Jump to content

Recommended Posts

  • Replies 173
  • Created
  • Last Reply

Modi and co. controlled the complete media in Gujarat and made it look like a model state to the outsiders. 

They are basically replicating the same strategy nationwide. 

They are controlling the media and regional political parties with an iron fist. 

If this was a communist nation, then it will work out in their favor.

However, in democracies, it's hard to sustain such control. 

 

Link to comment
Share on other sites

డు రాహుల్‌తో చంద్రబాబు సమావేశం.. వ్యూహం ఇదేనా?
01-11-2018 02:10:56
 
636766430354833495.jpg
  • బీజేపీ వ్యతిరేక పోరాటంలో స్పీడు పెంచిన బాబు
  • నేడు ఢిల్లీలో రాహుల్‌తో సమావేశం
  • శరద్‌ నివాసంలో విందు భేటీ
  • అక్కడికే వస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు
  • విపక్షాల ఐక్యతలో కీలక పరిణామం
  • ఇప్పటి నుంచే కలిసి సాగాలనే యోచన
  • బలమైన కూటమిగా ఆవిర్భవించే వ్యూహం
  • ఫరూక్‌ అబ్దుల్లా, ఏచూరిలతో కూడా భేటీ
  • 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ చీఫ్‌తో మాటలు
  • నాడు పీవీ, కేసరిలతో సంప్రదింపులు
బీజేపీతోనే ముప్పు...
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకే ఎన్టీఆర్‌ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పుడు కాంగ్రె్‌సతో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు... బీజేపీతో అంతకు మించిన సమస్య ఎదురవుతోంది. తెలుగు వారికి అవమానం, అణచివేత రెండూ జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంలో తప్పు లేదు. తెలుగు వారి ఆత్మగౌరవమే ఎన్టీఆర్‌ నినాదం. దీనికి ఎవరి వల్ల ఇబ్బంది తలెత్తినా... వారితో పోరాడతాం!
- చంద్రబాబు (కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడం సరైనదేనా అని మంత్రులు సందేహం వ్యక్తం చేసినప్పుడు ఇచ్చిన సమాధానం)
 
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతంపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు జోరు పెంచుతున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రె్‌సను... ఇతర పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నారు. ఇదొక సంచలన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.
 
తర్వాత చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు... మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని, ఆయన మళ్లీ ప్రధాని అయితే మరింత అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే... మోదీ పాలన దేశానికే ముప్పుగా మారిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టిన చంద్రబాబు... ఇప్పుడు కాంగ్రె్‌సతో రాజకీయ సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీని కోసం మూడు రోజుల వ్యవధిలో రెండోసారి హస్తిన యాత్ర పెట్టుకొన్నారు.
 
వరుస చర్చలు...
చంద్రబాబు గురువారం ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ముందుగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ కానున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా శరద పవార్‌ తన నివాసంలో మధ్యాహ్నం విందు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాహుల్‌ గాంధీ కూడా హాజరవుతారు. ఎస్పీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా దీనికి హాజరు కావచ్చునని అంటున్నారు. సీపీఎం అగ్రనేత ఏచూరి సీతారాంతోనూ బాబు చర్చలు జరుపుతారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి రూపు దిద్దుకుంటోందన్న సంకేతాన్ని దేశానికి ఇవ్వడానికి ఈ సమావేశం ఉపకరిస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. రాఫెల్‌ కుంభకోణం, సీబీఐలో అవాంఛనీయ పరిణామాలు, రిజర్వు బ్యాంకు వ్యవహారాల్లో కేంద్రం జోక్యం తదితర పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధనకు వేగంగా పావులు కదపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
 
