Jump to content

మదనపల్లె ఘటన యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌: డీజీపీ


Recommended Posts

Posted

AP DGP: మదనపల్లె ఘటన యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌: డీజీపీ

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు.

Updated : 22 Jul 2024 19:07 IST
 
 
 
 
 
 

220724dgp-inner.jpg

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగింది. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు.  ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ వాళ్లు కూడా చెప్పారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశాం. కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటాం. యాక్సిడెంట్‌ కాదు.. కుట్రో కాదో విచారణలో తేలుస్తాం’’ అని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్న ఆయన.. పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

రన్నింగ్‌ ఫైల్స్‌ దగ్ధమయ్యాయి: కలెక్టర్‌

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రన్నింగ్‌ ఫైల్స్‌ దగ్ధమైనట్లు కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయన్నారు. ఈ 25 అంశాల్లో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నట్లు తెలిపారు. కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, షార్ట్‌ సర్క్యూట్‌ కానప్పుడు ఘటన ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందని చెప్పారు.

Posted

Ncbn soft approach veedaali. Sir maoists ne clear chesaaru meeru veedentha? Get a grip and show your power. Asalu mana govt lo kinda intha aaraachkangaa pravartostunnaru ante emanna bhayam undaa? Vaadi network ala penchukunnadu. Jayalalitha chesinattu dismiss chesi paareyandi kinda adhikaarulni. Appudu line loki vastaaru.

Posted

its a shame on TDP.. CBN is still thinking it is a regular opposition party..  he didn't understood what kind of people they are in last 5 years and still TDP didn't learnt how to handle criminal goons..

Posted

@sonykongara

 note files avi, mari vere records lu tasildhar, collector kaaryalayam lo untay ani.

Kaani, bhoomula physical patraalu ekkadanna untayya ? ledha motham kaalipoyinattena ?

inka aaa section 22A prohibited lands patraalu poyinattaena ?

 

assala online lo, paatha maarpulu anni pettali, kevalam ippudu unna vaalla pere kaakunda. appudu jarigina maarpula oka sthalam meedha motham online lonae untay. inka kaagitha dhastraalatho pani undadhu,

 

Posted
45 minutes ago, pavan s said:

its a shame on TDP.. CBN is still thinking it is a regular opposition party..  he didn't understood what kind of people they are in last 5 years and still TDP didn't learnt how to handle criminal goons..

anni telusu kaakapothe action theesukodu.  thana principles against gaa velladu.  cbn naya gandhi. lokesh, tdp leaders, cadre anthaa gandhi followers. recent gaa cbn ni champesthamanna nagarjuna yadav ni eeroju  kuppam police station lo 41a notice ichi vadhilesaaru.

Posted
1 hour ago, ravindras said:

anni telusu kaakapothe action theesukodu.  thana principles against gaa velladu.  cbn naya gandhi. lokesh, tdp leaders, cadre anthaa gandhi followers. recent gaa cbn ni champesthamanna nagarjuna yadav ni eeroju  kuppam police station lo 41a notice ichi vadhilesaaru.

ee vishayamu andariki thelusu.. they will exploit this nature of him.. and escape scotfree.

Posted
4 hours ago, AndhraBullodu said:

@sonykongara

 note files avi, mari vere records lu tasildhar, collector kaaryalayam lo untay ani.

Kaani, bhoomula physical patraalu ekkadanna untayya ? ledha motham kaalipoyinattena ?

inka aaa section 22A prohibited lands patraalu poyinattaena ?

 

assala online lo, paatha maarpulu anni pettali, kevalam ippudu unna vaalla pere kaakunda. appudu jarigina maarpula oka sthalam meedha motham online lonae untay. inka kaagitha dhastraalatho pani undadhu,

 

adagal  dastram  ane book unatyai avi british india nundi vasthunnayi  vatilo bhumla charitra maps unatayi 

Posted
50 minutes ago, sonykongara said:

adagal  dastram  ane book unatyai avi british india nundi vasthunnayi  vatilo bhumla charitra maps unatayi 

emo ardham kaala, ante ippudu kaalipoyiniy anni vivaraalu raabottocha ?  e roju vi kaalee poyina emi parvaledha ? aa edvalni bokka lo veyyocha ?

 

41 minutes ago, sonykongara said:

10 days munde chuttu cctv camera lu aperu anta govt emi pikutundo, intelligence anedi emi ledu govt lo

nidra potha untunnaremo, mari andharini konesinattunnaru. assala akkada unna andhariki dabbulu ichesi, pani chese vaari lo, unna vaari lo evaru mancho chedo cheppalekunda unnam anukunta. 100 lo 70% kalupu ae ayite em chestham. aaa dasthraala dhaantlo lo mari chandaalam.

Posted

System is fully damaged babulu… crime lo andarini involve chesesaadu… ippudu Ade system ni use chesi, aa system ki against ga vellali ante … support takkuve untundi 

andarini replace chese antha stable situation lo manam lemu… reality is “time padtundi” accept it 

Posted
13 hours ago, krishna_a said:

System is fully damaged babulu… crime lo andarini involve chesesaadu… ippudu Ade system ni use chesi, aa system ki against ga vellali ante … support takkuve untundi 

andarini replace chese antha stable situation lo manam lemu… reality is “time padtundi” accept it 

Startedaaa dlms.....:P

Posted

Madanapalle: మదనపల్లెలో ఫైల్స్‌ దహనం కేసు.. సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

Updated : 24 Jul 2024 16:25 IST
 
 
 
 
 
 

124136658_24madanapalle-1a.jpg

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రెవెన్యూ, పోలీసు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను పోలీసులు.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనే వరుసగా మూడోరోజు కూడా విచారణ చేస్తున్నారు. 

బుధవారం ఉదయం అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ వెంకటరమణ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. ఎవరు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు, సిబ్బంది వచ్చినప్పుడు కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. ఈ ఘటనకు ప్రాథమిక విచారణలో బాధ్యులుగా చేరిన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ ఒలిబస్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సీఐను వీఆర్‌కు పంపారు. ఆయనతో పాటు నైట్‌ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు హరిప్రసాద్‌, భాస్కర్‌ను సస్పెండ్‌ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి అధికార బృందం చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఈ ఘటనలో కీలక పాత్రధారిగా భావిస్తూ ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు..

మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో భూవివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి సిసోడియా నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం సాయంత్రం నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 2022 నుంచి మదనపల్లె డివిజన్‌లో నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. తమ సమస్యలపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.  

 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...