Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
న్న క్యాంటీన్‌కు భారీ విరాళమిచ్చిన పారిశ్రామికవేత్త
12-07-2018 09:51:01
 
636669858606954814.jpg
విజయవాడ: పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్‌లో జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారరు. ఆంధ్రజ్యోతితో మండల మాట్లాడుతూ, నవ్యాంధ్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు పేదల ఆకలిని తీర్చే మరో బృహత్తర కార్యక్రమం అన్న క్యాంటీన్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ, బంధు మిత్రుల సహకారంతో తిరుమలకు కూరగాయలను పంపుతున్నారు.
Link to comment
Share on other sites

56 minutes ago, sonykongara said:
న్న క్యాంటీన్‌కు భారీ విరాళమిచ్చిన పారిశ్రామికవేత్త
12-07-2018 09:51:01
 
636669858606954814.jpg
విజయవాడ: పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్‌లో జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారరు. ఆంధ్రజ్యోతితో మండల మాట్లాడుతూ, నవ్యాంధ్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు పేదల ఆకలిని తీర్చే మరో బృహత్తర కార్యక్రమం అన్న క్యాంటీన్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ, బంధు మిత్రుల సహకారంతో తిరుమలకు కూరగాయలను పంపుతున్నారు.

GOD bless you sir!

Link to comment
Share on other sites

విరాళాలిచ్చి దాతృత్వాన్ని చాటుకోండి 
అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో సీఎం 
రాష్ట్ర వ్యాప్తంగా 60 ఆరంభం 
ఈనాడు - అమరావతి 
11ap-main4a.jpg

‘‘పేదలకు కడుపునిండా భోజనం పెట్టి ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు దాతలు విరాళాలిచ్చి దాతృత్వాన్ని చాటుకోవాలి. ఎన్టీ రామారావు తిరుమలలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు ఇస్తున్న విరాళాలు నేడు రూ.850 కోట్లకు చేరుకున్నాయి. పేదలకు అన్నం పెట్టడం కంటే పుణ్యం మరొకటి ఉండదు. అవకాశం ఉన్న వారంతా పిల్లల జన్మదినం, ఇతర శుభ సందర్భాల్లో, పెద్దల పేరుతో పేదలకు అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లుకు రండి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని 25 పురపాలక, నగరపాలక సంస్థల్లో బుధవారం 60 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి పేదలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎ.కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మంచిపనికి దాతల సాయం అవసరమని, చాలామందికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్నా, సరైన వ్యవస్థ లేక వేచిచూస్తున్న వారందరికీ అన్న క్యాంటీన్లు సరైన వేదిక అవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. 203 క్యాంటీన్లలో రోజూ 2.25 లక్షల మంది పేదలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమం భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తుందని, ప్రస్తుతానికి మొదటి విడతగా 60 క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. వచ్చే నెల 15 నాటికి మిగతా 143 కూడా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు ప్రకటించారు. అన్న క్యాంటీన్లకు రూ.200 కోట్లు కేటాయించామని, మూడు పూటలా ఆహారం సరఫరాపై ఒకొక్కరిపై ప్రభుత్వం రోజూ రూ.60 చొప్పున రాయితీగా ఖర్చు చేస్త్తోందని ఆయన వెల్లడించారు. శుచిగా, శుభ్రంగా, నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని, సామాజిక స్పృహ, సేవా దృక్పథంతో పని చేసే అక్షయపాత్ర సంస్థకు భోజనం సరఫరా చేసే బాధ్యతను అప్పగించామని ముఖ్యమంత్రి వివరించారు. కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్‌ తరహాలో క్యాంటీన్లు తయారు చేశామని, అన్నింటికీ ఏసీ సదుపాయం కూడా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. పేదల అభిప్రాయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే మార్పులు చేస్తామని, ఆధునిక సాంకేతికతను సైతం అనుసంధానిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

మొబైల్‌ నుంచి త్వరలో పౌర సేవలు.. 
ప్రభుత్వం రూపొందించే మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజలు తమకు కావలసిన ధ్రువపత్రాలు, ఇతర సేవలు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. తరువాత దశలో ఫేస్‌బుక్‌లో ప్రజల నుంచి విజ్ఞప్తులపైనా త్వరితగతిన సేవలు అందించే రోజులు ముందున్నాయని అన్నారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో అన్ని సేవలు ఆన్‌లైన్‌ చేశామని, ఎవరూ అధికారులు చుట్టూ తిరగాల్సిన, చేతులు తడపాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో చెత్తను తీసుకొచ్చి రోడ్లపై వేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు రాకపోతే తానే రోడ్లపై ఉండే చెత్తను తీసే రోజు వస్తుందని అన్నారు.

11ap-main4b.jpg

విరాళాలు ప్రకటించిన ప్రతినిధులు.. 
ముఖ్యమంత్రి సూచనపై పలువురు విరాళాలు ప్రకటించారు. కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనురాధ రూ.లక్ష, ఏపీ వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు రూ.85 వేలు, దాత ఎం.కుటుంబరావు రూ.లక్ష విరాళం, అక్షయపాత్రకు ప్రతి నెలా పది టన్నుల కూరగాయలు సరఫరా చేస్తానని ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ రూ.30 వేలు, కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం రూ.25 వేలు, విజయవాడ నగర మేయర్‌ శ్రీధర్‌ రూ.25 వేలు, సంయుక్త కలెక్టర్‌ బాబూరావు రూ.10 వేలు, కార్పొరేటర్లు గాంధీ రూ.10 వేలు, నాగమణి రూ.2 వేలు, సాధికారమిత్రలు రాజ్యలక్ష్మి, స్వర్ణ కలిసి రూ.5 వేలు ప్రకటించి ముఖ్యమంత్రికి అందజేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...