Jump to content

CBN USA TOUR

sonykongara

Recommended Posts

  • Replies 88
  • Created
  • Last Reply
1 hour ago, Yaswanth526 said:

AP24x7 full coverage isthunnayi tours motham

Above video is entire NJ Meet  only CBN speech ithe watch this

Excellent speech by CBN ...

And every one of you guys who attended and carried the TDP flag ... you guys are phenomenal ... 

Link to comment
Share on other sites

ఆధునిక క్యాన్సర్‌ చికిత్సలో రాష్ట్ర వైద్యులకు శిక్షణ
క్యాన్సర్‌ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు అంగీకారం
అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ
23ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్యులకు క్యాన్సర్‌ చికిత్సలో అధునాతన వైద్య విధానాలు, శస్త్రచికిత్స పద్ధతుల్లో నైపుణ్య శిక్షణనిచ్చేందుకు అమెరికాలోని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు అంగీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) నోరి దత్తాత్రేయుడితో భేటీ అయ్యారు. ఐదు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి న్యూయార్క్‌ చేరుకున్నారు. అక్కడి జాన్‌ ఎఫ్‌.కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అమెరికాలోని తెదేపా శ్రేణులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికాలో సుప్రసిద్ధ భారతీయ వైద్యుడిగా పేరుగాంచిన నోరి దత్తాత్రేయుడితో చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికాలో దత్తాత్రేయుడు స్థాపించిన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వైద్యులకు అవసరమైన తర్ఫీదు ఇవ్వాలని కోరారు. సొంత రాష్ట్రంలో వైద్యసేవలకు అవసరమైన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాధనాలను అందించడంలో సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్‌ చికిత్స విధానాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణల విస్తృతికి తోడ్పడాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన దత్తాత్రేయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అంగీకరించారు. తన దగ్గర శిక్షణ పొందిన వైద్యుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సా విధానాలను తీసుకెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఆలోచనలు స్ఫూర్తిమంతం
ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్‌ ప్రశంసలు
ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషిని..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానాన్ని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ కొనియాడారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఆయన మధ్యాహ్న విందు (భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి) సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి లేని ప్రకృతి సాగు విస్తృతికి తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు ఆయనకు వివరించారు. దాదాపు 80 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేసేలా 60 లక్షల మంది అన్నదాతలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. నూతన వ్యవసాయ విధానాలు, రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకువచ్చే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. ‘‘ముఖ్యమంత్రి ఆలోచన, చురుకైన నాయకత్వం ఏపీని ఆదర్శ, స్ఫూర్తివంతమైన రాష్ట్రంగా నిలుపుతాయని’’ ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ప్రశంసించారు.

Link to comment
Share on other sites

మూడోరోజు అమెరికా పర్యటనలో చంద్రబాబు
25-09-2018 20:13:47
 
636735032289813702.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు 'సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు'లో పాల్గొననున్నారు. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి-ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో 'శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన' అనే అంశంపై సంయుక్త పత్రం విడుదల చేశారు. రాత్రి 9.45కి గూగుల్ ఎక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు టామ్ మూరే ఏర్పాటుచేసిన విందులో చంద్రబాబు, ఎఫ్ సాక్ ప్రాజెక్టు హెడ్ కృష్ణస్వామి పాల్గొంటారు. రాత్రి 11.30కి ఆర్టిఫీషియల్ టెక్నాలజీ ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అత్యాధునిక ఐవోటీ సాధనాల ఆవశ్యకతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాత్రి 2.20కి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు.
Link to comment
Share on other sites

ఈఏపీతో ఆంధ్ర జట్టు!
25-09-2018 03:29:13
 
636734429545280934.jpg
  •  200 కోట్లతో ఉమ్మడి ఈక్విటీ నిధి
  •  2 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
  •  20 వేల ఉద్యోగాలకు అవకాశం
  •  ఆర్ధర్‌ ఈక్విటీ సంస్థతో బాబు చర్చలు
  •  100 రిసార్టుల ఏర్పాటుకు వి-రిసార్ట్‌ ఓకే
  •  రాష్ట్రంలో మెరైన్‌ రీసెర్చ్‌కు డోయెర్‌ సంసిద్దత
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఈఏపీ, వి-రిస్టార్ట్స్‌, డోయెర్‌ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. ఫలితంగా రాష్ట్రానికి తయారీరంగ కంపెనీలు-పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉమ్మడి ఈక్విటీ నిధి ఏర్పాటుకు ఆర్ధర్‌ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ (ఈఏపీ) ముందుకొచ్చింది. రాబోయే 18 నెలల్లో ఏపీ ప్రభుత్వం-ఈఏపీ కలిసి రూ.150 కోట్ల పెట్టుబడులు పెడతాయి. మిగిలిన రూ.50 కోట్లతో ఉమ్మడి నిధిని ఏర్పాటుచేస్తారు. ఈ పైలట్‌ నిధి ఆధారంగా రాబోయే రోజుల్లో రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు సమకూరేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఉమ్మడి భాగస్వామ్య ప్రయత్నం వల్ల రాష్ట్ర ఆర్థిక రంగం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
 
10 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈక్విటీ నిధి భాగస్వాములు ప్రముఖ తయారీరంగ కంపెనీలను ఏపీకి వచ్చేలా చొరవ తీసుకుంటారు. దీనికోసం తమ కంపెనీల కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటుచేస్తారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. సోమవారం ఈఏపీ ఉన్నతాధికారి రమణ జంపాలతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తయారీరంగ సంస్థలు సుమారు 20 వరకు ఈ ప్రతిపాదన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం అవుతుందని సీఎం అన్నారు. దీనివల్ల పన్ను రూపంలో ఏటా రూ.100-250 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుందని అంచనా. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థలు ఇక్కడే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీని విధి విధానాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. భవిష్యత్‌లో ఈ భాగస్వామ్యం మరింత ప్రయోజనకరంగా ఉండేలా చూడాలని ఈఏపీని కోరారు.
 
