December 16, 20241 yr Author https://www.eenadu.net/videos/playvideo/sky-cycling-at-kailasagiri-in-vizag/1/62605
January 9, 20251 yr Author Kinjarapu Ram Mohan Naidu: ప్రపంచానికే గర్వకారణంగా నిలిచేలా విశాఖ అభివృద్ధి: రామ్మోహన్‌నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఐటీకి కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) అన్నారు. By Andhra Pradesh News TeamPublished : 09 Jan 2025 13:00 IST విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఐటీకి కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘సీఎం చంద్రబాబు ఐటీతో పాటు డీప్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కేంద్రంగా విశాఖను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎక్కడికి వెళ్లినా విశాఖను టెక్ హబ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. బుధవారం ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. లోకేశ్ కృషితో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ వచ్చాకే అభివృద్ధి ఒక స్థాయిలో పెరిగింది. విశాఖకు బహుళ జాతి సంస్థలు పెట్టుబడులతో వస్తే నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ, ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ నగరాన్ని ప్రపంచానికే గర్వ కారణంగా నిలిచేలా తీర్చిదిద్దుతాం. పౌర విమానయాన శాఖ తరఫున డ్రోన్ టెక్నాలజీ, ఏవియేషన్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
January 24, 20251 yr Author Cruise ship: విశాఖపట్నం పోర్ట్‌కు క్రూజ్ షిప్.. ముహూర్తం ఖరారు కార్డేలియా క్రూజ్ షిప్ విశాఖపట్నం పోర్టుకు రానుంది. By Andhra Pradesh News TeamPublished : 24 Jan 2025 20:50 IST Ee Font size విశాఖపట్నం: కార్డేలియా క్రూజ్ షిప్ విశాఖపట్నం పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్ పుదుచ్చేరి, చెన్నై- విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీస్‌కు షిప్పింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈమేరకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి టి.వేణు గోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్
February 19, 20251 yr Author లులూ సంస్థ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విశాఖలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనపై తిరిగి పరిశీలనకు ప్రతిపాదన.
February 28, 20251 yr Author త్వరలోనే వైజాగ్ క్రూయిజర్ ABN , Publish Date - Feb 28 , 2025 | 01:12 AM విశాఖపట్నంలో స్థానికంగా క్రూయిజ్ టూరిజం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘గిల్ మెరైన్స్’ సంస్థ సన్నాహాలు పోర్టు అనుమతించగానే ప్రారంభం (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) విశాఖపట్నంలో స్థానికంగా క్రూయిజ్ టూరిజం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి, విశాఖపట్నం పోర్టు అనుమతులు ఇస్తే రెండు నెలల్లోనే ఫిషింగ్ హార్బర్ నుంచి రోజూ లోకల్ క్రూయిజర్ అందుబాటులో ఉంటుంది. పట్టుదలతో... నాలుగేళ్ల క్రితం తుఫాన్ గాలులకు పోర్టు యాంకరేజ్ నుంచి తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక ఎంవీ మాను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు ఆ రంగంలో అనుభవం ఉన్న ‘గిల్ మెరైన్స్’ సంస్థ ముందుకువచ్చింది. ఆ నౌకను యాజమాన్యం నుంచి కొనుగోలు చేసి ఏపీటీడీసీతో కలిసి రెస్టారెంట్‌గా మార్చేందుకు కృషిచేస్తోంది. దీనికి ఏపీసీజెడ్‌ఎంఏ నుంచి అనుమతులు రావలసి ఉంది. అటు ఆ ప్రయత్నం చేస్తూనే మరోవైపు విశాఖలో క్రూయిజ్ టూరిజం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ‘ఎంవీ సాయి వైష్ణవి’ పేరుతో ఓ క్రూయిజర్‌ను సమకూర్చుకుంది. రెండు ఇంజన్లతో పనిచేసే ఈ చిన్నపాటి నౌకను డబుల్ డెక్‌తో సుమారు 100 మందికి సరిపడేలా రూపొందించారు. అప్పుడప్పుడు ఇందులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి పది కిలోమీటర్ల వరకు సముద్రం లోపలకు, ఇక్కడి నుంచి తెన్నేటి పార్కు వద్ద బంగ్లాదేశ్ నౌక వరకు వెళ్లి వస్తున్నారు. ఏపీటీడీసీతో కలిసి జాయింట్ వెంచర్ కింద ‘వైజాగ్ క్రూయిజర్’ పేరుతో దీనిని నడపాలని విశాఖపట్నం పోర్టు యాజమాన్యానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. అది పోర్టు అధికారుల పరిశీలనలో ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో సురేందర్‌సింగ్, గిల్ మెరైన్స్ యజమాని వైజాగ్ క్రూయిజర్‌ని అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాము. పుట్టినరోజు వేడుకలు, ఫ్రెండ్స్ పార్టీలు, పెళ్లిరోజు వేడుకలు చేసుకోవడానికి డెక్ పార్టీలు ఏర్పాటుచేస్తాము. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విడివిడిగా ప్యాకేజీలు పెట్టి బృందాలుగా సముద్రంలోకి తీసుకువెళతాము. క్రూయిజర్‌లోనే ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. ఏ ప్యాకేజీ కావాలంటే అది ఎంచుకోవచ్చు. అనుమతులు రాగానే ప్యాకేజీల వివరాలు ప్రకటిస్తాం.
Create an account or sign in to comment