Jump to content

****GENERAL KNOWLEDGE****


NAGA_NTR

Recommended Posts

ఆడపిల్లలకు పెద్ద మనిషి ఫంక్షన్ ఎందుకు…? అప్పట్లో పెళ్లి ఎలా ఉండేది…?

భారతదేశంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఫంక్షన్ ల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి ఆడపిల్లలు పెద్ద మనిషి అయితే ఎందుకు అంత భారీ ఫంక్షన్ చేస్తారు…? వాస్తవాన్నికి ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి కాళ్ళు అరిగేలా తిరిగిన రోజుల్లో ఈ సాంప్రదాయం వచ్చింది. మన భారత సాంప్రదాయంలో బిడ్డ పుట్టిన రోజు నుంచి కడవరకు ఏదోక ఫంక్షన్ చేస్తూనే ఉంటారు.

cca-1.jpg?resize=725%2C481&ssl=1

బిడ్డ పుట్టిన 11 రోజున నూనెలో శిశువును చూడటం, అవసరం అయితే శాంతులు చేయించడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్న ప్రాశన, అక్షరాభ్యాసం, బోర్లా పడితే బొబ్బట్లు, ఆడపిల్లకు పైట ఉత్సవం, మగపిల్లలకు పంచెలు ఇవ్వడం కొన్ని కులాలలో వారి వారి శాస్త్రాలకు తగినట్టు ఉపనయనం వివాహం వంటివి చేస్తారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునేది మాత్రం రజస్వల ఉత్సవం.j-1.jpg?resize=680%2C453&ssl=1

ఈ వేడుక ప్రధాన ఉద్దేశం మాత్రం అమ్మాయి పదిమందికీ పరిచయం అవుతుందని, దీనివల్ల ఎవరికైనా నచ్చితే, సంబంధానికి సుముఖులవుతారని భావించి ఘనంగా చేసారు. పూర్వం బాల్య వివాహాలు ఎక్కువగా ఉండే రోజుల్లో ఆడపిల్ల రజస్వల కాకుండానే వివాహం చేసారు. అయితే ఇప్పుడు మాత్రం తల్లి తండ్రుల్లో మానవత్వం పెరిగి, సమాజంలో వచ్చిన మార్పులతో మూర్కత్వం వదిలి… రజస్వల అయిన వెంటనే చేస్తున్నారు. ఇక దీన్ని ఇప్పుడు పెద్ద ఫంక్షన్ లా చేయడం ఊరంతా ఫ్లెక్సీలు పెట్టడం వంటి చేష్టలతో గట్టిగా చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 463
  • Created
  • Last Reply

పాదరసం చేత్తో ముట్టుకోవచ్చా…? తాగితే ఏమవుతుంది…?

 మన జీవితంలో కొన్ని కొన్ని పదార్ధాల గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. అందులో పాదరసం ఒకటి. మన స్కూల్ డేస్ లో దీని గురించి ఎక్కువగా వింటాం. కొన్ని కొన్ని సామెతలకు కూడా పాదరసం ను వాడుతూ ఉంటారు. వాస్తవానికి పాదరసం ఎలా ఉంటుంది…? దాని వలన ఉపయోగాలు ఏంటీ అనేది తెలియదు గాని. కాలేజీల్లో ల్యాబుల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

 o.jpg?resize=1024%2C1024&ssl=1

నాలుగేళ్ల క్రితం అనుకుంట ఒక అమ్మాయి పాదరసం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ప్రేమ వైఫల్యంతో అని ఒక వార్త చదివాం. అసలు పాదరసం చేత్తో ముట్టుకుంటే ఏమవుతుంది…? పాదరసం చేత్తో ముట్టుకుంటే ప్రమాదకరం అని చెప్తారు గాని వాస్తవానికి అసలు ఏ ప్రమాదం లేదు. దాన్ని ధర్మామీటర్ లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పాదరసం చేత్తో పట్టుకుంటే ఏమి కాకపోవడానికి కారణం ఏంటీ అంటే… మన శరీరంకు దానిని సోషించు కునే (అబ్సరబ్ )స్థాయి చాలా తక్కువ.a-1.jpg?resize=1024%2C576&ssl=1

వాస్తవానికి పాదరసం ద్రవ రూపం లో వుండే భార లోహమనే విషయం చాలా మందికి తెలియదు. అది విషపూరీతమే కాని చర్మం పై దాని ప్రభావం అంతగా ఉండదట. కడుపులోకి వెళితే మాత్రం కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి దాన్ని ముట్టుకునే సాహసం చేయండి గాని తాగే సాహసం చేయకండి.

