Jump to content

2 people died in Mandapeta Jagan meeting


Godavari

Recommended Posts

2 minutes ago, niceguy said:

kl1ws.gif

maranichina vaariki matti karchu 5k....gaayapadina vaariki 5lks medical expenses..... no colour...no cast...no relegion...no party...no gender.....all are equal and schemes are equal to all....

Link to comment
Share on other sites

వైసిపి అధినేత జగన్ మండపేట లో నిర్వహించిన రోడ్ షో తీవ్ర విషాదానికి ఉద్రిక్తతలకు దారి తీసింది. సభ ప్రారంభంలో బస్ ఎక్కిన జగన్ ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ముందుకు రావడంతో షన్షేడ్ కూలి ఆ కింద ఉన్న సుమారు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మండపేట 10వ వార్డుకు చెందిన 72 ఏళ్ళ పిల్లి రామాయమ్మ అక్కడికక్కడే చనిపోగా పాలతోడుకు చెందిన మరో వృద్దురాలి 60 ఏళ్ళ సరాకుల సూరమ్మ చికిత్స పొందుతూ మరణించింది.

 సాధారణంగా మండపేట లో రోడ్ షోలు ఎవరు నిర్వహించిన కలువపువ్వు సెంటర్లో పెడుతుంటారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఎంతమంది హాజరైనా ఇబ్బంది ఉండదు. అయితే వైసిపి అధినేత జగన్ నిర్వహించిన రోడ్ షో మార్కెట్ సెంటర్ ను ఆనుకుని పెట్టడంతో అది కాస్తా విషాదానికి దారి తీసింది. అది ఇరుకైన ప్రాంతం కావడంతో కిక్కిరిసిన జనం పక్కనే ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కారు. అయితే పెద్ద ఎత్తున జనం ఎక్కడంతో ఒక్కసారిగా భవనం సన్ షైడ్ వాల్ కూలిపోయింది. దీంతో భవనం కింద నుల్చుని జగన్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న అభిమానులు శిథిలాల కింద నలిగిపోయారు. వీరిలో మండపేట 10వ వార్డుకు చెందిన పిల్లి రామాయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అలాగే పాలతోడుకు చెందిన మరో వృద్దురాలు సరాకుల సూరమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. సుమారు 60 మంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మండపేట, రామచంద్రపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలోని పలు ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల రోధనాలతో ఆసుపత్రి హోరెత్తిపోయింది.  కొద్దిసేపు అనంతరం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాగా ఎన్నికల ప్రచారంలో ఉన్న వేగుళ్ళ లీలాకృష్ణ తన ప్రచారాన్ని మానుకుని హుఠాహుఠిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ వైపు ఆసుపత్రిలో మృతులకుటుంబాలు, క్షతగాత్రుల రోధనలు మిన్నంటుతుండగా మరో వైపు జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండటం దారుణమన్నారు. ఈ ఘటన తో  తీవ్ర ఆవేశానికి  లోనైన లీలాకృష్ణ తన అనుచరులతో కలిసి జగన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వెళ్ళారు. అయితే పోలీసులు, వైసిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడి కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జగన్ అధికారం దాహంతో ఉండి మానవత్వాన్ని మర్చిపోతున్నాడని లీలాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు చనిపోతే సభ ఎలా జరపగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి శవ రాజకీయాలు తగవని పేర్కొన్నారు. జనపార్టీ తరుపు నుండి తన వంతు సహాయంగా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం అక్కడ నుండి కలువపువ్వు సెంటర్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి లీలాకృష్ణ వర్గీయులు, బోస్ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు తలెత్తాయి.అయితే వైసిపి నేత కర్రి పాపారాయుడు వైసిపి కార్యకర్తలను సముదాయించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈలోగా లీలాకృష్ణ రోడ్డుపై బైఠాయించి కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. సభ అనంతరం పిల్లి బోస్, కర్రి పాపారాయుడులతో కలిసి జగన్ క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 25 వేల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా మరో వైపు ఎన్నికల ప్రచారంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ యువనేత కుమార్ బాబు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావులు అర్థాంతరంగా వారి పర్యటనలను రద్దు చేసుకుని క్షతగాత్రులను పరామర్శించేందుకు మండపేట విచ్చేసారు. బాధితులను పరామర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేట చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోలేదన్నారు. ఇంత జరిగినా జగన్ తన సభను కొనసాగించడం దురదృష్టకరమన్నారు. అసలు అలాంటి ప్రదేశంలో సభకు పోలీసులు ఎలా అనుమతిచ్చారో అర్ధం కావడం లేదన్నారు. . దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్నారు. కేవలం తమ టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనట్లు చూపించు కోవడం కోసం ఇందతా చేసారని ఆరోపించారు. అలాగే దళిత నాయకులు దూలి జయరాజు, వెంటపల్లి జాన్ మార్క్లు మాట్లాడుతూ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...