Jump to content

Recommended Posts

డెమోక్రసీని కాపాడటం కోసమే రాహుల్‌ను కలిశా
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాహుల్

0521291BRK122-BABURAHUL.JPG

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాహుల్‌తో చర్చలు జరిపిన చంద్రబాబు.. దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశంపైనే చర్చించినట్టు వివరించారు. దిల్లీలో రాహుల్‌ నివాసంలో భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం’’ అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్‌ మద్దతిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. రఫేల్‌ పోరాటాన్నిరాహుల్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, గవర్నర్ల‌ వ్యవస్థ.. ఇలా అన్ని వ్యవస్థలూ సంక్షోభంలో కూరుకుపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

పాత విషయాల జోలికి వెళ్లం.. రాహుల్‌

వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించి.. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను కాపాడమే లక్ష్యంగా తమ భేటీ మంచి వాతావరణంలో సాగిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. భాజపాను ఓడించడమే లక్ష్యంగా తమ పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. దేశాన్నికాపాడుకునేందుకు భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొస్తామని చెప్పారు. గతంలో తమ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపైనే చర్చించినట్టు రాహుల్‌ తెలిపారు. తాము పాత విషయాల జోలికి పోవడంలేదన్నారు. ప్రస్తుత, భవిష్యత్తులో జరగబోయే అంశాలపైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబుతో భేటీలో చర్చించినట్టు చెప్పారు. భాజపా అన్ని వ్యవస్థలపైనా దాడి చేస్తోందని రాహుల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడిని ఆపడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, భాజపా కుంభకోణాలపై ఉద్యమిస్తామని రాహుల్‌ వివరించారు.

Link to comment
Share on other sites

  • Replies 173
  • Created
  • Last Reply

I think there is a strong evidence that Modi and co involved deeply in Rafale scam and they lost respect from various political leaders, when the CBI thing came out. And now Naidu knows that it will eventually happen that Modi will never become a PM again and all the fallen institutions and political parties coming together to show Modi and co the exit door.

Link to comment
Share on other sites

దేశం కోసం స్నేహం
గొంతు కలిపిన విపక్షాలు
రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ
దిల్లీలో కీలక ఘట్టం ఆవిష్కృతం
ప్రజాస్వామ్య అనివార్యతగా అభివర్ణించిన నేతలు
పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, ములాయం,అఖిలేష్‌, ఏచూరి, అరుణ్‌శౌరీలతోనూ  ఏపీ ముఖ్యమంత్రి సమావేశం
మోదీకి వ్యతిరేకంగా గళం
ప్రత్యామ్నాయ వేదికకు కసరత్తు
చంద్రబాబుకు బాధ్యత అప్పగింత
త్వరలో దిల్లీలో మళ్లీ సమావేశం
1ap-main1a.jpg
1ap-main1b.jpg
మేం ఉమ్మడిగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే వ్యవస్థలను రక్షించినట్లే. ఆ దిశగా చంద్రబాబు అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడనున్నారు. మేం ముగ్గురం కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసి నాయకులు అందరినీ పిలవాలనుకుంటున్నాం. అందులో ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తాం.
- శరద్‌పవార్‌
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  దేశం ఇలాంటి సంక్షోభ సమయాన్ని ఎదుర్కొన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. అందుకే మేం అంతా కలిసి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలన్న దానిపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాం.
- ఫరూక్‌ అబ్దుల్లా
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రస్తుతం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే నా ప్రధాన లక్ష్యం. అందుకోసం అందరినీ కూడగడతా. అందరం సంయుక్తంగా ఒకవేదిక మీదికొచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకొని ముందుకెళ్తాం.
చంద్రబాబు నాయుడు
మా మధ్య చాలా మంచి సమావేశం జరిగింది. ప్రజాస్వామ్యం, వ్యవస్థలు, దేశ భవిష్యత్తును కాపాడాలన్నదే ఈ సమావేశం సారాంశం. అందుకే మేం ఒక్కచోటికి వచ్చాం. దేశంలో ప్రజాస్వామ్యం, వ్యవస్థలను కాపాడటానికి
ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయి.
- రాహుల్‌గాంధీ
1ap-main1c.jpg
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం బలంగా ఉంది. తెలుగుదేశం, సమాజ్‌వాదీపార్టీ కలయిక పెనుమార్పులకు సంకేతం.
- ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్‌ యాదవ్‌
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు చూపిన చొరవ మెచ్చుకోదగింది. రాజ్యాంగాన్ని, ప్రజల్ని కాపాడేందుకు అన్ని పార్టీలు ముందుకొచ్చి కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది.
- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి


రాహుల్‌గాంధీ, చంద్రబాబు చేతులు కలపడం మంచి పరిణామం. మోదీ దుష్టపాలనలో దేశం ప్రమాదంలో పడింది. దాన్ని రక్షించడానికి అందరూ శత్రుత్వం వదిలిపెట్టి చేతులు కలపాలి.
- కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి

అన్ని వ్యవస్థలనూ మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ఫలించింది. దేశ చరిత్రలో ఒక సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అడుగు పడింది. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పేర్కొంటూ భాజపాకు వ్యతిరేకంగా ఒక కీలక వేదిక రూపుదిద్దుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా భాజపా ప్రభుత్వ దాడుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గట్టి మద్దతిచ్చారు. ఉమ్మడిగా కదిలి భాజపా ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సిద్ధమని దిల్లీలో గురువారం చంద్రబాబుతో భేటీ అనంతరం రాహుల్‌ ప్రకటించారు. ప్రతిపక్షాల ఐక్యతకు చంద్రబాబు చూపుతున్న చొరవను అభినందించారు. గతాన్ని వదిలేస్తున్నామని, వర్తమానం, భవిష్యత్తు కోసం కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలుస్తామని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌, తెదేపాల దోస్తీకి, ప్రత్యామ్నాయ వేదికకు మరో కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అండగా నిలిచారు. గురువారం మధ్యాహ్నం దిల్లీలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి మొదట శరద్‌ పవార్‌తో విందు భేటీ జరిపారు. ఈ కార్యక్రమంలో ఫరూక్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం ములాయం, అఖిలేశ్‌, అరుణ్‌శౌరి, సీతారాం ఏచూరి తదితరులతోనూ సమావేశమయ్యారు. వారంతా ముక్తకంఠంతో చంద్రబాబు ప్రయత్నాన్ని అభినందించడం విశేషం.

