Jump to content

Recommended Posts

  • Replies 173
  • Created
  • Last Reply
ఎన్టీఆర్‌ బాటలోనే కేంద్రంపై పోరాడుతున్నాం 

దిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగానే ఆయన తెదేపాను స్థాపించారు 
భాజపా రాష్ట్రంపై కక్ష కట్టినందుకే  ఉద్యమిస్తున్నాం 
భాజపాయేతర వేదికలో  కాంగ్రెస్‌ కూడా భాగస్వామి 
పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు 
రాహుల్‌తో భేటీపై శ్రేణుల నుంచి  అభిప్రాయ సేకరణ 
నిర్ణయం సరైందేనని 87 శాతం మంది అభిప్రాయం 
ఈనాడు - అమరావతి 
2ap-main1a_2.jpg

  • నిరంకుశత్వాన్ని ఎదిరించడం, పెత్తందారీతనాన్ని ప్రశ్నించడం, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం ఎన్టీఆర్‌ నేర్పిందే. దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా తెదేపా క్రియాశీల పాత్ర పోషించింది. వ్యవస్థలను ఎవరు పతనం చేయాలని చూసినా తెదేపా ఎదురొడ్డి నిలబడింది. ఇప్పుడూ అదే చేస్తున్నాం. దేశాన్ని కాపాడాలి. రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. దానికి మనమందరం నడుం కట్టాలి.
  • వారం వ్యవధిలోనే రెండు సార్లు నా దిల్లీ పర్యటనలు జరిగిన తీరు దేశం మొత్తం చూసింది. అక్టోబరు 27న జరిపిన పర్యటన అందరిలో నమ్మకం కలిగించింది. నవంబరు 1 పర్యటన అందరికీ భరోసానిచ్చింది. ఒకరిద్దరు తప్ప అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారు. మిగిలిన ఒకటి రెండు పార్టీలను ఒకే వేదికపైకి తెస్తాం. నిరంకుశత్వాన్ని నిలదీసే శక్తులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలే పార్టీలు ఏకం కావాలి. ఇదొక చరిత్రాత్మక ప్రజాస్వామ్య ఉద్యమం. ప్రజాస్వామ్యవాదులంతా భాగస్వాములు కావాలి.
- చంద్రబాబు

ఎన్టీఆర్‌ ఆశయసాధనలో భాగంగానే భాజపాతో మనం పోరాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. ‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెదేపాను నెలకొల్పారని, అలాంటి కాంగ్రెస్‌తో కలవడమేంటని కొందరు ప్రచారం చేస్తున్నారు. తెలుగువారికి జరుగుతున్న అవమానానికి, దిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెదేపాను  స్థాపించారు. ఇప్పుడు భాజపా కూడా కావాలని మనల్ని ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంపై కక్ష పెంచుకుంది. దేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీల బాధ్యులు సుమారు 14 వేల మందితో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తాను సమావేశమవడానికి కారణాలను వివరించారు. ఇది కాంగ్రెస్‌తో తెదేపా పొత్తు కాదని, జాతీయ స్థాయిలో భాజపాను వ్యతిరేకించే పార్టీలతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యామ్నాయ వేదికలో కాంగ్రెస్‌ కూడా భాగస్వామి అవుతోందని వివరించారు. రాహుల్‌తో తాను భేటీ కావడం సరైన నిర్ణయమేనా? కాదా? అన్న అంశంపై అభిప్రాయాలను సేకరించారు. నిర్ణయం సరైనదే అన్నవారు తమ ఫోన్‌లో 2, కాదన్నవారు 3 అంకెలు నొక్కాలని సూచించారు. 87 శాతం మంది సానుకూలంగా స్పందించగా, 13 శాతం మంది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. వారు ఆ నిర్ణయం ఎందుకు సరైంది కాదంటున్నారో ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ వర్గాలకు చంద్రబాబు సూచించారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుందని అన్నారు. ప్రజల్లోనూ కొందరికి ఇలాంటి అభిప్రాయం ఉండవచ్చని, వారందరికీ అర్థమయ్యేలా పార్టీపరంగా నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిని కూడా మోదీ తన పక్కన ఉంచుకోలేదని, సర్వం తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, అలాంటి అహంకార ధోరణే ఆయన పతనానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రం కోసమే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాం. ఐదు కోట్ల ప్రజల కోసమే భాజపాపై ధర్మపోరాటం ప్రారంభించాం. ఆ అక్కసుతోనే భాజపా మనపై దాడులకు దిగింది. ఇక్కడ మనతో పొత్తు ఉండగానే తెలంగాణలో పొత్తు లేదని ఏకపక్షంగా చెప్పింది’ అని చంద్రబాబు మండిపడ్డారు.