ఎన్నికలు వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే బీజేపీయేతర పార్టీలు వివిధ అంశాలపై కలిసి పనిచేస్తే వాటిపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వ్యతిరేకత ఉమ్మడి అంశమైనప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వివిధ పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆయా పార్టీల నేతలను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తే ఐక్యత మరింత బలంగా పాదుకొంటుందని, వాటి మధ్య విశ్వాసం కూడా పెరుగుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఈ కోణంలోనే ఆయన ప్రతి పార్టీ అధినేతతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి తన పాత్రపై కూడా స్పష్టత ఇస్తున్నారు. ‘‘నాకు మా రాష్ట్రం ముఖ్యం. మీ అందరినీ సమన్వయపర్చడం తప్ప ఢిల్లీలో నేను ఎటువంటి రాజకీయ పదవులను కోరుకోవడం లేదు. నేను మా రాష్ట్రంలోనే ఉంటాను’’ అని చెబుతున్నారు. తాను పోటీదారుడిని కానని ఆయన ముందే స్పష్టత ఇస్తుండటంతో వివిధ పార్టీల నేతలు ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు.
 
మంత్రులతో చర్చ
జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో అందుబాటులో ఉన్న కొందరు మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్‌తో తాను భేటీ కాబోతున్న అంశాన్ని వారికి తెలిపారు. ‘‘మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ సహా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంకులు దెబ్బ తిన్నాయి. రాఫెల్‌ కుంభకోణం ఈ ప్రభుత్వ నైతికతను దిగజార్చింది. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి వ్యవస్థలను నిర్లజ్జగా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. దేశాన్ని కాపాడుకోవాలి... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే నినాదంతో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెస్తేనే ఈ పెడ ధోరణులను అరికట్టగలుగుతాం. అందుకే కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కూడా కలుస్తున్నాను’’ అని చంద్రబాబు వారికి వివరించారు. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత సాధించేందుకు కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని పోవడం రాజకీయ అనివార్యతగా మారిందని... దీనిపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలని ఆయన వారికి సూచించారు.
 
‘‘తెలంగాణలో మహా కూటమిలో ఇప్పటికే కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తున్నాం. ఈ అనివార్యతను ప్రజలు, కార్యకర్తలు అర్థం చేసుకొన్నారు. ఇందులో ఇబ్బందేమీ లేదు’’ అని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. వయసులో చిన్నవాడైన రాహుల్‌ తానే చంద్రబాబు వద్దకు వచ్చి కలిస్తే బాగుండేదేమోనని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. దీనికి చంద్రబాబు నవ్వేశారు. ‘‘చిన్న పార్టీల వద్దకు కూడా నేను స్వయంగా వెళ్లి మాట్లాడుతున్నాను. వాటితో పోలిస్తే కాంగ్రెస్‌ పెద్ద పార్టీ. వెళ్లి మాట్లాడితే వారి మనసులో భావాలు తెలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇది కాంగ్రె్‌సకు దగ్గర కావడం కాదని, బీజేపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కలిపే ప్రయత్నమని ఆయన చెప్పారు.
 
ప్రజలకు చెప్పండి...
కేంద్రం నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత సాధించేందుకు కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని పోవడం రాజకీయ అనివార్యతగా మారింది. ఇది కాంగ్రెస్‌కు దగ్గర కావడం కాదు. బీజేపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కలిపే ప్రయత్నం. దీనిపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలి.
- చంద్రబాబు
Link to comment
Share on other sites

అందరికీ ఉమ్మడి శత్రువు బీజేపీ: సీఎం రమేష్
01-11-2018 09:07:12
 
636766600338577522.jpg
విజయవాడ: సేవ్‌ నేషన్‌ పేరుతో ఢిల్లీ పర్యటన సాగనుందని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ప్రజల న్యాయమైన కోరికలు బీజేపీ నేరవేర్చలేదని, బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందరికీ ఉమ్మడి శత్రువుగా బీజేపీ మారిందన్నారు. అందరినీ సమన్వయ పరిచి ఏకతాటిపైకి తెస్తామని సీఎం రమేష్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