Link to comment
Share on other sites

కలసి నడుద్దాం
గతం గతః
వర్తమానం, భవిష్యత్తు కోసం పనిచేస్తాం
భాజపాను ఓడించి దేశాన్ని కాపాడతాం
ప్రజాస్వామ్యం, వ్యవస్థలను నిలబెడతాం
సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమిస్తాం
రాహుల్‌గాంధీ, చంద్రబాబు స్పష్టీకరణ
తొలిసారిగా భేటీ అయిన ఇద్దరు అగ్రనేతలు
ఈనాడు - దిల్లీ
1ap-main5a.jpg

నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రత్యర్థులుగా ఉన్న మాట వాస్తవమేనని, గతం గతః.. ఇక వర్తమానం, భవిష్యత్తు కోసం తాము కలిసి పని చేయాలని నిర్ణయించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెల్లడించారు. తామంతా కలిసి భాజపాను ఓడిస్తామని అన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థను భాజపా ఆక్రమిస్తోందని, దాన్ని అడ్డుకోడానికి కలిసి పని చేయబోతున్నామని ప్రకటించారు. ఆయన గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో తొలిసారి సమావేశమయ్యారు. ఇక్కడి 12-తుగ్లక్‌లేన్‌లోని తన నివాసంలో జరిగిన గంట భేటీ తర్వాత రాహుల్‌గాంధీ.. చంద్రబాబుతో కలిసి నడుచుకుంటూ బయటకు వచ్చి విలేకర్లతో సంయుక్తంగా మాట్లాడారు. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా పనిచేసిన మీరు ఎలా కలిసి పనిచేస్తారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘మీరు చెప్పినట్టు మాకు గతం ఉంది. గతంలోకి వెళ్లకుండా వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఏకాభిప్రాయానికి వచ్చాం. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అందుకే అన్ని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రజలకు ఒక దార్శనికత అందించాలని నిర్ణయించాం’ అని అన్నారు. ఈ దేశం ముందున్న నిరుద్యోగం, రఫేల్‌, రైతు సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. తర్వాత విలేకరులు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించగా.. రాహుల్‌ జోక్యం చేసుకొని ముందు నాయుడుని మాట్లాడనివ్వండి అని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ప్రకటించారు. ‘అదే అంశంపై రాహుల్‌తో మాట్లాడా. ఆయన ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మా గతం గురించి మీలో కొందరికి అనుమానాలున్నాయి. కానీ ఈ దేశాన్ని రక్షించడానికి ఇద్దరం ఒక్కతాటిపైకి రావడం ప్రజాస్వామికంగా తప్పని పరిస్థితి. ఓ సీనియర్‌ నాయకుడిగా నాపైనా, ఓ ప్రధాన జాతీయ పార్టీ నేతగా రాహుల్‌గాంధీపైన దేశాన్ని రక్షించే బాధ్యత ఉంది. అందుకే ఇద్దరం కలిశాం. భాజపాను వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఉమ్మడి వేదిక తయారు చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రస్తుతం దేశంలో వ్యవస్థలు ఎలా ధ్వంసమవుతున్నాయో అంతా చూస్తున్నారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎన్నడూ ఇలాంటి పరిపాలనకానీ, వ్యవస్థల విధ్వంసంకానీ చూడలేదు. ఏ వ్యవస్థనూ వదిలి పెట్టకుండా నాశనం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోడానికే కలిసి పనిచేయాలని నిర్ణయించాం. దీనిపై కాంగ్రెస్‌లోనూ అంతర్గతంగా చర్చించమని రాహుల్‌కు చెప్పా. అన్ని పార్టీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్తాం’ అని అన్నారు. తాను డీఎంకే నేత స్టాలిన్‌నూ త్వరలో కలుస్తానని అన్నారు.

మీ బృందంలో ప్రధాని పదవికి ఎవరు పోటీ పడతారు? మీరు ఎన్నాళ్లనుంచో రఫేల్‌పై జేపీసీ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి చంద్రబాబు మద్దతు లభించిందా?
రాహుల్‌: ఈ దేశంలో ప్రజాస్వామ్యం, వ్యవస్థలను రక్షించాలన్నదే మా ప్రాథమిక లక్ష్యం. దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇతర అన్ని అంశాలు తర్వాత చర్చిస్తాం.

2019 ఎన్నికలనాటికి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెడతారా?
చంద్రబాబు: మీ ఆసక్తి అభ్యర్థులపైన. మా ఆసక్తి దేశంపైన. మీరు మిగతా విషయాలన్నీ మనసులోంచి తుడిచిపెట్టి దేశం గురించి ఆలోచించాలి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడుతాం. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షమన్నది వాస్తవం. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మిగతా పార్టీలు కూడా అవసరం. అందుకే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.

రాహుల్‌: (విలేకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ) మీ లక్ష్యం సంచలనం సృష్టించడం. మీకు సంచలనం కావాలి. కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మాకు కావాలి. అన్ని రాజకీయ పార్టీల ముందున్న ప్రధాన లక్ష్యం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే. మిగతావన్నీ ఆ తర్వాతే. మేం ఈ ప్రధాన సవాలును ఎదుర్కొనేందుకు కలిసి పనిచేస్తాం. రఫేల్‌లో అవినీతి సుస్పష్టం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. దీనిపై దర్యాప్తు చేసే వ్యవస్థలను బెదిరిస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలని మేం భావిస్తున్నాం. రఫేల్‌లో దర్యాప్తు కొనసాగితే అందులో ఏం జరిగింది? డబ్బు ఎక్కడికెళ్లింది? ఎవరు అవినీతికి పాల్పడ్డారన్నది స్పష్టంగా బయటికొస్తుంది. అందుకే దానిపై నేను దూకుడుగా వెళ్తున్నా. రఫేల్‌లో ఏం జరిగిందన్నది ప్రజలకు తెలియాలి. ఆ భావాలను ప్రతిపక్ష నాయకులందరితో పంచుకున్నా.

రఫేల్‌పై కాంగ్రెస్‌ మాట్లాడుతోంది తప్పితే మిగతా ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు కదా?
రాహుల్‌: దీనిపై చంద్రబాబుజీ మాట్లాడుతారు.
చంద్రబాబు: నేను అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నా. రాహుల్‌కూ ఆయన పార్టీలో మాట్లాడుకోమని చెప్పా. మేం అంతా ఒకసారి కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం. ఏపీలో మాకున్న విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలకు రాహుల్‌ మద్దతు పలికారు. అందువల్ల మాకు కలిసి పనిచేయడానికి ఎలాంటి సమస్యలు లేవు. రఫేల్‌ గురించి మేం మొదటినుంచీ మాట్లాడుతున్నాం. సీబీఐ గురించి మేం కూడా ఆందోళనగా ఉన్నాం. వీటన్నింటిపై జాతీయ స్థాయిలో ఒకే గొంతు వినిపిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పని మేం చేసి చూపుతాం.

? ఈ ఏర్పాటు జాతీయ స్థాయికే పరిమితమవుతుందా? లేదంటే రాష్ట్రాలవారీగా ఉంటుందా?
చంద్రబాబు: మీరు విషయం లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.
రాహుల్‌: మేం కలిసికట్టుగా పనిచేసి భాజపాను ఓడిస్తాం. మన ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై జరుగుతున్న దాడులను అడ్డుకుంటాం. ఈ పోరాటంలో మేం విజయం సాధిస్తాం. మా ప్రయత్నాల గురించి ఎప్పటికప్పుడు మీడియాకు చెబుతాం. నరేంద్రమోదీ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం మీడియాకు చాలా కష్టమని నాకు తెలుసు. అయినప్పటికీ చాలామంది ధైర్యంగా మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు.

?ఎవరు నాయకత్వం వహిస్తారు?
రాహుల్‌: అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు.

ప్రశ్న: ఎవరైనా కన్వీనర్‌ ఉంటారా?
చంద్రబాబు: కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షం. దేశంలో మాలాంటి పార్టీలు ఉన్నాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మేం కార్యాచరణ రూపొందిస్తాం.


