Jump to content

prakasam politics


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 123
  • Created
  • Last Reply
రాయబేరాలు
04-02-2019 10:54:14
 
636848745832533174.jpg
  • ముందే ఓటు బ్యాంకులపై నేతల కన్ను
  • కీలకమైన నాయకులను రాబట్టుకునే ప్రయత్నం
  • పదవులు, పనులు, డబ్బుతో బేరం
  • కింది స్థాయిలో ప్రారంభమైన ఫిరాయింపులు, సర్దుబాట్లు
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందే ఓటు బ్యాంకు రాజకీయం మొదలైంది. రాయబేరాలకు తెరలేచింది. ఫిరాయింపులు, సర్దుబాట్లు కూడా జరుగుతున్నాయి. గ్రామ, మండల స్థాయి ఓటర్లపై ప్రభావం చూపే క్షేత్ర స్థాయిలోని నాయకులు, గ్రామాల్లో గ్రూపులకు సారథ్యం వహిస్తున్న వారిపై దృష్టి సారించిన ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు వారిని ఆకర్షించే ప్రయత్నాలను ఆరంభించారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వారు ఈ విషయంలో ముందున్నారు. ఇప్పటికే జిల్లాలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో బేరాలు, రాయబారాల కార్యక్రమం విరివిగా సాగుతోంది. పశ్ఛిమ ప్రాంతంలోని గిద్దలూరు, ఎర్రగొండపాలెం, అలాగే దర్శి, కందుకూరు, కొండపి, ఒంగోలు, పర్చూరు నియోజకవర్గాలలో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నాయి.
 
ఈ నియోజకవర్గాలలో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి పోటీచేసే అభ్యర్థుల అంశం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. కొన్ని చోట్ల ఒక పార్టీకి సంబంధించి అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, కొన్ని నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల నుంచి తిరిగి పోటీచేసే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. గిద్దలూరులో అయితే జనసేన నుంచి పోటీచేసే అభ్యర్థి కూడా రంగంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో రాయబేరాల వ్యవహారం పెద్దస్థాయిలో జరుగుతోంది. టీడీపీ, వైసీపీ నాయకులు సొంత పార్టీలోని అసంతృప్తివాదులను బుజ్జగించుకునే పని ప్రారంభించారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలో ఓటర్లపై ప్రభావితం చూపే వారిని రాబట్టుకునే వ్యవహారాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల కందుకూరు, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఆయాపార్టీల్లో కొత్తగా చేరేవారి సంఖ్య పెరిగిపోవటం అందుకు ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
 
 
ఎర్రగొండపాలెంలోనూ ముమ్మరం
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ ప్రత్యర్థి పక్షాల వారిని దరిచేర్చుకునే ప్రయత్నాలను నేతలు ముమ్మరంచేశారు. ప్రస్తుతం అక్కడ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఒకప్పుడు తాను ప్రాతినిథ్యం వహించిన సంతనూతలపాడు రావాలని ఆశించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పటంతో పావులు కదపటం ప్రారంభించారు. వైసీపీ నుంచి తనతో టీడీపీలోకి తెచ్చుకున్న వారిని నిలబెట్టుకోవటంతో పాటు, గత మూడేళ్లుగా వైసీపీలో ఉండి తనతో పనులు చేయించుకున్న వారందరినీ పార్టీలోకి రాబట్టుకునే ప్రక్రియకు శ్రీకారంచుట్టారు.
 
ఇక వైసీపీ నుంచి పోటీకి సిద్ధమైన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఇరుపార్టీలలో ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకుల అసంతృప్తిని సరిదిద్దుకునే పనిలో పడిపోయారు. రెండు, మూడు మండలాలకు చెందిన అలాంటి నాయకులను మార్కాపురం పిలిపించుకుని ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇటు డేవిడ్‌రాజు, అటు సురే్‌షతో చర్చలు జరుపుతున్న ద్వితీయ స్థాయి నాయకులు భవిష్యత్తులో మా ప్రాధాన్యం ఏమిటన్న అంశంపై స్పష్టమైన హామీలు పొందే ప్రయత్నంతో ముందుకు సాగుతుండటం విశేషం.
 
