Jump to content

CBN USA TOUR


sonykongara

Recommended Posts

  • Replies 88
  • Created
  • Last Reply
అమెరికాలో చంద్రబాబు 4వ రోజు పర్యటన
26-09-2018 18:42:23
 
636735841447805436.jpg
న్యూయార్క్: అమెరికాలో సీఎం చంద్రబాబు బీజీబిజీగా గడుపుతున్నారు. అమెరికాలో సీఎం 4వ రోజు పర్యటిస్తున్నారు. 7 గంటలకు ఎయిర్‌టెల్ అధినేత భారతి మిట్టల్‌తో భేటీ కానున్నారు. రాత్రి 8.45కు ఎస్‌ఐపీఏలో 'సాంకేతిక యుగంలో పాలన' అంశంపై సదస్సులో ఆయన పాల్గొంటారు. రాత్రి 12 గంటలకు జీఈ పవర్‌ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. 12.30కి యూఎస్‌ఐబీసీ, సీఐఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో. 2 గంటలకు ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాు పాల్గొననున్నారు.
 
Tags : Chandrababu, America
Link to comment
Share on other sites

భారీ సోలార్‌ బ్యాటరీ ప్లాంటు
26-09-2018 03:35:25
 
636735297271683912.jpg
  • 727 కోట్లతో నవ్యాంధ్రలో తయారీ ప్రాజెక్టు
  • అమెరికాలో ట్రైటన్‌ సంస్థతో సీఎం చర్చలు.. ఈడీబీతో ఒప్పందం
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఎలక్ర్టిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సోలార్‌ బ్యాటరీల తయారీపై దృష్టిసారించింది. సౌర విద్యుత్‌ పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన ‘ట్రైటన్‌ సోలార్‌’ను రాష్ట్రంలో తయారీ ప్రాజెక్టు పెట్టేందుకు ఒప్పించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారుల బృందం ట్రైటన్‌ అధినేతలతో చర్చలు జరిపింది.
 
ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ ఛైర్మన్‌ హిమాంశు పటేల్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ నంద శాండిల్య; పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు రూ.727.84 కోట్ల పెట్టుబడి దశలవారీగా పెడతామని ట్రైటన్‌ పేర్కొంది. ప్లాంటు ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ సౌర బ్యాటరీ తయారీకి నానో టెక్నాలజీ ‘లిథియం పాలిమర్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
 
నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కండి..
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పెట్టుబడులకు తమ రాష్ట్రం స్వర్గధామమని, నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు.
 
3న రాష్ట్ర కేబినెట్‌ భేటీ
రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వచ్చే నెల మూడో తేదీన జరుగనుంది. మధ్యాహ్నం మూడుగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.
Link to comment
Share on other sites

ఆతిథ్యం.. ఆహారశుద్ధి
27-09-2018 03:04:39
 
636736142813040008.jpg
  • రెండు రంగాల్లో మిట్టల్‌ పెట్టుబడులు
  • విశాఖకు మరో ఫిన్‌టెక్‌ కంపెనీ
  • 20 కోట్లతో డ్రోన్‌ టెక్నాలజీ అభివృద్ధి
  • ముందుకొచ్చిన పెట్టుబడిదారులు
  • అమెరికాలో చంద్రబాబుతో చర్చలు
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టెలికాం రంగ దిగ్గజ కంపెనీ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త రంగాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో ఆతిథ్య, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. లండన్‌కు చెందిన ఎన్నిస్‌ మోర్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఇప్పటికే బ్రిటన్‌, ఐరోపా, అమెరికాల్లో ఆతిథ్య రంగం వెంచర్లలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లో పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. తొలుత భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌తో సీఎం చర్చించారు. ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భారతి ఆధ్వర్యంలోని భాగస్వామ్య సంస్థ ఫీల్డ్‌ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంసిద్ధత తెలిపింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నందుకు మిట్టల్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
 
ఫిన్‌టెక్‌ వ్యాలీలో వాట్సన్‌ పెట్టుబడులు
విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో డేటా అనలిటిక్స్‌, ఆపరేషనల్‌ రీసెర్చ్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముందుకొచ్చింది. వాట్సన్‌ ఫైనాన్షిల్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్యామ్‌ కల్యాణం ఏపీలో వ్యాపార అవకాశాలపై సీఎంతో చర్చించారు. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్‌, ఫ్రాడ్‌ రెగ్యులేటరీ కంప్లెయిన్స్‌ ఆధారిత ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడతామని శామ్‌ తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వేల్యూ థాట్‌ ఐటీ సొల్యూషన్స్‌, డలా్‌సలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సతో ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ అంగీకార ఒప్పందం కుదుర్చుకుంది. రూ.20కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు-డ్రోన్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు సదరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీఎం సమక్షంలో ఆ సంస్థ డైరెక్టర్‌ మహేశ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అసోసియేట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఎమిలీ లిసీ, ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ అహ్మద్‌బాబు సంతకాలు చేశారు.
 
ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతిక అభివృద్ధి, శిక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెడతారు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆన్‌లైన్‌ శిక్షణ నిర్వహించే సమన్వయ బాధ్యత నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో పరస్పర సహకారం దిశగా కె.ఎల్‌.యూనివర్సిటీతో కలిసి పనిచేస్తుంది. శిక్షణ, సాంకేతికతకు అవసరమైన సహకారాన్ని వేల్యూ థాట్‌ ఐటీ సొల్యూషన్స్‌ అందిస్తుంది. ఈ ప్రాజెక్టుతో 300మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం బృందంలో మంత్రులు యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, సమాచార కమిషనర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు ఉన్నారు
Link to comment
Share on other sites

కృత్రిమ మేధకు స్వాగతం..!
27-09-2018 03:20:18
 
636736152196755574.jpg
  • తక్కువ ధరకే భూమి, వసతులు
  • ప్రతి నూతన ఆవిష్కరణ రాష్ట్రానికి రావాలి
  • ఇప్పటికే ఏఐ క్లౌడ్‌ హబ్‌ విధానం తెచ్చాం
  • స్టార్టప్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ పాలసీ కూడా..
  • ఐవోటీ, యానిమేషన్‌, గేమింగ్‌ విధానాలూ..
  • ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టండి
  • న్యూయార్క్‌ సదస్సులో చంద్రబాబు పిలుపు
  • ఆతిథ్యం, ఆహారశుద్ధిలో మిట్టల్‌ పెట్టుబడులు
  • విశాఖకు మరో ఫిన్‌టెక్‌ కంపెనీ
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌-ఏఐ) ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ పరికరాలు, పరిశోధనకు అవసరమైన భూమిని, మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే సమకూరుస్తామని ప్రతిపాదించారు. రాష్ట్రాన్ని క్షేత్రస్థాయి ప్రయోగాలకు వేదికగా మలచుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం న్యూయార్క్‌లో ‘కృత్రిమ మేధస్సు-నమూనా పరిణామ క్రమం’ అన్న అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో
పాల్గొన్నారు.
 
సిలికాన్‌ వ్యాలీలో పలు టెక్నాలజీ సంస్థలకు మార్గదర్శిగా ఉన్న రమణ జంపాల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న పరిశ్రమ ప్రముఖులతో ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ క్లౌడ్‌ హబ్‌ విధానం-2018 పేరుతో ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. ‘స్టార్టప్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ పాలసీ, ఐవోటీ పాలసీ, డీటీపీ పాలసీ, యానిమేషన్‌, గేమింగ్‌ పాలసీ తదితరాలను నూతనంగా తీసుకొచ్చి.. ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. కృత్రిమ మేధస్సు పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఫిన్‌టెక్‌, మెడ్‌ టెక్‌, డ్రోన్‌ టెస్టింగ్‌, అటానమస్‌ వెహికిల్‌ టెస్టింగ్‌, బ్లాక్‌చెయిన్‌ తదితర విభాగాల్లో ఇప్పటికే ముందడుగు వేశాం. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, ఇ-ప్రగతి, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల్లో ఒక దశను దాటి ముందుకొచ్చాం.
 
ప్రపంచంలో ఎక్కడ నూతన ఆవిష్కరణ జరిగినా దానిని రాష్ట్రానికి తీసుకురావాలన్నది నా అభిలాష. సుస్థిరాభివృద్ధిలో కృత్రిమ మేధస్సుది కీలక పాత్ర. ముఖ్యంగా ఏపీలాంటి కొత్త రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని వేగంగా సాధించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రజల సంతోషం, సంతృప్తి స్థాయిలను పెంచేందుకు వీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నాం. కృత్రిమ మేధస్సు వల్ల జీవన సౌలభ్యం పెరుగుతుంది. క్లౌడ్‌ మేనే జ్‌మెంట్‌, డేటా స్టోరేజ్‌, అనలైజింగ్‌ ద్వారా ప్రభుత్వ పాలనలో నాణ్యతా ప్రమాణాలు పెంచగలిగాం. ఆధార్‌ తరహాలో భూదార్‌ ప్రవేశపెట్టి భూమి రికార్డులు తారుమారు కాకుండా సురక్షిత వ్యవస్థను ప్రవేశపెట్టాం’ అని వివరించారు.
 