Link to comment
Share on other sites

ఫ్లైట్ మోడ్ ఎందుకు…? ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే ఏమైనా ఇబ్బందా…?

విమానం ఎక్కి కూర్చోగానే, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఆర్ ఫ్లైట్ మోడ్ అని ఎయిర్ హోస్టెస్ చెప్తూ ఉంటారు. గాల్లో సిగ్నల్ రానప్పుడు ఫోన్ ఆన్ లో ఉంటే ఏంటీ, వేరే మోడ్ లో ఉంటే నష్టం ఏంటీ…? ఈ ప్రశ్న చాలా మంది మదిలో ఉంటుంది. విమానయాన రంగం మొదలైన కొత్తలో… మొబైల్ ఫోన్ తో విమానంలో ఉండే ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పని చేయక ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించి ఫోన్ ఆఫ్ చేయాలని కోరారు.

mo.jpg?resize=1024%2C768&ssl=1

అయితే ఇప్పుడు విమానాల్లో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చేసింది. ఒక్క ఫోన్ తో దుష్ట శక్తులు విమానం టెక్నాలజీ నాశనం చేసే అవకాశం కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పటి విమానాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మొబైల్ ఫోన్ల ఇంటర్ ఫెరన్స్ ను తట్టుకొని పని చేసే విధంగా రూపొందించారు. మొబైల్ సిగ్నళ్లు వాడుకునే బ్యాండ్, వేవ్ స్పెక్ట్రమ్ లు వేరుగా ఉంటే విమానం కమ్యూనికేషన్ చానెళ్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ మరో విషయం ఏంటీ అంటే… విమానంలో ఫోన్ వాడితే ఏ విమానం కూడా ప్రమాదానికి గురి కాలేదు.kj.jpg?resize=828%2C466&ssl=1

అయినా ఇప్పటికీ మొబైల్ వాడకంపై నిషేధం మాత్రం ఎత్తివేయలేదు. దానికి రెండు కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో చూస్తే…

విమానంలో మొబైల్ ఫోన్ వాడితే గనుక ఎలక్ట్రానిక్ వ్యవస్థకు వచ్చే సమస్య లేదు గాని… పైలట్లు ఏటీసీతో మాట్లాడే సమయంలో కొంత నాయిస్ వచ్చే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో రేడియో, టీవీలలో గరగరమని వచ్చే శబ్దాలు వస్తూ ఉంటాయి. దీనితో సంభాషణ స్పష్టంగా వినపడే అవకాశం ఉండకపోవచ్చు. ఇది పైలెట్ లను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి విమానం గాల్లోకి వెళ్ళే సమయంలో అంటే టేకాఫ్, దిగే ముందు అంటే ల్యాండింగ్ కు ముందు ఆఫ్ చేయాలని కోరుతూ ఉంటారు.

Link to comment
Share on other sites

అసలు RMP అంటే ఏంటీ…? ఆర్ఎంపీ కావాలంటే ఏం చేయాలి…?

ఆర్ ఎం పీ” పల్లెటూర్లు అనగానే మనకు గుర్తుకు వచ్చే క్యారెక్టర్లలో ఇది కూడా ఒకటి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే పల్లెటూర్లలో వీళ్ళే ఫ్యామిలీ వైద్యులు అన్నమాట. తక్కువ ధరతో రోగాలను నయం చేస్తారు కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఇక వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దామా…?

 

bb-1.jpg?resize=724%2C482&ssl=1

ఇండియాలో ఎవరైనా సరే వైద్యుడి గా ప్రాక్టీస్ చేయాలి అంటే… మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ కావాల్సిందే. జ్వరానికి మందు బిళ్ళ రాయాలన్నా సరే రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రిస్క్రిప్షన్ లెటర్ పై ముద్రించి ఉంటుంది. ఎంబీబీస్ పాసైనా సరే ఒక ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ను ఇస్తారు. ఆ నెంబర్ తో ఏడాది పాటు ఏదైనా ఎం.సీ .ఐ చేత ఆమోదం పొందిన ఆస్పత్రిలో అన్ని విభాగాలలో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంబీబీస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాలి.

rr.jpg?resize=799%2C456&ssl=1

 

ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్న వారిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ (R.M.P) అని పిలుస్తారు. వేరే దేశాలకు వెళ్లి ఎంబీబీస్ చేసినా సరే మన దేశంలో ఇంటర్న్షిప్ చేసి ఆ తర్వాతనే ఎం.సి.ఐ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడం అనేది నేరం గా పరిగనిస్తారు. ఎంబీబీస్ డిగ్రీ లేకుండా గ్రామాల్లో మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రిడ్జ్ కోర్స్ లాంటివి పూర్తి చేసేసి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేసే వైద్యులకు మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీనితో అక్కడ వైద్యుల కొరతను కొందరు హైస్కూల్ లో చదువుకున్న వాళ్ళు కూడా వాడుకుంటున్నారు.