 
కందుకూరులో ఎత్తుకుపైఎత్తులు 
కందుకూరు నియోజకవర్గంలోను ప్రధాన పక్షాల అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే పోతుల రామారావు, వైసీపీ నుంచి మాజీమంత్రి మహీధర్‌ రెడ్డి పోటీకి సిద్ధమై ఎత్తులకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే పోతుల రామారావు తనతోపాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని నిలుపుకోవటంతో పాటు ప్రత్యర్థిపక్షంలో అసంతృప్తివాదులను రాబట్టుకునే ప్రయత్నాలను పెద్దఎత్తున సాగిస్తున్నారు. తన సహజసిద్ధమైన శైలిలో రోజూ రెండు మూడు గ్రామాల వారిని టంగుటూరుకు పిలిపించుకొని అన్ని అంశాలలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ సమరానికి సిద్ధమవుతున్నారు. కుదిరితే ఆయా గ్రామాలలోని రెండు వర్గాల వారిని కలిపి ముందుకు పంపటం, అలా సాధ్యంకాని చోట ఒక వర్గం వారితో అనుబంధాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
రమారమి 30కి పైగా గ్రామాల విషయంలో ఈ విషయంలో ఆయన ఒక స్పష్టతకు వచ్చారు. వలేటివారిపాలెం మండలంలో వైసీపీ నేతలు దృష్టి సారించిన టీడీపీ నేతలను కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు కందుకూరు మండలంలో అసంతృప్తి గురైన గ్రామ వైసీపీ నాయకులను అప్పటికప్పుడు వదిలేసి పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయన ఏస్థాయిలో సమరానికి సిద్ధమయ్యారో తెలియజేస్తుంది.
 
మరోవైపు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా అంతేవేగంతో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామ సమాచారంపై అవగాహన ఉన్న ఆయన వైసీపీ శ్రేణులను నిలబెట్టుకుంటూనే గత ఎన్నికలలో చెల్లాచెదురైన పూర్వపు తన మద్దతుదారులను కూడగట్టుకునే విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. లింగసముద్రం మండలంలో కీలకనేతగా వ్యవహరించి వృద్ధాప్యంతో ఉన్న ఒక నాయకుడి కుమారుడిని తన వైపునకు తిప్పుకునే విషయంలో ఆయన సఫలమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొండముడుసుపాలెంలో మహీధర్‌ రెడ్డికి చెందిన ఒక ముఖ్య అనుచరుడిని పోతుల రాబట్టుకోవటం విశేషం.
 
 
కొండపిలో టీడీపీ నేతల స్పీడు
కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఈ విషయంలో స్పీడుగా ఉన్నారు. ఎమ్మెల్యే స్వామి, ఆయనకు మద్దతుగా దామచర్ల పూర్ణచంద్రరావు, ఆయన కుమారుడు సత్యలు అసమ్మతివాదులను సంతృప్తిపర్చడంతోపాటు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుని కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒక మండలంలో బాగా ప్రభావం చూపగలిగే నాయకుడితో ప్రస్తుతం వారు చర్చలు జరుపుతున్నారు. వైసీపీలో నెలకొన్న విభేదాలు కూడా వారికి కలిసొస్తున్నాయి.
 
 
గిద్దలూరు నియోజక వర్గంలో వ్యూహ ప్రతివ్యూహాలు
గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో కలిసి పయనిస్తున్న కిందిస్థాయి నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్యాఇ. గతంలో వారంతా వైసీపీ మద్ధతుతో స్థానిక సంస్థలలో గెలుపొంది అశోక్‌రెడ్డితో టీడీపీలో చేరిన వారు. దానికి విరుగుడుగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆయా గ్రామాలలోని టీడీపీకి చెందిన పాతకాపులను, గ్రామస్థాయిలోని నాయకులను సమీకరించుకునే పని ప్రారంభించారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు రంగంలోకి వచ్చాక ఈ వ్యవహారం ప్రారంభమైంది.
 
వైసీపీ అధికారంలోకి వస్తే స్థానిక పదవులన్నీ మీకే అంటూ గిద్దలూరు మండలంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అనుచరులను ఆకట్టుకునే ప్రయత్నంలో రాంబాబు ఉన్నట్లు చెప్తున్నారు. ఆయన మండల, గ్రామస్థాయి పదవులతో పాటు వివిధ నామినేటెడ్‌ పదవులపై కూడా హామీలు ఇస్తుననట్లు ప్రచారం జరుగుతోంది. దానికి ప్రతిగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా అవసరమైన హామీలతో కిందిస్థాయి ఓటుబ్యాంకులను ఆకర్షించుకోగలుగుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు కొందరు సిద్ధమైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అదేసమయంలో గ్రామాల వారీ టీడీపీలో చేరి అశోక్‌రెడ్డికి మద్ధతు ప్రకటించే వారి కార్యక్రమాలు గత కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.
 
