Jump to content

****GENERAL KNOWLEDGE****


NAGA_NTR

Recommended Posts

అంద‌మైన ఈ డిజైన్డ్ డ్రెస్సుల వెనుక‌….. బ‌లైన ఎన్నో ప్రాణాలు!

ఇప్పుడైనా అప్పుడైనా…ధ‌న‌వంతులు తాము ఇత‌రుల్లో కంటే కాస్త తేడాగా మ‌రింత అందంగా క‌నిపించాల‌నే అనుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాము ధ‌రించే దుస్తువుల విష‌యంలో కేర్ తీసుకుంటారు. పురాతాన కాలంలో ప్యాష‌నబుల్ గా క‌నిపించ‌డం కోసం….. ఏం చేశారు..? ఆ ట్రెండ్ ఎలా అర్థాంత‌రంగా ముగిసిందో ఇప్పుడు చూద్దాం!

 

ఆర్సెనిక్ డై:

అప్ప‌ట్లో ప్యారిస్ గ్రీన్ దుస్తులు ఫ్యాష‌న్ ఐకాన్ లు.! అవి గ్రీన్ క‌ల‌ర్‌లో క‌నిపించేందుకు ఆర్సెనిక్ డై వాడేవారు. ఆర్సెనిక్ డ్రై వాడిన ఆ దుస్తువులు నీటిలో త‌డిసిన‌ప్పుడు వాటి నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు వెలువ‌డేవి. ఆ ర‌సాయ‌నాల కార‌ణంగా కొంద‌రు చనిపోయారు కూడా.! ఆ మ‌ర‌ణాల‌కు కార‌ణం ఆ డై అని కూడా చాలా మందికి తెలియ‌దు.! ఆ విష‌యం తెలిశాక‌….ఆ ప్యారిస్ గ్రీన్ దుస్తువుల‌ను వాడ‌డం మానేశారు….ఆ ఫ్యాష‌న్ క‌నుమ‌రుగైంది!

main-qimg-cad87b0aed5c632fdf0ff225018ff9

పురుగుల రెక్క‌ల‌తో దుస్తుల అలంక‌రణ:

అప్ప‌ట్లో కొంద‌రు వెరైటీ ఫ్యాష‌న్ కోసం పురుగుల రెక్క‌ల‌ను దుస్తుల‌పై అలంక‌రించేవారు. ఆ రెక్క‌ల‌ను సేక‌రించేందుకు కొంద‌రు ప‌నివాళ్ల‌ను సైతం పెట్టుకునేవారు.!

main-qimg-4f920490d78b78e0404cc33341a0d5

చ‌నిపోయిన వారి వెంట్రుక‌ల‌తో…..

అప్ప‌ట్లో కొంద‌రు చ‌నిపోయిన త‌మ కుటుంబీకుల వెంట్రుక‌ల‌ను సేక‌రించి వారి జ్ఞాప‌కంగా వాటిని అనేక వ‌స్తువుల్లో వాడేవారు. క్ర‌మంగా అది కూడా ఫ్యాష‌న్‌గా మారిపోయింది.

main-qimg-934391967fd325388b989cf85936ac

టోపీల‌కు ప‌క్షుల రెక్క‌లు:

అప్ప‌ట్లో కొంద‌రు తాము ధ‌రించే టోపీల‌కు ప‌క్షుల రెక్క‌ల‌ను అలంక‌రించేవారు. అందుకోసం అవ‌స‌ర‌మైతే ప‌క్షుల‌ను కూడా చంపేవారు.

main-qimg-78d797bc0eab49de89b59652f8764e

లో దుస్తుల‌కు ద్వారాలు:

చైనాలో ఒక‌ప్పుడు లోదుస్తులు జ‌న‌నావ‌య‌వాల‌ను పూర్తిగా క‌ప్పి ఉంచేవి కావు. ముందు వెనుక భాగాల్లో ఓపెనింగ్ ఉండేది. ఎక్కువ స‌మ‌యం పాటు లో దుస్తుల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఇబ్బంది క‌లుగుతుంద‌ని చెప్పి కొంద‌రు వాటికి ఓపెన్ చేసి పెట్టుకునే వారు

main-qimg-c9d28f7853a4b16530dcebfe8b0e18

స‌మ‌త‌ల‌మైన ఛాతి భాగం:

1920లలో కొంద‌రు స్త్రీలు త‌మ ఛాతి భాగం స‌మ‌త‌లంగా క‌నిపించేలా దుస్తుల‌ను ధ‌రించేవారు. అప్ప‌ట్లో పురుషులు ఛాతి స‌మ‌త‌లంగా ఉండే మ‌హిళ‌ల‌ను ఇష్ట ప‌డేవార‌ని చెప్పి కొంద‌రు స్త్రీలు అలా ధ‌రించారు. అందుకు ప్ర‌త్యేక దుస్తులు ఉండేవి.

main-qimg-a270de02bcc9a4091ba59aeb9085fc

న‌లుపు రంగు దుస్తులు:

త‌మ కుటుంబీకులు చ‌నిపోతే …. సంతాపంగా కొన్ని రోజుల పాటు అంద‌రూ న‌లుపు రంగు దుస్తుల‌ను ధ‌రించేవారు. ఆచారంగా వ‌చ్చే ఈ బ్లాక్ క‌ల‌ర్ త‌ర్వాత ఫ్యాష‌న్ గా మారిపోయింది!

main-qimg-55dd650b2c76fa3e34469403ed2008

Link to comment
Share on other sites

  • Replies 463
  • Created
  • Last Reply

ఇండియాలోని పంజాబ్‌కు, పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు తేడాలేమిటో తెలుసా..?

మ‌న దేశంలోని రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒక‌టి. ఈ రాష్ట్రంలో ఎక్కువ‌గా సిక్కు వ‌ర్గానికి చెందిన వారు నివ‌సిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్‌కు చండీగ‌ఢ్ రాజ‌ధానిగా ఉంది. అయితే మ‌న దేశంలోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ఒక పంజాబ్ ఉంది. అవును. భార‌త దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు అంతా క‌లిసే ఉండేది. కానీ విడిపోయాక అక్క‌డ ఒక పంజాబ్‌, ఇక్క‌డ ఒక పంజాబ్‌గా మారింది. ఈ క్ర‌మంలో రెండు పంజాబ్‌ల‌కు ఉన్న తేడాల‌ను ఒక్క‌సారి గ‌మనిద్దాం.

 

main-qimg-eb7bfd787ca0921eebaac280ab60b8

main-qimg-204a970dba068ac3301aecfdcb89d9

మ‌న దేశంలో ఉన్న పంజాబ్ క‌న్నా పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ రాష్ట్రం వైశాల్య‌మే ఎక్కువ‌. పాకిస్థాన్ పంజాబ్ వైశాల్యం 2,05,344 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. భార‌త్ పంజాబ్ వైశాల్యం 50,362 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. అయితే పాకిస్థాన్ క‌న్నా మ‌న దేశంలోని పంజాబ్‌లోనే అక్ష‌రాస్య‌త శాతం ఎక్కువ. అక్క‌డ అది 64.7 శాతం ఉంటే మ‌న ద‌గ్గ‌ర 75.84 శాతం ఉంది.

main-qimg-0b4a978fbb4285570a1b28799cc870main-qimg-6ef52b7cb2d1e8da00ef0ec248dabd

main-qimg-24ae18152e390ebea73b58a78f6403main-qimg-41bfe77bbde84207d19d4eae08812d

పాకిస్థాన్ పంజాబ్ జీడీపీ ఎక్కువ‌. కానీ మ‌న పంజాబ్ కు చెందిన జీడీపీ ప‌ర్ కాపిటా ఎక్కువ‌. ఇండియ‌న్ పంజాబ్ జీడీపీ 81 బిలియ‌న్ డాల‌ర్లు కాగా పాకిస్థాన్ పంజాబ్ జీడీపీ 162 బిలియ‌న్ డాల‌ర్లు. పాకిస్థాన్ పంజాబ్ జ‌నాభా 110 మిలియ‌న్లు కాగా ఇండియ‌న్ పంజాబ్ జ‌నాభా 30 మిలియ‌న్లు. పాకిస్థాన్ పంజాబ్‌లో నివ‌సించే జనాభాలో 97.21 శాతం మంది ముస్లింలే. అక్క‌డ క్రిస్టియ‌న్లు, హిందువులు మైనార్టీలు. ఇండియ‌న్ పంజాబ్‌లో సిక్కులు, హిందువులు ఎక్కువ‌గా ఉంటారు. పాక్ పంజాబ్‌లో పంజాబీని గుర్ముఖిలో రాస్తారు. అదే ఇండియాలో అయితే షాముఖిలో రాస్తారు.

main-qimg-176e0b7efdc06078542a4cf2167a88main-qimg-256048f6412c4f846086b50dab1236main-qimg-50870599a063ffbf7725f3e28b00c4main-qimg-cebca5263cb77b605226695993af22main-qimg-e0c39a20bd79134dc5db9f080b0e10

ఇండియ‌న్ పంజాబ్‌లో పంజాబీ ఎక్కువ‌గా మాట్లాడుతారు. అదే పాకిస్థాన్ పంజాబ్ లో అయితే ఉర్దూ మాట్లాడేవారు ఎక్కువ‌. పాకిస్థాన్ పంజాబ్‌లో పేద‌రికం ఎక్కువ‌. అక్క‌డ 31 శాతం మంది దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉండ‌గా, మ‌న పంజాబ్‌లో 8 శాతం మంది పేద‌లు ఉన్నారు. పాక్ పంజాబ్ రాజ‌ధాని లాహోర్ కాగా, మ‌న పంజాబ్ రాజ‌ధాని చండీగ‌ఢ్‌.

main-qimg-e537556d087dc7b127055fce0b5004main-qimg-f402a97b1028d6a1313b8e09509c2e

మొత్తంగా చూసుకుంటే జనాభా, విస్తీర్ణంలో పాకిస్థాన్ పంజాబ్ పెద్దదిగా ఉంది. కానీ అభివృద్ధి, ఇత‌ర‌ విష‌యాల్లో ఇండియా పంజాబే ముందుంది.

Link to comment
Share on other sites

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

వివిధ దేశాల్లో విస్తుపోయే చట్టాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ చాలా విషయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. కానీ, మన దేశంలో సర్వసాధారణమైన కొన్ని విషయాలను ప్రపంచంలోని పలు దేశాల్లో నేరంగా భావిస్తారు. వాటిపై చట్టాలు తీసుకొచ్చి ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. విస్తుపోయే ఆ చట్టాలేవో ఓ సారి చూద్దాం పదండి..

లావెక్కారో.. ఇక అంతే

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

జపాన్‌లో ప్రజలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో నియమనిబద్ధతతో ఉంటారు. సమయపాలన పాటిస్తూ.. ఆరోగ్యకరమైన భోజనం చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేస్తూ చాలా ఫిట్‌గా ఉంటారు. కానీ, పాశ్చత్యదేశాల ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కృతి జపాన్‌లోనూ విస్తరించడంతో తమ దేశ ప్రజలు కూడా లావెక్కుతున్నారని భావించిన జపాన్‌ ప్రభుత్వం.. 2008లో ‘మెటబో లా’ పేరుతో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని 40-75ఏళ్ల వయసున్న ప్రజలు లావెక్కకుండా జాగ్రత్త పడాలి. ఏటా వారికి ప్రభుత్వ అనుమతితో కొన్ని ప్రైవేటు సంస్థలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా పొట్టభాగంలో కొలతలు తీసుకుంటారు. పురుషుల పొట్ట 33.5 అంగుళాలు, మహిళల పొట్ట 35.5 అంగుళాలు మించకుండా ఉండాలి. ఎవరైనా ఆ కొలతలు మించి ఉన్నారంటే వారిని బరువు తగ్గించుకునే ప్రత్యేక కార్యక్రమాల్లో చేరుస్తారు. శరీర బరువు, వాటి ప్రభావాలపై కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రజలకు జరిమానా ఉండదు. కానీ, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతే సంస్థలకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.


బయట ఆరేస్తే ఫైన్‌ కట్టాల్సిందే..!

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

మన దేశంలో దుస్తులు ఉతికేసి ఇంటి బయట, ఖాళీ స్థలంలో ఆరేస్తుంటాం. మనం ఆరేసిన దుస్తులు బయటవాళ్లకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, కరేబియన్‌ ప్రాంతంలోని ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఐలాండ్‌లో మాత్రం ఆరు బయట ఇలా దుస్తులు ఆరేయడం నిషేధం. బయట వ్యక్తులకు కనిపించేలా వీధుల్లో వస్త్రాలు ఆరేస్తే అక్కడి చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి 200 డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లేదా నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలి. 


