Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag

Featured Replies

  • Replies 338
  • Views 24.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

విశాఖ జూ.. సింగపూర్‌ తరహాలో

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskUpdated : 27 Jun 2025 03:48 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

త్వరలోనే బృహత్తర ప్రణాళిక రూపకల్పన

asr%20260625%202a.webp

విశాఖ జూ గురించి సింగపూర్‌ ప్రతినిధులకు వివరిస్తున్న క్యూరేటర్‌ మంగమ్మ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ జంతు ప్రదర్శనశాలలో సమూల మార్పులు చేసి సింగపూర్‌ జూ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ఇటీవల సింగపూర్‌లో పర్యటించి నిర్వాహకులతో మాట్లాడారు. తరువాత సింగపూర్‌ జూ ప్రతినిధులు విశాఖలో పర్యటించారు. అవసరమైన బృహత్తర ప్రణాళిక తయారీకి వారు అంగీకరించడంతో విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయనా పచ్చజెండా ఊపారు. జంతువుల మార్పిడి, అరుదైన రకాలు ఇచ్చిపుచ్చుకునేందుకు సింగపూర్‌ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.

సింగపూర్‌ జూలో: సింగపూర్‌ జూ మొత్తం విస్తీర్ణం 300 ఎకరాలు. ఆసియా, ఆఫ్రికా ప్రాంత జంతువులు సంచరించేలా అడవులు, వర్షపు అడవులు వేటికవిగా ఏర్పాటు చేశారు. రిసార్టులు, విల్లాలు, హోటళ్లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలకు తగినట్లు క్రీడా, ఉల్లాస ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాలున్నాయి. ఏటా అయిదు కోట్ల మంది సందర్శిస్తున్నారు. రూ.వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ జంతువులు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రహదారి కూడా ఉంది.

పదేళ్లలో.. పూర్తయ్యేలా: జూ రూపురేఖలు మార్చే ప్రాజెక్టు పూర్తయ్యేసరికి పదేళ్ల సమయం పడుతుంది. నాలుగేళ్లలో మొదటి దశ పనులు పూర్తయ్యేలా చూస్తాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సింగపూర్‌ ప్రతినిధుల సహకారంతో మూడు, నాలుగు నెలల్లో పూర్తవ్వనున్నాయి. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తున్నాం’ అని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ పేర్కొన్నారు.

విశాఖలో: విశాఖలో జాతీయ రహదారి పక్కనే ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల 620 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా రూ.8 కోట్ల ఆదాయం వస్తోంది. కంబాలకొండ రక్షిత అడవి నుంచి బయటకు వచ్చి జింకలు, దుప్పిలు, అడవి గొర్రెలు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందుతున్నాయి. విశాఖ వ్యాలీ కూడలి నుంచి పీఎంపాలెం వరకు ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు సింగపూర్‌లో మాదిరి వన్యప్రాణుల కోసం ప్రత్యేక వంతెనలు, భూగర్భ నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటి ద్వారా సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య (పీపీపీ) విధానంలో పనులు చేపట్టాలనుకుంటున్నారు. కేంద్ర నిధులు రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లతో అభివృద్ధి చేసి అయిదేళ్లలో సందర్శకుల సంఖ్యను 20 లక్షల మందికి పెంచాలన్నది లక్ష్యం.

  • 2 weeks later...
  • Author

విశాఖ-భోగాపురం మధ్య 4 థీమ్‌ టౌన్‌షిప్‌లు

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:38 AM

 

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ప్రత్యేక థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

విశాఖ-భోగాపురం మధ్య 4 థీమ్‌ టౌన్‌షిప్‌లు
 

 

  • భీమిలి సమీపాన కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం ప్రాంతాల ఎంపిక

  • ప్రాథమికంగా ఐటీ అండ్‌ ఇన్నోవేషన్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, టూరిజం అండ్‌ కల్చర్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ ట్రేడ్‌ వంటి రంగాలు గుర్తింపు

  • నివాసాలు, రిసార్ట్స్‌, గోల్ఫ్‌ కోర్సులు ఏర్పాటు

 

 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ప్రత్యేక థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్లోరిడా మోడల్‌లో తూర్పు తీరాన విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వ సూచన మేరకు కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖ నుంచి భోగాపురం మధ్య నాలుగు ప్రాంతాల్లో ఈ థీమ్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటుచేస్తారు. అందులో ఒకటి భీమిలి మండలం కొత్తవలస వద్ద మరొకటి ఆనందపురం మండలంలోని శొంఠ్యాం ప్రాంతంలో రానున్నాయి. మరో రెండు ప్రాంతాలను గుర్తించాల్సి ఉంది.