Link to comment
Share on other sites

గౌడాన్ పైన తిరిగేవి ఏంటీ…? అవి తిరగడానికి కరెంట్ అవసరమా…?

మనం ఎక్కడికి అయినా ప్రయాణం చేసే సమయంలో కొన్ని కొన్ని విషయాలను రోడ్ల పక్కన ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటాం కదూ…? అందులో చాలా మందికి ఆసక్తిని రేపే విషయం ఒకటి ఉంది. గౌడాన్ లపై గుండ్రంగా ఉండి… నిత్యం స్లో గా తిరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది ఒక్కసారి చూస్తే…

aaa.jpg?resize=1024%2C393&ssl=1

గౌడాన్ పైన సిల్వర్ కలర్ లో వరుసగా పేర్చిన గుండ్రటివి ఏంటా అనే డౌట్ ఉంది కదూ…? వాటిని వీటిని రూఫ్ టాప్ టర్బైన్ వెంటిలేటర్ అని పిలుస్తారన్నమాట. వెంటిలేషన్ కోసం వాటిని ఏర్పాటు చేస్తారు. అవి తిరగడానికి కరెంట్ అవసరం లేదు. ఫ్యాక్టరీ లో అలాగే, గోడౌన్ లోని వేడి గాలి చాలా తేలికగా ఉంటుంది కాబట్టి పైకి చేరుకుంటుంది.kr.jpg?resize=800%2C469&ssl=1

ఆ గౌడాన్ పైకప్పు కున్న ఈ వెంటిలేటర్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో గాలి గాలి టర్బైన్ ఫ్యాన్లని తిప్పడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఫ్యాన్ లు తిరిగినప్పుడు, ఎక్కువగా వేడి గాలిని పీల్చి బయటకు పంపిస్తుంది. ఇదంతా ఒక సైకిల్ గా నడుస్తూ ఉంటుంది. వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వీటి వలన లోపల ఉష్ణోగ్రత కూడా పెరగకుండా ఉంటుంది.

Link to comment
Share on other sites

Dolo-650 ఎలా పుట్టింది? 30 ఏళ్ల నుంచి ఉన్నా ఇప్పుడే ఎందుకింత పాపులర్ అయింది?

డోలో 650

కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల నేపథ్యంలో డోలో-650 మీద మీమ్స్ పెరిగిపోయాయ్.

సోషల్ మీడియాలో ఇంతగా సందడి చేస్తున్న డోలో, కరోనా క్రైసిస్‌లో దాన్ని తయారు చేసే కంపెనీకి బాగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది.

ఈ క్రేజ్‌ను తాము కూడా ఊహించలేదని అంటోంది ఆ కంపెనీ.

డోలో-650 ఎలా పుట్టింది?

డోలో-650 అనేది పారాసిటమల్ ట్యాబ్లెట్ అనే విషయం తెలిసిందే. కాకపోతే అందులో ఉండే మెడిసిన్ పవర్ 650ఎంజీ ఉంటుంది.

డోలో అనేది మెడిసిన్ పేరు కాదు బ్రాండ్ పేరు. అందులో ఉండే మెడిసిన్ పారాసిటమల్. మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. 1993లో డోలో-650 అమ్మకాలు మొదలయ్యాయ్.

పారాసిటమల్ 500 ఎంజీ విభాగంలో బాగా పోటీ ఉండటంతో కొత్తగా ఏమైనా చేయాలని భావించింది కంపెనీ. ఇందుకు మార్కెట్‌ను స్టడీ చేయడంతోపాటు అనేక మంది డాక్టర్లతో మాట్లాడామని 'మనీ కంట్రోల్'తో మాట్లాడుతూ అన్నారు మైక్రో ల్యాబ్స్ ఎండీ దిలీప్ సురానా.

జ్వరం, నొప్పిని తగ్గించడంలో పారాసిటమల్-500 ఎంజీ, ఎఫెక్టివ్‌గా పని చేయడంలేదని గుర్తించింది మైక్రో ల్యాబ్స్. దీనికి సమాధానంగా డోస్ పెంచి పారాసిటమల్-650ఎంజీని తయారు చేయడం మొదలు పెట్టింది.