అలాంటి హోర్డింగ్స్‌ ఉండవు.. ఉన్నా

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే ప్రచారం అవసరం. అందుకే ఎక్కడపడితే అక్కడ రోడ్ల పక్కన భారీ హోర్డింగ్స్‌పై ప్రచార చిత్రాలు దర్శనమిస్తుంటాయి. అదే యూఎస్‌లోని అలస్కా, హవాయి, మైనే, వెర్మోంట్‌ రాష్ట్రాల్లో హోర్డింగ్‌లను నిషేధించారు. కేవలం దారి చూపించే మ్యాప్‌లు, ల్యాండ్‌ మార్క్‌లు, రియల్‌ ఎస్టేట్‌కి సంబంధించిన చిత్రాలు మాత్రమే హోర్డింగ్స్‌పై కనిపిస్తాయి. మరే ఇతర సంస్థలకు చెందిన హోర్డింగ్స్‌ను ప్రదర్శించకూడదు. అయితే సొంత స్థలం ఉంటే అందులో హోర్డింగ్స్‌ పెట్టుకోవచ్చట.


జ్యోతిషం చెప్పకూడదు

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

జ్యోతిషాన్ని కొందరు నమ్ముతారు.. మరికొందరికి పెద్దగా దానిపై పట్టింపులు ఉండవు. నమ్మకం ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే జ్యోతిష కేంద్రాలు మన దేశంలో విరివిగా కనిపిస్తుంటాయి. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో జ్యోతిషం చెబుతుంటారు. అయితే యూఎస్‌లోని మేరీలాండ్‌లో మాత్రం జ్యోతిషం చెప్పడం నిషేధమట. అది ఎంత వరకు అమలువుతుందో తెలియదు గానీ, ఎవరైనా జ్యోతిషం చెబుతూ పట్టుబడితే కనీసం 500 డాలర్లు జరిమానా లేదా ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారట. 


 

గేటు తెరిచే వాళ్లే మూయాలి

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

మనలో చాలామందికి గేట్లు తెరవడమే గానీ మూసేసే అలవాటు ఏమాత్రం ఉండదు. అందుకే ఇంటి గేట్లపై చాలామంది ‘ప్లీజ్‌ క్లోజ్‌ ది గేట్‌’ అని బోర్డులు పెడుతుంటారు. అయినా అలసత్వం వహిస్తుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేదే. అయితే, యూఎస్‌లోని నెవాడా రాష్ట్రంలో గేటు తెరిచి మూసివేయకపోతే నేరం. ఇది నగరాల్లో ఉండే ఇళ్లకు, ఆఫీసులకు వర్తించదు. పొలాలు, కంచెలు వేసిన ఖాళీ స్థలాలు వంటి ప్రాంతాల్లో గేట్లను తెరిచి మూసివేయకపోతే నేరం చేసినట్లే. దీనికి న్యాయమూర్తి నిర్ణయం ఆధారంగా జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు.


వాళ్లకు ఒక్క గ్లాస్‌ మాత్రమే

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

పాశ్చాత్య దేశాల్లో పురుషులతో సమానంగా కొందరు మహిళలు మద్యం తాగుతుంటారు. అయితే దక్షిణ అమెరికాలోని బొలివియా దేశ రాజధాని లా పజ్‌ నగరంలో వివాహిత మహిళలు కేవలం ఒక్క గ్లాస్‌ మద్యం మాత్రమే తాగాలని చట్టం తీసుకొచ్చారు. ఎక్కువ మద్యం తాగడం వల్ల మహిళలు హద్దులు దాటి ప్రవర్తించే అవకాశం ఉందని ఈ చట్టాన్ని తీసుకొచ్చారట. మహిళలు ఎవరైనా ఒక్క గ్లాస్‌ కన్నా ఎక్కువ తాగితే ఈ కారణం చూపించి భర్త ఆమెకు విడాకులు ఇవ్వొచ్చని చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ చట్టంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం ఈ చట్టం సరిగా అమలు కావట్లేదనే చెప్పాలి.


మనం గాలిపటాలు ఎగరేస్తే సరదా.. వాళ్లు ఎగరేస్తే నేరం

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

సంక్రాంతి పండగంటేనే గాలిపటాల వేడుక. పండగకు నెల రోజుల ముందు నుంచే పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇంటి మేడ మీద, ఇంటి ముందు, పార్కులు, పాఠశాల గ్రౌండ్స్‌ ఇలా ఎక్కడ వీలు ఉంటే అక్కడ గాలిపటాలు ఎగరేసి సంబరాలు చేసుకుంటాం. వివిధ దేశాల్లోనూ ఈ గాలిపటాలు ఎగరేసే సంస్కృతి ఉంది. అయితే ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం. 1966లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా పార్కులు, గ్రౌండ్స్‌, మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తే వారికి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా 165 డాలర్ల నుంచి 826 డాలర్ల వరకు ఉంటుంది.


శునకాన్ని నడకకు తీసుకెళ్లాల్సిందే

 

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

పెంపుడు జంతువుల్లో మనుషులకు బాగా దగ్గరయ్యేవి శునకాలే. అలాంటప్పుడు మన ఆరోగ్యంతోపాటు వాటి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అందుకే శునకాల్ని పెంచుకునేవాళ్లు.. వాటిని ఉదయం లేదా సాయంత్రపు నడకకు తీసుకెళ్తుంటారు. అయితే దీన్ని ఇటలీలో చట్టంగా మార్చారు. ముఖ్యంగా రోమ్‌ నగరంలోని శునకాల యజమానులు వాటిని కనీసం రోజులో ఒక్కసారైనా బయట నడకకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేయని పక్షంలో కనీసం 625 డాలర్ల జరిమానా విధిస్తారు. ఇలాంటి చట్టాన్నే జర్మనీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని యోచిస్తోంది. రోమ్‌లోని చారిత్రక కట్టడాలను సందర్శించినప్పుడు అక్కడ మెట్లపై కూర్చోవడం కూడా నిషేధమట.


అక్కడ హై హీల్స్‌కు నో..

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా హైహీల్స్‌ వేసుకొని వెళ్తుంటారు. కానీ, గ్రీస్‌లో ఆక్రోపొలిస్‌ కోట ప్రాంతంలో హైహీల్స్‌ వేసుకోవడం నిషేధం. అక్కడ హైహీల్స్‌ వేసుకొని నడిస్తే కట్టడాలు దెబ్బతినే అవకాశముందని, నేలపై మట్టి హై హీల్స్‌కు అంటుకొని ఇతర ప్రాంతాలు అపరిశుభ్రం అయ్యే అవకాశం ఉందని ఈ చట్టం తీసుకొచ్చారట.


పావురాలకు ఆహారం ఇవ్వొద్దు

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

ఎక్కడైనా పావురాల గుంపు కనిపిస్తే ధాన్యాలను ఆహారంగా అందిస్తుంటాం. కొన్ని సందర్శక ప్రాంతాల్లో పావురాలకు ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక చోటు, ధాన్యాలు అమ్మే దుకాణాలు ఉంటాయి. కానీ పర్యటక ప్రాంతాల్లో మొదటి వరసలో ఉండే వెనిస్‌లో మాత్రం పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం. ఎవరైనా అలా పావురాలకు ఆహారం పెడుతూ పట్టుబడితే 700 డాలర్లు జరిమానా విధిస్తారట. 


రేడియోల్లో కెనడా సంగీతానికి రిజర్వేషన్‌

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

 

రేడియో స్టేషన్‌ నిర్వాహకులు నిత్యం శ్రోతలకు నచ్చే ఎన్నో పాటలు వినిపిస్తుంటారు. అయితే, కెనడాలోని రేడియోల్లో వినిపించే పాటల్లో రిజర్వేషన్‌ ఉంటుంది. అక్కడి రేడియోల్లో కనీసం 40శాతం కెనడా సంగీతకళాకారులు రూపొందించిన పాటల్ని మాత్రమే వినిపించాల్సి ఉంటుంది. 


చూయింగ్‌ గమ్‌ నమిలినా నేరమే.. ఇప్పుడు కాదులెండి

ఆరు బయట దుస్తులారేసినా.. లావెక్కినా నేరమే!

సింగపూర్‌లో 1992లో ప్రజలు చూయింగ్‌ గమ్‌ను నమలడం నిషేధించారు. చికిత్సలో భాగంగా ఎవరికైనా అవసరమైతే వైద్యులు సూచించిన వారికే వాటిని అమ్మేవారు. ప్రస్తుతం చూయింగ్‌ గమ్‌ నమలడం నేరమేం కాదు. అయితే వీటిని కేవలం దిగుమతి చేసుకునే విక్రయించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

IPL ల్లో…… 2:30 నిమిషాల టైమ్ ఔట్ వాల్యూ 3.6 కోట్లు!? అదెలాగో చూడండి!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ప్ర‌తి సీజ‌న్‌లోనూ జ‌రిగే ప్ర‌తి మ్యాచ్‌లో స్ట్రాటెజిక్ టైమ్ అవుట్‌ను అమ‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. ఒక్కో టీం ఇన్నింగ్స్‌కు రెండు సార్ల‌ (బ్యాటింగ్‌, బౌలింగ్‌) చొప్పున ఒక్క మ్యాచ్‌లో మొత్తం 4 సార్లు టైమ‌వుట్ తీసుకుంటారు. ఒక్కో టైమ‌వుట్ 2.50 నిమిషాలు ఉంటుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో టైమ‌వుట్ నిబంధ‌న అవ‌స‌ర‌మా ? దాంతో ఎవ‌రికి ఏం లాభం ఉంటుంది ? అంటే…

 

ipl time out value

ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో అమ‌లు చేస్తున్న టైమ్ అవుట్ వ‌ల్ల బ్రాడ్‌కాస్ట‌ర్ల‌కు భారీగా ఆదాయం వ‌స్తుంది. మరోవైపు టీంల‌కు వ్యూహాలు రచించుకునేందుకు, కోచ్‌ల స‌హాయం తీసుకునేందుకు టైం దొరుకుతుంది. ఇలా వారికి లాభం ఉంటుంది. కానీ చూసే ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఇర్రిటేష‌న్ వ‌స్తుంది. నిజానికి టీ20 క్రికెట్ ఉద్భ‌వించిందే చాలా వేగంగా మ్యాచ్ అయిపోతుంద‌ని. కానీ దానికి నిర్వ‌చ‌నం మారుస్తూ మ‌రింత టైం పెంచేలా టైమ్ అవుట్ నిబంధ‌న‌ను ఐపీఎల్ యాజ‌మాన్యం చేర్చింది. ప్రపంచంలో ఏ లీగ్‌లోనూ, ఆఖ‌రికి అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌లోనూ టైమ్ అవుట్ నిబంధ‌న లేదు. కానీ బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు ఆదాయం ర‌ప్పించ‌డం కోసం, మ్యాచ్ లో ఇరు టీంల‌కు పై విధంగా మేలు చేయ‌డం కోస‌మే టైమ్ అవుట్‌ను అమ‌లు చేస్తున్నారు.

సాధార‌ణంగా బ్రాడ్ కాస్ట‌ర్‌కు ఒక్కో టైమ్ అవుట్ స‌మ‌యంలో (2.50 నిమిషాలు) యాడ్‌ల వ‌ల్ల రూ.3.60 కోట్ల ఆదాయం వ‌స్తుంది. అంటే ఒక్క సీజ‌న్‌కు 60 మ్యాచ్‌లు అనుకుంటే ఒక్కో మ్యాచ్‌లో మొత్తం క‌లిపి టైమ్ అవుట్ 10 నిమిషాలు ఉంటుంది. అంటే 60 మ్యాచ్‌ల‌కు క‌లిపి టైమ్ అవుట్ 600 నిమిషాలు లేదా 10 గంట‌లు అవుతుంది. దీన్ని బ‌ట్టి లెక్కిస్తే బ్రాడ్‌కాస్ట‌ర్ల‌కు టైమ్ అవుట్ వ‌ల్ల ఎంత‌టి ఆదాయం వ‌స్తుందో మ‌నం ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అంత ఆదాయ‌న్ని వ‌దులుకోలేకే టైమ్ అవుట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. దీని వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు చిరాకు త‌ప్ప ఎటువంటి లాభం క‌ల‌గ‌డం లేదు.

jwmv-Strategic_Time_out

అయితే టైమ్ అవుట్ నిబంధ‌న వ‌ల్ల గ‌తంలో ఓ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా వారు టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించారు. 2014 ఐపీఎల్‌లో చెన్నై బ్యాట్స్‌మ‌న్ సురేష్ రైనా భీభ‌త్స‌మైన ఫాంలో ఉన్నాడు. అప్ప‌టికే 25 బంతుల్లో 87 ర‌న్స్ స్కోర్ చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే మ‌ధ్య‌లో టైమ్ అవుట్ వ‌చ్చింది. దీంతో టైమ్ అవుట్ అవ్వ‌గానే బ్యాటింగ్ చేప‌ట్టిన రైనా ఔట‌య్యాడు. ఆ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. దీంతో టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించింది. అదే ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. అందువ‌ల్ల టైమ్ అవుట్ అనేది కొన్ని సార్లు టీంల‌కే ఇబ్బంది అవుతుంద‌ని మ‌నం గ్ర‌హించ‌వ‌చ్చు.