1ap-main5b.jpg
దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. 40ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు మద్దతిచ్చారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని నిజం చేశారు. ఆయనతోపాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేతలు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించగలిగే శక్తియుక్తులు గల నేత మీరేనని కితాబిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుతో విడిగా సమావేశమై మద్దతు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రస్తుతం కనిపిస్తున్న పెడపోకడల నుంచి దేశాన్ని రక్షించడానికి భాజపా వ్యతిరేక కూటమిని కూడగట్టాలన్న లక్ష్యంతో దిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపారు. ఉదయం విమానాశ్రయంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడి జన్‌పథ్‌లోని శరద్‌ పవార్‌ ఇంటికి వచ్చారు. పవార్‌తోపాటు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాతో మధ్యాహ్న విందు సందర్భంగా గంటపాటు భేటీ అయ్యారు. సాధారణంగా విలేకర్లను తన ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వని పవార్‌ ఇంట్లోకి పాత్రికేయులను పిలిచి మాట్లాడటం ద్వారా ఈ సమావేశానికి తాను ఇచ్చిన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. 3.30 గంటలకు రాహుల్‌గాంధీ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ కలవని వ్యక్తులు కలుస్తున్నారని తెలియడంతో జాతీయ మీడియా మొత్తం రాహుల్‌ ఇంటి ముందు మూగింది. సుమారు 1.20 గంటలసేపు ఇరువురు నేతలు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ తర్వాత ఇద్దరూ మీడియా ముందుకు నడుచుకుంటూ వచ్చారు. రాహుల్‌ పాత్రికేయుల ముందుకొచ్చి మాట్లాడటం ద్వారా ఆ సమావేశానికి, చంద్రబాబుకు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ చెప్పకనే చెప్పారు. చంద్రబాబు వంతు వచ్చినప్పుడు చేయిపట్టి దగ్గరకు రమ్మని పిలిచి తను పక్కకు జరిగి మైకుల ముందు నిలబెట్టారు. 12 తుగ్లక్‌ లేన్‌లోని రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్లిన వెంటనే చంద్రబాబు ఆయనకు శాలువాకప్పి, బొబ్బిలి వీణను బహూకరించారు. చంద్రబాబు సూచనలు, మార్గదర్శనం తమకు అవసరమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ములాయం, అఖిలేష్‌ యాదవ్‌లతో చంద్రబాబు ఉమ్మడిగా, వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. అఖిలేష్‌, ములాయంతో సుమారు గంటకుపైగా మాట్లాడారు. ఎయిర్‌పోర్టులో సీతారాం ఏచూరితో సుమారు అరగంటకుపైగా చంద్రబాబు మాట్లాడారు. మోదీని నమ్మొద్దని తాను తొలి నుంచీ చెబుతున్నానని, మీరే కొంత నిర్లక్ష్యం చేశారని సీతారాం... చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. అంతకుముందు అరుణ్‌ శౌరితోనూ భేటీ అయ్యారు.
Link to comment
Share on other sites

ఉమ్మడి పోరాటం
చంద్రబాబుతో భేటీ తర్వాత పవార్‌, ఫరూక్‌ వెల్లడి
1ap-main9a.jpg
మేం ఉమ్మడిగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే వ్యవస్థలను రక్షించినట్లే. ఆ దిశగా చంద్రబాబు అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడనున్నారు. మేం ముగ్గురం కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసి నాయకులు అందరినీ పిలవాలనుకుంటున్నాం. అందులో చర్చించి ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తాం. ఇది మా ఆలోచనా సరళి.  ఈ రోజు అంతకు మించి మాట్లాడాలనుకోవడం లేదు.
- శరద్‌పవార్‌

ఈనాడు, దిల్ల్లీ: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించినట్లు కేంద్ర మాజీ మంత్రులు శరద్‌పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు. గురువారం ఇక్కడ శరద్‌పవార్‌ నివాసంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. అన్ని రాజకీయపార్టీలతో మాట్లాడి వాటిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించినట్లు చెప్పారు. త్వరలో తాము దిల్లీలో సమావేశమై ఒక కార్యాచరణ వెల్లడిస్తామని ప్రకటించారు.  ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ... ‘‘సీబీఐ, ఆర్‌బీఐ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో మీరు చూశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి సంక్షోభ సమయాన్ని ఎదుర్కొన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. అందుకే మేం అంతా కలిసి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలనుకున్నాం. దిల్లీలో ఏర్పాటు చేసే సమావేశానికి మేం ముగ్గురం కన్వీనర్లుగా ఉంటాం’’ అని వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ .. ‘‘అధికారం, సీట్లు మాకు అక్కర లేదు. కేవలం దేశ ప్రయోజనాలకే కలిసి పని చేయాలనుకుంటున్నాం. అన్ని పార్టీలతో నన్ను మాట్లాడమని శరద్‌పవార్‌ చెప్పారు’’ అని వివరించారు.

Link to comment
Share on other sites

శుభపరిణామం
రాహుల్‌, చంద్రబాబు కలయికపై అరుణ్‌శౌరి వ్యాఖ్య
1ap-main3a.jpg

ఈనాడు, దిల్లీ: మోదీ దుష్టపాలన కారణంగా దేశం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడటానికి దేశంలోని అన్ని రాజకీయపక్షాలు శత్రుత్వాన్ని, విభేదాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి రావాలని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఇక్కడ ఏపీ భవన్‌లో చంద్రబాబుతో భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మోదీ కారణంగా దేశం ఎంత ప్రమాదంలో పడిపోయిందన్న విషయాన్ని అర్థం చేసుకునే రాహుల్‌, చంద్రబాబు కలిశారని, అందరూ అదే పంథా అనుసరించాలని చెప్పారు. ‘‘ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని విపక్షాలు ఒక్కతాటిపైకి రావాలన్న చంద్రబాబు పిలుపులో నిజం ఉంది. గత కొంత కాలంగా నేను కూడా ఇదే భావనతో ఉన్నాను. అద్భుతమైన పరిపాలన దక్షత, ఆమోదయోగ్యత, దేశంలోని విభిన్న నాయకులతో ఉన్న సంబంధాలు ఉన్న ఏపీ సీఎం ప్రస్తుత పరిస్థితుల్లో కీలక భూమిక పోషిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఈ ప్రయత్నంలో ఆయనకు విజయం చేకూరాలని కోరుకుంటున్నా. దేశం తీవ్ర ప్రమాదంలో ఉంది. అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొనే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబుతో అన్ని రాజకీయపార్టీలు చేతులు కలపడం చూసి మోదీ ఆందోళనకు గురవుతుంటారు. రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు చేతులు కలపడం మంచి పరిణామం. అందరూ అలాగే కలవాలి. జీవితంలో ఆగర్భ శత్రుత్వం, మిత్రుత్వం ఉండదు. మోదీ దుష్పరిపాలన వల్ల దేశంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయో తెలుసుకొనే వారు శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలిపారు. పాత శత్రుత్వాలను వదిలిపెట్టి కలిసి పనిచేయాలి. శత్రువులు కలవడం చాలా సానుకూల పరిణామం’’ అని అరుణ్‌ శౌరి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

చంద్రబాబు చొరవ భేష్‌
సీతారాం ఏచూరి
1ap-main8a.jpg
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు చూపిన చొరవ మెచ్చుకోదగినదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ విమనాశ్రయంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఏచూరి మాట్లాడుతూ సీబీఐ, న్యాయవ్యవస్థ, ఆర్బీఐలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సి ఉందన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని, ప్రజల్ని కాపాడాల్సిన నేపథ్యంలో అన్ని పార్టీలు ముందుకొచ్చి కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాఫెల్‌ డీల్‌ అవినీతి కేంద్రం సమర్థతకు అద్దం పడుతోందని, కేంద్రంపై అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ఉదయం నుంచి చంద్రబాబు పలువురు నేతల్ని కలిసి చర్చించారని తెలిసిందని, ఆయన చొరవను అందరూ అంగీకరించాల్సి ఉందని, మరిన్ని సమావేశాలు జరిపి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. నేతలందరిదీ ఒకే అభిప్రాయం అని తెలిసిందన్నారు. 2019 ఎన్నికలు కాదని.... ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఎలా కాపాడాలి అన్నదే తమ అజెండా అని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఏకం కావడానికి ఓ ఒప్పందానికి వచ్చామని తెలిపారు.
 