వివిధ రంగాల అభివృద్ధే ధ్యేయంగా

విశాఖను ‘బే సిటీ మియామీ’గా అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రతి టౌన్‌షిప్‌కు ప్రత్యేకమైన థీమ్‌ ఉంటుంది. ఐటీ అండ్‌ ఇన్నోవేషన్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, టూరిజం అండ్‌ కల్చర్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ ట్రేడ్‌, ఎకో రీసైలెన్స్‌ వంటి రంగాలను ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో టౌన్‌షిప్‌ ఒక్కో రంగానికి ప్రత్యేకించి అభివృద్ధి చేస్తారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి లేఅవుట్లు వేయడమే కాకుండా ఆయా పరిశ్రమలు రావడానికి, పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వాటిని తయారుచేస్తారు. ఇక్కడ సముద్రతీరం, పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉండడంతో గ్రీన్‌ అండ్‌ బ్లూ ఎకానమీని ఓ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో వీటిని ప్లాన్‌ చేశారు. వీటిలో భాగంగా రెసిడెన్షియల్‌ కాలనీలు, కన్వెన్షన్‌ సెంటర్లు, రిసార్ట్స్‌, థీమ్‌ పార్కులు, గోల్ఫ్‌ కోర్సులు వంటి వస్తాయి. ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపడతారు.

5 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా

ఈ నాలుగు థీమ్‌ బేస్ట్‌ టౌన్‌షిప్‌ల ద్వారా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపడతామని, వీటికి డిజైన్లు తయారు చేయడానికి ఆర్కిటెక్ట్‌లను ఆహ్వానిస్తూ ప్రకటన కూడా జారీ చేశామన్నారు.

  • 2 weeks later...
  • Author

 కైలాసగిరికి మరో ఆకర్షణ

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:23 AM

 

విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మరిన్ని హంగులు సమకూరుస్తోంది.

Visakhapatnam: కైలాసగిరికి మరో ఆకర్షణ
 

 

  • 55 అడుగుల ఎత్తైన త్రిశూలం ఏర్పాటుకు శంకుస్థాపన

  • బీచ్‌ రోడ్డులో హెలికాప్టర్‌ మ్యూజియం ప్రారంభం

 
 
Advertisement: 0:01
 
 
 
 
Close PlayerUnibots.com
Advertisement

విశాఖపట్నం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మరిన్ని హంగులు సమకూరుస్తోంది. ఇక్కడ 55 అడుగుల ఎత్తైన త్రిశూలం నిర్మాణానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ మాట్లాడుతూ ‘ఈ త్రిశూలం హనుమంతవాక వైపు ఉంటుంది. చీకటి పడ్డాక వెలుగులు విరజిమ్ముతుంది. ఢమురకం కూడా ఉంటుంది. రూ.1.55 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని వివరించారు. ఆ తరువాత బీచ్‌ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన యూహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియాన్ని మంత్రులు డోలా, వంగలపూడి కలసి ప్రారంభించారు. దీనికి రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే బీచ్‌ రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142, సీ హ్యారియర్‌ యుద్ధ విమానాల మ్యూజియాలు ఉండగా వాటి సరసన కొత్తగా యుహెచ్‌-3 హెచ్‌ చేరింది. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • Author

అందమైన వీధులు.. అద్దంలాంటి దారులు

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskUpdated : 09 Sep 2025 06:04 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

నగరంలో ‘కేరళ’ తరహా ప్రయోగం
తొలుత 50 కి.మీ.లలో అమలు

5a_866.webp

రహదారులు, పచ్చదనం అభివృద్ధి నమూనా

పీఎంపాలెం, న్యూస్‌టుడే: తమ ప్రాంతంలో రోడ్లపై గుంతలు పూడ్చాలని, వీధి దీపాలు వేయాలని, పచ్చదనం పెంచాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఇక మారనుంది. ‘కూటమి’ ప్రభుత్వం నగరంలో సరికొత్త విధానం అమలుకు పూనుకుంది. ఇప్పటికే జీవీఎంసీ కసరత్తు ప్రారంభించింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో అమలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్న ‘యాన్యుటీ మోడల్‌’ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

నూతన విధానంలో నగర వ్యాప్తంగా 253.99 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేయాలను కుంటున్నారు. ఇందుకు రూ.407.75 కోట్లు వ్యయమవుతుందని అంచనా. పైలెట్‌ ప్రాజెక్టుగా మొదటి దశలో 50 కి.మీ మేర అభివృద్ధి చేసే బాధ్యత గుత్తేదారులకు అప్పగిస్తారు. కొంతకాలం పాటు వారే నిర్వహణ చూసుకోవాలి. ప్రభుత్వం కొంత, గుత్తేదారులు కొంత నిధులు వెచ్చించే ఈ విధానంలో...గుత్తేదారులకు నిధులు ఏ తీరుగ చెల్లించాలనే అంశంపై ప్రస్తుతం కసరత్తు సాగుతోంది.