టైమ్ అవుట్ వ‌ల్ల అన‌వ‌స‌రంగా మ్యాచ్ ఫ్లో దెబ్బ‌తింటుంది. ఒక రిథ‌మ్‌లో వెళ్లే ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట వేసిన‌ట్లు అవుతుంది. దీంతో ఇటు టీంల‌కు కొన్ని సార్లు న‌ష్టం క‌లుగుతుంది. మ‌రోవైపు అటు ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పిస్తుంది. కానీ బ్రాడ్‌కాస్ట‌ర్ల‌కు ఆదాయం వ‌స్తుంది. అయితే టైమ్ అవుట్ లేక‌పోయినా ఆదాయం ప‌రంగా వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండదు. ఓవ‌ర్ ఓవ‌ర్‌కు, వికెట్ ప‌డిన‌ప్పుడు, ఆట‌గాళ్ల‌కు గాయాలు అయిన‌ప్పుడు ఏర్ప‌డే అంత‌రాయం స‌మ‌యంలో.. బ్రాడ్ కాస్ట‌ర్లు యాడ్స్ ద్వారా పెద్ద మొత్తంలో డ‌బ్బులు సంపాదిస్తారు. అలాంట‌ప్పుడు టైమ్ అవుట్ ద్వారా డ‌బ్బులు సంపాదించ‌క‌పోయినా క‌లిగే న‌ష్టం ఏమీ పెద్ద‌గా ఉండ‌దు. అయిన‌ప్పటికీ డ‌బ్బు డ‌బ్బే కదా. అందుక‌ని టైమ్ అవుట్‌ను అమ‌లు చేస్తున్నారు. నిజానికి అసలు దాన్ని అమ‌లు చేయాల్సిన ప‌నేలేదు..!

Link to comment
Share on other sites

చైనాలో కేజీ కుక్క మాంసం రేటెంత‌?

చైనాలో కేజీ కుక్క మాంసం రేటెంత‌?

ప్ర‌పంచంలో అనేక దేశాల్లో ర‌క‌ర‌కాల మాంసాల‌ను తినేవారు ఉన్నారు. ముఖ్యంగా చైనా విష‌యానికి వ‌స్తే అక్క‌డ అదీ, ఇదీ అని లేదు. దేన్ని ప‌డితే దాన్ని తింటారు. ముఖ్యంగా కుక్క మాంసానికి అక్క‌డ గిరాకీ ఎక్కువ‌. దీంతో అనేక షాపుల్లో అక్క‌డ కుక్క మాంసం విక్ర‌యిస్తుంటారు. అలాగే కుక్క మాంసంతో వండిన వంట‌కాల‌ను అక్క‌డి అనేక రెస్టారెంట్ల‌లో వ‌డ్డిస్తుంటారు. అయితే నిజానికి చైనాలో ఏడాదికి సుమారుగా 1 కోటికి పైగానే కుక్క‌ల‌ను మాంసం కోసం చంపుతున్నార‌ట‌.

chaina dog meet

అంటే దాదాపుగా రోజుకు అక్క‌డ 27వేల వ‌ర‌కు కుక్క‌ల‌ను మాంసం కోసం చంపుతున్న‌ట్లు లెక్క‌. ఈ క్ర‌మంలోనే కుక్క‌ల‌ను అక్క‌డ మాంసం కోసం పెంచ‌డం కూడా ప‌రిపాటిగా మారింది. మ‌నం ఇక్క‌డ చికెన్‌, మ‌ట‌న్ తిన్న‌ట్లుగా చైనీయులు అక్క‌డ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటారు. అయితే కుక్క మాంసం అమ్మడం ఏమోగానీ వాటిని వారు అక్క‌డ అనేక చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తార‌ట‌. వాటిని ఇనుప బోన్ల‌లో బంధించి చిత్ర హింస‌లు పెడుతూ చంపి త‌రువాత వాటి నుంచి మాంసాన్ని సేక‌రిస్తార‌ట‌.

160620-yunlin-dog-meat-festival-01_68f54 ఇక అక్క‌డ కేజీ కుక్క మాంసం ధ‌ర సుమారుగా 10 నుంచి 20 యువాన్ల మ‌ధ్య ఉంటుంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.110 నుంచి రూ.220 వ‌ర‌కు ఉంటుంద‌న్న‌మాట‌. ఇక ఒక్క‌ కుక్క నుంచి వ‌చ్చే మొత్తం మాంసం కావాలంటే దాదాపుగా 80 యువాన్లు (రూ.878) చెల్లించాలి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ కుక్క మాంసం వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది.

అయితే కుక్క‌ల‌ను హింసిస్తూ వాటి మాంసాన్ని సేక‌రిస్తున్నందున అక్క‌డ కొన్ని జంతు సంర‌క్ష‌ణ సంస్థ‌లు ఈ విష‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నాయి. జంతు ప్రేమికులు అడ‌పా ద‌డ‌పా కుక్క‌ల‌ను చంప‌వ‌ద్ద‌ని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ వారు వింటే క‌దా.. కుక్క‌ల‌ను చంప‌డం, తిన‌డం ఇదేవారి ప‌ని..!

Link to comment
Share on other sites

1000ని k తో ఎందుకు సూచిస్తారు?

నా జీతం 30k, నాకు ఫేస్ బుక్ లో 10k ఫాలోవ‌ర్స్ ఉన్నారు. నా షూస్ 3k పెట్టి కొన్నాను.! ఇలాంటి మాట‌ల‌ను మనం చాలా సార్లు వినే ఉంటాం! నెంబ‌ర్ల వ‌ర‌కు ఓకే ఈ k ఎక్క‌డి నుండి వ‌చ్చింద‌నేదే అస‌లు డౌట్.! వేయిను k తో సూచిస్తార‌ని తెలుసు…కానీ k తోనే ఎందుకు సూచిస్తార‌నేది చాలా త‌క్కువ మందికి తెలుసు. ఇప్పుడు అదే తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

money-in-note-books.png?resize=1200%2C63
ఇంగ్లీష్ అక్ష‌రం అయిన ‘k’ కిలో ను సూచిస్తుంది. ఒక కిలో అంటే 10^3 =1000 అది గ్రాములైనా కావొచ్చు, మీట‌ర్లైనా కావొచ్చు…. అలా సౌల‌భ్యం కోసం వేయిని ‘k’ లో చెప్ప‌టం మొద‌లైంది . మొద‌ట్లో కాస్త విచిత్రంగా అనిపించినా…త‌ర్వాత అదే ట్రెండ్ గా మారింది. త‌ర్వాత జ‌నాలు దాన్నే ఫాలో అవుతూ వ‌స్తున్నారు.!

Link to comment
Share on other sites

పార్సీలు అంటే ఎవ‌రు ? ఇండియాలో వీరు ఎంత మంది ఉన్నారంటే..?.

భార‌త దేశం భిన్న జాతులకు నిల‌యం. ఎన్నో వ‌ర్గాలు, కులాలు, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు భార‌త్‌లో నివాసం ఉంటున్నారు. వారిలో పార్సీలు కూడా ఒక‌రు. వీరు నిజానికి జొరాస్ట్రియ‌న్ వ‌ర్గానికి చెందిన వారు. అందులో రెండు వ‌ర్గాలు ఉన్నాయి. ఒక వ‌ర్గానికి చెందిన పార్సీలు ఇండియాలో నివ‌సిస్తున్నారు. వీరు ముస్లిం చక్ర‌వ‌ర్తుల కాలంలో భార‌త్ కు వ‌చ్చి ఇక్క‌డే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్ర‌ధానంగా గుజ‌రాత్ తో పాటు ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లోనూ మ‌న‌కు పార్సీలు ఎక్కువ‌గా క‌నిపిస్తారు.

 

parsis.png?resize=1200%2C630&ssl=1

పార్సీలు జొరాస్ట్రియ‌నిజం అనే మ‌తాన్ని అనుస‌రిస్తారు. ఇరాన్ దేశ‌స్థులు కూడా ఈ మ‌త‌స్థులే. అక్డ స‌సానిద్ కాలం నుంచి ఈ మ‌తాన్ని వారు అనుసరిస్తూ వ‌స్తున్నారు. వీరు ఇత‌ర కులాలు, మ‌తాల‌కు చెందిన వారిని త‌మ మ‌తంలోకి మారేందుకు ఎట్టి ప‌రిస్థితిలోనూ అనుమ‌తించ‌రు. ఇక వివాహాలు కూడా వీరు త‌మ మ‌త‌స్థుల‌నే చేసుకుంటారు. మ‌న దేశంలో సుమారుగా 60వేల నుంచి 70వేల మంది పార్సీలు ఉన్న‌ట్లు అంచ‌నా.

main-qimg-9df58fdc1d3e02e395658e0eab9735

ఇక జొరాస్ట్రియ‌న్ల‌లో రెండో వ‌ర్గానికి చెందిన పార్సీలు ఇరాన్‌లో ఎక్కువ‌గా ఉన్నారు. వీరు క‌జ‌ర్ సామ్రాజ్యం స‌మ‌యంలో వ‌చ్చారు. ఇండియా త‌రువాత అత్య‌ధిక సంఖ్య‌లో జొరాస్ట్రియ‌న్లు క‌లిగి ఉన్న దేశం ఇరాన్ కావ‌డం విశేషం.

ఫరావహర్, జొరాస్ట్రియన్ మతస్థుల మతపరమైన చిహ్నం

jorastian.png?resize=1920%2C1029&ssl=1

 

పార్సీ మ‌తంలోని ప్ర‌ముఖులు.

  • దాదాభాయి నౌరోజీ
  • జమ్షెట్ జీ టాటా
  • ఫిరోజ్ షా మెహతా
  • ఫిరోజ్ గాంధీ
  • గోద్రెజ్ కుటుంబం, టాటా కుటుంబం.
Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

Ee thread lo members participation assalu ledu except Naga and  me 🤔🤔🤔

అందరూ చదివేవాళ్లే 

Link to comment
Share on other sites

ఆ కుటుంబానికి చట్టాలు వర్తించవు!

ఆ కుటుంబానికి చట్టాలు వర్తించవు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోని ప్రతి దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం.. చట్టాలున్నాయి. దేశ ప్రథమ పౌరుడి నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరూ చట్టాలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరూ వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా పదవి నుంచి తొలగించి శిక్షలు వేయొచ్చని చట్టంలోనే ఉంటుంది. కానీ, బ్రిటన్‌ రాయల్‌ కుటుంబం మాత్రం ఆ దేశ చట్టాలకు అతీతులు. కొన్ని అంశాల్లో బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌, ఆమె కుటుంబం చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. వారికి కొన్ని చట్టాలు అసలు వర్తించవు.  

అరెస్టా.. అంటే

రాణి ఎలిజెబెత్‌కు యూకేపై సార్వభౌమాధికారాలు ఉన్నాయి. ఆమె నిర్ణయాలపైనే ప్రభుత్వ పాలన సాగుతుంది. కాబట్టి, రాణిపై ఆరోపణలు వచ్చినా.. నేరం చేసినట్టు తెలిసినా అరెస్టు చేసి విచారణ జరపడానికి వీల్లేదు. కేసులు, దర్యాప్తుల్లాంటివి ఏవీ వారికి వర్తించవు.

 

రిజిస్ట్రేషన్‌.. లైసెన్స్‌.. స్పీడ్‌ 

ఏ దేశంలోనైనా కార్లకు రిజిస్ట్రేషన్‌, వాహనచోదకులకు లైసెన్స్‌ తప్పనిసరి, ప్రాంతాన్ని బట్టి వాహనాల వేగానికి పరిమితి విధిస్తారు. బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజెబెత్‌కు అవేవి అక్కర్లేదు. ఆమె వెళ్లే కారుకు రిజిస్ట్రేషన్‌ ఉండదు. వ్యక్తిగతంగా వాహనం నడపాల్సిన అవసరం క్వీన్‌కు ఎప్పుడూ రాలేదు. కాబట్టి లైసెన్స్‌ లేదు. ఒకవేళ నడిపినా.. ఆమె లైసెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్వీన్‌తోపాటు, ఆమె కుటుంబసభ్యులు, ప్రధాన మంత్రి వెళ్లే వాహనాల వేగానికి పరిమితి ఉండదు. పోలీసులు, ప్రత్యేక సిబ్బంది వారి వాహనాలను ఎంత వేగంగానైనా.. ఎంత నెమ్మదిగానైనా నడపొచ్చు. 

