Jump to content

pk ga


sonykongara

Recommended Posts

MUST SHARE : పవన్ నోరు తెరిచి సమాధానం చెప్పలేని 12 ప్రశ్నలు అడిగిన తెదేపా మంత్రి, హాట్స్ ఆఫ్

tdp-minister-aggressive-attack-on-pawan-
 

పవన్ కళ్యాణ్ గత మార్చి లో జరిగిన జనసేన ఆవిరభవ సభ నుంచి తన డైరెక్షన్ మార్చి తెదేపాకు వ్యతిరేకముగా బిజెపి కి తెరాసా వైకాపా లాంటి కరుడుకట్టిన తెదేపా వ్యతిరేక పక్షాలకు అనుకూలంగా మాటలు మార్చిన సంగతి తెలిసిందే. రాజకీయంగా తన పద్దతి మార్చుకోవటమే కాకుండా చాలా పరుషమైన భాషలో, బయటకి రాయలేని పదజాలంతో విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్. మాటకు ముందొక సారి తరువాత ఒక సారి టిడిపి ని నేనే గెలిపించా అని చెప్పుకోవటం అలవాటుగా మారింది. ఇవన్నీ ఎలా ఉన్నా ముఖ్యంగా లోకేష్ మీద టార్గెట్ చేసిన పవన్, చంద్రబాబు మీద సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా అవాకులు చవాకులు పేలుతున్న సంగతి తెలిసిందే. జుగుప్సాకరమైన పవన్ బాషను, ఆయన ఉపన్యాసాలు కవర్ చేయటానికి మీడియా సైతం జంకే పరిస్థితి తీసుకుని వచ్చాడు పవన్. ఏది ఎలా ఉన్నా పవన్ వ్యవహార శైలి విమర్శలకు దారి ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
pawan-kalyan-yatra--e1528525492266.jpg

కోస్తా ఆంధ్ర పర్యటనలో పవన్ బహిరంగ సభలు పెట్టి అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి కళా వెంకట్రావు స్పందిస్తూ పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం మధ్యాహ్నం పవన్‌కు కళా బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి పవన్‌కు 19 సూటి ప్రశ్నలు సంధించారు. అక్కడ పోటీ చేస్తా.. ఇక్కడ పోటీ చేస్తానని చెప్పుకుంటున్న పవన్.. అసలు తమరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో? ముందు క్లారిటీ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.

మంత్రి సంధించిన కొన్ని ప్రశ్నలు..

1. చిరంజీవి, అరవింద్‌ను గెలిపించుకోలేని పవన్ టీడీపీని ఏ విధంగా గెలిపించారు?

2. ఏపీకి నమ్మకద్రోహం చేస్తుంటే మోడీ-షాను ఎందుకు వదిలేశారు..?

3. బీజేపీని వదిలేసి టీడీపీపై విమర్శలు ఎలా చేస్తారు?

4. బీజేపీకి పవన్ ఎందుకు భుజం కాస్తున్నారు?

5. బీజేపీ-పవన్ మధ్యనున్న చీకటి ఒప్పందం ఏంటి?

6. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?

7. వెనుకబడిన జిల్లాల నిధులను వెనక్కు తీసుకుంటే జనసేన నిలదీయదా?

8. రాఫెల్ డీల్ విషయంలో ఇప్పటి వరకు ఎందుకు సైలెంటుగా ఉన్నారు.?

9. వంతాడ అక్రమాల వెనుక వైసీపీ నేతలు బాలినేని, వైవీ సుబ్బారెడ్డిలు ఉన్నారని పవన్‌‌కు తెలియదా?

10. విశాఖలో వట్టి రవి నివాసంలో వైసీపీ అధినేత జగన్ పవన్ కలిశారనే ప్రచారం నిజం కాదా?

11. ప్రసంగాల్లో పరుష పదజాలం వాడుతూ యువతకు ఏం సందేశం ఇస్తున్నారు?

12. కాకినాడ సీ పోర్టు అధినేత ఇంట్లో మీ సోదరుడు చిరంజీవి ఎందుకు ఉన్నారో చెప్పగలరా?

అని పవన్‌‌ను మంత్రి కళా ప్రశ్నించారు. అయితే టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టే పవన్.. మంత్రి విమర్శలపై స్పందిస్తారా లేకుంటే మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...