 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

కలిసికట్టు కూటమి
02-11-2018 03:20:41
 
636767282919796257.jpg
36 ఏళ్ల సైద్ధాంతిక రాజకీయ వైరాన్ని పక్కన బెట్టి కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపాయి. ఉమ్మడి ప్రత్యర్థులను ఒక్కుమ్మడిగా ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం ఢిల్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సారథి రాహుల్‌ గాంధీ వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. పవార్‌, ఫరూక్‌, ఏచూరి, ములాయం, అఖిలేశ్‌లతో సమావేశమై దేశ రాజకీయాల్లో కొత్త పునరేకీకరణకు తెరతీశారు. ఫలితంగా దాదాపు 15 పార్టీలతో జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ రూపుదిద్దుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘పరోక్ష’ పొత్తులతో తనను సతాయిస్తున్న ప్రధాని మోదీకి జాతీయ స్థాయి ఫ్రంట్‌తో చంద్రబాబు బలప్రదర్శనకు దిగి సవాల్‌ విసిరారు.
 
కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లోని తన ప్రత్యర్థులు భవిష్యత్తులో అటువైపు మొగ్గకుండా వ్యూహం రచించారు. వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ పెద్ద అయిన చంద్రబాబు స్వయంగా రాహుల్‌ వద్దకు వెళ్లడం.. మిగిలిన నేతలు కూడా భేషజాలు పక్కనపెట్టి కలసిరావడానికి మార్గం చూపినట్టైంది. ఈ పరిణామాలతో సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది.
 
మోదీ ఒక్కడు ఒక వైపు..
మిగతా హేమాహేమీలంతా ఒకవైపు.
2019 ఎన్నికల్లో భారీ యుద్ధమే!!
 
 
‘‘దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి... బీజేపీ ఉన్న కూటమి. రెండు... బీజేపీ వ్యతిరేక కూటమి. విపక్షాలను ఏకం చేసేందుకు ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. మమత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్‌ మొదలుపెట్టిన ప్రయత్నం ఎక్కడిదాకా వచ్చిందో ఆయననే అడగాలి’’                                           - చంద్రబాబు
 
  • 15 పార్టీలతో బీజేపీ వ్యతిరేక జట్టు
  • నినాదం: దేశాన్ని కాపాడండి..ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
  • కలిసొచ్చిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌
  • 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే ‘వేదిక’
  • ఇప్పటికే ముఖ్య నేతలతో బాబు సమావేశాలు
  • త్వరలో మమత, దేవెగౌడ తదితరులతో భేటీ
  • ఆపై చర్చలు, సదస్సులు, దేశవ్యాప్త ర్యాలీలు
15 పార్టీలివే
1.కాంగ్రెస్‌ 2.టీడీపీ 3.ఎస్పీ 4.బీఎస్పీ 5.ఆర్జేడీ 6.డీఎంకే 7.ఎన్సీపీ 8.జేఎంఎం
9. సీపీఐ 10.సీపీఎం 11. తృణమూల్‌ 12.జేడీఎస్‌ 13.ఎన్సీ 14.లోక్‌దళ్‌ 15. పీడీపీ.
 
న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ... జాతీయ స్థాయిలో ‘మహా కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పార్టీలను ఒక్కటి చేసే ప్రక్రియ మరో దశకు చేరుకుంది. ‘దేశాన్ని కాపాడండి... ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ (సేవ్‌ ది నేషన్‌... సేవ్‌ ది డెమోక్రసీ) నినాదంతో ఈ వేదిక రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలు, గతంలోని వైరుధ్యాలను మరచిపోయి కలిసిపనిచేయాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఎవరు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి... అనే అనిశ్చితిని తొలగిస్తూ చంద్రబాబు తీసుకున్న చొరవ జాతీయ స్థాయిలో ఫలితం చూపుతోంది. కాంగ్రె్‌సతోసహా 15 పార్టీలతో జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.
 
అక్టోబరు 27న ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎన్‌సీ నేత ఫరూక్‌ అబ్దుల్లా, ఆప్‌ నేత కేజ్రీవాల్‌, సీపీఐ నేత రాజా, సురవరం సుధాకర్‌ రెడ్డిలను కలిశారు. గురువారం ఆయన మళ్లీ ఢిల్లీకి వచ్చారు. తొలుత శరద్‌ పవార్‌ నివాసంలో విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ఫరూక్‌ అబ్దుల్లా కూడా హాజరయ్యారు. ఆ తర్వాత వీరు ముగ్గురూ కలిసి మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమిగా ఏర్పడటం అనివార్యం’ అని ఫరూక్‌, పవార్‌ స్పష్టంగా చెప్పారు.
 
మరో అడుగు ముందుకు...
జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు ప్రక్రియను చంద్రబాబు గురువారం మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ‘దేశం కోసం కూటమి ఏర్పడుతున్నాం. బీజేపీపై ఉమ్మడిగా పోరాడతాం’ అని రాహుల్‌ స్పష్టం చేశారు. రాష్ట్రీయ లోక్‌ దళ్‌ నేత అజిత్‌ సింగ్‌, ఎస్పీ నేతలు ములాయం, అఖిలేశ్‌లతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. విమానాశ్రయంలో సీతారాం ఏచూరితో చర్చలు జరిపారు. తాను తృణమూల్‌ నేత మమతా బెనర్జీ, జనతాదళ్‌ (ఎస్‌) నాయకుడు దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలతో కూడా మాట్లాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
 
ఇదీ కార్యాచరణ...
బీజేపీ వ్యతిరేక ఉమ్మడి వేదికపై గురువారం ప్రాథమిక చర్చ జరిగింది. దీని ప్రకారం... ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ఈ ఫ్రంట్‌ ఏర్పడుతుంది. తొలి దశలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలందరితో మాట్లాడతారు. తర్వాతి దశలో వారందరినీ ఒక వేదికపై సమావేశపరిచి... భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించడమే లక్ష్యంగా పని చేస్తారు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అవే రోజులను గుర్తుకు తెస్తున్నారు. మోదీపై ఉమ్మడి పోరు అవసరమని భావించిన ప్రత్యర్థి పార్టీల వారందరినీ కలిపేందుకు చొరవ తీసుకునేదెవరనే ప్రశ్న ఉత్పన్నమైన తరుణంలో... దీనికి సమాధానంగా చంద్రబాబు ముందుకు వచ్చారు. విపక్షాలను ఒక్కటి చేయడంలో ‘ప్రధాన సంధానకర్త’ పాత్ర పోషిస్తున్నారు. విపక్షాలు ఐకమత్యంగా, బలంగా ఉండగలవనే సంకేతాలను పంపిస్తున్నారు.
Link to comment
Share on other sites