పాస్‌పోర్టుతో పనిలేదు

బ్రిటన్‌ పౌరులకు జారీ చేసే పాస్‌పోర్టులు రాణి ఎలిజెబెత్‌ పేరుతోనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి పాస్‌పోర్టుతో పనేముంది చెప్పండి. క్వీన్‌ పాస్‌పోర్టు లేకుండానే ఏ దేశానికైనా వెళ్లే అధికారముంది. అయితే ఆమె కుటుంబసభ్యులకు మాత్రం పాస్‌పోర్టు ఉండాల్సిందే.

 

ఆ కుటుంబానికి చట్టాలు వర్తించవు!

టాక్స్‌ కట్టక్కర్లేదు

క్వీన్‌ ఎలిజెబెత్‌కు దేశ పాలనతో పాటు ఎన్నైనా వ్యాపారాలు ఉండొచ్చు.. ఆదాయం రావొచ్చు. కానీ, ఆమెకు చట్టాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, క్వీన్‌ స్వచ్ఛందంగా ఆదాయపు పన్ను కట్టడం విశేషం. క్వీన్‌తోపాటు ఆమె కుటుంబసభ్యులకు కూడా ఆదాయం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది.

ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ చెల్లదు

 

మన దగ్గర ఉన్న రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌నే బ్రిటన్‌లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అని పిలుస్తారు. దరఖాస్తు ద్వారా ఎలాంటి వివరాలైనా పొందే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. కానీ, రాయల్‌ కుటుంబంలో జరిగే విషయాలన్నీ వారి వ్యక్తిగతం. వాటిని ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కింద బహిర్గత పర్చలేరు. క్వీన్‌ కుటుంబానికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం కోసమే ఈ చట్టంలో మినహాయింపు కల్పించారు.

Link to comment
Share on other sites

క్వీన్ ఎలిజ‌బెత్ 2 చేతిలోని హ్యాండ్ బ్యాగ్….. ఆమె ప్రాణాలు కాపాడే కీల‌క సాధ‌నం! అదెలా?

బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు వ‌చ్చిన‌ప్పుడు క్వీన్ ఎలిజ‌బెత్ 2 ను ఎప్పుడైనా గ‌మ‌నించారా? అలాంటి సంద‌ర్భంలో ఆమె చేతిలో ఖ‌చ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఉండే పొజీష‌న్ బ‌ట్టి…..ఆమె సెక్యూరిటీ గార్డ్స్ కు రెడీ అయిపోతుంటారు.! హ్యాండ్ బ్యాగ్ ఉంచిన ప్లేస్ ను బ‌ట్టి అప్ప‌‌టిక‌ప్పుడు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేస్తుంటారు!

 
 

queen elizebit

  • క్వీన్ హ్యాండ్ బ్యాగ్ ను లెప్ట్ హ్యాండ్ లో  కాకుండా రైట్  హ్యాండ్ తో  పట్టుకుంటే  ఆమె  అక్కడ  బోర్ ఫీలవుతుందని  అర్థం…. సెక్యూరిటీ వెంట‌నే ఆమెను అక్క‌డి నుండి తీసుకెళ్తారు.
  • అదే  బ్యాగ్ ని  టేబుల్ పై  పెడితే  మరో 5 నుంచి  10 నిమిషాల్లో  ఆమె  అక్కడినుంచి  వెళ్తుందని  అర్థం… ఆలోపు సెక్యూరిటీ రూట్ మొత్తం క్లియ‌ర్ చేసుకుంటారు!
  • ఇక జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజిలా మోర్క‌ల్ త‌న సెక్యూరిటీ టీమ్ లో మెడిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల‌నే నియ‌మించుకుంటారు. ఏలాంటి ఆప‌ద వ‌చ్చినా త‌న టీమ్ వైద్యం తెలిసిన వారుండాల‌నేది ఆమె ఉద్దేశం.

ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో కోడ్ ను త‌మ సెక్యూరిటీ కి ముందే చెప్పుకుంటారు.

Link to comment
Share on other sites

మన చేతిరాతను మార్చిన పెన్ను... ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి?

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

ఫౌంటెయిన్ (ఇంకు) పెన్నుతో రాత చాలా అందంగా కనిపిస్తుంది. కానీ, ఆ పెన్నులు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకు కక్కుతూ చేతులు, కాగితాలను పాడుచేస్తుండేవి. కొన్నిసార్లు సిరా ముద్దలుగా కాగితంపై పడిపోయేది.

చేతికి ఇంకు అంటుకోకుండా వాటితో రాసిన సందర్భాలు చాలా అరుదు. ఒక్కోసారి చొక్కా జేబుల్లోనూ అవి ఇంకును కక్కేసేవి. చొక్కాల మీద మరకలు పడుతూ ఉండేవి.

అయితే, ఈ ఫౌంటెయిన్ పెన్నులను బాల్‌పాయింట్ పెన్నులు భర్తి చేశాయి. 'చేతి రాత' దిశ, గమనాన్నే అవి మార్చేశాయి.

బాల్‌పాయింట్ పెన్ను ఓ గొప్ప ఆవిష్కరణ. పారిశ్రామీకరణ ఊపందుకుని, తయారీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ ఆవిష్కరణ జరగడం చాలా మేలు చేసింది.

మొట్టమొదటగా 1945 అక్టోబర్ 29న న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్‌లోకి బాల్ పాయింట్ పెన్నులు వచ్చాయి. అయితే, వీటి వాడకం విస్తృతమవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది.

రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపనీ బాల్‌పాయింట్ పెన్నుల తయారీ మొదలుపెట్టాక ఫౌంటెయిన్ పెన్నులకు పూర్తిగా కాలం చెల్లింది.

బాల్‌పాయింట్ పెన్నుల్లో జిగటగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంకును వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితం వెనకవైపు మచ్చలు పడవు. పెన్ను మొనలో గుండ్రంగా కదిలే చిన్న బాల్‌ ఉంటుంది. రాస్తున్న కొద్దీ ఇది తిరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందకు వచ్చి, కాగితం స్థిరంగా పడుతుంది. బాల్ వల్ల ఇంకు ముద్దలు ముద్దలుగా పడకుండా ఉంటుంది.

బాల్‌పాయింట్ పెన్నులు శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ, మొదట్లో వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది.

పెన్ను, ఫౌంటెయిన్ పెన్ను

రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ ధర అప్పట్లో సుమారు 900 రూపాయలు ఉండేది. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని విలువ 13 వేల రూపాయలకు పైమాటే.

అయితే, బాల్‌పాయింట్ పెన్ తొలిసారిగా అమెరికాలో మార్కెట్లోకి ప్రవేశించిందిగానీ అదే మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ కాదు. అంతకుముందే దక్షిణ అమెరికాలో ఇలాంటి పెన్ ఉపయోగంలో ఉన్నట్లు ఈ పెన్ తయారుచేసిన అమెరికా కంపెనీ హెడ్ కనుగొన్నారు.

ప్లాస్టిక్ లభ్యత, తయారీ రంగం ఊపందుకోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండటం, తెలివైన మార్కెటింగ్... ఇవన్నీ బాల్ పాయింట్ పెన్‌కు అనుకూల పరిస్థితులు కల్పించాయి.

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్త ఎవరు?

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్తగా హంగేరీ-అర్జెంటీనాలకు చెందిన లాస్జ్లో బిరో పేరు చెప్తారు గానీ, ఈ పెన్ అంతకన్నా పురాతనమైందే.

అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ 1888లో బాల్ పాయింట్ పెన్‌పై మొట్టమొదటి పేటెంట్ హక్కు పొందారు. వృత్తి రీత్యా లాయర్ అయిన లౌడ్... చెక్క, తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయడానికి వీలుగా ఉండే ఇంకు పెన్ కావాలనుకున్నారు. దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్‌ను రూపొందించారు. దాన్ని ఒక ఒరలో రాయడానికి వీలుగా అమర్చారు.

"నేను కనిపెట్టింది ఫౌంటెన్ పెన్ కన్నా మెరుగైంది. కఠినమైన ఉపరితలాలపై రాయడానికి అనువుగా ఉండేది" అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌండ్ వివరించారు.

లాస్జ్లో బిరో

లాస్జ్లో బిరో

లౌడ్ కనిపెట్టిన పెన్... చెక్క, తోలులాంటి వాటి మీద రాయడానికి అనువుగా ఉన్నప్పటికీ, కాగితంపై రాయడానికి అది పనికిరాలేదు. ఈ పెన్‌కు వ్యాపార విలువ లేదని భావించడంతో ఆయన పేటెంట్ కోల్పోవాల్సి వచ్చింది.

తరువాతి దశాబ్దాల్లో, లౌడ్ తయారుచేసిన్ డిజైన్‌కు మెరుగులు దిద్దడానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ, ఎవరూ విజయవంతం కాలేదు.

1930లో లాస్జ్లో బిరో మొట్టమొదటి సారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్‌పాయింట్ పెన్ రూపొందించారు.

హంగేరీలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న బిరో, అప్పటికి ఫౌంటెయిన్ పెన్నులు వాడి వాడి విసుగు చెందారని లండన్ డిజైన్ మ్యూజియంలో క్యూరేటర్‌గా ఉన్న గెమ్మా కర్టిన్ అన్నారు.

అయితే, ఇంకు పెన్నుల్లో వాడే సిరాను బాల్‌పాయింట్ పెన్నుల్లో వాడడానికి వీలు పడలేదు. బాల్‌పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరాను తయారుచేయవలసి వచ్చింది.

ఫౌంటెయిన్ పెన్నుల్లో వాడే సిరా ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో బాల్‌పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిరా కావాలని, పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకు అనుకూలంగా ఉంటుందని బిరో గ్రహించారు.

ఈ సిరా తయారుచేయడానికి బిరో తన సోదరుడు గ్యోర్జీ సహాయం తీసుకున్నారు. వృత్తిరీత్యా దంతవైద్యులైన గ్యోర్జీ జిగటగా ఉంటూ, సులువుగా వ్యాపిస్తూ, త్వరగా ఆరిపోయే సిరాను కనుగొన్నారు. బాల్‌పాయింట్ పెన్నుల్లో, ఫౌంటెయిన్ పెన్నులకన్నా తక్కువ ఇంకు ఖర్చవుతోందని గమనించారు.

బాల్‌పాయింట్ పెన్నుల్లో బాల్ గుండ్రంగా తిరుగుతూ క్రమ పద్ధతిలో ఇంకు కాగితంపై విస్తరిస్తుంది. రాయడం ఆపేసిన తరువాత ఆ బాల్ కదలకుండా, బిగుతుగా ఉండి సిరా లీక్ అవ్వకుండా, గాలి లోపలికి జొరబడి ఇంకు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది.

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

లాస్జ్లో బిరోకు 1938లో బాల్‌పాయింట్ పెన్ మీద పేటెంట్ లభించింది. కానీ అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండడంతో ఈ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యపడలేదు. బిరో, ఆయన సోదరుడు యూదులు కావడంలో యుద్ధ సమయంలో యూరోప్‌ నుంచి పారిపోయి అర్జెంటీనా చేరారు. అక్కడ తనలాగే పారిపోయి వచ్చిన జువాన్ జార్జ్ మెయ్‌నే సహాయంతో బాల్‌పాయింట్ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేశారు.

అర్జెంటీనా భాషలో "బిరోమే"గా పిలిచే బాల్‌పాయింట్ పెన్నును తొలిసారి 1943లో విడుదల చేశారు. ఈ పెన్ డిజైన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను ఆకర్షించింది. ఒక్కసారిగా 30,000 పెన్నులను కొనుగోలు చేశారు. విమానయానంలో, ఆకాశంలో చాలా ఎత్తులో కూడా బాల్‌పాయింట్ పెన్నులను వాడడం సులువయ్యింది. ఇంకు పెన్నులైతే అంత ఎత్తులో ఉండే పీడనం వలన ఇంకు చిమ్ముతాయి.

అయితే, అర్జెంటీనాకు బయట ఈ పెన్నులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు.

1945లో అమెరికాలోని ఎవర్‌షార్ప్ కో, ఎబర్‌హార్డ్ ఫాబెర్ కో సంస్థలు కలిసి ఈ పెన్నును అమెరికాలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వారి ప్రయత్నాలు అంత వేగంగా సాగలేదు. ఈలోపు అమెరికా వ్యాపారవేత్త మిల్టన్ రెనాల్డ్స్ అర్జెంటీనాలోని బుయెనస్ ఆరిస్ నగరానికి వెళ్లినప్పుడు ఈ పెన్ను చూసి ముచ్చట పడి, వాటిని కొనుగోలు చేశారు. అమెరికాకు తిరిగివచ్చిన తరువాత రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ స్థాపించి ఈ సరికొత్త పెన్నును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి రంగ సిద్ధం చేశారు.

