Jump to content

వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు!


vamse2507

Recommended Posts

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఇప్పటికే వీడియో కాలింగ్‌, వాయిస్‌ కాలింగ్‌, స్టేటస్‌ తదితర ఫీచర్లు ఉన్న యాప్‌లో ఇటీవల డిలీట్‌ ఆప్షన్‌ వచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లో మరో మూడు ఫీచర్లను యాడ్‌ చేయబోతున్నారు. వాటిలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, షేక్‌ టు రిపోర్ట్‌, ప్రైవేట్‌ రిప్లైస్‌ ఫీచర్లు ఉన్నాయి.

ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ 
వాట్సాప్‌ ఎవరినైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది.

షేక్‌ టు రిపోర్ట్‌ 
వాట్సాప్‌లో ఏవన్నా సాంకేతిక సమస్యలు ఉంటే ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు, రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి తెలియజేయాలంటే.. జస్ట్‌ మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ అయ్యి ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు.

ప్రైవేట్‌ రిప్లైస్‌ 
వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసిమెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు.

ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. అయితే వాట్సాప్‌ వెబ్‌ 2.7315 వెర్షన్‌లో కేవలం ప్రైవేట్‌ రిప్లైస్‌, పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఆప్షన్లు మాత్రమే అప్‌గ్రేడ్‌ అవుతాయి. 2.17.424, 2.17.436, 2.17.437 వెర్షన్లలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, న్యూ ఇన్‌వైట్‌ వయా లింక్‌, షేక్‌ టు రిపోర్ట్‌ ఆప్షన్లు ఆప్‌గ్రేడ్‌ అవుతాయి.

Link to comment
Share on other sites

32 minutes ago, Theda Singh said:

whatsapp bore kottesindi naakaithe. eppudaithe naa sonpapdi naatho chat cheyyadam manesindo a next second nunchi WA use cheyyadam tagginchesa :sad:

sonpapdi lekapothe em kakinada kaja, atryapuram pootareku  loop lo pette untav ga :kick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...