Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag

Featured Replies

  • Replies 338
  • Views 24.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

విశాఖలో పర్యటినస్తున్న మంత్రినారా లోకేష్ వరుణ్ బే సౌండ్స్ హోటల్‌ ఆఫీస్ టవర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... వరుణ్ బే సాండ్స్ హోటల్ విశాఖకు ఐకానిక్ గా మారనుందన్నారు. విశాఖ పరిశ్రమలు, ఐటీ హబ్‌గా మార్చుతున్నామన్నారు.ImageImageImage

Edited by sonykongara

  • Author

Visakhapatnam: విశాఖలో ఫిన్‌టెక్‌ సిటీ!

విశాఖ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పారిశ్రామిక, ఐటీ, నిర్మాణ, పర్యాటక, సేవా రంగాల్లో ఈ నగరం రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా విశాఖకు గుర్తింపు ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 07 Apr 2025 05:51 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

మధురవాడలో వందెకరాల్లో ఏర్పాటుకు చర్యలు
ఆసక్తి చూపే కంపెనీలకు అవకాశం
రోడ్డుషోలతో డిమాండు అంచనాకు ప్రణాళిక 

ap060425main4a.webp

మధురవాడలో పరిశీలిస్తున్న స్థలం 

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పారిశ్రామిక, ఐటీ, నిర్మాణ, పర్యాటక, సేవా రంగాల్లో ఈ నగరం రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా విశాఖకు గుర్తింపు ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఇందులో భాగంగా మధురవాడలో ఫిన్‌టెక్‌ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నారు. ఎనభై నుంచి వందెకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దానికి సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఫిన్‌టెక్‌ సేవలతో విశాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్య సాధనగా పెట్టుకున్నారు. 

ఏమిటీ ఫిన్‌టెక్‌ సిటీ? 

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), అనుబంధ రంగాల సంస్థలు ఒకే చోట కార్యకలాపాలు, సేవలందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడమే ఫిన్‌టెక్‌ సిటీ లక్ష్యం. అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడంలో ఫిన్‌టెక్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రంలోని నందంబక్కంలో 56 ఎకరాల్లో ఈ తరహా ప్రాజెక్టును ఆరంభించారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులతో 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళిక చేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో అదే తరహా ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది. 

ap060425main4b.webp

చెన్నైలోని ఫిన్‌టెక్‌ సిటీ నమూనా 

ప్రాజెక్టు ఇలా.. 

ఫిన్‌టెక్‌ సిటీ కోసం మధురవాడలోని ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భూములు గుర్తించారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు కొమ్మాది వద్ద ఉన్న 80 ఎకరాల స్థలాన్ని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో చేపట్టనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన డెవలపర్లకు స్థలం ఇచ్చి మౌలిక వసతులను కల్పించే బాధ్యత అప్పగిస్తారు. వారు మొత్తం స్థలాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తెస్తారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలంలో కొంత వాటా వారికి ఇస్తారు. అందులో నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు. విలాసవంత హోటళ్లు, ఐటీ సేవలకు అప్పగించొచ్చు. ప్రభుత్వ వాటాగా ఉన్న స్థలాన్ని బ్యాంకింగు, ఫైనాన్స్, బీమా సంస్థలకు పీపీపీ కింద అప్పగిస్తారు. ఐటీ, బీపీవో కేంద్రాలకు స్థలాలు కేటాయిస్తారు. దీన్ని ఎలా చేపట్టాలనే దానిపై ఓ కన్సల్టెన్సీ ద్వారా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే డెవలపర్‌ ఎంపికకు టెండర్లు పిలవనున్నారు. 

ఆసక్తి ఉన్న కంపెనీల కోసం..

విశాఖలో ఆర్థిక సంబంధ సేవలకు కంపెనీలు ఎంతవరకు ఆసక్తి చూపుతాయో మొదట పరిశీలించనున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్డు షోలు నిర్వహించాలని చూస్తున్నారు. ముంబయి, బెంగళూరు, దిల్లీ, చెన్నై మరికొన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ముందుకొచ్చే కంపెనీల ఆధారంగా ఎంత విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపట్టాలో నిర్ణయిస్తారు. జిల్లా కలెక్టరు హరేంధిరప్రసాద్‌ ప్రాజెక్టు బాధ్యత తీసుకున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు.