మొదట్లో బిరో రూపొందించిన బాల్‌పాయింట్ పెన్నుకు రెనాల్డ్స్ తగినన్ని మార్పులు చేసి ఆ ఏడాది అక్టోబర్‌లో మార్కెట్లో విడుదల చేశారు.

"మార్కెట్లో విడుదల అయిన సరి కొత్త పెన్నును దాదాపు 900 రూపాయలు పెట్టి కొనడానికి జనం ఎగబడ్డారు" అంటూ టైమ్ మ్యాగజీన్ ఓ కథనంలో రాసింది.

ఈ కొత్త బాల్‌పాయింట్ పెన్నులో రెండేళ్లకొకసారి ఇంకు నింపుకుంటే చాలు. గింబెల్స్ సంస్థ 50,000 పెన్నులను కొనుగోలు చేసి 30,000 పెన్నులను మొదటి వారంలోనే అమ్మేసింది.

టైమ్ మ్యాగజీన్ కథనం ప్రకారం గింబెల్స్‌కు మొదటి ఆరు నెలల్లోనే సుమారు 41 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ప్రస్తుత కాలంలో అది దాదాపు 602 కోట్ల రూపాయలకు సమానం.

'బిరో' (బాల్‌పాయింట్ పెన్) ఇప్పుడు మనందరి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బాల్‌పాయింట్ పెన్ తెలియని వారు, వాడని వారు ఉండరు.

"ప్రతి ఒక్కరూ ఇష్టపడే డిజైన్ ఇది" అని కర్టిన్ అన్నారు.

మార్సెల్ బిక్

మార్సెల్ బిక్

మొదటి తరం బాల్‌పాయింట్ పెన్నులు కొంతవరకూ ఫౌంటెయిన్ పెన్నుల శైలిని అనుకరించాయి. లోహాలతో తయారు చేసేవారు. ఫౌంటెయిన్ పెన్నుల్లాగే వీటిల్లో కూడా ఇంకు నింపుకోవాల్సి ఉండేది. అయితే, రెనాల్డ్స్ పెన్నుల్లో రెండేళ్లకోసారి ఇంకు నింపుకుంటే సరిపోయేది.

సరళంగా, మృదువుగా, ఏ రకమైన గందగోళం లేకుండా, ఇంకు కక్కకుండా, కాగితాలు పాడవ్వకుండా రాసే రెనాల్డ్స్ బాల్‌పాయింట్ పెన్నులు వాడడం మొదలెట్టాక... ఫౌంటెయిన్ పెన్నులకు, దానికి ఉన్న తేడా ఏంటో జనాలకు అర్థమైంది.

అయితే, ఫౌంటెయిన్ పెన్నుల రాతలో ఉన్నంత అందం బాల్‌పాయింట్ పెన్నులతో రాదన్నది మాత్రం కొందరి అభిప్రాయం. అయినా బాల్‌పాయింట్ పెన్నులు బాగా సౌకర్యవంతంగా ఉండటంతో, వాటి వాడకం పెరగడం మొదలైంది.

అయితే, ఇంతలో ఓ సమస్య వచ్చి పడింది. బాల్‌పాయింట్ పెన్నులు ఇంతమందిని ఆకట్టుకోవడంతో…ఎవర్‌షార్ప్, ఫౌంటెయిన్ పెన్నులు తయారు చేసే పార్కర్ కంపెనీ సహా అనేక కంపెనీలు బాల్‌పాయింట్ పెన్నులు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. కానీ, జానాలు రీఫిల్స్ కొంటూ, పెన్నులు కొనడం మానేశారు. బాల్‌పాయింట్ పెన్ను ఎన్నో ఏళ్లు వాడొచ్చు. రీఫిల్ మారిస్తే చాలు. దాంతో, ఈ పెన్నులకు ఉన్న మార్కెట్ మందకొడిగా మారింది.

ఈసారి బాల్‌పాయింట్ పెన్నుల పరిణామక్రమంలో మలుపు ఫ్రాన్స్‌ నుంచీ వచ్చింది. బాల్ పాయింట్ పెన్నుల కంపెనీ నడిపిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మార్సెల్ బిక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడంలో నిపుణులు. బాల్‌పాయింట్ పెన్నులను వాడి పారేసే విధంగా రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి, చవగ్గా అందించే పెన్నులను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

'సొసైటె బిక్' అనే సంస్థను స్థాపించి చౌక పెన్నుల ఉత్పత్తి ప్రారంభించారు. ఈ సంస్థ లోగో బాల్‌పాయింట్ పెన్నులో ఉండే 'బాల్ ముఖంగా ఉన్న ఒక బాబు బొమ్మ'తో ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.

"బాల్‌పాయింట్ పెన్నులను ఇవాల్టి స్మార్ట్ ఫోన్లతో పోల్చొచ్చు. వీటిని కొనుక్కోక ముందు, ఏదైనా రాయాలంటే ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి. అనుకూలమైన బల్ల, రాయడానికి వీలుగా ఉండే అన్ని సదుపాయాలు ఉండాలి. కానీ బాల్‌పాయింట్ పెన్‌తో రాయడానికి అవేమీ అక్కర్లేదు. మంచు ప్రదేశాల్లో, వర్షం పడుతున్నప్పుడు, సముద్రం మధ్యలో ఎక్కడైనా, ఎలాగైనా రాయొచ్చు. బాల్‌పాయింట్ పెన్నులకు బ్యాటరీల్లాంటివి అవసరం లేదు. మధ్యలో ఛార్జ్ చేసుకోనక్కర్లేదు. ఎంత చిన్న జేబులోనైనా చక్కగా అమరిపోతాయి. ఇంకు అయిపోయేవరకూ నిరంతరంగా, సులువుగా రాసుకుంటూ ఉండొచ్చు" అంటూ కెనడాకు చెందిన జర్నలిస్ట్ డేవిడ్ సాక్స్ ఈ పెన్నుల విశిష్టతను ప్రశంసించారు.

అయితే, ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప డిజైన్ కలిగిన బాల్ పాయింట్ పెన్నులు కూడా కనుమరుగైపోతున్నాయని, ఇప్పటివరకూ వాటిని కనుగొని ఉండకపోతే, ఈ కాలంలో వాటిని కనుక్కుంటే ప్రపంచంలోనే అతి పెద్ద విషయంగా పరిగణించి ఉండేవారిని సాక్స్ అభిప్రాయపడ్డారు.

బిక్ ఉత్పత్తి చేసిన చౌక పెన్నులు విజయవంతం కావడానికి ఒక ముఖ్య కారణం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరగడం అని చెప్పుకోవచ్చు. తరువాతి కాలంలో ఈ పెన్నులు మరింత చౌక ధరకు లభ్యమవ్వడం మొదలయ్యింది.

రచయిత ఫిలిప్ హెన్షెర్ 2012లో చేతిరాత మీద రాసిన "ది మిస్సింగ్ ఇంక్" పుస్తకంలో బాల్‌పాయింట్ పెన్ విశిష్టతను కొనియాడారు. బిక్, ఈ పెన్నులను చౌకగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చెయ్యడమే కాకుండా, దశాబ్దాల తరబడి నిలిచిపోయేలా వీటి రూపకల్పన చేశారని ప్రశంసించారు.

బాల్‌పాయింట్ పెన్నుల్లో క్రిస్టల్ పెన్నులది విలక్షణమైన డిజైన్. 1950 నుంచీ క్రిస్టల్ పెన్నుల ఉత్పత్తి ప్రారంభమయ్యింది. 2006కి 10వేల కోట్ల క్రిస్టల్ పెన్నులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

"షడ్భుజిలా ఉండే క్రిస్టల్ పెన్ చేతితో పట్టుకుని రాయడానికి సులువుగా ఉంటుంది. పారదర్శకంగా ఉండటం వల్ల ఈ పెన్నులో ఇంకు ఎంతవరకూ ఉందనేది మనకు తెలుస్తుంది. బిక్ పెన్నులు ఓ అద్భుతం" అని హెన్షెర్ అన్నారు.

బిక్ పెన్నులు ఆఫ్రికా సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయని హెన్షెర్ తెలిపారు.

"బిక్ పెన్నులు ఆఫ్రికా సమాజాన్ని మలుపు తిప్పాయి. బిక్ పెన్నులు ప్రవేశ పెట్టకముందు ఆఫ్రికాలో రాసేందుకు సులభమైన మార్గమే లేదు" అని హెన్షెర్ వివరించారు.

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

ఇంత విశిష్టత సాధించిన బాల్‌పాయింట్ పెన్ కూడా ఒక ముఖ్యమైన విమర్శను ఎదుర్కొంది. 1950ల నుంచి వాడి పారేసే వీలున్న బాల్‌పాయింట్ పెన్నులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేశారు. దీనివలన అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాదీ 160 కోట్ల బాల్‌పాయింట్ పెన్నులను వాడి పారేస్తున్నారని అంచనా.

పారేసిన కోట్లకొద్ది పెన్నులన్నీ భూగర్భంలో పేరుకుపోయి ఉంటాయని కర్టిన్ అన్నారు.

"కొన్ని రకాల పెన్నుల్లో మళ్లీ రీఫిల్ వేసుకుని వాడొచ్చు. కాని, మనం దాన్ని పారేసి కొత్తది కొనుక్కుంటాం. ఇది చాలా వింతైన విషయం" అని కర్టిన్ అభిప్రాయపడ్డారు.

అయితే, బాల్‌పాయింట్ పెన్ తయారీదారులకు అవి సృష్టిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన ఉంది. బిక్ కంపెనీ 74% రీసైకిల్ ప్లాస్టిక్‌ను ఉపయోగించి వివిధ రకల పెన్నులను ఉత్పత్తి చేస్తోంది. కొందరు తయారీదారులు వాడిన తరువాత పెన్నులు పారేయకుండా, రీఫిల్ మార్చుకుని మళ్లీ వాడేలా కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు పెన్నులను అట్టతో లేదా లోహంతో తయారుచేస్తున్నారు. అయితే, లోహంతో చేసే పెన్నుల ఖరీదు కాస్త ఎక్కువే!

''ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు, కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో. కానీ, బాల్‌పాయింట్ పెన్నులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. వాటి స్థానం కోల్పోవు. సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పాతదైపోయిందని అంటారు గానీ పెన్నులు పాతవైపోయాయని ఎవరూ అనరు. మార్క్ జుకర్బర్గ్, ఎలోన్ మస్క్ టేబుల్‌పై కూడా కొన్ని బాల్‌పాయింట్ పెన్నులు ఉండే ఉంటాయి" అని సాక్స్ అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

పురావ‌స్తు తవ్వ‌కాల్లో బ‌య‌ట ప‌డ్డ భ‌యం గొలిపే అస్థి పంజ‌రాలు!!

పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌ల త‌వ్వ‌కాల్లో ఎప్పుడూ ఏదో ఒక చారిత్ర‌క నిర్మాణ‌మో, శిలాజాలో, వ‌స్తువులో బ‌య‌ట ప‌డుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం భ‌యం గొల్పుతుంటాయి. చాలా వ‌ర‌కు త‌వ్వ‌కాల్లో పురాత‌న కాలం నాటి అస్థిపంజ‌రాలు బ‌య‌ట ప‌డుతుంటాయి. వాటిని చూస్తే భ‌యం వేస్తుంది. అలాంటి కొన్ని త‌వ్వ‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్రీస్తు శ‌కం 1200 నుంచి 1400 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉత్త‌ర ఇట‌లీలోని నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు తవ్వ‌కాలు జ‌ర‌ప‌గా వాటిల్లో ఓ అస్థిపంజ‌రం బ‌య‌ట ప‌డింది. అందులో చేతికి క‌త్తి ఉంది. అంటే అప్ప‌ట్లో ఆ వ్య‌క్తి చేతిని తొల‌గించ‌గా అత‌ను దాని స్థానంలో క‌త్తిని ఏర్పాటు చేసుకున్న‌ట్లు మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.

main-qimg-12f554e3854328a1cebf9371419add

క్రీస్తు శ‌కం 79వ సంవ‌త్సరంలో పాంపెయిలోని మ్యాట్ వెసువియ‌స్ అనే ప్రాంతంలో బండ‌రాయిలో చిక్కుకుపోయిన అస్థిపంజ‌రాన్ని గుర్తించారు. అత‌ను అక్క‌డి నుంచి త‌ప్పించుకుంటుండ‌గా ఆ రాయి అత‌ని మీద ప‌డి అత‌ను న‌లిగి పోయి ఉంటాడ‌ని సైంటిస్టులు నిర్దారించారు.

main-qimg-4fef9c4afc04a17099636a7b976ee9

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వ‌ద్ద పురావ‌స్తు తవ్వ‌కాల్లో 6 చోట్ల గుంత‌ల్లో మ‌హిళ‌ల పుర్రెలు బ‌య‌ట ప‌డ్డాయి. అప్ప‌ట్లో మ‌హిళ‌ల‌ను షిమావో అనే వ‌ర్గానికి చెందిన వారు బ‌లిచ్చేవార‌ట‌.

