Jump to content

Krishna District

Recommended Posts

2 hours ago, God Of Masses said:

Uma medha antha anti enthuku undhi?  surprising

Same doubt.... local ga ante okay... district motham spoil antaaru deniko ..... nani, vamsi, kesineni, avinash etc vellipotaaniki reason Uma ante aa ulfa batch unnaa waste ani proved so not understanding why uma is blamed....

Link to comment
Share on other sites

6 hours ago, God Of Masses said:

Uma medha antha anti enthuku undhi?  surprising

Minister gaa vunnappudu constituency pattinchu koledu. Rythulu evvaru vachhina kalise vaadu kaadu. Morning nunchi evening varaku wait chesi chesi velli poye vallu anta. Krishna dist President gaa or in charge gaa vunnappudu andarini velu petti kelike vaadu. District president godavalu tagginchali si poyi Inka ekkuva chesadu etc..

Link to comment
Share on other sites

అమరావతి: తెలుగుదేశం (TDP) ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీలా గోవింద్‌తో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్‌కు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పొత్తులు, పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తానని రాజా చెప్పినట్టు సమాచారం. భేటీ అనంతరం నారా లోకేశ్‌ను కలిసిన ఆలపాటి రాజా.. అధినేతతో సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు.

అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఆశించిన పీలా గోవింద్‌.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని, సముచిత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాజానగరం తెలుగుదేశం ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటు, లేదా మరో ప్రత్యామ్నాయం పరిశీలిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. భేటీపై వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు.

అధినేత మాటే శిరోధార్యం: ఉమా

తెలుగుదేశం అధినేత మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అంటూ విధేయత చాటుకున్నారు. ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ అధినేతతో ఉమా సమావేశమయ్యారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే తొలి జాబితాలో పేరు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు: గంటా

తొలి జాబితాలో చోటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta srinivasarao) కూడా చంద్రబాబును కలిశారు. భేటీ ముగిసిన తర్వాత గంటా  మీడియాతో మాట్లాడారు. ‘‘ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించారు. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పా. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనే విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు అన్నారు. తెదేపా తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొదటి జాబితాపై ప్రజాస్పందన బాగుందని చెప్పా. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. వైకాపా ఓడిపోవడం అంతే నిజం’’ అని వ్యాఖ్యానించారు

Link to comment
Share on other sites

12 minutes ago, sonykongara said:

Overall ga 1st list meeda pedda negative reaction aithe raaledu.....may be aa Undi candidate okkadide konchem bad... hope lokesh/cbn talk to him....

Link to comment
Share on other sites

నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన కొలుసు పార్థసారథి

  • నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన కొలుసు పార్థసారథి
  • చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న కొలుసు పార్థసారథి
Link to comment
Share on other sites

Vasantha Krishna Prasad: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరతా: వసంత కృష్ణప్రసాద్‌

రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 26 Feb 2024 14:17 IST
 
vasanta-260224.jpg

మైలవరం: రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాను. ఆయన సమక్షంలో తెదేపాలో చేరతా. దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. తెదేపా అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటాం. చంద్రబాబు, లోకేశ్‌ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్‌ చెప్పారు. మైలవరం టికెట్‌ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక తెదేపాలో చేరుతున్నా. వైకాపాలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Link to comment
Share on other sites

టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Penamaluru baig ante ycp ki hope ichinattte

Link to comment
Share on other sites

TDP: తెదేపాలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు.

Updated : 26 Feb 2024 15:03 IST
 
26022024kolusu-i.jpg

విజయవాడ: వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైకాపాలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. బలహీనవర్గాలకు వైకాపాలో అన్నీ అవమానాలే. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం. నూజివీడులో అందరితో కలిసివెళ్తూ తెదేపా జెండా ఎగురవేస్తా’’అని తెలిపారు. పార్థసారథితోపాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ తదితరులు తెదేపాలో చేరారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని), శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెదేపా-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Link to comment
Share on other sites

Jaleel Khan: తెదేపాలోనే కొనసాగుతా: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.

Published : 29 Feb 2024 14:02 IST
 
124040739_24040739BZA.jpg

అమరావతి: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. విజయవాడ తెదేపా లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ కేశినేని చిన్ని ఆయన్ను లోకేశ్‌ వద్దకు తీసుకెళ్లారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్‌ఖాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగడతానని.. పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...