దానికి పెట్టిన బ్రాండ్ నేమ్ డోలో-650. ట్యాబ్లెట్ పవర్ 500 నుంచి 650 ఎంజీకి పెరిగింది కాబట్టి దాని సైజు కూడా పెరుగుతుంది. అందువల్ల మింగేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ట్యాబ్లెట్‌ను ఓవల్ షేప్ అంటే కోడి గుడ్డు ఆకారంలో తయారు చేయడం ప్రారంభించింది.

కరోనా ఆగమనం... ద రైజ్ ఆఫ్ డోలో-650

30 ఏళ్ల నుంచి మార్కెట్‌లో ఉన్న డోలో-650... ఇప్పుడు ఇంతగా పాపులర్ కావడానికి కారణం కరోనా క్రైసిస్. కరోనా కాలంలో వినియోగం పెరగడంతో గత రెండేళ్లలో దీని సేల్స్ భారీగా పెరిగాయ్.

హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ ఐక్యూవియా రిపోర్ట్ ప్రకారం మార్చి 2020 తరువాత 350 కోట్ల డోలో-650 పిల్స్ అమ్ముడు పోయాయి. 2021లో డోలో అమ్మకాల విలువ రూ.307 కోట్లకు పెరిగింది.

2019లో అంటే కరోనాకి ముందు అమ్ముడు పోయిన డోలో-650 మాత్రల సంఖ్య సుమారు 110 కోట్లు మాత్రమే. ఇదే కాదు, జీఎస్‌కేకు చెందిన పారాసిటమల్ బ్రాండ్ కాల్పాల్ కూడా రూ.310 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది.

కరోనా క్రైసిస్‌లో పారాసిటమల్‌ ఎంతగా వాడారో ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తుంది.

ఎందుకు ఇంత పాపులర్?

కాల్పాల్-650, పారాసిప్-650, పాసిమోల్-650 వంటి అనేక బ్రాండ్స్ ఉండగా డోలో-650 మాత్రమే ఎందుకు పాపులర్ అయిందనేదే అసలు ప్రశ్న?

కరోనా సోకిన పేషెంట్లలో జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్‌గా కనిపించే లక్షణాలు. దాంతో కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా పేషెంట్లకు డోలోను ప్రిస్ర్కైబ్ చేశారని నిపుణులు అంటున్నారు.

ఇక పేషెంట్లలోనూ మౌత్ పబ్లిసిటీ పెరగడం కూడా డోలో పాపులర్ కావడానికి కలిసొచ్చిందని వారు చెబుతున్నారు.

గతంలో కరోనా సోకినప్పుడు వాడాల్సిన మందులంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చాలా మందులు వైరల్ అయ్యేవి. వాటిలో ప్రధానంగా ఉండేది డోలో-650. అది కూడా తమకు కలిసొచ్చిందని చెబుతోంది మైక్రో ల్యాబ్స్. దీంతో మెడికల్ షాపుకు వెళ్లి డోలో-650 ఇవ్వమని అడగడం పెరిగింది.

వ్యాక్సీన్ సెంటర్ల దగ్గర ఆరోగ్య నిపుణులకు డోలో-650తోపాటు శానిటైజర్లు, మాస్కులు ఉండే కిట్స్ ఇవ్వడం, మెడికల్ షాపుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నామని కంపెనీ చెబుతోంది.

వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత జ్వరం, నొప్పి వస్తే వేసుకోవడానికి డాక్టర్లు డోలోనే ప్రిస్క్రైబ్ చేశారని అది అంటోంది.

 
పారాసెటమాల్

పారాసిటమల్ హబ్‌గా భారత్

నేడు మనం తరచూ వాడే పారాసిటమల్ ఉనికిలోకి వచ్చింది 1893లో. తొలిసారి పేషెంట్ల మీద వాడింది కూడా అప్పుడే. కానీ 1950 వరకు పారాసిటమల్‌ను కమర్షియల్‌గా ఉత్పత్తి చేయలేదు.

1950లో అమెరికాలో, 1956లో ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో దాని వాణిజ్య ఉత్పత్తి మొదలైంది. 1980ల నాటికి ప్రపంచవ్యాప్తంగా పారాసిటమల్ బాగా పాపులర్ అయింది.

1990ల నాటికి భారత్‌లోనూ పారాసిటమల్ తయారీ ప్రారంభమైంది. నేడు పారాసిటమల్ తయారీ హబ్‌గా మారింది భారత్. చైనా తరువాత పారాసిటమల్ ఏపీఐను భారీగా ఎగుమతి చేస్తున్న రెండో దేశం ఇండియానే.

అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది పారాసిటమల్. నెలకు 5,600 మెట్రిక్ టన్నుల పారాసిటమల్‌ను తయారీ చేస్తోంది ఇండియా. ఇందులో దేశీయంగా వాడేది 200 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా స్టాకంతా అమెరికా, బ్రిటన్, కెనడా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ…? హిందీ… జాతీయ పక్షి ఏంటీ నెమలి… జాతీయ జంతువు ఏంటీ పులి, మరి జాతీయ క్రీడ ఏంటీ…? హాకీ అని చెప్పేస్తారు కదా… ఎవరైనా అలా చెప్తే అసలు నమ్మకండి. మన దేశానికి జాతీయ క్రీడా లేనే లేదు. కాని పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చెప్పిన పులిహోరే చెప్పి చెప్పి మనల్ని విసిగిస్తున్నారు.

What is the national game of India?

1928–1956 మధ్య కాలంలో 8 స్వర్ణాలు, ఒక రజతం మరియు రెండు కాంస్య పతకాలు సాధించింది హాకీ జట్టు. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా మన చరిత్ర చెప్తుంది. ఇండియా ఒలింపిక్స్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 76 గేమ్స్ లో గెలిచింది. స్వాతంత్రం తరువాత పాకిస్తాన్ హాకీని తన జాతీయ ఆటగా ప్రకటించుకుంది. ఇక ఆ తర్వాత మన దేశంలో క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగింది.

Odisha CM requests PM Modi to make hockey national sport | NewsBytes

హాకీ టీం లో ఎంత మంది ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. ఆర్టీఐ[Right To Information] సమాధానంలో, క్రీడా మంత్రిత్వ శాఖ ఎలాంటి క్రీడను జాతీయ ఆటగా ప్రకటించలేదని కూడా స్పష్టం చేసింది. ఒక దేశం జాతీయ క్రీడను నిర్ణయించడంలో ఆ దేశపు సంస్కృతి కీలకంగా ఉంటుంది. కాని మనది ఉపఖండం కావడం, విభిన్న సంస్కృతులు ఉండటంతో ఒక క్రీడను జాతీయ క్రీడా అని చెప్పలేం. కబడ్డీ ఉత్తరాన ప్రసిద్ధి చెందిన ఆట. బెంగాల్‌లో ఫుట్‌బాల్ ప్రాచుర్యం పొందిన ఆట.

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఇక కొన్ని కష్టమైన పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. ఎందరో కలలు గానే పరిక్షల విషయంలో పాస్ అవ్వడానికి పరీక్ష రాసే అభ్యర్ధులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిక్షలు మన మెదడుకి సవాల్ చేస్తూ ఉంటాయి.

10 Of The Toughest Exams In The World To Crack - Youth Incorporated

పరీక్షల్లో ఉండే ప్రశ్నలను సాల్వ్ చేయడానికి ఒక్కోసారి మన మేధస్సు సరిపోదు. ఎంత ప్రిపేర్ అయినా సరే కొన్ని పరీక్షలు పాస్ కావడం అనేది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. అలాంటి పరిక్షలు ఒక రెండు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మాస్టర్ సోమెలియర్ డిప్లొమా పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చెప్తూ ఉంటారు. 40 సంవత్సరాల క్రితం యూకేలో లో పరీక్ష ప్రారంభమైనప్పటి నుండి 200 మంది మాత్రమే పాస్ అయ్యారు.

Aligarh Muslim University to conduct UG and PG semester exams in June;  check details here

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆల్ సోల్స్ కాలేజీకి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష కూడా ఒకటి ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆల్ సోల్స్ కాలేజీకి ఫెలోషిప్ పరీక్షను ప్రపంచంలోనే కష్టతరమైన పరీక్షగా చెప్తూ ఉంటారు. ఈ పరిక్షలకు అభ్యర్ధులను పాస్ చేయడానికి ప్రత్యేక కోచింగ్ సెంటర్లు కోట్ల రూపాయలు కూడా వసూలు చేస్తున్నాయి. ఈ పరీక్ష కోసం ఏళ్ళ తరబడి చదివే వారు ఉన్నారు. ఇక మన సివిల్స్, జేఈఈ మెయిన్స్ గురించి తెలిసిందే.

Link to comment
Share on other sites

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా సరే వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కదా… అలాంటిదే పెళ్లి చదివింపులలో 116, 516,1116 లాంటిది. ఇలా చివర్లో 16 వచ్చేటట్టు ఎందుకు చదివిస్తారు అనేది ఎవరికి అర్ధం కాదు. గుడిలో కూడా ఇలాంటివే మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ 16 వెనుక ఉండే రహస్యం ఏంటీ…? వాస్తవంగా మాట్లాడాలి అంటే… 100 ఇవ్వడమే సంప్రదాయం.

