Jump to content

ABV Won...


Recommended Posts

న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు అనుకూలంగా సుప్రీం తీర్పును వెల్లడించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. ఏబీవీ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సుప్రీం సమర్థించింది. రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తి అయినందున ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేసింది. 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ  ఉన్నతన్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు.  జస్టిస్ కన్విల్కర్ ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. 

Image

Link to comment
Share on other sites

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏబీ వెంకటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ,.... రాష్ట్ర ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారని ప్రశ్నించారు. ఏ శాడిస్ట్ కోసం, ఏ సైకో కోసం ఇదంతా చేశారని నిప్పులు చెరిగారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి సాధించిందేమిటని అడగారు.  ప్రభుత్వానికి, అధికారులకు నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు. కొందరు అధికారులు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. 

 సస్పెన్షన్ ను ప్రశ్నించడమే తాను చేసిన తప్పా ?  అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. లాయర్ల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని... ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదించేందుకు ఒక లాయర్ల టీమ్ నే ఏర్పాటు చేసిందని తెలిపారు. వీరికి ఎన్ని కోట్లు చెల్లించారో తనకు తెలియదని చెప్పారు. కేసుల వల్ల తనకు కూడా అంతే ఖర్చు అయిందని అన్నారు. తన ఫీజును కూడా చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు వదిలి పెట్టనని చెప్పారు. రెండేళ్లు ముగిసిన తర్వాత సస్పెన్షన్ చెల్లదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని.... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. తాను ఎప్పుడూ చట్టం ప్రకారమే ముందుకెళ్లానని చెప్పారు. తాను లోకల్ అని... ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు. తాను డ్యూటీలో చేరతానని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...