పార్టీని నిలబెట్టుకునేందుకే మహాకూటమిలో చేరాం 
తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తెదేపా లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తెలంగాణలో తెదేపాతో పొత్తుకు కేసీఆర్‌ నిరాకరించారని, అక్కడ పార్టీని నిలబెట్టుకునేందుకే మహాకూటమిలో చేరామని తెలిపారు. కేసీఆర్‌ జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్‌ అంటూ హడావుడి చేసి ఆ తర్వాత వదిలేశారని వివరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా తమతో కలసివచ్చే అవకాశం ఉందని తెలిపారు.

భాజపాను ఎదుర్కోకపోతే.. 
‘తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి. ప్రజలతో మమేకం కావాలి. పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలి. రాబోయే రోజుల్లో చరిత్ర మనల్ని ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోకూడదు. భాజపాను ఎదుర్కోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. దేశం, రాష్ట్రం కోసం పోరాడాలని చెప్పింది ఎన్టీఆరే. రాజకీయ అనివార్యతల వల్లే భాజపాపై పోరాడుతున్నాం. ప్రజాస్వామ్య అనివార్యతల వల్లే భాజపాయేతర  శక్తుల్ని ఏకం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. చివరకు పటేల్‌ విగ్రహంపై తెలుగులో పేరే లేకుండా చేశారు. వ్యవస్థల ధ్వంసంతో పాటు రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన భాజపాను నిలదీద్దాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

తిరగబడ్డ తెలుగు బిడ్డను!
03-11-2018 02:44:22
 
636768098635174428.jpg
  • రాష్ట్రానికి అన్యాయాన్ని సహించను
  • ప్రశ్నించినందుకే ఇబ్బంది పెట్టారు
  • ఇక నేను బయటికి రాలేననుకున్నారు
  • విజృంభించాలని ఎన్టీఆరే చెప్పారు
  • దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
  • మోదీ చేతిలో వ్యవస్థలన్నీ ధ్వంసం
  • గుణపాఠానికే కాంగ్రెస్‌తో కలిశాం
  • బాధ్యతలేని వైసీపీ.. కోడికత్తి డ్రామాలు
  • పత్తాలేకుండా పోయిన మరో
  • ప్రకాశం సభల్లో బాబు ఫైర్‌
ఒంగోలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. అనేక రకాలుగా దాడులు చేశారు. బెదిరించారు. ఒత్తిడి తెచ్చారు. ఇక... నేను దీని నుంచి బయటికి రాలేననుకున్నారు. కానీ... నేను తిరగబడ్డాను. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ బెదిరింపులు, వేధింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదని... అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలిపులిలా విజృంభించాలని ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారని అన్నారు. దేశం కోసం
ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రజల అండ తనకు శ్రీరామ రక్ష అని... అదే ఉంటే కొండనైనా ఢీకొంటానని తెలిపారు. రెండు రోజుల ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డేగరమూడి, మార్టూరులో నిర్వహించిన గ్రామ దర్శిని సభల్లో ప్రసంగించారు. ‘‘మోదీది దుర్మార్గపు పాలన. రాష్ట్రానికి బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలనే ఢిల్లీకి వెళ్లి అందరినీ ఒకేతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నాను. ఇది నా స్వార్థం కోసం కాదు. దేశం కోసమే’’ అని తేల్చిచెప్పారు.
 
ఈ పోరు ఎందుకంటే..
విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం, ద గా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. దాన్ని ప్రశ్నించిన టీడీ పీ, రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నా రు. టీడీపీ ఆవిర్భావం నుంచి 36 ఏళ్ల పాటు కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఇప్పుడు మోదీకి గుణపాఠం చెప్పేందుకే కాంగ్రె్‌సతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యామని చంద్రబాబు తెలిపారు. ‘‘సకల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ చివరకు ప్రజాస్వామ్య స్ఫూర్తినే పరిహారం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ రాజకీయ వేత్తగా, బాధ్యతగల వ్యక్తిగా చొరవ చూపి ఢిల్లీ వెళ్లాను. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ... ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రక్షణ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ పార్టీతోనే కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అది చారిత్రక అవసరం’’ అని వివరించారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే... దేశం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగువాడిగా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతానని ప్రకటించారు.
 