 
ఒంగోలులో రసవత్తరం
జిల్లా కేంద్రమైన ఒంగోలులో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన ఎమ్మెల్యే జనార్దన్‌ సొంత పార్టీలో అసమ్మతివాదులను సరిచేసుకోవటంతో పాటు వైసీపీలో కిందిస్థాయిలో ఉన్న కొందరు ముఖ్యులను రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం సామదాన భేద దండోపాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు మాజీమంత్రి, వైసీపీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన వ్యూహానికి పదును పెట్టారు. టీడీపీలో ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్న అర డజను మందికి పైగా నాయకులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టచ్‌లో ఉన్నట్లు చెప్తున్నారు. పదవుల కన్నా డబ్బు అవసరాలే కీలకంగా ఇక్కడ కిందిస్థాయి నేతల కోసం ఇరువైపుల నుంచి ఆర్థిక అవసరాలకు అనుగుణ మైన అంశాలతో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇలా ఎన్నికలకు ముందే జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
 
 
దర్శిలో రెండు నెలల క్రితమే శ్రీకారం
మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిథ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలోనూ రాయబేరాల పర్వం ఊపందుకుంది. రెండు నెలల నుంచే శిద్ధా రాఘవరావు పార్టీలోని అసమ్మతివాదులను మచ్చిక చేసుకోవటంతో పాటు వైసీపీ నుంచి, అలాగే తటస్థంగా ఉన్నవారిని టీడీపీలో చేర్చుకునే కార్యక్రమాలు ప్రారంభించారు. చేరినవారి బలాబలాలు ఎంతైనప్పటికీ ఒక నిర్విరామ ప్రక్రియగా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. పింఛన్లు, పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలో మంత్రి శిద్దాతోపాటు ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి, కుమారుడు సుధీర్‌ బాబు విస్తృతంగా పర్యటిస్తున్న తీరుని చూస్తే వారు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుంది.
 
ఇప్పటికైతే ఇతర పార్టీల నుంచి రెడ్డి, దళిత సామాజిక వర్గాలకు చెందిన పలువురిని చేర్చుకోవటంలో శిద్దా సఫలీకృతులయ్యారు. అదే సమయంలో పార్టీలోని అసంతృప్తివాదుల ఆశలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వారిని కలుపుకుపోవటంలోనూ ఆయన ముందున్నారు. వైసీపీ నుంచి ఇటీవల రంగంలోకి వచ్చిన మద్ధిశెట్టి వేణుగోపాల్‌ తమ సామాజికవర్గంలోని టీడీపీ శ్రేణులపై దృష్టి సారించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఆమంచి ఎఫెక్ట్.. చంద్రబాబును కలిసిన వైసీపీ కీలకనేత
18-02-2019 23:08:41
 
636861281227194191.jpg
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఆమంచికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు తిరుగుబాటు చేయడం.. మరోవైపు టీడీపీ నేతలు వరుస సమావేశాలతో చీరాల నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
 
 
అయితే.. ఆమంచి రాకను మొదట్నుంచి వైసీపీ నేత ఎడం బాలాజీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఆమంచి రాగానే ఈయన టీడీపీలోకి జంప్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ముందుగా అనుకున్నట్లే ఎడం.. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిశారు. ఆమంచి చేరికకు ముందు ఈయన వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈయన టీడీపీలో చేరితే చీరాల అసెంబ్లీ టికెట్ ఇస్తారా..? లేకుంటే ఇవ్వరా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోతుల సునీత పోటీచేశారు. ఈసారి కూడా తానే పోటీ చేసి.. గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ టికెట్ కోసం టీడీపీ కీలకనేత అయిన కరణం బలరాం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ నియోజకవర్గం నుంచి కరణం వెంకటేశ్‌ను బరిలోకి దింపాలని బలరాం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఎడం బాలాజీ వస్తుండటంతో ఎవరికి టికెట్ ఇస్తారో..? ఎవరికి హ్యాండిస్తారో..? అనేది అర్థం కాని పరిస్థితి.
 
 
కాగా.. భవిష్యత్‌ పయనంపై నిర్ణయం తీసుకునేందుకు బాలాజీ ఆదివారం నాడే అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒకరిద్దరు నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఎడం బాలాజీ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులపై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన ఆమంచి 10,335 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఆమంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమంచి చీరాల నుంచే పోటీ చేయనున్నట్లు సమాచారం.
 
Tags : ys jagan, Chirala MLA Amanchi Krishna Mohan, yadam bala
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...