Jump to content

తన తరంలో.. One and Only Jai Balayya


vk_hyd

Recommended Posts

వందకు పైగా చిత్రాలు,వందలాది పైగా వేషధారణలు,చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గారి తరువాత అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటుడు. తన తరంలో డబల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఏకైక నటుడు(1986).

ఎన్నో విజయాలు, ఎన్నో విబిన్నమైన పాత్రలు, భైరవద్వీపం, శ్రీ కృష్ణార్జునవిజయం, మంగమ్మగారి మనవడు, ముద్దలమావయ్య, ఆదిత్య 369,రౌడీ ఇన్స్పెక్టర్, బోబ్బిలి సింహం, పెద్దన్నయ్య, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, శ్రీ రామరాజ్యం, పాండురంగుడు, గౌతమిపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ బైయోపిక్,అఖండ,భగవంత్ కేసరి, వీరసింహరెడ్డి, లెజెండ్ లాంటి పాత్రలు ఆయన మాత్రమే ఆయన మాత్రమే చేయగల పాత్రలు.

14 సంవత్సరాలుగా బసవతారకం హాస్పిటల్ కి చైర్మన్ గా ఉంటు, హాస్పిటల్ ని అభివృద్ధి చేస్తూ,వేల మంది చిన్నారులుకు,పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందేలా తన వంతు సాయం అందిస్తున్న ఎంతో గొప్ప వ్యక్తి.

10 సంవత్సరాలు గా హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉంటు హిందూపురం ప్రజలు చిరకాల కోరిక 194 కోట్లుతో ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా ఆ గంగమ్మనే హిందూపురం తీసుకొచ్చి హిందూపూర్ ప్రజలు నీటి కష్టాలు తీర్చిన నిజమైన ప్రజాసేవకుడు. ప్రభుత్వ హాస్పిటల్ ని కార్పొరేట్ హాస్పిటల్ గా తీర్చిదిద్ది, #లేపాక్షి ఘనకీర్తి ని ప్రపంచ నలుమూలల చాటిచెప్పి హిందుపూర్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నిజమైన ప్రజాసేవకుడు.

తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయిన హిందూపురం ప్రజలు ఆరోగ్య కోసం తన సొంత ఖర్చులుతో ఎన్టీఆర్ ఆరోగ్య రధం ఏర్పాటు చేసి సంవత్సరానికి కోటి రూపాయలు పైగా ఖర్చు చేయటమే కాకుండా..నిరుపేదల కోసం ప్రతి రోజు రెండు రూపాయలుకే అన్న కాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నదాత.

2009 లో Kurnool cyclone తో నష్టపోయిన రాయలసీమ ప్రజలు కోసం తెలుగు చిత్ర పరిశ్రమను ఒకటి చేసి StarNight ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాదాపు 6 కోట్లు వచ్చేలా చేయటమే కాకుండా తనవంతు బాధ్యతగా 60 లక్షల రూపాయలు అందించిన గొప్ప మనసుఉన్న వ్యక్తి.

కరోనా టైంలో తెలుగు సినిపరిశ్రమ లోని పెదాకళాకారుల కోసం, హిందూపురం ప్రజలు కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కీ ఒక కోటి 25 లక్షలు అందించిన నిజమైన సేవకుడు.

కోరోనాతో టైంలో తమ సినిమాలో రిలీజ్ చేయటానికి భయపడుతూ, postpone చేసుకున్న సందర్భంలో ఎవరు ముందుకు వస్తారా అని ఎదురుచూస్తున్నా సినీ పరిశ్రమ కోసం ఒక అడుగు ముందుకువేసి నేను ఉన్నాను అంటూ దైర్యం చేప్పి, దైర్యంగా తన సినిమా #అఖండ ను రిలీజ్ చేశాడు టికెట్స్ రేట్స్ లేకపోయిన..

ఇలా సినీరంగంలో, రాజకీయ రంగంలో, సేవా రంగంలో ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు.

Produly say.. #JaiBalayya

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...