ప్రాథమిక విద్య నుంచే కృత్రిమ మేధస్సు
ప్రాథమిక విద్య నుంచే కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. దీనికోసం మూస విధానాలు కాకుండా ఆ రంగంలో నిష్ణాతులతో విద్యాబోధన జరగేలా మార్పులు తీసుకురావాలని పలువురు సూచించారు. ప్రాథమిక విద్యకు సాంకేతిక విద్య జోడింపుతో ఆంధ్రను అత్యుత్తమ విద్యాధామంగా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుందన్న ధీమాను చంద్రబాబు వ్యక్తం చేశారు. దీనికి తోడ్పాటు అందించేందుకు ముందుకురావాలని ఏఐ రంగ నిపుణులను కోరారు.
 
అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి నుంచే చదువుల్లో ప్రమాణాలను పెంచే కృషి ప్రారంభించామన్నారు. వర్చువల్‌, డిజిటల్‌ తరగతుల బోధన తాము సాధించిన విప్లవాత్మక ప్రగతిగా అభివర్ణించారు. రాష్ట్రంలోని విద్యాలయాలను ప్రపంచ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కృత్రిమ మేధస్సు రంగంలో రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు సదస్సులో పలువురి నుంచి ప్రశంసలు లభించాయి. డేటా క్యాంప్‌ చీఫ్‌ డేటా సైంటిస్ట్‌ డేవిడ్‌ రాబిన్‌సన్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌డైరక్టర్‌ యూరీ అగియార్‌, ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ లీడర్‌ టిమ్‌ సులివాన్‌, గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్‌ రాజ్‌ పాటిల్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగ ప్రముఖుడు శ్రీధర చిట్యాల, 212మీడియా సహ వ్యవస్థాపకులు షెనాయ్‌, శ్రీరామ్‌ రాజప్ప, నిగమ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాష్ట్రానికి రండి
కృత్రిమ మేధపై ప్రయోగాలు చేయండి
తక్కువ ధరకే భూములిస్తాం: సీఎం చంద్రబాబు పిలుపు
అమెరికాలో పలువురు నిపుణులతో చర్చ
ఆతిథ్య, ఆహారశుద్ధి రంగాల్లో  ‘భారతీ ఎంటర్‌ప్రైజెస్‌’ ఆసక్తి
డ్రోన్ల తయారీ, పరిశోధనలో అమెరికా సంస్థ పెట్టుబడి
ఈనాడు - అమరావతి
26ap-main5a.jpg

కృత్రిమ మేధపై (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) క్షేత్ర స్థాయి ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా చేసుకోవాలని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ రంగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని, తక్కువ ధరకే భూములను కేటాయిస్తామని, ఫిన్‌టెక్‌, బ్లాక్‌ చెయిన్‌, మెడ్‌టెక్‌, డ్రోన్‌ టెస్టింగ్‌, అటానమస్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ తదితర విభాగాల్లో ఇప్పటికే ముందడుగు వేశామని వివరించారు. ‘కృత్రిమ మేధ క్లౌడ్‌ హబ్‌ పాలసీ-2018’ పేరుతో ఇప్పటికే ప్రత్యేక విధానం ప్రవేశ పెట్టామని తెలిపారు. అంకుర ఆవిష్కరణల విధానం, ఐవోటీ, డీటీపీ, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ విధానాలద్వారా పెట్టుబడులు రాబడుతున్నామని, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలతో సాంకేతిక దిగ్గజాలను ఆకట్టుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా దానిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. ‘కృత్రిమ మేధ - మౌలిక మార్పు’ అన్న అంశంపై న్యూయార్క్‌లో ఆ రంగానికి చెందిన నిపుణులతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి చర్యలను వివరించారు.