గతం మరచి ముందుకు!
02-11-2018 03:05:02
 
636767247035521468.jpg
  • దేశం కోసం... ప్రజాస్వామ్యం కోసం
  • బీజేపీ నుంచి దేశాన్ని కాపాడడమే మా ధ్యేయం
  • విపక్షాల ఉమ్మడి కూటమి అనివార్యం
  •  జాతీయ స్థాయిలో కలిసికట్టుగా పని చేస్తాం
  •  ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదు
  •  వ్యవస్థలను కాపాడుకోవడమే కీలకం
  •  చంద్రబాబు, రాహుల్‌ సంయుక్త ప్రకటన
  •  రాహుల్‌తో గంటపాటు సీఎం సమావేశం
  •  ఆపై సంయుక్తంగా మీడియా ముందుకు
న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గతం మరిచి... వర్తమానంలోని పరిణామాలను గమనించి... భవిష్యత్తు కోసం కలిసి సాగాలని తెలుగుదేశం, కాంగ్రెస్‌ నిర్ణయించుకున్నాయి. మోదీ నిరంకుశ పాలనకు అంతం పలికేలా విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశాయి. ఈ దిశగా గురువారం ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపక్షాలను ఏకం చేయడంలో గురువారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఆయనతో సుమారు గంటపాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు ఒక గతం ఉంది. దీనిని మేం అంగీకరిస్తున్నాం. ఇప్పుడు గతంలోకి వెళ్లం. వర్తమానం గురించి, భవిష్యత్తు గురించే మాట్లాడతాం. ఎందుకంటే... దేశానికిది క్లిష్టమైన సమయం. ఇప్పుడు ఒక విజన్‌ కావాలి. మోదీ హయాంలో కుప్పకూలిపోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు, దేశాన్ని రక్షించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాం. బీజేపీ ఓటమి... ప్రజాస్వామ్య పరిరక్షణ... ఇవే మా లక్ష్యాలు. మిగిలినవన్నీ ఆ తర్వాతే చర్చిస్తాం’’ అని రాహుల్‌ స్పష్టం చేశారు. చంద్రబాబుతో తన భేటీ చాలా బాగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కబళిస్తున్న తీరును ఐక్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. ‘‘ఎలా చేస్తాం, ఏం చేస్తామనే వివరాలు మీకు త్వరలో తెలుస్తాయి. అందరం కలిసి కట్టుగా పని చేయడం మాత్రం ఖాయం’’ అని ప్రకటించారు.
 
అభ్యర్థి ముఖ్యం కాదు... 
‘మీ కూటమికి ప్రధాన అభ్యర్థి ఎవరు?’ అనే ప్రశ్నపై చంద్రబాబు, రాహుల్‌ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. ‘‘మాకు అభ్యర్థులు కాదు. దేశం ముఖ్యం. మీరు కూడా దేశం గురించి ఆలోచించండి’ అని సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వ్యవస్థలను, దేశాన్ని కాపాడటమే తమ ముందున్న సవాలు అని... మిగిలినవన్నీ ఆ తర్వాతేనని రాహుల్‌ పేర్కొన్నారు. రాఫెల్‌ డీల్‌లో అవినీతి జరిగిందనేది సుస్పష్టమని తెలిపారు. తగిన విధంగా దర్యాప్తు జరిపితే డబ్బు ఎవరికి, ఎలా పోయిందో తెలుస్తుందన్నారు. రాఫెల్‌లో 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, అంబానీకి కాంట్రాక్టు ఎలా వచ్చింద నే విషయంలో సరైన విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. దీనికి ఇతర పార్టీలు కూడా మద్దతునిస్తున్నాయని చెప్పారు. రాఫెల్‌ అంశంలో రాహుల్‌కు తామూ మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
 
 
ఇది ప్రజాస్వామ్య అనివార్యత
‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అదే మా లక్ష్యం. అందుకే రాహుల్‌తో సమావేశమయ్యాను’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘కొందరికి గతంపై కొన్ని సందేహాలున్నాయి. గతంలోకి వెళ్లదలచుకోలేదు. బీజేపీని వ్యతిరేకించే వారందరినీ ఉమ్మడి వేదికపైకి తీసుకొస్తాం. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం. ఇది ప్రజాస్వామ్య అనివార్యత. నాయకులకుగా మా బాధ్యత’’ అని చంద్రబాబు వివరించారు. మోదీ హయాంలో జరుగుతున్న దారుణాలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ‘‘ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ... ఒక్కటేమిటి అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టును కూడా వివాదాస్పదం చేశారు’’ అని తెలిపారు. ఆయా అంశాలపై జాతీయ స్థాయిలో ఐక్య స్వరం వినిపిస్తే అది బలమైన ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడని అందుకే ఆయనను కలిశానని చెప్పారు.
Link to comment
Share on other sites

ఆ ఒక్క నిర్ణయంతో..!
02-11-2018 02:53:19
 
636767421208316303.jpg
  • జాతీయ స్థాయిలో కేంద్ర బిందువైన బాబు
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క కీలక నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువు కాగలిగారు. బీజేపీయేతర పార్టీల మధ్య అనుసంధానాన్ని సాధించగలిగిన సమన్వయకర్తగా ఇతర పార్టీల విశ్వాసం సంపాదించగలిగారు. బీజేపీయేతర పార్టీలకు కొందరు సీనియర్‌ నేతలకు ప్రధాని పదవిపై కన్నుంది. పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ కూడా ఆ పదవిని బలంగా కోరుకుంటోంది. దీంతో ఇతర పార్టీల సీనియర్‌ నేతలను పోటీదారులుగా పరిగణించి అనుమానంగా చూసే వాతావరణం నెలకొంది. ఈ పార్టీలు ఒక తాటిపైకి వచ్చేందుకు, పరస్పరం కలిసి పనిచేయడానికి ఉన్న అడ్డంకుల్లో ఇదీ ఒకటిగా పరిణమించింది. ప్రతిపక్షాల ఐక్యతకు చొరవ తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక.. దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలని భావించారు. ప్రధాని పదవికి రేసులో లేనని మిగిలిన పార్టీల అధినేతలకు ఆయన ముందుగానే చెప్పేస్తున్నారని సమాచారం.
 
‘నేను రేసులో లేను. నాకు నా రాష్ట్రం ముఖ్యం. కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను దానిని విడిచి రాను. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా వాటి నుంచి దేశాన్ని కాపాడేందుకు బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామాన్ని కాపాడాలి అన్నది నా నినాదం. ఇది మనందరి ఉమ్మడి నినాదం కావాలి. ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి నేను ముందుకొచ్చాను. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి నా వంతు సహకారం అందించడం వర కే నా పాత్ర’ అని ఆయన వారికి చెబుతున్నారు. తనను ప్రధాని అభ్యర్థి అని గానీ లేదా జాతీయ కన్వీనర్‌ అని గానీ ఎక్కడా చెప్పవద్దని.. ప్రచారం కూడా చేయవద్దని వారికి గట్టిగా సూచించారు. రేసులో చంద్రబాబు లేరని తెలిశాక ఇతర పార్టీల నేతలు బాగా స్పందిస్తున్నారని అంటున్నారు. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో చంద్రబాబు దానికి కన్వీనర్‌గా వ్యవహరించారు. భిన్న ధ్రువాలైన అనేక పార్టీలతో మాట్లాడి సమన్వయం చేయగలిగిన నైపుణ్యం ఆయనకు ఆ సమయంలో అలవడింది.
 
