Jump to content

Recommended Posts

దేవుడితో మాట్లాడతా!: ‘ఆదిత్య 369’ హీరోయిన్ మోహిని

08012021004025n22.jpg

 

‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహిని, స్వతహాగా శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ ప్రస్తుతం ఆమె క్రైస్తవ మతాభిమాని. అంతే కాదు దేవుడితో మాట్లాడతానని కూడా అన్నారు. ఆ విషయాలేంటో ఆమె మాటల్లోనే..

 

ఆయనే ప్రజాపతి!

‘క్రీస్తు’ అంటే విదేశీ దేవుడు కాదు. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం నాటి ఋగ్వేదంలో ఏసుస్వామి గురించి ఉంది. అందుకే అనేక మంది పాస్టర్లు ఇప్పుడు ఋగ్వేదం చదువుతున్నారు. ఋగ్వేదం ప్రకారం- ఒక కన్యకు ప్రజాపతి అనే దైవదూత పుడతాడు. ఆయనను ఒక చెట్టుకు కట్టి, మూడు శీలలను ఉపయోగించి చంపుతారు. ఆ శీలల సైజు ఎంతో కూడా దానిలో ఉంది. ‘ప్రజాపతి’ అంటే మొదటి మగవాడు, కొడుకు, భర్త, సోదరుడు, అధిపతి.. ఇలా రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. మొత్తం మీద ‘ప్రజాపతి’ అంటే ‘బ్రహ్మ మొదటి కుమారుడు’ అని అర్థం. ప్రతి యజ్ఞంలోను పుర్ణాహుతిని ప్రజాపతికే అర్పిస్తారు. బ్రాహ్మణులకు 12 గోత్రాలు ఉన్నట్లే.. క్రైస్తవంలో 12 తెగలు ఉన్నాయి. బ్రాహ్మణులు ప్రజాపతికి పూర్ణాహుతి ఇస్తారు. మురుగనకు ఇచ్చినా, నారాయణుడికి ఇచ్చినా, అమ్మవారికి ఇచ్చినా.. ఆ పూర్ణాహుతి వెళ్లేది ప్రజాపతికే. ఆ ప్రజాపతినే నేను విశ్వసిస్తున్నాను..’’

 

దేవుడితో మాట్లాడతా!

‘‘నేను క్యాథలిక్‌గా మారిన తర్వాత పేరును క్రిస్టియానాగా మార్చుకున్నా. నా జీవితమంతా కేథలిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో పేరును మార్చుకున్నా. నేను క్రీస్తు పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నా. నేను ఆయనతో మాట్లాడతా. మనం చేసే ప్రార్థనలే మనల్ని ఆయనకు దగ్గరగా చేరుస్తాయి. నేను ఏ పనిచేయాలన్నా.. ఆయనకు చెప్పి, ప్రార్థన చేస్తా. అది పూర్తయ్యే సరికి ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది. అంటే ఆయన నా నిర్ణయాన్ని సమ్మతించినట్లు లెక్క. కొందరితో ఆయన నేరుగా కూడా మాట్లాడతారు. చాలా మంది ఇవి క్రైస్తవ మతంలోనే ఎందుకు ఉన్నాయని అడుగుతారు. హిందుమతంలో కూడా ఇవి ఉన్నాయి. కొందరు అమ్మవారు ఆవహించిందని పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అప్పుడు ఏవేవో చెబుతూ ఉంటారు. వాటిని నమ్ముతారు కదా.. ఇస్లాంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. దేవుడు అందరితోనూ మాట్లాడతాడు. కానీ మనం గుర్తించలేం అంతే!

Link to post
Share on other sites

నాకు చేతబడి చేశారు.. అలా బయటపడ్డాను: ‘ఆదిత్య 369’ హీరోయిన్

08012021010132n93.jpg

 

‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి దాదాపు 100పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మోహిని, తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తనకు చేతబడి చేశారని చెప్పినట్లుగా, తనను దేవుడు కాపాడినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ విషయాలేంటో ఆమె మాటల్లోనే..

 

అలా.. బయటపడ్డాను!

