Jump to content

*సార్.. నేను మీ అభిమానిని ! చంద్రబాబుతో సెల్ఫీ తీసుకొని మురిసిపోయాడు


Raaz@NBK

Recommended Posts

*సార్.. నేను మీ అభిమానిని ! చంద్రబాబుతో సెల్ఫీ తీసుకొని మురిసిపోయాడు కేంద్రమంత్రి !*

పార్లమెంటులో అన్ని పార్టీల నాయకులతో సమావేశాల్లో బిజీగా ఉన్న చంద్రబాబుకి ఊహించని ఫ్యాన్ ఎదురయ్యాడు. సార్… నేను మీ అభిమానిని, నేను కేంద్ర మంత్రి. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని అభిమానం బైటపెట్టుకున్నాడు. చంద్రబాబుతో సెల్ఫీ దిగి… చాలా హ్యాపీగా ఉందన్నారు. అంతే… చుట్టూ ఉన్నవాళ్లు మొదట షాక్ తో చూస్తుండిపోయారు. తర్వాత దటీజ్ చంద్రబాబు అంటూ నవ్వులు పూశాయ్ అక్కడ. చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పే ఈ సీన్ చూసి మిగతా పార్టీల నాయకులు ఆశ్చర్యం కాదు అనందంతో కనిపించారు. ఒక్కసారి బాబు లెవెల్ ఏంటో అక్కడ కనిపించినట్టు అయ్యింది.
అవును. ఇది పార్లమెంటులో జరిగిన సన్నివేశం. చంద్రబాబు ఎన్సీపీ నాయకులతో మాట్లాడుతుండగా… హర్ దీప్ సింగ్ పూరీ వచ్చారు. ఆయన స్వతంత్రహోదా ఉన్న నగర వ్యవహారాలు, గృహ నిర్మాణ మంత్రి. వచ్చారు అక్కడికి. సర్ నేను… హదీప్ సింగ్. కేంద్రంలో మంత్రిని. నేను మీ అభిమానని. బ్యూరోక్రాట్ గా ఉన్నప్పటి నుంచి మీ గురించి వింటూనే ఉన్నా. మిమ్మల్ని కలవాలనుకున్నా. ఇప్పుడు మీరు మాతో లేరు. అంటూనే నేను మీతో సెల్ఫీ తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడు. థాంక్యూ చెప్పి వినయంగా వెళ్లిపోయాడు.

ఇంతకీ హర్ దీప్ సింగ్ ఎవరో తెలుసా…? ఇండియన్ ఫారిన్ సర్వీసులో 30 ఏళ్లకు పైగా పనిచేసి దాదాపు 100 దేశాలు తిరిగిన అధికారి. ఎంతో మందిని చూశాడు. ఐక్యరాజ్య సమితీలోనూ సెక్యూరిటీ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అషామాషీ కాదు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు అపూర్వంగా కనిపించాడు అంటే… ఇక బాబు రేంజ్ ఎంతనుకోవాలి ! ఎంతో మందిని చూశాను మీ లాంటి నాయకుడు లేడు అని ఓపెన్ గా అనడం అంటే ఏమనుకోవాలి… దటీజ్ చంద్రబాబు… బాబు ఆలోచనలు అర్థమైనవాళ్లు, వాటి ప్రభావాన్ని ఊహించిన వాళ్లు అలాగే ఫ్యాన్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...