ప్రతిపక్షం కోడికత్తి డ్రామాలు
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయాన్ని చేస్తుం టే.. రాష్ట్రంలోని ప్రతిపక్షం కోడికత్తి డ్రామాలు ఆడుతోందని వైసీపీ పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘కోడికత్తి డ్రామా చూశారా! దాడి జరిగింది... విశాఖ విమానాశ్రయంలో. చేసింది... ఆ పార్టీ వీరాభిమాని. నెపం మాత్రం తెలుగుదేశంపై నెడుతున్నారు. ఇదెక్కడి డ్రామా?’’ అని విమర్శించారు. పవన్‌ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ... ‘‘మరో నాయకుడు రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని లెక్క తేల్చారు. అవిశ్వాసం పెట్టాలని డిమాండ్‌ చేశారు. తీరా ఆవిశ్వాసం పెట్టాక అడ్రసు లేకుండా పోయారు’’ అని విమర్శించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన భూ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 1954 ముందు ఉన్న రికార్డుల్లో చుక్కల భూములు, అసైన్డ్‌ భూములు, ఇనాం భూములకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పట్టాలు అందజేస్తామన్నారు.
 
కేంద్రంతో పోరాడుతూనే అభివృద్ధి
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 2 గంటలకు విజయవాడకు వచ్చాను. శుక్రవారం ఉదయాన్నే ప్రకాశం జిల్లాకు బయలుదేరాను. కేం ద్రంతో పోరాడుతూనే అభివృద్ధి పనులు చేస్తున్నాను. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేస్తున్నానని.. ఢిల్లీలో ఉంటానని అనుకోవద్దు.
 
ఇది ‘దేశం’ బాధ్యత
దేశానికి ప్రమాదం వాటిల్లినప్పుడల్లా టీడీపీ క్రియాశీల పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం. దేశాన్ని కాపాడాలి. రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి! - చంద్రబాబు
 
ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా: బాబు
విభజన హామీలను అమలు చేయకుండా, హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేసింది. దాన్ని ప్రశ్నించినందుకు టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనది. దేశానికి సమస్య వచ్చినప్పుడు దారి చూపే పార్టీ మనది. అందుకే వారిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం! ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడతాం.
 
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేరుగా లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడి లోటుపాట్లు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అవకతవకలకు పాల్పడుతున్నఅధికారుల లెక్కలన్నీ నా కంప్యూటర్‌లో ఉన్నాయి. పోస్టింగ్‌ల సమయంలో పరిగణలోకి తీసుకుంటాం.
- చంద్రబాబు
 
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

I'm so proud of you, CBN ... 

Link to comment
Share on other sites

దేవెగౌడ, కుమారస్వామి లకు చంద్రబాబు ఫోన్. ఎన్నికల విజయాలపై అభినందనలు తెలియజేసారు. ఎల్లుండి చంద్రబాబు బెంగళూరు ప్రయాణం. దేవే గౌడ తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్న టీడీపీ అధినేత. అదే రోజు చెన్నై వెళ్లి స్టాలిన్ తో సమావేశమయ్యే అవకాశం.

రేపు బెంగళూరు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
07-11-2018 18:33:35
 
636772124165192085.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(గురువారం) బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రేపు జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

2019లో 1996 పునరావృతం కానుంది

0708438BRK-KUMARSWAMY.JPG

బెంగళూరు: 1996లో ఏదైతే జరిగిందో అదే 2019 సార్వత్రిక ఎన్నికల్లోను పునరావృతం కానుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

‘జనతా దళ్‌ సెక్యులర్‌, తెలుగుదేశం పార్టీలు పాతకాలం నాటి మిత్రులే. 2019 ఎన్నికల్లో మేం తప్పకుండా విజయం సాధిస్తాం. 1996లో భాజపాకు ఎదురైన పరిస్థితే 2019లోను పునరావృతం అవనుంది’ అని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ‘దేశాన్ని నడిపించగలిగే సామర్థ్యం ఉన్న ప్రతిపక్ష నేతలు చాలా మంది ఉన్నారు. ముందు భాజపా నుంచి దేశాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం ఆ తర్వాతే ప్రతిపక్ష పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాం. అందుకే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. 2019లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సారథ్యంలో కలిసి పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

1996 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా భాజపా అవతరించింది. దీంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ భాజపా ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలం కావడంతో వాజ్‌పేయీ ప్రభుత్వం తమ ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో సరైన మెజారిటీని పొందలేకపోవడంతో 13రోజుల అనంతరం వాజ్‌పేయీ తన పదవికి రాజీనామా చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...