Jump to content

Recommended Posts

‘ఎక్స్‌ప్రెస్‌ వే’ల నిర్మాణానికి కృషి : ఎంపీ శ్రీభరత్‌

విశాఖలో ‘ఎక్స్‌ప్రెస్‌ వే’ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ శ్రీభరత్‌  అన్నారు. ఆదివారం ఆటోనగర్‌ సమీప గ్రీన్‌సిటీ కల్యాణ మండపంలో ఫార్మా, అనుబంధ సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

Published : 22 Jul 2024 03:29 IST
 
 
 
 
 
 

Vsp-Asr-akp-Dkr21072424a.jpg

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : విశాఖలో ‘ఎక్స్‌ప్రెస్‌ వే’ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ శ్రీభరత్‌  అన్నారు. ఆదివారం ఆటోనగర్‌ సమీప గ్రీన్‌సిటీ కల్యాణ మండపంలో ఫార్మా, అనుబంధ సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ నగరంతో పాటు గాజువాకలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు అగనంపూడి నుంచి ఆనందపురం వరకు ఉన్న ప్రధాన రహదారిలో సుమారు 12 పైవంతెనలు నిర్మిస్తామన్నారు. షీలానగర్‌- పోర్టు రోడ్డులో మూడు వంతెనలు కలిపి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామన్నారు. కాలుష్య నియంత్రణతో పాటు, మల్టీలెవెల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మిస్తామన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ... నగరంతో పాటు, గాజువాక అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అనంతరం నిర్వాహకులంతా కలిసి ఎంపీ, ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో భాజపా గాజువాక ఇన్‌ఛార్జి కరణంరెడ్డి నర్సింగరావు, తెదేపా కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

నగరానికి మణిహారాలే!!

నాడు మాటలకే పరిమితంగత ప్రభుత్వంలో జగన్‌  రూ.60కోట్లతో హనుమంతవాక వద్ద పైవంతెన ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో ఆ వంతెన నిర్మిస్తామంటూ చెప్పుకొచ్చారు

Published : 07 Sep 2024 04:31 IST
 
 
 
 
 
 

58 కి.మీ. పరిధిలో పన్నెండు పైవంతెనలు
విశాఖలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా భారీ ప్రణాళిక
ఇటీవల సమీక్షించి కొన్ని మార్పులు సూచించిన సీఎం చంద్రబాబు

60924-vsp4a.jpg

ఈనాడు-విశాఖపట్నం:  నగర పరిధిలో జాతీయ రహదారి 58 కి.మీ. ఉండగా... ఈ కీలక కూడళ్లలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

సీఎం సూచనలతో.. 

ఈ ఏడాది జులైలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైవంతెనలు నిర్మించే కూడళ్ల వివరాల నివేదిక సీఎంకు అధికారులు అందజేశారు. తక్కువ దూరంలోనే నిర్మించాల్సి వస్తే... వాటిని వేర్వేరుగా కాకుండా... ఒక్కటే పెద్ద వంతెనగా నిర్మించాలంటూ కొన్ని మార్పులు, సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం సూచించిన విధంగా ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు.

ఆ వంతెనలు ఎక్కడంటే..

60924-vsp4b.jpg

రామారావు ప్రైవేటు ఉద్యోగి. ఎండాడ నుంచి అక్కయ్యపాలెం రావడానికి బస్సులో అర్ధగంటకుపైగా పడుతోంది. ద్విచక్ర వాహనంపై వచ్చినా 25 నిమిషాల సమయం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తోంది. ప్రధానంగా హనుమంతవాక, మద్దిలపాలెం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఎక్కువ ఆలస్యమవుతోంది.ఒకవేళ ఉదయం కొంచెం ఆలస్యంగా బయలుదేరితే.. స్కూలు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగుల రద్దీతో ఇంకా పూర్తిగా ట్రాఫిక్‌లో చిక్కినట్లే. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనూ ఇదే పరిస్థితి.

అంబులెన్స్‌ వంటి అత్యవసర  వాహనాలకైనా ఇదే దుస్థితి.

విశాఖలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా కార్యాచరణ వేగవంతం అయింది. నగర పరిధిలోని ముఖ్యమైన పన్నెండు కూడళ్లలో పైవంతెనల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం  నిర్లక్ష్యం వహించిన ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డీపీఆర్‌ (సమగ్ర పథక నివేదిక) సాంకేతిక దశలో ప్రస్తుతం రూపు దిద్దుకుంటోంది. ఇది అయిన వెంటనే ఆర్థిక అంశాలపై కసరత్తు చేసి పూర్తి నివేదిక సిద్ధం చేయనున్నారు. కేంద్రం  పచ్చజెండా ఊపిన వెంటనే గుత్తేదారులకు బాధ్యతలప్పగించి, వంతెన నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నాడు మాటలకే పరిమితం

గత ప్రభుత్వంలో జగన్‌  రూ.60కోట్లతో హనుమంతవాక వద్ద పైవంతెన ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో ఆ వంతెన నిర్మిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2021 మార్చిలో డీపీఆర్‌ సిద్ధం చేయాలని సూచించినా అప్పటి ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న విమర్శలున్నాయి. ఎన్నికల వేళ హడావుడిగా 2023 ఆగస్టులో ఓ కన్సల్టెంట్‌ కంపెనీకి డీపీఆర్‌ బాధ్యతలిచ్చారు. ప్రస్తుతం ఆ డీపీఆర్‌ పూర్తయితే వంతెన నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యేలు, సిటీ పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్‌ సమావేశం అవుతారు. ‘కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ గ్రేడ్‌ సపరేటర్స్‌ స్ట్రక్చర్స్‌ ఎట్‌ వేరియంట్‌ జంక్షన్స్‌ ఆఫ్‌ విశాఖ సిటీ’ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతం పిలుస్తున్నారు.

ఎన్‌ఏడీ వద్ద పైవంతెన నిర్మించిన తరువాత.. ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తీరాయి. ఇక్కడ కొంతమేర పనులు ఇంకా చేయాల్సి ఉంది. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...