main-qimg-134ec8eda37441d55af4515debe99f

పోలండ్‌లో 1600-1700 మ‌ధ్య కాలానికి చెందిన అస్థిపంజ‌రాల‌ను అక్క‌డి డ్రాక్సో అనే శ్మ‌శాన‌వాటిక‌లో త‌వ్వ‌కాల్లో గుర్తించారు. అప్ప‌ట్లో మ‌నుషుల ర‌క్తాన్ని తాగే వాంపైర్లు (ర‌క్త పిశాచులు) ఉన్నాయ‌నే కార‌ణంతో జ‌నాలు కొంద‌రు చ‌నిపోయిన వారిని భిన్న రూపంలో సమాధి చేసేవారు. వారు స‌మాధి నుంచి మ‌ళ్లీ లేచి రక్తం తాగుతార‌నే ఉద్దేశంతో వారు లేవ‌కుండా ఉండేందుకు గాను వారి మెడ‌ను ఓ ప్ర‌త్యేక‌మైన పరిక‌రంతో బిగించి క‌ట్టేవారు. లేదా వారి నోళ్ల‌లో రాళ్ల‌ను బ‌లంగా గుచ్చి పూడ్చేవారు. ఆ అస్థిపంజ‌రాలు త‌వ్వ‌కాల్లో 2014లో బ‌య‌ట ప‌డ్డాయి.

main-qimg-6570ce7e022e79af94dfba57943e47

అప్ప‌ట్లో గిరోలామో సెగాటో అనే ఓ వైద్య నిపుణుడు చ‌నిపోయిన వారి శ‌రీరాలు కుళ్లిపోకుండా ఉండేందుకు గాను వారి శ‌రీరాల‌కు ప‌లు ర‌సాయ‌నాల‌ను పూసి భ‌ద్ర‌ప‌రిచేవాడు. ఆ శ‌వాల‌ను చూస్తే అవి బొమ్మ‌ల్లా క‌నిపించేవి. దంతాలు ముందుకు వ‌చ్చి అవి భ‌యాన్ని గొలిపే విధంగా ఉండేవి.

main-qimg-eed77c130a1ddf926d529efdd6d0b8

Link to comment
Share on other sites

 

సగం మగ సగం ఆడ!

08112020sun-sf5a.jpg

హా శివుడు అర్ధ నారీశ్వరుడు అంటారు. అంటే ఆయనలో సగ భాగం పార్వతీ దేవి ఉంటుందని అర్థం. ఆశ్చర్యం ఏంటంటే... ఇలాగే అమెరికాలోని ఇల్లినాయిస్‌లో సగం మగ సగం ఆడ ఉన్న ‘నార్తన్‌ కార్డినల్‌’ పక్షిని గుర్తించారు శాస్త్రవేత్తలు. మామూలుగా ఈ పక్షుల్లో మగది ఎరుపు రంగులోనూ ఆడది బూడిద వర్ణంలోనూ ఉంటుందట. కానీ ఓ పక్షి మాత్రం ఇందుకు భిన్నంగా సగం మగ పిట్ట రంగులోనూ సగం ఆడపిట్ట వర్ణంలోనూ ఉందట. పైగా దీనికి జంట పక్షి కూడా లేదు. ఈ జాతి మగ పక్షులు కూత కూస్తూ పాడతాయి. ఈ పిట్ట పాడనూ పాడట్లేదు. దాంతో శాస్త్రవేత్తలు కొన్ని రోజులపాటు దీని గురించి అధ్యయనం చేసి ఈ పక్షి ‘బైలేటరల్‌ గైనాండ్రొమార్ఫిజమ్‌’ అనే జన్యు సమస్య కారణంగా ఇలా జన్మించిందని తేల్చారు. అంటే... ఈ పక్షి అవయవాలు కూడా ఒకవైపు ఆడ, మరోవైపు మగ పక్షికి ఉన్నట్లే ఉంటాయి. వింతగా ఉంది కదూ..!

Link to comment
Share on other sites

ఇది మ‌న ఇండియా….దేన్నైనా త‌ట్టుకొని జీవించ‌డం మా వార‌స‌త్వం! వాటికి చిన్న ఉదాహ‌ర‌ణ‌లే ఇవి!

ఇండియాను ఉప‌ఖండం అంటాం…ఎందుకంటే ఒక ఖండానికి ఉన్నాల్సిన అన్ని క్వాలిటీస్ ఇండియాలో మ‌న‌కు క‌నిపిస్తాయి. అధిక చ‌లిగా ఉండే ప్రాంతం, అత్యంత వేడిగా ఉండే ప్రాంతం,ఆగ‌కుండా వ‌ర్షాలు కురిసే ప్రాంతం, మంచు కురిసే ప్రాంతం, ఇసుక తుఫాన్లు వ‌చ్చే ప్రాంతం…ఇలా విభిన్న వాతావ‌ర‌ణాల‌ను ఇండియాలో చూడొచ్చు!

 

ద్రాస్
ల‌ఢ‌క్ కేంద్ర‌పాలిత ప్రాంతంలోని ఓ ప్రాంతం ద్రాస్…ఇది ప్ర‌పంచంలోనే రెండో అత్యంత చ‌లిగా ఉండే ప్రాంతం…అప్పుడ‌ప్పుడు ఇక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు -22 డిగ్రీ సెల్సియ‌స్ కు ప‌డిపోతుంటాయి! అయినా ఇక్క‌డ ఇప్ప‌టికీ మ‌నుషులు త‌మ జీవితాల‌ను చాలా సంతోషంగా కొన‌సాగిస్తూనే ఉన్నారు.!

drass-in-india-22-temparature.png?resize

చురు :
రాజ‌స్థాన్ లోని చురు అనే ప్రాంతంలో వేస‌విలో ఎండ 50 డిగ్రీల‌ను దాటుతుంది. అయినా కొన్ని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ జీవ‌నాన్ని కొన‌సాగిస్తూనే ఉంటారు.!

churu-in-rajastan-.png?resize=1200%2C630

చిర‌పుంజి
ప్ర‌పంచంలోనే అత్యంత తేమ‌తో కూడిన ప్రాంతం…ఏడాదంతా వ‌ర్షం కురుస్తున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది! ఏడాదికి 12063 మిల్లీమీట‌ర్ల వ‌ర్షాపాతం న‌మోదు చేసుకుంది. అయినా అదే వ‌ర్షంలో అక్క‌డి ప్ర‌జ‌లు త‌మరోజును గ‌డుపుతుంటారు.!

chirapunji.png?resize=1200%2C630&ssl=1

జైస‌ల్మేర్ :
కోట‌ల న‌గ‌రంగా పేరుపొందిన జైస‌ల్మేర్…భ‌యంక‌ర ఇసుక తుఫాన్ల‌కు పెట్టింది పేరు. ఇసుకంతా గాల్లోకి లేచి…. గంట‌ల పాటు ఊపిరి కూడా తీసుకోనివ్వ‌కుండా భ‌య‌పెడుతుంది. అయినా అక్క‌డి ప్ర‌జ‌లు దీన్ని అల‌వాటు చేసుకొని త‌మ లైఫ్ ను లీడ్ చేస్తూనే ఉన్నారు.!

jaisalmer.png?resize=1200%2C630&ssl=1

Link to comment
Share on other sites

చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా వాడిన వ‌స్తువులు ఇవే.!

ఒక వ‌స్తువు పూర్తిస్థాయిగా రూపాంత‌రం చెంద‌డానికి…. అంత‌కు ముందు అది అనేక ద‌శ‌ల‌ను దాటాల్సి ఉంటుంది! అలా మొద‌టిసారిగా ఆ వ‌స్తువులు వాడిన సంద‌ర్భాలేంటో ఇప్పుడు చూద్దాం!

 

మొద‌టి సారిగా వాడిన బ్రా!
లెనిన్ తో త‌యారు చేసిన మొద‌టి బ్రా ఇది! మ‌ద్య యుగంలో ఆస్ట్రేలియాలో దీనిని వాడ‌డం జ‌రిగింది!

bra.jpeg?resize=602%2C338&ssl=1

ఫ‌స్ట్ ప‌ర్ ఫ్యూమ్.
క్రీ.పూ 3000 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. దీనిని మ‌ల్లెపువ్వు, దాల్చిన చెక్క‌ల‌ను క‌లిపి త‌యారుచేసేవార‌ట‌!

perfumes.jpeg?resize=181%2C300&ssl=1

మొద‌టి దువ్వెన.

‌క్రీ.పూ 1500 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. చెక్క‌తో, చేప బొక్క‌తో త‌యారు చేసేవార‌ట‌!

comb.jpeg?resize=602%2C521&ssl=1

అభ‌ర‌ణాలు 
జంతువుల బొక్క‌ల‌తో నెథ‌ర్లాండ్ లో మొద‌ట‌గా వీటిని త‌యారు చేశార‌ట‌!

neclace.jpeg?resize=512%2C508&ssl=1

మొద‌టి కండోమ్:

జంతువుల పేగుల‌తో సుఖ వ్యాధులు రాకుండా 16,17 వ శ‌తాబ్దంలో ఇంగ్లాడ్ , స్వీడ‌న్ లో వాడార‌ట‌!

confommm.jpeg?resize=330%2C220&ssl=1

బ్ర‌ష్
క్రీ.పూ 1400 సంవ‌త్స‌రంలో…చైనాలో త‌యారు చేయ‌బ‌డింది. వెదురు బొంగుకు, పంది ఈక‌ల‌ను క‌ట్టి…ప‌ళ్లు తోముకోడానికి వాడేవార‌ట‌!

brush-.jpeg?resize=415%2C300&ssl=1

లిప్ స్టిక్:
సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌లో లిప్ స్టిక్ లు ఉండేవ‌ట‌…. ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఆడ‌,మ‌గ‌లు ఇద్ద‌రూ వాడేవార‌ట‌!

ipstick-.jpeg?resize=302%2C238&ssl=1

 
Link to comment
Share on other sites

2 minutes ago, NAGA_NTR said:

చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా వాడిన వ‌స్తువులు ఇవే.!

ఒక వ‌స్తువు పూర్తిస్థాయిగా రూపాంత‌రం చెంద‌డానికి…. అంత‌కు ముందు అది అనేక ద‌శ‌ల‌ను దాటాల్సి ఉంటుంది! అలా మొద‌టిసారిగా ఆ వ‌స్తువులు వాడిన సంద‌ర్భాలేంటో ఇప్పుడు చూద్దాం!

 

మొద‌టి సారిగా వాడిన బ్రా!
లెనిన్ తో త‌యారు చేసిన మొద‌టి బ్రా ఇది! మ‌ద్య యుగంలో ఆస్ట్రేలియాలో దీనిని వాడ‌డం జ‌రిగింది!

bra.jpeg?resize=602%2C338&ssl=1

ఫ‌స్ట్ ప‌ర్ ఫ్యూమ్.
క్రీ.పూ 3000 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. దీనిని మ‌ల్లెపువ్వు, దాల్చిన చెక్క‌ల‌ను క‌లిపి త‌యారుచేసేవార‌ట‌!

perfumes.jpeg?resize=181%2C300&ssl=1

మొద‌టి దువ్వెన.

‌క్రీ.పూ 1500 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. చెక్క‌తో, చేప బొక్క‌తో త‌యారు చేసేవార‌ట‌!

comb.jpeg?resize=602%2C521&ssl=1

అభ‌ర‌ణాలు 
జంతువుల బొక్క‌ల‌తో నెథ‌ర్లాండ్ లో మొద‌ట‌గా వీటిని త‌యారు చేశార‌ట‌!

neclace.jpeg?resize=512%2C508&ssl=1

మొద‌టి కండోమ్:

జంతువుల పేగుల‌తో సుఖ వ్యాధులు రాకుండా 16,17 వ శ‌తాబ్దంలో ఇంగ్లాడ్ , స్వీడ‌న్ లో వాడార‌ట‌!

confommm.jpeg?resize=330%2C220&ssl=1

బ్ర‌ష్
క్రీ.పూ 1400 సంవ‌త్స‌రంలో…చైనాలో త‌యారు చేయ‌బ‌డింది. వెదురు బొంగుకు, పంది ఈక‌ల‌ను క‌ట్టి…ప‌ళ్లు తోముకోడానికి వాడేవార‌ట‌!

brush-.jpeg?resize=415%2C300&ssl=1

లిప్ స్టిక్:
సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌లో లిప్ స్టిక్ లు ఉండేవ‌ట‌…. ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఆడ‌,మ‌గ‌లు ఇద్ద‌రూ వాడేవార‌ట‌!

ipstick-.jpeg?resize=302%2C238&ssl=1

 

India lo first vadinavai emi leva 🤔🤔

Link to comment
Share on other sites

స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి ? క్రికెట్ చ‌రిత్ర‌లో ఇందుకు భారీ మొత్తం ఫైన్ క‌ట్టిన ప్లేయ‌ర్స్ ఎవ‌రు??

