Jump to content

Roads ambulances


Yaswanth.M

Recommended Posts

 

22-1.png

 

ఏపీ ఏం చేసినా దేశం ఆశ్చర్యంగా చూస్తుంది దేశంలో తొలిసారిగా ‘రోడ్డు అంబులెన్స్‌’లు 
 

మరికొద్ది నెలల్లో ఏపీలో గ్రామీణ రహదారులపై గోతులు కనిపించవు. గతుకుల రోడ్లపై ప్రయాణం మీకు ఇరిటేషన్‌ ఇకపై తెప్పించదు. ఒక్క ఫోన్‌ కొట్టగానే అంబులెన్స్‌ సైరన్‌ కొట్టుకుంటు వచ్చినట్టు రోడ్డు అంబులెన్స్‌లు మీ ఊరికొస్తాయి, రోడ్లపై చిన్నచిన్న మరమ్మత్తులు చేసి వెళతాయి. ఈ తరహా ప్రయోగం దేశంలో తొలిసారిగా ఏపీలోనే చేస్తున్నారు. తొలివిడత 13 జిల్లాల్లో 52 రోడ్డు అంబులెన్స్‌లను రంగంలోకి దించబోతోంది ప్రభుత్వం. ఒక్కో వాహనం ఖరీదు రూ.16 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్రంలోని 78,743 కి.మీ పొడవునా 32,423 గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది ప్రభుత్వం. రెండు రకాలైన 52 రోడ్డు అంబులెన్స్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.37 లక్షల విలువైన ‘బాబ్‌ కేట్‌’ అంబులెన్స్‌ వాహనంలో రహదారుల మరమ్మతులకు అవసరమైన సామగ్రితోపాటు అత్యవసరమైన చోట కొత్తగా రహదారులు వేసే సౌలభ్యమూ ఉంది.

 

ఒక్కో వాహనానికి పదిమంది అవసరముంటుంది. రూ.13.50 లక్షల విలువైన చిన్న తరహా మోటారు వాహనం(ఎల్‌ఎంవీ)లో ప్రత్యేకించి తారు, సిమెంట్‌ రహదారులపై ఏర్పడిన గోతులను వెను వెంటనే పూడ్చే సదుపాయం ఉంది. ఇందులో వైబ్రేటర్‌, మిల్లర్‌, బ్లోయిర్‌, ఇతర నిర్మాణ సామగ్రితోపాటు ఐదుగురు సిబ్బంది ఉంటారు. జిల్లాకో ‘బాబ్‌ కేట్‌’, మూడు ఎల్‌ఎంవీ అంబులెన్స్‌లు కేటాయించేలా అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...