 
పవార్‌, ఫరూక్‌లదీ ఒకే మాట! ఇరువురితో చంద్రబాబు చర్చలు
దే శంలో ప్రజాస్వామ్యం వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయని, ఈ పరిస్థితిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని... దీనికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని ఎన్సీపీ అధినేత పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా నిర్ణయించారు. గురువారం చంద్రబాబు ఢిల్లీ రాగానే జనపథ్‌లోని శరద్‌ పవార్‌ ఇంటికి వెళ్లి అక్కడే వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముగ్గురూ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పవార్‌, ఫరూక్‌ ఏమన్నారంటే...
 
బాబు సూచించారు
‘‘దేశంలో ముఖ్యమైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ లాంటి సంస్థల పరిస్థితి కూడా దిగజారుతోంది. మొత్తంగా దేశమే ప్రమాదంలో పడింది. వీటన్నిటిపై బీజేపీయేతర పార్టీలన్నీ కలసికట్టుగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం దేశంలో సమైక్య ఫ్రంట్‌ ఏర్పడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే సంస్థలను కూడా కాపాడగలుగుతాం. చంద్రబాబు అందరితో మాట్లాడుతున్నారు. నిర్దుష్ట కార్యాచరణ రూపొందించాలన్నదే మా అందరి ఆలోచన.’
- శరద్‌ పవార్‌
ఇంత సంక్షోభం ఎప్పుడూ చూడలేదు
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జాతీయ స్థాయిలో ఇలాంటి సంక్షోభం మేమెప్పుడూ చూడలేదు. సీబీఐ, ఆర్‌బీఐల్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రజలు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో ఐక్య వేదిక ఏర్పాటు చేసేందుకు మేం కన్వీనర్లుగా పనిచేస్తాం. 2019 ఎన్నికల్లో తమను శ్రీరాముడే గెలిపిస్తాడని బీజేపీ భావిస్తోంది. కానీ ఏ పార్టీనీ రాముడో, అల్లానో గెలిపించరు. ప్రజలు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలుస్తారు.’ - ఫరూక్‌
Link to comment
Share on other sites

కాంగ్రెస్‌ కార్యాలయంలా ఏపీ సీఎం కాటేజీ
02-11-2018 02:38:59
 
636767231403221378.jpg
న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు బస చేసిన ఏపీ భవన్‌లోని ముఖ్యమంత్రి కాటేజీ ప్రాంగణం గురువారం కాంగ్రెస్‌ కార్యాలయాన్ని తలపించింది. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న నేతలు.. ఏపీభవన్‌లో ఉన్న చంద్రబాబును కలవడానికి పోటీపడ్డారు. దాదాపు 50 మంది వరకు నేతలు చంద్రబాబును కలిసేందుకు గేటు దగ్గర వేచిచూశారు. ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్‌లు కూడా చంద్రబాబును కలుసుకున్నారు. కాగా, చంద్రబాబు తన కారులో బయటకు వెళ్తున్న సమయంలో గేటు దగ్గర ఉన్న నేతలు అటువైపుగా నమస్కరించడం కనిపించింది.
Link to comment
Share on other sites

దేశం కోసమే!
02-11-2018 02:43:46
 
  • అధికారం, సీట్లూ ముఖ్యం కాదు
  • ప్రశ్నించిన వారిపై దాడుల పరంపర
  •  విపక్షాలు ఏకం కావాల్సిన ఆవశ్యకత
  •  ముందుగా అందరినీ కలిసి మాట్లాడుతున్నా
  •  కనీస ఉమ్మడి కార్యాచరణ తదుపరి దశలో!
  •  కూటమికి నేను కన్వీనర్‌ను కాదు: చంద్రబాబు
 న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయాలు జఢత్వంతో ఉండవు. డైనమిక్‌గా ఉంటాయి. మనది గొప్ప దేశం. ఎన్నో వనరులున్నాయి. కావాల్సింది... తగిన నాయకత్వమే. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకునేందుకు... ప్రజల ఆకాంక్షలను పట్టించుకునే పార్టీలన్నీ చేతులు కలపాల్సిన రాజకీయ, ప్రజాస్వామ్య అనివార్యత ఏర్పడిందని గుర్తించాం. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ సహా అనేకమంది నేతలతో సమావేశమైన చంద్రబాబు... ఆ తర్వాత ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తన ప్రయత్నాలకు రాహుల్‌ మద్దతు పలికారన్నారు. ‘‘కాంగ్రె్‌సతో కొన్ని వైరుధ్యాలున్నప్పటికీ ప్రజాస్వామ్య అనివార్యత వల్ల కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించాం. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో ఎన్టీఆర్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో నేను కీలక పాత్ర పోషించాం’’ అని తెలిపారు. మరిన్ని వివరాలు చంద్రబాబు మాటల్లోనే...
 
సీట్లు, అధికారం కాదు....
విపక్షాలన్నీ ఏకం కావాలనే ఈ ప్రయత్నాల్లో స్థానిక, జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. మాకు సీట్లు, అధికారం ముఖ్యం కాదు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకం కావడం... ప్రజాస్వామ్య పరిరక్షణే ఇప్పుడు ముఖ్యం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యం! సంయుక్త ప్రచారం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఇవన్నీ తదుపరి దశలో నిర్ణయిస్తాం. ఇప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆయా పార్టీలతో నేను మాట్లాడుతున్నాను. దీనికి డెడ్‌లైన్‌ ఏదీ లేదు. వీలైనంత త్వరగా కూటమి ఏర్పడుతుంది. దీనికి నేను కన్వీనర్‌గా ఉండాలనుకోవడంలేదు! స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రయోగాలు జరిగాయి.
 
కాంగ్రెస్‌ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కూటములు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మరో ప్రయోగం... కాంగ్రెస్‌ బయటి నుంచి ఇచ్చిన మద్దతుతో థర్డ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం! అది రెండేళ్లలోనే విఫలమైంది. మోదీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇస్తే... ఆయన దేశాన్ని ధ్వంసం చేశారు. మోదీకంటే రాహుల్‌ మాత్రమే కాదు.. ఎవరైనా బాగా చేయగలరు. మీరు కూడా చేయగలరేమో! (ప్రశ్నించిన విలేకరితో నవ్వుతూ). మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. బోఫోర్స్‌ సమయంలో అన్ని పార్టీలూ ఏకమయ్యాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి రాఫెల్‌పై ప్రశ్నిస్తున్నాయి. ‘రహస్యం’ అంటూ చెప్పడంలేదు. బోఫోర్స్‌లో లేని రహస్యం రాఫెల్‌లో ఎందుకు?
 
రోజురోజుకూ దారుణంగా...
రోజురోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. సీబీఐతో పాటు రిజర్వు బ్యాంకు వంటి సంస్థలను కూడా నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం తమ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటోందని, అలా అయితే మార్కెట్‌, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయని రిజర్వు బ్యాంకు డిప్యుటీ గవర్నర్‌ హెచ్చరించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ సైతం సెలవుపై వెళతారని లేదా రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు అమలు సక్రమంగా చేయలేదు. 500, వెయ్యి నోట్లను రద్దు చేసి... మళీ కొత్తగా 500, 2000 నోట్లు ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? జీఎస్టీ అమలులోనూ ప్రభుత్వం విఫలమైంది. చరిత్రలో లేని విధంగా రూపాయి విలువ భారీగా తగ్గింది. పెట్రో ధరలు పెరిగాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. నిరుద్యోగం పెరిగింది. చివరికి లౌకికవాదం కూడా ప్రమాదంలో పడింది. దేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. అణగారిన వర్గాలు అభద్రతాభావంలోకి వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వెంటనే ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలతో దాడులు చేయిస్తారు. ఈ దేశం ఎటు పోతోంది? నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇందిరా గాంధీ నుంచి అనేక మంది ప్రధానులను చూశాను. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. కేంద్రంలో అనేక మందిని గుజరాత్‌ నుంచి తీసుకొచ్చారు. సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని ఐక్యత గురించి మాట్లాడారు. భావోద్వేగాలను రెచ్చగొడుతూ... ఐక్యత గురించి మాట్లాడటమా!
 
