srohith Posted August 24, 2021 Posted August 24, 2021 ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను నేడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాణే.. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కేంద్రమంత్రి రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాణేపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
Raaz@NBK Posted August 24, 2021 Posted August 24, 2021 CBN ni nadi road medha champeyyali ani Jagan ante emi cheyyakunda vadhilesaru
Prasadr Posted August 24, 2021 Posted August 24, 2021 In this aspect there is lot to learn from shiv sena by TDP. Good job shiv sena.
Vishal_Ntr Posted August 24, 2021 Posted August 24, 2021 5 minutes ago, Prasadr said: In this aspect there is lot to learn from shiv sena by TDP. Good job shiv sena. shivsena jagan nundi nerchukunnarani talk 🙂
Naren_EGDT Posted August 24, 2021 Posted August 24, 2021 Spineless CBN didn't take any action in Jagan
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.