తొలి దశలో రోడ్ల అభివృద్ధి ప్రతిపాదన ఇలా(కి.మీ.)

  • మధురవాడ (జోన్‌-2): 20
  • గాజువాక (జోన్‌-6):  20
  • మిగిలిన జోన్లు: 10

అలా ఆలోచన: జీవీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు గతేడాది ‘అధ్యయన పర్యటన’లో భాగంగా తిరువనంతపురం ప్రాంతంలో పర్యటించారు. గుంతలు లేని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న రోడ్లను గుర్తించారు. 12 సంవత్సరాలుగా ‘యాన్యుటీ మోడల్‌’లో ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విధానాన్ని విశాఖలో అమలు చేయాలని భావించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.

పచ్చదనం సహా: జీవీఎంసీతో రహదారుల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్న సంస్థలు దాదాపు పదేళ్ల పాటు పూర్తి నిర్వహణ బాధ్యత తీసుకుంటాయి. రోడ్లతో పాటు కూడళ్లను అభివృద్ధి చేయాలి. మార్గాలకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి. వీధి దీపాలు లేని చోట ఏర్పాటు చేయాలి. నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలి. 

 
  • Author

Visakhapatnam: విశాఖలో రూ.553 కోట్లతో మురుగునీటి శుద్ధి వ్యవస్థ

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 09 Sep 2025 05:30 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

ముఖ్యమంత్రి సమక్షంలో ఐఎఫ్‌సీ, జీవీఎంసీ మధ్య ఒప్పందం

ap080925main28a.webp

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్,
ఐఎఫ్‌సీ మౌలిక సదుపాయాల కల్పన విభాగం మేనేజర్‌ విక్టోరియా డెల్మోన్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో ఒకటైన విశాఖలో ప్రజలకు ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచ బ్యాంకులో భాగమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్‌సీ) రుణసాయంతో రూ.553 కోట్లతో ఆధునిక మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఐఎఫ్‌సీ, మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)ల మధ్య సచివాలయంలో సోమవారం ఒప్పందం జరిగింది. దీంతో దేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మొదటి నగరపాలక సంస్థగా జీవీఎంసీకి గుర్తింపు వచ్చింది.

  • విశాఖలో ఐటీ, డిజిటల్‌ ఎకానమీ క్లస్టర్లు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా నిలుస్తున్న మధురవాడలో మురుగునీరు శుద్ధి చేసే ఆధునిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
  • ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ.498 కోట్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ రుణం కింద సమకూర్చనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమృత్‌ 2.0లో     రూ.45.64 కోట్లు, మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి మరో రూ.9.36 కోట్లు అందనున్నాయి. 
  • ఐఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణాన్ని 8.5% వడ్డీతో నగరపాలక సంస్థ తిరిగి వాయిదాలుగా చెల్లిస్తుంది. 15 ఏళ్ల కాల వ్యవధిలో మూడేళ్లు మారటోరియం ఉంటుంది. మిగిలిన 12 ఏళ్లలో నగరపాలక సంస్థ ఐఎఫ్‌సీకి తిరిగి చెల్లించాలి. 
  • సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో నిర్వహించిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సురేశ్‌కుమార్, పురపాలకశాఖ సంచాలకులు పి.సంపత్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మౌలిక సదుపాయాల కల్పన విభాగం మేనేజర్‌ విక్టోరియా డెల్మోన్, ప్రిన్సిపల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ నీరజ్‌ గుప్త, అసోసియేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అభిషేక్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

మధురవాడలో 100% మురుగునీటి శుద్ధి 

  • ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో మధురవాడలో 100% మురుగునీరు శుద్ధి చేసి పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపనున్నారు. 
  • రాబోయే 30 ఏళ్ల జనాభా వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. భూగర్భ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్, లిఫ్టింగ్‌ స్టేషన్లు, అత్యాధునిక నీటిశుద్ధి కేంద్రం ఇందులో ఉంటాయి. 
  • శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకం తదితర రోజువారీ అవసరాలకు వినియోగిస్తారు. 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.