Life after demonetisation: "Darling, the delivery boy has brought the  cabbage, tomatoes... and your ATM" — Quartz India

నిజాం సంస్థానంలో వేరే రాజ్యాంగం అమలులో ఉండేది కాబట్టి వేరే నాణేలు వినియోగంలో ఉండేవట. అక్కడి రూపాయ ఆంధ్రా తదితర ప్రాంతాల వాళ్ల విలువను బట్టి చూస్తే… వంద రూపాయలు ఇస్తే అది 90 రూపాయలే అయ్యేదట. అందుకే నిజాం రాజ్యం లోని గద్వాల వంటి సంస్థానాల వాళ్లు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు ఇక్కడి వందకు సరిపడే లెక్కగా అంటే —పండితులు అక్కడ ఇచ్చేది తక్కువ అనే భావన రాకుండా మరో 16 చేర్చి ఇచ్చే వారు.

Assam polls: Rs 2.72 cr in cash, liquor worth Rs 1.1 cr seized so far »  News Live TV » Assam

వాళ్ల 116 రూపాయలు ఇతర ప్రాంతాల 100 రూపాయలకు సమానం. ఇదే 116 అనే ఆచారంగా స్థిరపడి… ఒకవేళ ఆ 16 లేకపోతే పక్క వారిని అప్పు అడిగి అయినా ఇస్తారు. ఒకవేళ అందుకు వీలు కాకపోతే 58 రూ. ఇవ్వడం కూడా ఆ విధంగా వచ్చిన ఆచారమే. నూట పదార్ల పద్ధతి అజ్ఞానమనే వాళ్ళు ఉన్నారు.

 
Link to comment
Share on other sites

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. కొందరు ప్రజలకు మాయ మాటలు చెప్పి క్షణాల్లో డబ్బు కాజేస్తున్నారు. దీని నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నాయి సంస్థలు. ఐటి రంగానికి ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఇది పెద్ద సవాల్ గా మారిన విషయం గానే చెప్పాలి.

The Crossword Stumper - The New York Times

ఇక కంప్యూటర్ దాడుల నుంచి మనం బయటకు రావడానికి కొన్ని కొన్ని కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే కాప్చా అనేది ఒకటి మనకు నిత్యం కనపడుతూ ఉంటుంది. అసలు కాప్చా అంటే ఏంటీ అంటే… సైబర్ దాడుల నుండి రక్షించుకునేందుకు కాప్చా పద్ధతిని ఇంటర్నెట్ లో ఉపయోగిస్తారు. అంటే ప్రోగ్రామ్ వ్రాసి సైట్ కు సంబంధించిన సెర్వర్ల మీద ఒత్తిడి పెంచేందుకు చేసే దాడుల నుండి కూడా తట్టుకునేందుకు వాడతారు.

People Spend 500 Years Every Day on CAPTCHAs: Cloudflare

ఇందులో వచ్చే టెక్స్ట్ ఇమేజ్ రూపంలో ఉండటం వల్ల ఒక మనిషే చూసి అర్థం చేసుకుని ఎంటర్ చేయాల్సి ఉంటది. కాబట్టి ప్రోగ్రాం ద్వారా చేసేందుకు అసలు ఛాన్స్ ఉండదు. ఇక క్యాప్చ అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ ట్యూరింగ్. ఇది జావాస్క్రిప్ట్‌పై పనిచేస్తుంది. స్పామ్ ప్రోగ్రాంలకు జావాస్క్రిప్ట్ ఎక్జిక్యూట్ చేసి, అందులోని అంశాలను చదవటం అసలు సాధ్యమయ్యే పని కాదు.

 
Link to comment
Share on other sites

హారతి కళ్ళకు అద్దుకోవడం మంచిదా…? అద్దుకుంటే ఏం జరుగుతుంది…?

హిందు సాంప్రదాయంలో ఉండే ఆచారాలకు సంబంధించి ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో కొందరికి కొన్ని భయాలు ఉన్నాయి. ఇక వాటి గురించి ప్రచారాలు కూడా అలాగే భయపెడుతూ ఉంటాయి. ఇదెలా ఉంటే హారతి కళ్ళకు అద్దుకోవచ్చా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు అద్దుకోవాలో ఒకసారి చూస్తే…

హారతి కళ్ళకు అద్దుకోవచ్చా? | Significance Of Aarti In Telugu • Hari Ome

భగవంతునికి ఇచ్చిన హారతి మనం కళ్లకు అద్దుకోవటం 100% సరైన విధానం అనే మాట వినపడుతుంది. ఆలయంలో భగవద్దర్శనంబాటు హారతి కళ్లకు అద్దుకోవటం, తీర్ధం స్వీకరించడం, శిరస్సుపై శఠగోపం తీసుకోవడం, కొంచెమైనా దేవుడికి నైవేద్యంగా చూపించిన ప్రసాదం స్వీకరించడం వంటివి యుగాలుగా మనకు వస్తున్న ఆచారాలు. ఇక హారతి కళ్ళకు అద్దుకోవడం కళ్ళకు మంచిది అనే మాట ఉంది.

