Jump to content

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసు


Rayapaati

Recommended Posts

28brk-babu1a_1.jpg

హైదరాబాద్‌: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనానికి సీఆర్డీఏ జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌  నోటీసు అంటించారు. తమ సాంకేతిక సిబ్బంది పరిశీలనతో ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమంగా నిర్మించిందేనని  నిర్ధారించినట్లు సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. చంద్రబాబు నివాసం ఉంటోన్న భవనం యజమాని లింగమనేని రమేష్‌ పేరిట నోటీసులు జారీ చేశారు.

కృష్ణా నదీతీరంలో.. లింగమనేని రమేష్‌ కొన్నేళ్ల క్రితం అతిథిగృహంగా నిర్మించిన భవనాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. ఈ అతిథిగృహం  అక్రమ కట్టడమేనని.. ఇందులో నివాసం ఏమిటని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో న్యాయస్థానానికి వెళ్లారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న  జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటికి అనుమతులు తీసుకోలేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులో స్పష్టం చేసింది.  సీఆర్డీఏ నుంచి ముందుగా అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌ 2012, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ 2015 జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్‌ సిటీ జోనింగ్‌ రెగ్యులేషన్‌ 2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్‌డీఏ అభిప్రాయపడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254,272,790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతిలేని పైఅంతస్తు, గదులు, హెలిప్యాడ్‌ నిర్మాణాలను షోకాజ్‌ నోటీసులో పొందుపరిచారు. 

తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఒక వేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కిపైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందించాలని నిర్ణయించారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దె దారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసు నకళ్లను గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి, ఉండవల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా పంపారు.

 

Link to comment
Share on other sites

Ayina court lo stay vunte notices ela icharu?? 

CRDaa nunchi permission teesukoledha??  Asala CRDA eppudu vachindhi..  aa house eppudu kattaru?? 

State lo em issues lenattu Akrama kattadalu ani egurutunnara :lol2:

 

G lo dammu vunte krishna lanka, Ramalingeswarnagar,  Bandar,  eluru kalava vodduna vunna akrama kattadalu ani kulchandi.. 

Link to comment
Share on other sites

Ee 5 years lopu CBN ni corrupted person and TDP ni asalu AP lo Lekunda cheyyalani Mosha, KCR and jagan lu emi cheyyalo anni chestunnaru.

Ika assembly lo majority TDP MLA’s ni lakkoni CBN ni just MLA ga vunchutaaru. 

Link to comment
Share on other sites

5 hours ago, Koduri said:

Ee 5 years lopu CBN ni corrupted person and TDP ni asalu AP lo Lekunda cheyyalani Mosha, KCR and jagan lu emi cheyyalo anni chestunnaru.

Ika assembly lo majority TDP MLA’s ni lakkoni CBN ni just MLA ga vunchutaaru. 

Tappadu anndaru eyydho roju use avutaru anni andarini ekkinchumunnandhuku netting tappavu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...