 
హైదరాబాద్‌ అభివృద్ధి కేసీఆర్‌ చేశారా?
‘‘నేను చేసిన తప్పేమిటి? నన్ను దూషించడం ఎందుకు? హైదరాబాద్‌ను మానస పుత్రికగా భావించి... విదేశాల్లో కాలినడకన నడిచి మరీ అభివృద్ధి చేశాను. హైదరాబాద్‌ వల్లే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఇది కేసీఆర్‌ చేశారా?’ అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తనను బూచిగా చూపిస్తూ టీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పిస్తోందన్నారు. ‘‘నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని కాను. నా జోక్యం ఎందుకు ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. విభజన తర్వాత గతం మరిచిపోయి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలిసి వెళదామని ప్రతిపాదించినా... టీఆర్‌ఎస్‌ తోసిపుచ్చిందని తెలిపారు. అప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని... ఇప్పుడు అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నామని ప్రకటించారు.
 
 
నేతలుగా మీరు ఒక్కటవుతున్నా... మీ కూటమిని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆమోదిస్తారా?
ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు సమయంలో మీరు చూశారు. ప్రజలు బ్యాంకుల ముందు లైన్లలో నిలబడ్డారు. ఇప్పుటికీ ఏటీఎంలు పని చేయడంలేదు. నగదు అందుబాటులో లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల ఆశయాలను నెరవేర్చడానికి అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.
 
కనీస ఉమ్మడి కార్యక్రమం ఎప్పుడు నిర్ణయిస్తారు?
అందరం కలిసి కూర్చోవాలి. ప్రస్తుతం వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాం. కాంగ్రె్‌సకు, బీజేపీకి మిత్రపక్షాలు ఉన్నాయి. కొన్ని స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా అందరితో నేను చర్చిస్తున్నాను. అందరం ఒక అవగాహనకు రావాలి. కార్యాచరణ ఎలా ఉంటుందో తర్వాత చెప్పగలం.
 
అందరినీ ఏకం చేస్తున్నారు కదా! కూటమికి కన్వీనర్‌గా ఉంటారా?
నేను కన్వీనర్‌ను కాదు. కన్వీనర్‌ కావాలని లేదు. కానీ తొలుత ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి కదా! ఆ పని మాత్రమే నేను చేస్తున్నాను.
 
శివసేన, జేడీయూ వంటి పార్టీల నేతలను కలుస్తారా?
చూద్దాం. వాళ్లు బీజేపీ పక్షాన ఉన్నారు. ఇప్పుడు ఏమీ చెప్పలేం.
 
రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నియమించాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌కు మద్దతిస్తారా?
కేంద్రం జేపీసీ ఏర్పాటు చేయకుండా తప్పించుకోగలదు. కానీ సుప్రీం కోర్టుకు ప్రభుత్వం అన్ని వివరాలు ఇవ్వాల్సిందే.
 
ప్రస్తుతం రామమందిరం అంశం నడుస్తున్నది. మీ అభిప్రాయం ఏంటి?
ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా తెరపైకి తెస్తారు.
 
ఏపీలోనూ కాంగ్రె్‌సతో పొత్తు ఉంటుందా?
నేను జాతీయ స్థాయిలో ఆలోచిస్తుంటే మీరు నియోజకవర్గ స్థాయికి వెళ్తున్నారు.
Link to comment
Share on other sites

కొడితే పడాలా.. తెలుగుదేశం ఉండొద్దా?
02-11-2018 02:48:28
 
636767403021023344.jpg
  • తెలుగుదేశం ఉండొద్దా?
  • ఆత్మగౌరవాన్ని బీజేపీ పెంచిందా?
  • ఆ పేరెత్తితేనే తెలుగువారిలో మంట
  • కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించారు
  • ఏపీలో ఆ పార్టీ నామమాత్రమే
  • హోదా ఇస్తామంటోంది: బాబు
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌తో కలిసి పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్‌ కంటే బీజేపీ చేసిన ద్రోహం ఎక్కువా? ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుంటుందా.. ఇలాంటి అంశాలపై సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశంలో స్పందించారు. వివరాలు.. ‘‘ప్రజాస్వామ్య, రాజకీయ అనివార్యత వల్లే కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి ప్రయత్నిస్తున్నాను. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందన్న బాధ, ఆవేదన చెందాం. ఐదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అడిగింది కూడా బీజేపీ వారే. బిల్లు ఆమోదానికి సహకరించిందీ వారే. పొత్తు పెట్టుకున్నాక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పైగా ఐటీ దాడులతో భయభ్రాంతులను చేస్తున్నారు. అన్యాయం చేయడంతోపాటు ఐటీ దాడులతో భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలాంటప్పుడు మేమేం చేయాలి? ఇతరుల మద్దతు తీసుకోవద్దా? కొడితే చచ్చిపోండి అని అంటున్నారా?
 
బీజేపీ ఏం చేసింది...
తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టింది. అది నిజమే. మరి... బీజేపీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిందా? న్యాయం చేసిందా? బీజేపీ పేరెత్తితేనే ఆంధ్రులు మండిపడుతున్నారు. మోసానికి, నమ్మక ద్రోహానికి పాల్పడిందని ధ్వజమెత్తుతున్నారు. కడప స్టీల్‌, జోన్‌, హోదా ఎందుకు ఇవ్వలేదు? హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? జాతీయ స్థాయిలో విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే కాంగ్రె్‌సతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తున్నాం. ఏపీ, తెలంగాణ అనేవి ఇక్కడ ముఖ్యం కాదు. నిజానికి... ఏపీలో కాంగ్రెస్‌ పార్టీయే లేదు. నామమాత్రంగా మిగిలింది. ప్రజలు కాంగ్రె్‌సను శిక్షించడం పూర్తయింది. కనీసం ఇప్పుడైనా రాష్ట్రానికి మేలు చేస్తామని కాంగ్రెస్‌ అంటోంది. బీజేపీ అలా కాదు. ఇప్పుడు కూడా దెబ్బమీద దెబ్బ కొట్టింది. నమ్మించి మోసంచేసింది. బీజేపీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ఇస్తామంటోంది. బీజేపీ హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్‌ నెరవేరుస్తామంటోంది. ఇది రాజకీయ, ప్రజాస్వామ్యమైన అనివార్యత! రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే దేశ ప్రయోజనాలు కాపాడగలం.
Link to comment
Share on other sites

రాహుల్‌ను బాబు ఎందుకు కలిశారంటే..!
02-11-2018 02:50:02
 
  •  వివరణ పత్రం రూపొందిస్తున్న టీడీపీ
  •  ప్రజలు, పార్టీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం
  •  అపోహలకు ఆస్కారం రాకూడదన్న వ్యూహం
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఈ రెండు పార్టీల అధ్యక్షులు భేటీ కావడం ఒక రాజకీయ సంచలనం. ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుందో.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు సమావేశం కావలసి వచ్చిందో వివరించే పత్రాన్ని టీడీపీ రూపొందిస్తోంది. దీనిని ప్రజలు, పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారంలో పెట్టాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలకు విఘాతం కలుగుతోందన్న ప్రతిపక్షాల విమర్శల వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడకుండా.. వారికి అవగాహన కల్పించేందుకు ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. రాహుల్‌ను బాబు కలిసి చర్చించడం కాంగ్రె్‌సతో కలవడం కాదని.. ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని ఆ పార్టీ ప్రధానంగా వివరిస్తోంది. ‘మోదీ విధానాలు దేశానికి, రాష్ట్రానికి అరిష్టంగా మారాయి.
 