ప్రాథమిక విద్య నుంచే కృత్రిమ మేధ
కృత్రిమ మేధకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రాథమిక విద్య నుంచే పరిచయం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. మూస విధానాలకు స్వస్తి చెప్పి ఆ రంగానికి చెందిన నిపుణులతో విద్యాబోధన జరిగేలా మార్పులు తీసుకురావాలని ప్రతినిధులు సూచించారు. ప్రాథమిక విద్యకు సాంకేతికతను జోడించి ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నానికి తోడ్పాటునందించాలని ముఖ్యమంత్రి కోరారు. సిలికాన్‌ వ్యాలీలో పలు టెక్నాలజీ సంస్థలకు మార్గదర్శిగా ఉన్న రమణ జంపాల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కృత్రిమ మేధ టెక్నాలజీ వినియోగానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను పలువురు అభినందించారు. డేటా క్యాంప్‌ చీఫ్‌ డేటా సైంటిస్ట్‌ డేవిడ్‌ రాబిన్‌సన్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డైరెక్టర్‌ యూరీ అగియార్‌, ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ లీడర్‌ టిమ్‌ సులివాన్‌, రాజ్‌ పాటిల్‌, శ్రీధర్‌ చిట్యాట, నియాల్‌ షెనాయ్‌, రెనా నిగమ్‌, శ్రీరామ్‌ రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

26ap-main5b.jpg

ఏపీలో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌) ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవ పథంలో ఆంధ్రప్రదేశ్‌ రానున్న కాలంలో వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదక సాధన’ అన్న అంశంపై రూపొందించిన సంయుక్త పత్రాన్ని మూడోరోజు అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని, ప్రస్తుతం సరైన భాగస్వామ్యాలతో విజయాలను అందుకునే దశలో తామున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని చట్టబద్ధంగా బదలాయించడంలోనూ, సంబంధిత లావాదేవీల్లోనూ ముఖ్య పాత్ర పోషించే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ, మనుషులకు పని ఒత్తిడి తగ్గించి మరింత వేగంగా, సృజనాత్మకతతో పని చేయడానికి వీలు కల్పించే కొబాటిక్స్‌ టెక్నాలజీతో రానున్న కాలంలో కొత్త తరహా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవ టెక్నాలజీలను ఉపయోగించుకుని యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం, స్థానిక శిక్షణ సంస్థల మధ్య బహుముఖ భాగస్వామ్యానికి మేం కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో ఏర్పడే కొత్త తరహా ఉద్యోగాల్లో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలుగల మానవ వనరుల్ని అందించేందుకు పరిశ్రమలతో కలసి పని చేస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎన్టీఆర్‌కు ఏసీ లేకపోయినా కంప్యూటరు ఉండేది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి తెదేపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ టెక్నాలజీ వినియోగంలో ముందున్నామని చంద్రబాబు వివరించారు. ‘1984లో టెక్నాలజీ పెద్దగా అభివృద్ధి చెందలేదు. కంప్యూటర్లు చాలా పెద్దగా ఉండేవి. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు అప్పట్లో ఏసీ సౌకర్యం లేకపోయినా కంప్యూటర్లను పెట్టాల్సి వచ్చేది. అప్పట్లోనే 10 లక్షల రికార్డుల్ని కంప్యూటరీకరించాం’ అని వివరించారు.

Link to comment
Share on other sites

పారిశ్రామికవేత్తలతో భేటీ
26ap-main11a.jpg

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు పలు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. టెలికాం రంగంలో అగ్రగామి సంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఆతిథ్య, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ బుధవారం న్యూయార్క్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న భాగస్వామ్య సంస్థ ఫీల్డ్‌ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, మొక్కజొన్న పంటల ఉత్పత్తి గణనీయంగా ఉన్నందున ఈ రంగంలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని సునీల్‌ మిట్టల్‌తో చంద్రబాబు పేర్కొన్నారు. మరిన్ని రంగాలకు పెట్టుబడులు విస్తరించాలని ఆకాంక్షించారు.  ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్‌ తయారీ, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై వేల్యూ థాట్‌ ఐటీ సొల్యూషన్స్‌ సంస్థ గ్రూప్‌ డైరెక్టరు మహేష్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అసోసియేట్‌ రీసెర్చ్‌ డైరెక్టరు ఎమిలీ లిసీ, ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ బాబు.ఎ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతిక అభివృద్ధి, శిక్షణపై ప్రధానంగా దృష్టి పెడతారు. యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆన్‌లైన్‌ శిక్షణ సమన్వయ బాధ్యత నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో పరస్పర సహకారం దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని కేఎల్‌ యూనివర్సిటీతో కలసి పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో డేటా అనలిటిక్స్‌, ఆపరేషనల్‌ రీసెర్చ్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముందుకొచ్చింది. ఆ సంస్థ గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ శామ్‌ కల్యాణం ముఖ్యమంత్రిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌, ఫ్రాడ్‌ రెగ్యులేటరీ కంప్లెయిన్స్‌ ఆధారిత ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడతామని తెలిపారు.