కర్పూరంలో ఉండే ఘాటుసుగంధం సున్నితమైన మన కనురెప్పలపైన చేరిన సూక్ష్మజీవులను చంపేస్తుందని ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పే మాట. అసలు కర్పూరంలోనూ, హారతిలోనూ నరదృష్టి, దుష్టశక్తి (negative energy) ని దూరంచేసే అపురూపలక్షణాలు ఉంటాయనే వాళ్ళు ఉన్నారు. అయితే మరో మాట కూడా ఉంది.

హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్నిరకాలు, ఎన్ని వత్తులు? | Aarti Deepam |  Aarti Deepam Importance | Deepam Aarthi | Oil Lamp Hindu Puja | Harathi

స్వామి వారికి ఇచ్చేది ‘ మంగళ హారతి’ కాబట్టి ఆ హారతిని సాక్షాత్ దైవ స్వరూపం గా భావించి నమస్కరించుకోవాలి. ఆ హారతి వెలుగులోనే స్వామి వారిని పూర్ణంగా దర్శించి తన్మయత్వం చెందాలి గాని దిష్టి పరిహారంకోసం తీసే హారతులను కళ్ళకు అద్దుకోవడం మంచిది కాదు.

Link to comment
Share on other sites

గ్యాస్ పైప్ లైన్ లీక్ అయితే రాబందులకు ఎలా తెలుస్తుంది…?

పాత సినిమాలో రాబందులు… శవం కనపడిన వెంటనే వచ్చి వాలిపోతూ ఉంటాయి. ఇక డిస్కవరీ ఛానల్ చూసినా సరే రాబందులు కుళ్ళిన జంతువుల బాడీల వద్దకు వచ్చి పీక్కు తింటూ ఉంటాయి. అసలు అలా ఎందుకు జరుగుతుంది…? అక్కడ కుళ్ళిన మాంసం ఉందనే విషయం వాటికి ఎలా తెలుస్తుంది…?

Gas Leaks Are Designed To Attract Turkey Vultures

కళేబరాలు విడుదల చేసే గంధక సంబంధ రసాయన మిశ్రమాల స్మెల్ ను అవి మైలు దూరం నుంచి కూడా ఈజీగా పట్టేస్తాయి. అంతే కాకుండా… ఏదైనా కళేబరాన్ని కనిపెట్టిన డేగలవంటి పక్షులను దూరం నుంచి చూసేసి ఆహారం ఉందని గుర్తిస్తాయి. ఆ విధంగా కనిపెట్టి… గుండ్రంగా ఆకాశంలో తిరుగుతూ ఆహారం ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తాయి. రాబందుల గురించి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అవి పూర్తిగా మాంసాహారులు. అతి తక్కువ శ్రమతో ఎంతో ఎత్తున ఉష్ణవాయు తరంగాలపై తేలుతూ గంటల తరబడి ఎగురుతూ ఉంటాయి. తల, మెడపై వాటికి ఈకలు ఉండవు. కుళ్ళిన కళేబరాలను తినే సమయంలో వాటిలోని బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఈకల అడుగుభాగానికి చేరుకునే అవకాశం ఉండదు. అలా ఉంటే వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక రాబందుల కడుపులోని ఆమ్లాలు సగటు కంటే ఎంతో శక్తివంతంగా ఉంటాయి.

New World and Old World vultures | Britannica

బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఈజీగా చంపివేయగలవు. అందుకే అవి కుళ్ళిన మాంసాన్ని కూడా ఎంతో ఇష్టంగా తింటాయి. ఆహార కొరత ఉంటే మాత్రం చిన్న చిన్న జంతువుల మీద ఈజీగా దాడి చేస్తాయి. ఇక మరో తెలియని విషయం ఏంటీ అంటే… గ్యాస్ పైప్‌లైన్లలో లీకులను కనిపెట్టేందుకు కొన్ని సంస్థలు రాబందులను ఇప్పటికీ వాడుతున్నాయి. ఇథైల్ మెర్కప్టన్ అనే ఒక రసాయనాన్ని గ్యాసులో కలిపితే… రాబందులు ఈ వాసనను కుళ్ళిన మాంసం వాసనగా భ్రమపడి అక్కడికి వచ్చేస్తాయి.