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఒకట్రెండు పార్టీలు కలిస్తే చాలదు. కాంగ్రె్‌సకు దేశవ్యాప్తంగా అంత శక్తి లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక తాటిపైకి వస్తేనే బలమైన ప్రత్యామ్నాయం రూపొందుతుంది. అందుకే చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలిసి మాట్లాడుతున్నారు. జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తూ మోదీ పాలనకు వ్యతిరేకంగా అందరినీ ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ను కలవడం కూడా ఇందులో భాగమే. అంతేతప్ప నేరుగా కాంగ్రె్‌సతో టీడీపీ కలవడం లేదు’ అని ఈ పత్రంలో వివరించనున్నారు. రాష్ట్రం కోణం నుంచి కూడా ఈ అంశాన్ని ఇందులో విశ్లేషిస్తున్నారు. ‘మళ్లీ మోదీ కేంద్రంలో అధికారం అందుకుంటే ఆంధ్రకు అది వినాశనమే. ఇంకా కక్షగట్టి రాష్ట్రాన్ని నష్టపరిచే అవకాశం ఉంది.
 
టీడీపీపై కూడా మరింత తీవ్రంగా విరుచుకుపడడం ఖాయం. మోదీ రాకుండా ఆపాలంటే అన్ని పార్టీలను ఒక తాటిపైకి తేవాలి. కేంద్రంలో మరెవరు వచ్చినా రాష్ట్రానికి లాభమే. ప్రతిపక్షాలను కలపడానికి చొరవ తీసుకోకపోతే బీజేపీ లాభపడుతుంది’ అని అందులో పేర్కొననున్నారు. కాంగ్రె్‌సతో కలిసి పనిచేయడం టీడీపీ మూల సిద్ధాంతాలకు విఘాతమన్న ప్రతిపక్షాల విమర్శలకు కూడా ఇందులో సమాధానం ఇవ్వనున్నారు. ‘ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్‌ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తోంది. అప్పుడు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ ప్రజల ముందుకెళ్లారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి తెలుగు ప్రజలకు అటువంటి అవమానం, అణచివేత ఎదురవుతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఎదురు నిలిచి పోరాడాలని ఎన్టీఆర్‌ ఉద్బోధించారు. ఏ పార్టీతో సమస్య వస్తే ఆ పార్టీతో పోరాడాలి. ఇప్పుడు బీజేపీతో వచ్చింది కాబట్టి అదే ఆత్మ గౌరవ నినాదంతో టీడీపీ పోరాడుతోంది. ఎన్టీఆర్‌ నాటి మూల సిద్ధాంతమే ఇప్పటికీ పార్టీకి పట్టుగొమ్మ’ అని ఈ పత్రంలో వివరించనున్నారు.
 
ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే: టీడీ జనార్దనరావు
ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే మోదీపై టీడీపీ పోరాడుతోందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు అన్నారు. ‘తెలుగువారి ఆత్మ గౌరవం కోసం నియంతృత్వంపై పోరాటమే లక్ష్యంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఢిల్లీలో మోదీతో ఢీకొట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సమాయత్తమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ఇది శుభపరిణామం
02-11-2018 02:54:42
 
636767240840538769.jpg
  • ఉత్తర, దక్షిణ ధ్రువాలు కలిశాయి: నారాయణ
తిరుపతి, నవంబరు 1: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంతోపాటు బీజేపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తుండడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ కలిసేంతగా వ్యతిరేకతను కల్పించిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఢిల్లీ పరిణామాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని.. ప్రజాస్వామ్యానికి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశ్‌ బచావో.. మోదీ హటావో’ నినాదంతో పోరాటం సాగిస్తామని ప్రకటించారు. మోదీని ప్రమాదకరమైన ప్రధానిగా అభివర్ణించారు. మహాత్మాగాంధీ కంటే సర్దార్‌ పటేల్‌ గొప్పవాడా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని కాదని.. 182 అడుగుల ఎత్తున పటేల్‌ విగ్రహం పెట్టడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

బాబుకు మా మద్దతు
02-11-2018 03:06:37
 
 
టీడీపీ, సమాజ్‌వాది పార్టీ కలిస్తే దేశంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుంది.   - ములాయం సింగ్‌ యాదవ్‌
 
మా మధ్య ఇలాంటి చర్చలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ములాయం, చంద్రబాబు చెప్పినట్లుగా దేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమిగా కలిసి దేశాన్ని రక్షించడానికి కలిసి పనిచేస్తాం! - అఖిలేశ్‌ యాదవ్‌
 
రాజ్యాంగాన్ని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉంది. మోదీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు పోరాటం చేస్తాం. ఆయా అంశాలపై నేను, చంద్రబాబు చర్చించుకున్నాం!    - సీతారాం ఏచూరి
 
 
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది అత్యవసరం. బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఏకీభవిస్తున్నాం.                                              - సురవరం సుధాకర్‌రెడ్డి
Link to comment
Share on other sites

చంద్రబాబు చుట్టూ ఢిల్లీ రాజకీయం!
01-11-2018 14:52:01
 
636766817349846481.jpg
హైదరాబాద్: 2019 ఎన్నికలు కొత్త ఎత్తులకు, పొత్తులకు వేదికగా నిలుస్తున్నాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో కలిసి నడవబోతోంది. ఇప్పటి వరకు నీరూనిప్పులా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఏకం చేసిన ఘనత ప్రధాని మోదీకి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దక్కుతుంది. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన మోదీ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన వెంటనే ఏపీ కేబినేట్‌లో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ అవినీతి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 
 
 
ఇది ఇలావుంటే కేంద్ర రాజకీయాల్లో సీఎం చంద్రబాబు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్‌డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలని, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తామని చెప్పారు. ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తానని స్పష్టం చేశారు. తనకు ప్రధాని పదవిపై కోరికలేదని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని తానేనంటూ ప్రకటించారు. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు.
 
‘‘బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడింది. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... నేను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశాను. మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది’’ అని చంద్రబాబు చెప్పారు.
 
 
ఆయన ప్రకటించినట్లే చంద్రబాబు.. రాహుల్‌గాంధీతో భేటీ కాబోతున్నారు. వారం వ్యవధిలోనే ఆయన రెండు సార్లు ఢిల్లీ పర్యటిస్తున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో పర్యటించి పలు పార్టీల నేతలను కలిశారు. చంద్రబాబు కలిసిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాయావతిని కలిశారు.
 
 
ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని ఫరూక్‌ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.
 
 
అయితే ఫరూక్‌కు భిన్నంగా మాయావతి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఢిల్లీలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మరింది. చంద్రబాబు చుట్టూ ఢిల్లీ రాజకీయం తిరుగుతోందని, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పబోతున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...