క్రికెట్‌లో మ‌న‌కు స్లో ఓవ‌ర్ రేట్ అనే ప‌దం త‌ర‌చూ వినిపిస్తూనే ఉంటుంది. మ్యాచ్ లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా కెప్టెన్‌కు, ప్లేయ‌ర్ల‌కు ఫైన్ విధించారు. ప్లేయ‌ర్ల‌పై కొన్ని మ్యాచ్‌ల‌కు నిషేధం విధించారు. అనే మాట‌ల‌ను మ‌నం త‌ర‌చూ వింటుంటాం. అయితే స్లో ఓవ‌ర్ రేట్ అంటే ఏమిటి ? దీని వల్ల కెప్టెన్ ఎందుకు ఫైన్ క‌ట్టాలి ? క‌్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మొత్తంలో ఇందుకు ఫైన్ క‌ట్టిన కెప్టెన్లు ఎవ‌రు ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ponting.jpg?resize=1049%2C593&ssl=1

క్రికెట్‌లో 3 ర‌కాల ఫార్మాట్లు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డేలు, టీ20లు, టెస్ట్‌లు. వ‌న్డేలు, టీ20ల‌లో రూల్స్ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. టెస్టు క్రికెట్ రూల్స్ వేరేగా ఉంటాయి. వ‌న్డేలు, టీ20ల‌లో అయితే ఫీల్డింగ్ టీం మ్యాచ్‌లో గంట‌కు 15 ఓవ‌ర్లు కచ్చితంగా బౌల్ చేయాలి. అంటే వ‌న్డే మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌ను సుమారుగా మూడున్నర గంట‌ల్లోగా ముగించాలి. అదే టీ20లు అయితే గంట‌న్న‌ర (90 నిమిషాలు) లోగా ఒక ఇన్నింగ్స్‌ను ముగించాలి. అలా కాకుండా బౌలింగ్ లేట్ చేస్తే.. అంటే గంట‌కు 15 ఓవ‌ర్లు బౌల్ చేయ‌కుండా త‌క్కువ ఓవ‌ర్ల‌ను బౌల్ చేస్తే దాన్ని స్లో ఓవ‌ర్ రేట్ అంటారు. ఇందులో గంట‌కు కొన్ని ఓవ‌ర్ల‌ను న‌ష్ట‌పోతారు. దీని వ‌ల్ల ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యం పెరుగుతుంది. ఫ‌లితంగా కెప్టెన్ తోపాటు కొన్ని సంద‌ర్భాల్లో ప్లేయ‌ర్లు కూడా అందుకు బాధ్యులు అవుతారు.

వ‌న్డేలు, టీ20లు ఎందులో అయినా స‌రే ఫీల్డింగ్ జ‌ట్టు ఒక ఓవ‌ర్‌ను 4 నిమిషాల్లో వేయాలి. అంటే గంట‌కు సుమారుగా 15 ఓవ‌ర్లు బౌల్ చేయాలి. అంత క‌న్నా త‌క్కువ బౌల్ చేస్తే దాన్ని స్లో ఓవ‌ర్ రేట్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఇక టెస్టుల్లోనూ ఇదే ఫార్ములా వ‌ర్తిస్తుంది. గంట‌కు 15 ఓవ‌ర్ల చొప్పున ఒక రోజు మ్యాచ్‌లో 90 ఓవ‌ర్లు వేయాలి. త‌క్కువ‌గా వేస్తే స్లో ఓవ‌ర్ రేట్ అంటారు. ఇక ఇన్నింగ్స్ ముగిశాక అంపైర్లు ఓవ‌ర్ రేట్‌ను లెక్కిస్తారు. అందులోనుంచి ప్లేయ‌ర్ల‌కు గాయాల‌ వ‌ల్ల గ‌డిచిన స‌మ‌యం, డ్రింక్స్ స‌మ‌యం, ఇత‌ర స‌మాయ‌ల‌ను తీసేస్తారు. ఈ క్ర‌మంలో ఓవ‌ర్ రేట్‌ను లెక్కిస్తారు. గంట‌కు 2 ఓవ‌ర్ల వ‌ర‌కు త‌క్కువ‌గా వేసిన‌ట్లు నిర్దారిస్తే అది అంత తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించ‌రు. అలాంటి సంద‌ర్భాల్లో కెప్టెన్ కు 10 నుంచి 15 శాతం వ‌ర‌కు మ్యాచ్ ఫీజులో ఫైన్ విధిస్తారు. అదే 2 ఓవ‌ర్లు మించి ఓవ‌ర్ల‌ను త‌క్కువగా వేసిన‌ట్లు నిర్దారిస్తే దాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అప్పుడు కెప్టెన్‌కు 20 శాతం, ప్లేయ‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. అలాగే ఆ త‌ప్పును ప‌దే ప‌దే చేస్తే కెప్టెన్‌ను త‌దుప‌రి మ్యాచ్‌లు ఆడ‌కుండా నిషేధం విధిస్తారు. అదే టెస్టుల‌కు అయితే 5 ఓవ‌ర్ల వ‌ర‌కు త‌క్కువ‌గా వేసినా దాన్ని స్వల్ప నేరంగానే ప‌రిగ‌ణిస్తారు. 5 ఓవ‌ర్లు మించితే తీవ్ర‌మైన నేరం అవుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో ముందు తెలిపిన విధంగా శిక్ష‌లు వేస్తారు. ఇక ఇవే రూల్స్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశీయ క్రికెట్ మ్యాచ్‌ల‌లోనూ ఫాలో అవుతున్నారు.

అయితే క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రిక్కీ పాటింగ్‌, గ్రేమ్ స్మిత్‌, సౌర‌వ్ గంగూలీలు అత్య‌ధిక మొత్తంలో ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేయించి భారీ మొత్తంలో ఫైన్లు క‌ట్టారు. పాంటింగ్ అప్ప‌ట్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉండ‌గా, గ్రేమ్ స్మిత్ సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా ప‌నిచేశాడు. అలాగే గంగూలీ భార‌త్‌కు అప్ప‌ట్లో కెప్టెన్‌గా ఉన్నాడు.

Link to comment
Share on other sites

మ‌రాఠా చ‌రిత్ర‌లోనే మాయ‌ని మ‌చ్చ‌.. బ‌ర్గిస్ సైన్యం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు !!

 భార‌త దేశ చ‌రిత్ర‌లో మ‌రాఠా సైనికుల‌ను యోధులుగా చెప్పారు. ఎంతో మంది మ‌రాఠా రాజులు బ్రిటిష్‌, మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల‌కు వ్య‌తిరేకంగా పోరాటాలు చేశారు. వారిలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ కూడా ఉన్నాడు. అయితే ఎంత గొప్ప వారైనా స‌రే వారికి కూడా ఏదో ఒక మ‌ర‌క ఉంటుంద‌న్న చందంగా.. మ‌రాఠా సైన్యం విష‌యంలోనూ ఓ చీక‌టి కోణం ఉంది. మ‌రాఠా సైన్యానికి చెందిన ఓ వ‌ర్గం వారు అప్ప‌ట్లో ప‌శ్చిమ బెంగాల్‌పై కొన్నేళ్ల పాటు వ‌రుసగా దాడులు చేశారు. అత్యం పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించారు. కానీ చ‌రిత్ర‌లో దీని గురించి ఎక్క‌డా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

అప్ప‌ట్లో.. అంటే… 1740 నుంచి 1750 సంవ‌త్సాల వ‌ర‌కు సుమారుగా 10 ఏళ్ల పాటు మ‌రాఠా సైన్యానికి చెందిన బ‌ర్గిస్ అని పిల‌వ‌బడే ఓ వ‌ర్గం వారు బెంగాల్‌పై ఏటా దాడి చేసే వారు. వారు మెరుపు దాడులు చేయ‌డంలో, అక‌స్మాత్తుగా దెబ్బ కొట్టి పారిపోవ‌డంలో సిద్ధ‌హ‌స్తులుగా ఉండేవారు. ఈ క్ర‌మంలో వారు ఏటా బెంగాల్‌పై దాడి చేసి త‌మ‌కు న‌చ్చింది తీసుకునిపోయేవారు. అలాగే వారు ఒరిస్సాపై కూడా దాడులు చేసేవారు. అప్ప‌ట్లో బ‌ర్గిస్ సైన్యాన్ని నాగ్‌పూర్‌కు చెందిన రాజా ర‌ఘోజీ రాజే భోంస్లే వృద్ది చేశారు. బ‌ర్గిస్ సైనికులకు ఆ రాజ్యం గుర్రాల‌ను, ఆయుధాల‌ను ఇచ్చేది. వాటితో ఆ సైనికులు ఒరిస్సా, బెంగాల్ ల‌పై దాడులు చేసేవారు.

 

అయితే బ‌ర్గిస్ సైన్యం దాడుల వ‌ల్ల అప్ప‌ట్లో ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా కానీ మొత్తం దాదాపుగా 4 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు చ‌నిపోయారు. బ‌ర్గిస్ సైనికులు చేసిన అకృత్యాల‌కు అప్ప‌ట్లో అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఎంతో మంది వ్యాపారులు, నేత కార్మికులు, రైతులు చంప‌బ‌డ్డారు.

కానీ ఎట్ట‌కేల‌కు బ‌ర్గిస్ సైన్యం దాడుల‌కు ఓ రాజు ముగింపు ప‌లికాడు. 1751లో బెంగాల్ న‌వాబ్ అలివ‌ర్ది ఖాన్ మ‌రాఠా బ‌ర్గిస్ సైన్యంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్ర‌కారం బెంగాల్ న‌వాబ్ బ‌ర్గిస్ సైన్యానికి ఏటా రూ.12 ల‌క్ష‌లు చెల్లించాలి. అలాగే మ‌రో రూ.32 ల‌క్ష‌ల‌ను అద‌న‌పు రుసుం కింద చెల్లించాలి. దీంతో న‌వాబ్ ఒప్పుకునే సరికి బ‌ర్గిస్ సైన్యం అప్ప‌టి నుంచి బెంగాల్‌పై దాడులు చేయ‌డం ఆపేసింది. అయిన‌ప్ప‌టికీ వారు ఒరిస్సాపై య‌థావిధిగా దాడులు కొన‌సాగించారు. ఇలా మ‌రాఠా చ‌రిత్ర‌లో బ‌ర్గిస్ సైన్యం పాల్ప‌డిన అకృత్యాలు, చేసిన ఘోరాలు మాయ‌ని మ‌చ్చ‌ల్లా మిగిలిపోయాయి. ఎంతో మంది మ‌రాఠా రాజులు త‌మ జాతికి వ‌న్నె తెచ్చారు. కానీ బ‌ర్గిస్ సైనికుల వల్ల మ‌రాఠా రాజుల చరిత్రపై మ‌చ్చ ఏర్ప‌డింది.

Link to comment
Share on other sites

అంబులెన్స్ కు 108 నంబర్ ను ఎందుకు ఎంచుకున్నారు ఆ నంబర్ వెనుక ఉన్న కారణాలేంటో మీకు తెలుసా ?

అంబులెన్స్ అవసరం వచ్చినప్పుడు సాధారణంగా మనం 108కి కాల్ చేస్తాం.ఇంతకీ అంబులెన్స్ కు 108 నంబర్ ను ఎందుకు ఎంచుకున్నారు ఆ నంబర్ వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

 

20200924_094852.jpg?resize=1200%2C630&ss

హిందువులకు 108 అనే సంఖ్య చాలా పవిత్రమైనది.అందుకే దేవుడికి కట్టే పూల పూలమాలలో సరిగ్గా 108 పువ్వులను వాడుతారు.అంతేకాకుండా పూసలు పొదిగిన హారాలలో కూడా 108 పూసలని వినియోగిస్తారు.

20200924_094819.jpg?resize=1200%2C630&ss

ఇక సూర్యుడు,చంద్రుడు,భూమి దూరం వాటి వ్యాసాల( డయామీటర్) సరిగ్గా 108 సార్లు ఉంటుంది.ఇక యోగా శాస్త్రాల ప్రకారం దేశంలో 108 సంఖ్య గల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాక ఉపనిషత్తులు, మర్మ స్థానాల సంఖ్య కూడా 108 సంఖ్య ఉంది.

 

20200924_094804.jpg?resize=1200%2C630&ss

ఇక ఇస్లాం మతంలో 108 సంఖ్యను దేవుడితో పోలుస్తారు.సాధారణంగా మనిషి చనిపోయాక తన ఆత్మ 108 ఘట్టాలను ఎదుర్కొని ప్రయాణం చేయాలట.

