Jump to content

*****HanuMan Updates*****


chanu@ntrfan

Recommended Posts

Day 1 WW Collections — 13.77CR~(24.50CR~ Gross)
Day 2 WW Collections — 10.81CR~(20.95CR~ Gross)
Day 3 WW Collections — 14.05CR~(27.20CR~ Gross)
Day 4 WW Collections — 12.40CR~(23.85CR~ Gross)
Day 5 WW Collections — 10.44CR~(19.40CR~ Gross)

Day 6 WW Collections — 7.40CR~(13.55CR~ Gross)
Day 7 WW Collections — 7.82CR~(14.35CR~ Gross)(GST & OS updated)
Day 8 WW Collections — 7.70CR~(14.25CR~ Gross)
Day 9 WW Collections — 10.61CR~(19.10CR~ Gross)
Day 10 WW Collections — 12.91CR~(24.20CR~ Gross)
Day 11 WW Collections — 4.99CR~(8.55CR~ Gross)

Day 12 WW Collections — 3.58CR~(6.20CR~ Gross)
Day 13 WW Collections — 2.41CR~(4.35CR~ Gross)
Day 14 WW Collections — 2.05CR~(3.60CR~ Gross)
Day 15 WW Collections — 9.48CR~(20.80CR~ Gross)(OS updated)

Link to comment
Share on other sites

ఏమీ చేతగాని కుర్రాడొకడు. ఎందుకూ కొరగాని కొక్కిరాయిగాడు. పనీపాటాలేని పరమ నాసిరకపు తుంటరోడు.

 

ఇటువంటివాళ్లు ఎన్నో అవమానాలు పొందుతూ, ఊరందరిచేతా తిట్లుతింటూ, బ్రతుకుకొక అర్ధమనేది లేకుండా జీవిస్తుండగా....

 

అనుకోకుండా ఒక అద్భుతమో, చిత్రవిచిత్రమైన సంఘటనో వారి జీవితాల్ని మలుపు తిప్పుతుంది.

 

ఉదాహరణకి స్పైడర్‌మాన్, మాస్క్... 

 

ఈ టైపు సినిమాలన్నింట్లోనూ దాదాపుగా ఒకేరకం ఫార్ములా ఉంటుంది. ఇందులోనూ అంతే! కాకపోతే ఆ ప్రారంభ సన్నివేశాలన్నింట్లోనూ హాస్యాన్ని తగుపాళ్ళలో రంగరించడంవల్ల సినిమా ప్రథమార్ధం బాగా ఆకట్టుకుంటుంది.

 

ముఖ్యంగా సీజీలో చేసినా ఆ అంజనాద్రి అనబడే గ్రామం మనందరినీ అద్భుతమైన లోకంలోకి తీసుకెళిపోతుంది.

 

నటనపరంగా చూసుకుంటే తేజా బాగా చేశాడు. గెటప్ శీనుకి వేసిన ఆ గెటప్ ఎప్పుడో ద్వాపరయుగంలో కృష్ణుడితో కలిసి గోవులుకాసే అమాయకపు యాదవుడి రూపం. ఇంకా అక్కడే ఉండిపోయారా బాబూ? ఎప్పుడూ నీరుకావిరంగు వదులైన పంచే, కళ్ళీలాల్చీలు, వెనకాల జడలల్లిన పిలక.  

 

కనీసం బస్సు సౌకర్యం కూడా సరిగా లేని ఆ మారుమూల గ్రామంలోని ఆ అమాయకుడు మాత్రం లేటెస్ట్ హీరోల డైలాగులు, సన్నివేశాలు, మిమిక్రీలూ చెప్పేస్తాడు. మిగతా సమయాల్లో కడు అమాయకంగా కనబడతాడు.

 

వరలక్ష్మిని ఇంకా ఎణ్ణాళ్లు బరించాలో మణం! ఆవూళ్లో పుట్టిపెరిగిన అమ్మాయి అలా ఎందుకు మాటాడుతుందసలు?

 

‘ఇలా పణిపాట లేకుండా ఎణ్ణాల్లు తిరగుతావురా?’ అంటూ హనుమంతుగాడి అక్క తెలుగు పదాలన్నింటినీ వక్కల్ని గూటంతో సితగ్గొట్టినట్టు మాటాడుతోంటే డైరెట్టర్లెవరికీ ఇనబడదా అని నా డౌటు!