Link to comment
Share on other sites

పవన్‌.. పెదవి జారొద్దు: టీడీపీ ఎమ్మెల్యే
29-09-2018 12:19:25
 
636738204074119630.jpg
ఏలూరు: ‘ప్రజా జీవితంలో ఉన్నాం. వారి కోసమే శ్రమిస్తున్నాం. మాకు ఏది మంచో, ఏది చెడ్డో తెలుసు. పవన్‌కల్యాణ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన ఆరోపణలలో ఏది రుజువు చేసినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం’ అంటూ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సవాల్‌ విసిరారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ ఆరోపించినట్లు నేను ఎక్కడా కబ్జాలు చేయలేదు. పేకాట క్లబ్‌లు లేవు. హత్యలు జరుగుతున్నా, వాటి నిరోధానికే ప్రయత్నిస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇది కూడా తప్పేనా’ అని ఎమ్మెల్యే బుజ్జి నిలదీశారు.
 
రెండు రోజుల్లో ఆధారాలతో నిరూపిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఎవరో ఒకరికి భయపడి ఉండాల్సిన పనిలేదన్నారు. ప్రజల కోసం పనిచేసే వాడిని. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏలూరులో ఏ నేరం చేయలేదు. మొదటి నుంచి ఆయన నాకు ఆప్తమిత్రుడు. మీ తప్పుడు ఆరోపణలకు నేనేమి భయపడేది లేదని స్పష్టం చేశారు. అంతర్గత చర్చలను గుట్టుగా ఉంచాలే తప్ప.. ఏదో సమయం వచ్చింది కదా అని పవన్‌ ఇప్పుడు సీఎం చంద్రబాబు తనతో భేటీ అయిన విషయాలను చెబుతున్నారన్నారు. పీఆర్పీలో తాను ఉన్నప్పుడు కొంతమంది నాయకులతో అంతర్గత సంభాషణలు జరిపానని, వాటిని బయట పెట్టాలా అంటూ నిలదీశారు.
 
రాజకీయాలకు సరిపోరేమో :
పవన్‌ పద్ధతి చూస్తుంటే.. ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిది కాదేమోననిపిస్తోందని ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. ‘నేను మీకు అభిమానిగా, శ్రేయోభిలాషిగా చెబుతున్నా.. మీకుసేవ చేయాలని ఉంటే రాజకీయాలు మీకు ఏ మాత్రం సరిపోవ’ని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని తన శిష్యుడేనని, పది మందికి సాయం చేసే మనిషి అని, కోపంలో ఏదైనా తప్పులు చేసి ఉండవచ్చని, వాటిని ఎత్తిచూపుతూ తప్పుపట్టడం పవన్‌కు సరి కాదని హితవు పలికారు. సమావేశంలో పాలి ప్రసాద్‌, పూజారి నిరంజన్‌, శశికుమార్‌, ఉప్పాల జగదీష్‌బాబు, గూడవల్లి శ్రీనివాస్‌, దాకారపు రాజేశ్వరరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Lifted from other db

 

CBN US tour lo many things achieved. 

1. UN lo ZNBF method AP state achievements explain sesthu speech ichadu. 

2. Made agreement with Cancer COE institute (founded by Dr. Nori) to give training in latest surgeries and methods for AP doctors. Skill improvement scheme will be floated for this by AP. 

3. Made agreement with DOER inc. for Deep water exploration & research to establish a R&D center and to give training in ocean marine technology, aqua culture and equipment rentals in AP with 200 Cr investment. 

4. agreement Arthur Equity Partners Inc. for 150 Cr investment as JV with AP govt. to attract 1500 Cr investment in manufacturing sector. They are trying to bring two greenfield companies in this area. 

5. Agreement with V Resorts for establishing resorts in AP. 

6. Agreement with Triton solar to establish solar battery manufacturing plant with 727 Cr investment. Mou made. 

7. Agreement with Field Fresh Food products pvt ltd. (sunil mittal company) to establish food process industry in AP. 

8. Agreement for Drone manufactuing and research by Value Thought IT solutions along with Uni. of Texas Associate Research Director. Uni. of Texas will provide skill development training in this area for AP technicians while Value thought manufactures drones. KL university in AP will coordinate skill training in AP. 

9. Agreement with Watson Financial Services for investment in AP FinTech Valley in Vizag. 

10. CBN presented AP policies and Benefits to all delegates came for meeting from companies in AI, Cloud and Data Analytics areas. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...