విజయవాడ, వెలగపూడిలో ఆకర్షిస్తున్న హోర్డింగ్‌లు
01-11-2018 09:55:46
 
636766629470996163.jpg
విజయవాడ: విజయవాడ, అమరావతిలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో ఏర్పాటు చేసిన హోర్గింగ్‌లు, ఫ్లెక్సీలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ‘నాటి రామన్న బాటలో నేడు చంద్రన్న’ టైటిల్‌తో ఉన్న ఫ్లెక్సీలను అందరూ ఆసక్తిగా చదువుతున్నారు. ఈ హోర్డింగ్‌లు విజయవాడలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, వెలగపూడిలో ఉన్నాయి. ‘నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందరాగాంధీ కూలదోసిన వేళ రామన్న సారథ్యంలో జరిగిన ప్రజాస్వామ్యం, పరిరక్షణ ఉద్యమంలో భిన్న ధృవాలైన వామపక్షాలు, బీజేపీ కలిశాయి. కేంద్ర దుర్మార్గ చర్యను ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. ఎన్టీఆర్ సాగించిన పోరాటం స్ఫూర్తిగా ఇప్పుడు కలిసి వచ్చే రాజకీయ శక్తులను సమైక్యపరుస్తూ ధర్మపోరాటం చేస్తున్న చంద్రబాబును తెలుగు ప్రజలు దీవించాలి’ అంటూ కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీల్లో రాయించారు. రాష్ట్ర విభజన హామీలను కాలరాస్తున్న కేంద్ర పాలకులను, కేంద్రంతో చేతులు కలిపిన జాతి ద్రోహులను తిప్పికొట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

దిల్లీ బయలుదేరిన సీఎం చంద్రబాబు

09485101BABU1A.JPG

మరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ పర్యటనకు బయలుదేరారు. అమరావతినలోని తన నివాసంలో హెలికాప్టర్‌లో గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని పయనమయ్యారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌ దిల్లీ వెళ్లారు.
జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలన్న చంద్రబాబు నిర్ణయానికి జమ్మూకశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మొదటి నుంచీ అండగా నిలిచారు. శరద్‌ పవార్‌తో చంద్రబాబు భేటీకి అనుసంధానకర్త కూడా ఆయనేనని పార్టీవర్గాల సమాచారం. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా దిల్లీలోని శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన ప్రణాళిక, దేశ రాజకీయాలపై చర్చిస్తారు. రాహుల్‌ గాంధీతో మధ్యాహ్నం 3.30కు చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం అజిత్‌ సింగ్‌, సీతారాం ఏచూరి వంటి నాయకులు వచ్చి కలుస్తారు. ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌లలో ఎవరో ఒకరు చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Naidu to meet Rahul Gandhi

author-deafault.png Continued from page 1
November 01, 2018 00:00 IST
Updated: November 01, 2018 05:27 IST
 

On Saturday, Mr. Naidu met Delhi Chief Minister Arvind Kejriwal, BSP leader Mayawati, CPI General Secretary S. Sudhakar Reddy and Loktantrik Janata Dal leader Sharad Yadav besides Mr. Abdullah.

The meeting with the AICC president has come through after Mr. Naidu himself threw a hint at the swearing-in of Mr. Kumarawswamy. A few months later, he allowed his party leaders in Telangana to hold talks with the Congress leaders there. This took the shape and launch of a “people’s alliance” against the TRS comprising the Congress, the TDP, the CPI and the Telangana Jana Samithi to fight the Assembly elections there.

Eversince he walked out of the NDA , funds and not fulfilling the provisions of the AP Re-organistion Act, Mr. Naidu has adopted a strident political posture against the BJP.

He was also cut up with it for ‘egging on’ his immediate political opponents, the YSRCP and the Jana Sena Party, to turn the heat on his government besides unleashing its own leaders. Mr. Naidu perceives a ‘political conspiracy’ by the BJP and the YSRCP against him and cites the series of events that followed the attack on Mr. Jagan Mohan Reddy.

These include the YSRCP allegation that the ‘murderous attempt’ on their leader was ‘engineered’ by the TDP government, BJP State president Kanna Lakshminarayana demanding President’s rule alleging law and order breakdown .