రిసార్ట్‌ల ఏర్పాటుకు వి-రిసార్ట్స్‌ సంసిద్దత
ఏపీలో ప్రకృతి సోయగాలతో కూడిన ప్రాంతాలు-బీచ్‌లలో రిసార్ట్స్‌లు ఏర్పాటుచేసేందుకు వి-రిసార్ట్స్‌ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థ సీఈవో అదితి బల్బీర్‌, మాసివ్‌ ఎర్త్‌ఫండ్‌ సీఈవో శైలేశ్‌ సింగ్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబింబించేలా ఈ రిసార్టులను వినూత్నంగా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో అందుకు తగ్గ రిసార్టులను కూడా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యకర వాతావరణం కోసం ఈ రిసార్టుల్లో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటివి 100 రిసార్టుల వరకు ఏర్పాటుచేసేందుకు వి-రిసార్ట్స్‌ సుముఖత వ్యక్తం చేసింది. దీనివల్ల స్థానికులకు అధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సంస్థ భారత్‌లోని 17 రాష్ట్రాల్లో ఇప్పటికే రిసార్టులు ఏర్పాటుచేసింది.
 
డోయెర్‌ సీఈవోతో బాబు భేటీ
రాష్ట్రంలో సముద్ర సంబంధిత పరిశోధన-అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటుచేసేందుకు ఈ రంగంలో అంతర్జాతయ ప్రసిద్ధి పొందిన ‘డోయెర్‌’ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో లిజ్‌ టేలర్‌తో సమావేశమైన చంద్రబాబు.. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్రతీరం గురించి వివరించారు. సముద్ర సంబంధిత సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు నైపుణ్య శిక్షణకు రూ.200 కోట్ల మేరకు అందించేందుకు డోయెర్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ముఖ్య స్థావరంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తామని టేలర్‌ హామీ ఇచ్చారు. తూర్పుతీరంలో వ్యూహాత్మక వాణిజ్య స్థావరంగా ఉన్న ఏపీ నుంచి అనేక దేశీయ సంస్థలకు సముద్ర సంబంధ సేవలు అందించేందుకు ఆసక్తి కనబరిచారు. సముద్ర పరిశోధనా రంగంలో డోయెర్‌ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతికతను ఏపీకి అందించడం ద్వారా ఉభయులూ కలిసి అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం వెంటనే ఒక బృందాన్ని పంపించాలని కోరారు. 1992లో ప్రఖ్యాత ఓషనోగ్రాఫర్‌, సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్‌ సిల్వియా ఈరీ నెలకొల్పిన డోయెర్‌ సంస్థను ప్రస్తుతం ఆయన కుమార్తె లిజ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థతో భాగస్వామ్యం ఏపీలో చిన్నతరహా ఓడరేవుల ఆధునికీకరణ, అభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్
25-09-2018 21:24:34
 
636735074761318857.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. రూ.727 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ట్రైటన్ సోలార్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈడీబీతో ట్రైటన్ సోలార్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐక్యరాజ్యసమితిలో జరగే ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సులో’ పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కూడా సీఎం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు అమెరికా పర్యటనలో కీలక ఒప్పందం 08022725BRK141BABU.JPG
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రూ.727 కోట్లతో ఏపీలో సోలార్‌ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ట్రైటన్‌ సోలార్‌.. ఈడీబీతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీల ప్రాజెక్టువైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్‌ పరికరాల తయారీలో పేరున్న ట్రైటన్‌ సోలార్‌ ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌ బ్యాటరీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
 
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, అధికారుల బృందంతో ట్రైటన్‌ సోలార్‌ సంస్థ చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ ఛైర్మన్‌ హిమాంశు పటేల్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ నంద శాండిల్య- పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ల మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు 100 నుంచి 200 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆసంస్థ ప్రతిపాదించింది. సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానో టెక్నాలజీ, లిథియం పాలిమర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. దీని వల్ల వాయుకాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గధామమని, నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

భారీ సోలార్‌ బ్యాటరీ ప్లాంటు
26-09-2018 03:35:25
 
636735297271683912.jpg
  • 727 కోట్లతో నవ్యాంధ్రలో తయారీ ప్రాజెక్టు
  • అమెరికాలో ట్రైటన్‌ సంస్థతో సీఎం చర్చలు.. ఈడీబీతో ఒప్పందం
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఎలక్ర్టిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సోలార్‌ బ్యాటరీల తయారీపై దృష్టిసారించింది. సౌర విద్యుత్‌ పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన ‘ట్రైటన్‌ సోలార్‌’ను రాష్ట్రంలో తయారీ ప్రాజెక్టు పెట్టేందుకు ఒప్పించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారుల బృందం ట్రైటన్‌ అధినేతలతో చర్చలు జరిపింది.
 
ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ ఛైర్మన్‌ హిమాంశు పటేల్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ నంద శాండిల్య; పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు రూ.727.84 కోట్ల పెట్టుబడి దశలవారీగా పెడతామని ట్రైటన్‌ పేర్కొంది. ప్లాంటు ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ సౌర బ్యాటరీ తయారీకి నానో టెక్నాలజీ ‘లిథియం పాలిమర్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
 
నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కండి..
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పెట్టుబడులకు తమ రాష్ట్రం స్వర్గధామమని, నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు.
 
3న రాష్ట్ర కేబినెట్‌ భేటీ
రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వచ్చే నెల మూడో తేదీన జరుగనుంది. మధ్యాహ్నం మూడుగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...