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

అదిగో.. మరో రాచబాట

విజయనగరం, అనకాపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ వలయ రహదారి (రింగు రోడ్డు)కి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందిస్తోంది

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 14 May 2025 05:54 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

85 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి ప్రణాళిక
డీపీఆర్‌ రూపకల్పనకు దరఖాస్తుల ఆహ్వానం
భోగాపురం-రాంబిల్లి మధ్య నూతన మార్గం

vsp130525--5a.webp

ఈనాడు, విశాఖపట్నం : విజయనగరం, అనకాపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ వలయ రహదారి (రింగు రోడ్డు)కి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ ప్రతిపాదన సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు, విశాఖలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ కసరత్తు సాగుతోంది.  ఇటీవల విశాఖ జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించిన సమయంలో దీనిపై చర్చించడంతో అమలు దిశగా వీఎంఆర్‌డీఏ చర్యలు తీసుకుంటోంది.

  • అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం, భోగాపురం మండలాల పరిధిలో సుమారు 85 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించాలనుకుంటున్నారు. మొదట నాలుగు వరుసలు, ఆ తర్వాత ఆరు, ఎనిమిది వరుసలతో నిర్మించేలా భూసేకరణ చేయాలని భావిస్తున్నారు.
  • భూసేకరణ జరిపి రైతులకు పరిహారం అందజేసి నిర్మించాలంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున.. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు.
  • ప్రతిపాదిత రోడ్డుకు ఇరువైపులా ఉండే భూములకు విలువ కల్పించేలా ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య విధానంలో చేపట్టాలనే దిశగా ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. అంటే.. అక్కడక్కడ వాణిజ్య సముదాయాలు, బహుళ అవసరాల నిర్మాణాలు చేపట్టి సంబంధిత భూ యజమానులకు ప్రయోజనం కల్పించేలా చేయనున్నారు.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా సర్వే నిర్వహణ, లేఅవుట్‌ ఖరారు, ప్రతిపాదిత మార్గం, సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీకి కన్సల్టెంట్‌ నియామకానికి వీఎంఆర్‌డీఏ ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎఫ్‌పీ) కోరింది. వేగంగా పట్టాలెక్కేలా వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

    ప్రయాణ సమయం తగ్గేలా: వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, పరిసర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డుకు ప్రణాళిక చేశాం. అచ్యుతాపురం నుంచి భోగాపురం బీచ్‌ వరకు, రాంబిల్లి ఇతర ప్రాంతాల్లోని రద్దీ, ప్రయాణ సమయం తగ్గించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. విశాఖ, భోగాపురం విమానాశ్రయాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా ఇది ఉంటుంది. అటు పర్యాటకంగానూ కీలకంగా మారనుంది. దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నాం.  

- ఎంవీ ప్రణవ్‌గోపాల్, ఛైర్మన్, వీఎంఆర్‌డీఏ 

  • Author

విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం: మంత్రి నారాయణ

భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 21 May 2025 22:22 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

210525imagee48.webp

విశాఖపట్నం: భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి అవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. 115 రోజుల్లో మిగిలిన ఆరు రోడ్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి, జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకొని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై మంత్రి మీడియాతో మాట్లాడారు. 

‘‘టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7వేల కోట్లు కావాలి. వైకాపా హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014-2019 మధ్య 7లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించాం. అవి వైకాపా హయాంలో ఆగిపోయాయి. కేవలం 2లక్షల ఇళ్లు కూడా పూర్తిచేయలేకపోయారు. ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ దసరాకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తాం. 

ప్రతి ఇంటికి నీరిచ్చేలా 2021లో అమృత్‌ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైకాపా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదు. ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్లీ నిధులు వచ్చేలా చేశారు. రూ. 834 కోట్ల పనులు అమృత్‌ పథకం కోసం నిర్దేశించాం. కొద్ది నెలల్లో అమృత్‌ పథకం ద్వారా సర్ఫేస్‌ వాటర్‌ వస్తాయి. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్‌ నెలలో పనులు మొదలుపెడతాం. డబుల్‌ డెక్కర్‌ మెట్రో కింద డీపీఆర్‌ ఇచ్చాం. కోటి మంది ప్రజలు ఉన్న హైదరాబాద్‌కు రింగురోడ్డు ఉంది. అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం’’అని మంత్రి నారాయణ తెలిపారు.

  • Author

రంగరించిన ప్రణాళిక.. ఇక ఉజ్వల విశాఖ!!

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా విశాఖకు నీతిఆయోగ్‌  ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ కసరత్తు దాదాపు చివరి దశకు చేరింది. రంగాల వారీగా వృద్ధిపై అంచనాలు తయారు చేశారు.