Link to comment
Share on other sites

శరద్‌ పవార్‌తో చంద్రబాబు భేటీ

0158350111BRK94A.JPG

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌‌తో భేటీ అయ్యారు. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే కార్యాచరణలో భాగంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే దిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత గులాంనబీ ఆజాద్‌ చంద్రబాబును కలిశారు. దేశ రాజకీయాలపై ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన చంద్రబాబు ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పవార్‌తో పాటు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులు తదితర అంశాలపై చంద్రబాబు, పవార్‌ చర్చించారు. అనంతరం చంద్రబాబు ఫరూక్‌ అబ్దుల్లాతోనూ భేటీ కానున్నారు. దిల్లీ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణడు, కళా వెంకట్రావు, ఎంపీలు సీఎం రమేశ్‌, మాగంటి బాబు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు చుట్టూ ఢిల్లీ రాజకీయం!
01-11-2018 14:52:01
 
636766807433311663.jpg
హైదరాబాద్: 2019 ఎన్నికలు కొత్త ఎత్తులకు, పొత్తులకు వేదికగా నిలుస్తున్నాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో కలిసి నడవబోతోంది. ఇప్పటి వరకు నీరూనిప్పులా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఏకం చేసిన ఘనత ప్రధాని మోదీకి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దక్కుతుంది. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన మోదీ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన వెంటనే ఏపీ కేబినేట్‌లో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ అవినీతి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 
 
 
ఇది ఇలావుంటే కేంద్ర రాజకీయాల్లో సీఎం చంద్రబాబు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్‌డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలని, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తామని చెప్పారు. ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తానని స్పష్టం చేశారు. తనకు ప్రధాని పదవిపై కోరికలేదని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని తానేనంటూ ప్రకటించారు. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు.
 
‘‘బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడింది. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... నేను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశాను. మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది’’ అని చంద్రబాబు చెప్పారు.
 
 
ఆయన ప్రకటించినట్లే చంద్రబాబు.. రాహుల్‌గాంధీతో భేటీ కాబోతున్నారు. వారం వ్యవధిలోనే ఆయన రెండు సార్లు ఢిల్లీ పర్యటిస్తున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో పర్యటించి పలు పార్టీల నేతలను కలిశారు. చంద్రబాబు కలిసిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాయావతిని కలిశారు.
 
 
ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని ఫరూక్‌ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.
 
 
అయితే ఫరూక్ భిన్నంగా మాయావతి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఢిల్లీలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మరింది. చంద్రబాబు చుట్టూ ఢిల్లీ రాజకీయం తిరుగుతోందని, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పబోతున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Link to comment
Share on other sites

ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అగ్ర నేతలతో కీలక చర్చలు
01-11-2018 14:49:12
 
636766805928940865.jpg
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు చర్చలు చేపట్టారు. పర్యటనలో భాగంగా శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలపై మంతనాలు నిర్వహించారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో చర్చించామని తెలిపారు. అలాగే సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామన్నారు. కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చామని తెలిపారు.
 
శరద్‌పవర్‌ మాట్లాడుతూ.. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులల్లో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
 
చంద్రబాబు మాట్లాడుతూ.. శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్‌ నేతలు అని చెప్పారు. దేశంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. సీనియర్‌ నాయకులుగా మేమంతా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేశారు. అందరం కలిసి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు, దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలనుకున్నామని వివరించారు.
naeoi-500.jpg
Link to comment
Share on other sites

రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ 0346411BRK112-RAHUL.JPG

దిల్లీ: భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు. ‘జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో స్నేహంపై వ్యూహాత్మంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా, భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే శరద్ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాలతో సీఎం భేటీ అయినవిషయం తెలిసిందే. రాహుల్‌తో భేటీలో సీఎం వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

రాహుల్‌ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, బండ్ల గణేశ్‌ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...