 
 
Link to comment
Share on other sites

పచ్చి మిర్చి ఉపయోగాలు ఏంటీ…? బరువు తగ్గే వారికి ఎలా ఉపయోగపడుతుంది…?

పచ్చిమిర్చి వాడటం మంచిదా… లేక కారం వాడటం మంచిదా అనే దాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పచ్చి మిర్చి తింటే గ్యాస్ వస్తుందనే భయం చాలా మందిలో ఉంది. కారం వాడితే బీపీ పెరుగుతుంది అని భయపడి రుచి లేకుండానే అన్నీ తింటున్నారు. అసలు పచ్చి మిర్చితో ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం.

12 varieties of Indian chillies you must know about | Manorama English

పచ్చిమిర్చి లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థకు ఇది చాలా మంచిది. విటమిన్ బి6, ఏ, ఐరన్, కాపర్, పొటాషియం సహా… కొద్ది మొత్తంలో ప్రొటీన్లు కార్బోహైడ్రైట్స్ కూడా ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. విటమిన్ సి తో… చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి తినడంతో… ఉమ్ము ఎక్కువగా వస్తుంది. ఇది నోటికి తినే ఆహారానికి ఎంతో మంచి చేస్తుంది.

Green chillies for sale in Mapusa Market, Goa, India, Asia - Stock Photo -  Dissolve

ఇక శరీరంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని వాడితే కొవ్వు కరిగిపోతుంది. పచ్చిమిర్చి ని నేరుగా వాడలేని వారు ఒక పని చేయవచ్చు. తినే శనగపప్పులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని నంచుకుని స్నాక్స్ లా తినండి. పచ్చి మిర్చి తో అనవసర సమస్యలు ఏమీ ఉండవు. ఏదైనా మితంగా తింటే ఏ సమస్య ఉండదు గాని… ఇక దొరకదు అని తింటే సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

 
Link to comment
Share on other sites

బస్సు అద్దాలు ఎందుకు చిన్న చిన్న ముక్కలు అవుతాయి…?

మాములుగా అద్దం పగిలితే ఎలా పగులుతుంది…? సరిగా దెబ్బ తగిలితే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. మనం ముఖం చూసుకునే అద్దం అయితే అలానే పగిలిపోతుంది. అయితే కారు అద్దామో, లారీ అద్ధమో, బస్సు అద్దమో పగిలితే అలా ఉండదు. ఏదైనా దెబ్బ తగిలితే చిన్న చిన్న ముక్కలు అవుతుంది. అలా జరగడానికి ప్రధాన కారణం బస్సు అద్దాలకు రెండింటి మధ్యలో అభ్రకం పొరను పెట్టి జోడిస్తారు.

Tempered Glass: Why Does It Break In Such Small Pieces? » Science ABC

దానితో అద్దాలు అసాధారణ గట్టితనం తో/లో ధృఢంగా ఉండి చాలా కాలం ఉంటాయి. అభ్రకం పొర రెండు అద్దాల మధ్య ఉండటంతో ప్రమాదవశాత్తు ఏదైన రాయి, ఇనుము లాంటివి తగిలిన లేదా బులెట్ తగిలినా … వద్దనే అంత మేర మాత్రమే రంధ్రం పడుతుంది. అభ్రకం అంటే… మైకా అన్నట్టు. అభ్రకం లేదా మైకా అనేది ఖనిజాల సమూహం. వివిధ లోహాలతో ఉన్న అల్యుమినోసిలికేట్‌లు అన్నమాట. ఇది చక్కని పలకలుగా విడివడి ఉండటంతో అద్దం పగలగుండా ఉంటుంది.

Tempered Glass: Why Does It Break In Such Small Pieces? » Science ABC

మైకా అనేక దగ్గర సంబంధం గల పదార్థాలతో కూడి పరిపూర్ణ ఆధారభూత చీలికలను కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీనినే కాకి బంగారం అని కూడా పిలుస్తారు. ఇది అద్దపు పెంకుల మాదిరి ఉంటుంది. రసాయనికంగా చూస్తే… ఈ కాకి బంగారం మెగ్నీషియమ్‌, ఇనుము, సోడియమ్‌, పొటాషియమ్‌ తో కూడిన సిలికేట్‌. దీని పొరలు తేలికగా అతుక్కుని ఉంటాయి. అందుకే అద్దం ఒక్కసారిగా విరిగిపోకుండా ఉంటుంది.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...