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 30 May 2025 03:53 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

సిద్ధమైన నీతి ఆయోగ్‌ తుది ముసాయిదా

vsp29052025-3a.webp

ఈనాడు, విశాఖపట్నం: వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా విశాఖకు నీతిఆయోగ్‌  ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ కసరత్తు దాదాపు చివరి దశకు చేరింది. రంగాల వారీగా వృద్ధిపై అంచనాలు తయారు చేశారు. అందుకు పెట్టుబడుల అవకాశాలపైనా నిపుణులతో కూలంకషంగా చర్చించారు. పలుమార్లు విశాఖను సందర్శించి అభివృద్ధికి వీలున్న రంగాల ద్వారా ఆదాయాన్ని ఎలా సృష్టించాలో సూచనలు చేశారు. ముసాయిదా నివేదిక దాదాపు సిద్ధమవ్వగా త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తుది నివేదిక ఖరారు చేయనున్నారు.

పెట్టుబడులు ఆకర్షించేలా..: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా కొన్ని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు పెట్టుబడులతో కొత్త వాటికి ఆలోచన చేశారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఉక్కు కర్మాగారం, గ్రీన్‌హైడ్రోజన్‌ హబ్‌లకు అడుగులు పడ్డాయి. విశాఖ పోర్టు ఆధారంగా కొన్ని సెక్టార్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఫుడ్‌ ప్రాసెస్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మరికొన్ని నెలకొల్పాలనే ప్రణాళికలున్నాయి.

ఆ నాలుగులో: దేశంలో మొత్తం 20 నగరాలకు ఆర్థిక ప్రణాళికలు రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా ముంబయి, సూరత్, వారణాశి, విశాఖలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. ప్రణాళికల రూపకల్పనపై విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సమన్వయంతో ముందుకువెళ్తున్నారు. గత ఆరు నెలల్లో ఐదారుసార్లు సమావేశమైన నీతిఆయోగ్‌ అధికారుల బృందం క్షేత్రస్థాయిలోనూ పర్యటించింది. విశాఖ కేంద్రంగా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

  • పెట్రో రసాయన, రసాయన విభాగంలో కొత్త పరిశ్రమలకు అవకాశాలను గుర్తించారు. పెదగంట్యాడ మండలం నుంచి కాకినాడ గ్రామీణం వరకు వీకేపీసీపీఐఆర్‌ (విశాఖ- కాకినాడ పెట్రోకెమికల్స్‌ పెట్రో పెట్టుబడుల ప్రాథికార సంస్థ)కు మాస్టర్‌ప్లాన్‌ తయారవుతుంది. దీంతో మరిన్ని కొత్త పెట్టుబడులు రానున్నాయి. వేల మందికి ఉపాధి దొరకనుంది.
  • అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఫార్మా పరిశ్రమలు చాలా ఉన్నాయి. టెక్స్‌టైల్‌ పార్క్‌ ఉంది.  ప్రస్తుతం ఉన్నవి కాకుండా కొత్త వాటికి భూములను సిద్ధం చేస్తున్నారు.
  • ఉమ్మడి విశాఖలో పర్యాటక రంగం ఆధారంగా ఉపాధి అవకాశాలు పెంపొందించనున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేఫెయిర్‌ వంటి సంస్థలు రిసార్టుల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మరిన్ని బ్రాండింగ్‌ గ్రూపులు వచ్చేలా ప్రతిపాదనలున్నాయి. అలాగే సాహస పర్యాటకం, జల  విన్యాసాలను ప్రోత్సహించనున్నారు. 
  • మత్స్యసంబంధ రంగాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు, సముద్ర ఉత్పత్తులు, వాటి ఎగుమతులపై దృష్టిసారించారు. 
  • రియల్‌ ఎస్టేట్, భవన నిర్మాణరంగానికి విశాఖ ఎంతో అనుకూలం. కొత్త ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులకు వీలున్న రంగం. దీన్ని ప్రధాన అభివృద్ధి సూచీగానూ నీతిఆయోగ్‌ భావిస్తోంది.
  • విశాఖ కేంద్రంగా సేవా రంగం ద్వారా ఆదాయ వనరులు పెంపొందించాలనేది మరో లక్ష్యం. ఐటీ రంగంలో బహుళ జాతి సంస్థల పెట్టుబడులు వచ్చేలా కసరత్తు సాగిస్తున్నారు. 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.