Jump to content

పెనిమీటీ lyrics


NTRYoungTiger

Recommended Posts

నిద్దర్ని ఇరిచేసి రెప్పల్ని తెరిచాను
నువొచ్చే దారుల్లో చూపుల్ని పరిచాను
ఒంటెద్దు బండెక్కి రారా 
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా 
నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా గలబోటీ
కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ
ఎన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
ఎన్నెన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
పల్లవి: చిమ్మటి సీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ
చరణం1:పొలిమేర దాటిపోయావని
పొలమారిపోయే నీదానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలిమనసుని
సూసీ సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకోని తరలి తరలి రార పెనిమిటీ
చరణం2:నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
ఏలకు తింటివో ఎట్టనువ్వుంటివో
ఏట కత్తి తలగడై ఏడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...