 

‘ఎదుట నిలిచింది చూడూ.... జలతారు వెన్నెలేమో...!’ అనే పాటతో మనందరనీ కట్టిపడేసిన వినయ్, పాపం వేషాల్లేక కండలుపెంచి విలన్‌గా మారిపోయాడు. విశాల్ సినిమా డిటెక్టివ్‌లో పవర్ డ్రిల్‌తో శవాన్ని ముక్కలుచేసే విలన్‌గాను, ఇందులో డాక్టర్ ఆక్టేవియస్ (స్పైడర్ మాన్ -2) టైపు విలన్‌గాను కనబడి ఏదో తన ఉనికిని నిలబెట్టుకుంటున్నాడు. అతనికి పెద్ద స్కోపేమీ లేదు నటించడానికి.

 

ఇక ఆ ప్రాంతాన్ని సింగరాయకొండంటాడు. అందరూ తూగోజి భాష మాటాడుతుంటారు. సముద్రం ఉంటుంది. రైలుపట్టాలుంటాయి. ఊరంతా కలిపి వందమంది కూడా ఉండరు.

 

ఆవకాయ కలిపే బ్యాచంతా మా వైజాగ్‌లో ఎం.వి.వి. సిటీ గేటెడ్ కమ్యూనిటీలో కాపరముండే అరిస్టోక్రాట్ ఆడవాళ్లలా ఉన్నారేతప్ప నిరుపేదలైన అంజనాద్రి వాసుల్లా లేరు. వారికి కష్టమొచ్చి ఏడుస్తోంటే మాకు నవ్వొచ్చిందేతప్ప ఏడుపురాలా!

 

చీప్ థాట్స్! నిర్లక్ష్యం! అంతే! ఈ విషయంలో తమిళ, మలయాళ దర్శకులు వెయ్యిరెట్లు దూరంలో ఉన్నారు మనవాళ్ళకి.

 

ఇక అత్యంత శక్తివంతమైన టర్బోజాకెట్లనీ, హాండ్ గ్లవ్స్‌నీ తయారుచేసే సైంటిస్టుగా వెన్నెల కిషోర్‌ని పెట్టుకోవడం, అతనిచేత అడ్డమైన కామెడీ చేయించడం.... ఈ విషయంలో ప్రశాంత్‌వర్మే కాదు, శంకర్ సైతం అతీతుడేం కాదు. రోబోలో దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త రజనీకాంత్ పక్కనుండే సంతానం, కరుణాస్ చేసే అవకతవక పనులు, చీప్ డైలాగులూ గుర్తున్నాయిగా?

 

హీరోయిన్ అమృత అయ్యర్ ఎటువంటి నటనకూ అవకాశంలేని హావభావాలతో పెసరపిండితో చేసిన బొమ్మలా ఉంది. ఏదో, ఉండాలికదా మరి! 

 

సత్య ఉన్న కాసిని సన్నివేశాలూ హాయిగా నవ్వుకున్నాం. అతనొక జెమ్. అంతే!

 

సినిమాలో సంగీతం ప్రధానపాత్ర పోషించింది. సీన్లన్నీ ఎలివేటవ్వడానికి కావలసిన బీజీఎమ్ టాప్‌నాచ్ అసలు. 

 

ఫొటోగ్రఫీ బావుంది. కానీ కొన్ని సాధారణ సన్నివేశాలు సైతం ఏదో ఒక అడవిలో తీసుకోకుండా గ్రీన్‌స్క్రీన్లేసి తీసి కృతకంగా తయారుచేశారు.

 

ఆ స్కల్ మాస్కులేసుకున్న ఫైటర్లు, అంతంత దారుణమైన మారణాయుధాలూ చూస్తే అదొక కుగ్రామంలా అనిపించదబ్బా! బాగా అడ్వాన్స్‌డ్ & అర్బనైజ్డ్ విలేజ్‌లా అనిపిస్తుంది.

 

చివరి అరగంటా దర్శకుడు గ్రిప్ కోల్పోయాడు. అనవసరంగా రిపీట్ సీన్లు వచ్చిపడిపోయాయి. తనకి శక్తులున్నాయని తెలుసు, కొడతాడని తెలుసు. అవే గూస్‌బంప్స్ ఎన్నిసార్లు అనుభవిస్తాం?

 

పిల్లలకు మాత్రం కన్నులపండగ. హాలంతా వాళ్లే! మొత్తానికి హనుమాన్ నాకైతే ఉడికీ ఉడకని పొంగల్‌లా అనిపించింది. 

 

బాగా ఆకలిమీద ఉండటాన తినేస్తున్నారుతప్ప మిగతా విషయాలేమీ పట్టించుకోవట్లేదని నా భావన. 

 

ఇదంతా నా వ్యూ! ఇందులోకి మతాన్ని అనవసరంగా లాగాల్సిన పనిలేదు. 

 

........కొచ్చెర్లకోట జగదీశ్

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...