నాకు పెళ్లి అయిన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. మంచి భర్త, కుటుంబం, హోదా, ఆస్తిపాస్తులు- అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని వేదన వెంటాడుతూ ఉండేది. కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నానో నాకే తెలిసేది కాదు. రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశా! దీనితో ఒక జ్యోతిష్కుడికి చూపించాం. ఆయన నాకు కొందరు చేతబడి చేశారని చెప్పారు. చేతబడి చేసి ఐదేళ్లు అయిపోయిందని.. తామేమి చేయలేమన్నారు. దేవుడే కాపాడాలన్నారు. దేవుడంటే ఎవరు? శివుడా? కేశవుడా? ఆంజనేయుడా? అమ్మవారా? - ఈ ఆలోచనతో అనేక గ్రంథాలు చదివాను. కానీ నాకు స్పష్టత రాలేదు. నాకు ఈ సమస్య రాకముందు ప్రతి రోజు అమ్మవారి పూజలు చేసేదాన్ని. వచ్చిన తర్వాత పూజలు మానేశాను. ఆలయానికి వెళ్లటం కూడా మానేశాను. దైవాన్వేషణలో తీవ్రంగా ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ‘‘దేవుడంటే ఎవరు? ఆడా.. మగా? నేను దేవుడు సృష్టించిన బిడ్డను.. అలాంటి నాకు దేవుడు ఎందుకు కనబడటం లేదు?’’ లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ధ్యానం చేసేదాన్ని. ఆ సమయంలో ఒక రోజు ధ్యానంలో క్రీస్తు కనిపించారు. 

 

ఒక పెద్ద ప్రళయంలో నేను కొట్టుకుపోతుంటే- ఆయన నాకేసి చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. ‘నన్ను కాపాడతాడా? లేదా?’ అని ఆలోచిస్తుంటే- ఆయన ‘నిన్ను కాపాడతాను’ అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత నేను నా సమస్యల నుంచి బయటపడ్డాను. ఏసుస్వామే నా దేవుడని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఒక పాస్టర్‌ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో నేను 13 యాసలతో మాట్లాడాను. చిత్రమేమంటే నేను మాట్లాడిన మాటలు నాకు కూడా వినిపిస్తున్నాయి.. అయినా నేను వాటిని ఆపలేకపోయాను. ఆ తర్వాత-  ‘ఈ అమ్మాయి అటువైపు వెళ్లిపోయింది. ఇక ఈ అమ్మాయిని ఏమీ చేయలేము. మాకు నిప్పులపై ఉన్నట్లుంది. ఆయన పేరు చెప్పి మమ్మల్ని పంపించేయండి’ అనే మాటలు వినిపించాయి. ‘ఆయన’ అంటే ఏసుస్వామి. ఆయన పేరు కూడా ఆ దుష్టశక్తి పలకలేకపోయింది. ఇదంతా నేను విన్నాను. అప్పుడు నాకు ‘దేవుడు ఎవరు?’ అనే విషయంపై స్పష్టత వచ్చింది. అందుకే నాకు తెలిసిన సత్యాన్ని అందరికీ పంచుతున్నాను. ప్రచారమంటే మైకు పట్టుకొని రోడ్లపై తిరగటం కాదు. మాకు తెలిసిన వారికి.. దగ్గరలో ఉన్నవారికి మాకు తెలిసిన విషయాలను వివరిస్తాం. 

Link to post
Share on other sites

Matalu vinabadatam is one of the clear sign of mental disorders maa relatives lo iddaru ki ilage maatalu vinabadathunayi anevallu vij lo Manchi doctors vunnaru tablets isthe taggedi good food good sleep vundali other wise malli repeat avuthayi malli tablets it's a nirantara prakriya !!

Link to post
Share on other sites

Looks to be these guys are influencing badly, in the intrest of spreading the Christianity.

In Jagan matter, bjp chusta encourage chesta vundhi and hindutva party ani jabalu charchu konta vunnaru.

Mark my words next time mali jagan vaste, every district  lo statue of liberty kana peda Jesus Christ statue pedtadu.

Link to post
Share on other sites
Posted (edited)


Meerante..majority  religion  ni rechagotti..aa votes tho gelusthunnaaru kaabatti..meeku vere mathaalu akkarledu.
But usually votes adigeppudu anni religious sections ni appease cheyyalani try chesthayi political parties .  Adoka pedha tappu laaga chusthunna…chaduvukunna moorkhudaa..itu chudu.

FRBM limit daati..sixers koduthunnaadu mee jagan anna. Bail meeda untu andarini influence chesthunnaadu.

Ayina sare..Baffas..chanti bidda laaga kaapaaduthunnaaru..financial gaa, CBI param gaa😂

enduko telusaa? Jaffa gaadu power lo unte..religious angle meedha edo okaroju division techi..state lo jenda paathudaam ani. Antha sannasi..anti nationals mee baffa gaalu. Alaanti vaallani guddi ga venakesuku vasthunanduku siggu padu😤

actions speak louder.

 

ippdu cheppu..kirasthaani gaallani real gaa penchi poshisthundi evaru? 😂

chaduvukunna moorkhudaa..kaneesam chaduvu ayina sarigga eduvu😁

operations chesi enthamandini champuthaavo ento nee matha picha tho😴

 

Edited by LION_NTR
Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...