20200924_094749.jpg?resize=1200%2C630&ss

ఇక సైకాలజి పరంగా చూస్తే మనిషి డిప్రెషన్ లేదా సమస్యలో ఉన్నప్పుడు అతని చూపు ఫోన్ లో ఎడమ భాగం వైపు చివరిగా వెళ్తుందని అక్కడ 0,8 దగ్గరగా ఉన్నాయని అందుకే 108ని ఎమర్జెన్సీ నంబర్ గా ఉంచుండ వచ్చని అంచనా వేస్తున్నారు.ఇక మరో కథనం ప్రకారం మొదటి సంఖ్య అయిన 1 మేల్ ను,0 ఫిమేల్ ను సూచిస్తాయి అని 8వ సంఖ్య ఇన్ఫినిటీ లేదా ఎటర్నిటిని సూచిస్తుందని అంటారు.

సో ఇదండీ ప్రస్తుతం 108 సంఖ్య అంబులెన్స్ లకు వాడడానికి గల కారణంగా చెబుతున్నారు

Link to comment
Share on other sites

19 hours ago, NAGA_NTR said:

చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా వాడిన వ‌స్తువులు ఇవే.!

ఒక వ‌స్తువు పూర్తిస్థాయిగా రూపాంత‌రం చెంద‌డానికి…. అంత‌కు ముందు అది అనేక ద‌శ‌ల‌ను దాటాల్సి ఉంటుంది! అలా మొద‌టిసారిగా ఆ వ‌స్తువులు వాడిన సంద‌ర్భాలేంటో ఇప్పుడు చూద్దాం!

 

మొద‌టి సారిగా వాడిన బ్రా!
లెనిన్ తో త‌యారు చేసిన మొద‌టి బ్రా ఇది! మ‌ద్య యుగంలో ఆస్ట్రేలియాలో దీనిని వాడ‌డం జ‌రిగింది!

bra.jpeg?resize=602%2C338&ssl=1

ఫ‌స్ట్ ప‌ర్ ఫ్యూమ్.
క్రీ.పూ 3000 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. దీనిని మ‌ల్లెపువ్వు, దాల్చిన చెక్క‌ల‌ను క‌లిపి త‌యారుచేసేవార‌ట‌!

perfumes.jpeg?resize=181%2C300&ssl=1

మొద‌టి దువ్వెన.

‌క్రీ.పూ 1500 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. చెక్క‌తో, చేప బొక్క‌తో త‌యారు చేసేవార‌ట‌!

comb.jpeg?resize=602%2C521&ssl=1

అభ‌ర‌ణాలు 
జంతువుల బొక్క‌ల‌తో నెథ‌ర్లాండ్ లో మొద‌ట‌గా వీటిని త‌యారు చేశార‌ట‌!

neclace.jpeg?resize=512%2C508&ssl=1

మొద‌టి కండోమ్:

జంతువుల పేగుల‌తో సుఖ వ్యాధులు రాకుండా 16,17 వ శ‌తాబ్దంలో ఇంగ్లాడ్ , స్వీడ‌న్ లో వాడార‌ట‌!

confommm.jpeg?resize=330%2C220&ssl=1

బ్ర‌ష్
క్రీ.పూ 1400 సంవ‌త్స‌రంలో…చైనాలో త‌యారు చేయ‌బ‌డింది. వెదురు బొంగుకు, పంది ఈక‌ల‌ను క‌ట్టి…ప‌ళ్లు తోముకోడానికి వాడేవార‌ట‌!

brush-.jpeg?resize=415%2C300&ssl=1

లిప్ స్టిక్:
సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌లో లిప్ స్టిక్ లు ఉండేవ‌ట‌…. ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఆడ‌,మ‌గ‌లు ఇద్ద‌రూ వాడేవార‌ట‌!

ipstick-.jpeg?resize=302%2C238&ssl=1

 

madhya yugam lo aus ani undi , Aus is comparatively new settlement. i doubt this article :dream:

Link to comment
Share on other sites

52 minutes ago, uravis said:

madhya yugam lo aus ani undi , Aus is comparatively new settlement. i doubt this article :dream:

AUSTRALIA eppudu unikiloki vachhindhi :thinking:

Link to comment
Share on other sites

14 minutes ago, uravis said:

I think Britishers established colony in 1800's . They have natives called aborigines who were enslaved same like what they did with native Americans :dream:

I'm just going through WIKI

Link to comment
Share on other sites

17 minutes ago, uravis said:

I think Britishers established colony in 1800's . They have natives called aborigines who were enslaved same like what they did with native Americans :dream:

Aboriginal Australians first arrived on the Australian mainland by sea from Maritime Southeast Asia between 40,000 and 70,000 years ago, and penetrated to all parts of the continent.

The first known landing in Australia by Europeans was in 1606 by Dutch navigator Willem Janszoon.

Link to comment
Share on other sites

3 hours ago, NAGA_NTR said:

Aboriginal Australians first arrived on the Australian mainland by sea from Maritime Southeast Asia between 40,000 and 70,000 years ago, and penetrated to all parts of the continent.

The first known landing in Australia by Europeans was in 1606 by Dutch navigator Willem Janszoon.

Andrew Symonds gaadu native antagaa

Link to comment
Share on other sites

సౌత్ కొరియాలో ప్రెగ్నెంట్ లేడీస్ కు ప్ర‌భుత్వం 500$ క్రెడిట్ కార్డ్ నిస్తుంది…ఆ దేశం పాటించే మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు!

సౌత్ కొరియాలో ఆధునిక‌త మ‌రియు ప్రాచీన‌తను క‌ల‌గ‌లిసిన నియ‌మాల‌ను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా గ‌ర్భావ‌తిగా ఉన్న‌ప్పుడు అక్క‌డి మ‌హిళ‌ల‌కు ఆ ప్ర‌భుత్వం ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

 

  • ప్రెగ్నెంట్ లేడీస్ కు సౌత్ కొరియా ప్ర‌భుత్వం…500$ క్రెడిట్ కార్డ్ ను ఇస్తుంది. దీంతో వాళ్లు మెడిసిన్ తో పాటు ఇత‌ర అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుగోళు చేసుకోవొచ్చు.! కాన్పు త‌ర్వాత తిరిగి ఆ డ‌బ్బు చెల్లించ‌లేని ప‌క్షంలో…ప్ర‌భుత్వం ఆ అప్పును ర‌ద్దు చేస్తుంది. అంతేకాకుండా….గ‌ర్భావ‌తుల‌కు ప్ర‌త్యేకమైన పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి.! ఆ స్లాట్స్ లో ఇత‌రులు ఎవ్వ‌రూ పార్క్ చేయ‌కూడ‌దు.!

women-inkorea.png?resize=602%2C401&ssl=1

  • ప్ర‌తి బ‌స్ హాల్ట్ వ‌ద్ద‌…ఏ బ‌స్ ఎప్పుడు వ‌స్తుంది…ప్ర‌స్తుతం ఆ బ‌స్ ఎక్క‌డ ఉంది అనే విష‌యాల‌ను డిజిట‌ల్ డిస్ ప్లే ద్వారా చూపుతారు! అక్క‌డి బ‌స్సులు 24*7 న‌డుపుతారు…డ్రైవ‌ర్లు యూనిఫామ్ చేతుల‌కు గ్లౌసులు ధ‌రించి ఉంటారు!

bus-halt.jpeg?resize=602%2C802&ssl=1

 

  • సూప‌ర్ మార్కెట్ ల‌లో….పండ్ల ముందు శాంపిల్ పీస్ లు క‌ట్ చేసి పెడ‌తారు. తిన్న త‌ర్వాత మీకు టేస్ట్ న‌చ్చితేనే కొనొచ్చే…లేదంటే లైట్ తీసుకోవొచ్చు!

sample.jpeg?resize=602%2C802&ssl=1

  • గృహ‌ప్ర‌వేశాల‌కు ఆహ్వ‌నించిన‌ప్పుడు…ఆహ్వానితులు వారికి కావాల్సిన వ‌స్తువులు త‌లాఒక‌టి చొప్పున తీసుకెళ‌తారు. కొంత‌మంది ప‌ప్పు, ఇంకొంత‌మంది బియ్యం, నూనె, షూ పాలిష్, టాయిలెట్ పేప‌ర్స్….ఇలా ఇంట్లో వాడే వ‌స్తువుల‌ను గిఫ్ట్ లుగా ఇస్తుంటారు.!

 

  • సౌత్ కొరియ‌న్ టీవీ యాంక‌ర్స్….నూత‌న సంవ‌త్స‌రం నాడు త‌ప్ప‌కుండా వారి సాంప్ర‌దాయ దుస్తుల్లోనే క‌నిపించాలి!

anchor.png?resize=602%2C537&ssl=1

  • కిండ‌ర్ గార్డెన్ స్కూల్ లో….ప్ర‌తి క్లాస్ పిల్ల‌ల‌కు డిఫ‌రెంట్ క‌ల‌ర్ యూనిఫామ్ ను పెడ‌తారు. ఒక‌వేళ పిల్ల‌లు గుంపులో త‌ప్పిపోయినా….ఈజీగా గుర్తుప‌ట్టొచ్చు.!

school-.jpeg?resize=602%2C802&ssl=1

Link to comment
Share on other sites

క్రికెట్ లోని 5 వింత‌లు…అతిచిన్న సిక్స్, 24గంట‌ల్లో మూడుసార్లు ఔట్ అయిన బ్యాట్స్ మ‌న్!?

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి.! ఎన్నో అరుదైన రికార్డ్స్ కూడా న‌మోద‌వుతూ ఉంటాయి! ఇలా మా దృష్టికొచ్చిన 5 వింత విష‌యాలను మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.!

 

షార్టెస్ట్ సిక్స్:   పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్ లో బ్యాక్ స్వీప్ షాట్ అడాడు.ఆ బాల్ బౌన్స్ అయ్యి వికెట్ కీపర్ తల పై నుండి వెళ్లి దూరంగా ఉంచిన తన హెల్మెట్ కు తగిలింది.ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో అంపైర్ వెంటనే ఆ బ్యాటింగ్ టీంకు ఐదు పరుగులు ఇచ్చాడు.అప్పటికే వారు ఒక పరుగు తిరిగుండడంతో ఆ బాల్ వల్ల బ్యాటింగ్ టీంకు మొత్తం ఆరు పరుగులు లభించాయి.దీన్ని క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ సిక్స్ సిక్స్ గా వర్ణించారు.

అతి చిన్న టెస్ట్ మ్యాచ్ : 1932 లో ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా మధ్య ఓ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ కేవలం 5 గంటల 53 నిమిషాలలో పూర్తయి హిస్టరీలో అతి చిన్న టెస్ట్ మ్యాచ్ గా రికార్డ్ ను నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23.2 ఓవర్స్ ఆడి కేవలం 36 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.ఆతరువాత లీడ్ సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో 72 పరుగులతో విజయం సాధించింది.

 

మోస్ట్ డక్ ఔట్స్ : శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ జయసూర్య 34 సార్లు డక్ ఔట్ ( అసలు స్కోర్ చేయకుండా ఔట్ అవ్వడమని అర్థం) అయ్యారు.ODI  మ్యాచ్ లలో ఎక్కువ సార్లు డక్ ఔట్ అయిన ప్లేయర్ గా ఈయన రికార్డ్ సృష్టించారు. 29 సార్లు డక్ ఔట్ అయ్యి పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆతర్వాత స్థానంలో నిలిచారు.

jayasurya.jpg?resize=2117%2C1411&ssl=1

 

49వ యేట అరంగ్రేటం : ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ జేమ్స్ సౌథర్టన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తన 49వ యేట అరంగ్రేటం చేశారు. ఈయన తన ఇంటర్నేషనల్ కెరియర్ లో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్ లు ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు.ఆతర్వాత వయసు వల్ల కలుగుతున్న ఇబ్బందుల వల్ల క్రికెట్ కు దూరమయ్యారు.

james-southerton-.jpeg?resize=263%2C191&

 

24 గంటలలో మూడుసార్లు ఔట్ అయిన బ్యాట్స్ మెన్ : పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ 24 గంటలలో మూడుసార్లు ఔట్ అయ్యాడు.మొదట ఇంగ్లాండ్ తో జరిగిన టి20 లో బ్యాటింగ్ చేసిన ఉమర్ అక్మల్ 9 బాల్స్ కు 4 రన్స్ కొట్టి వికెట్ ను కోల్పోయాడు.ఆతరవాత మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన ఉమర్ అక్మల్ జోర్డాన్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు.మ్యాచ్ పూర్తవ్వడంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడడానికి దిగిన ఉమర్ అక్మల్ 8 బాల్స్ ఆడి కేవలం 1 పరుగు చేసి వికెట్ కోల్పోయి. 24 గంటలలో మూడుసార్లు ఔట్ అయిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.

20200928_100632.jpg?resize=1200%2C630&ss

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...