Jump to content

Bullet train


eshwarR

Recommended Posts

Same thing they are doing with River linking project. North side first take up chesthunnaru putting South & Orissa aside.

 what is the point in blaming center when KA, Odisha and even Telangana not agreeing for this? last lo vunna AP and TN matrame ok antunnayyi.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Hope they compensate something similar between BZA and Chennai.... atleast AP-TS-TN-KA should do it together...

 

5 గంటల్లో కాజీపేట టూ చెన్నై!

11-10-2017 01:53:01
 
636432879056159195.jpg
  • విజయవాడ మీదుగా సెమీ హైస్పీడ్‌ రైలు
  • జర్మనీతో భారతీయ రైల్వే ఒప్పందం
న్యూఢిల్లీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉత్తరాదికి బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకొస్తున్న కేంద్రం దక్షిణాదిన సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నై నుంచి విజయవాడ మీదుగా కాజీపేట కారిడార్‌లో 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచే విధంగా అభివృద్ధి చేయన్నారు. ప్రస్తుతం కాజీపేట-చెన్నై మధ్య నడుస్తున్న సర్వీసులకు పదిగంటల సమయం పడుతోంది. చెన్నై నుంచి విజయవాడ మీదుగా కాజీపేట వరకు దూరం 643 కిలోమీటర్లు. ఈ లైన్‌లో సగటు వేగం గంటకు 57 కిలోమీటర్లు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సగటు వేగం 75.3 కిలోమీటర్లు. వీటి స్థానంలో సెమీహైస్పీడ్‌ రైళ్లు వస్తే ప్రయాణ కాలం సగానికి తగ్గిపోతుంది. కారిడార్‌ అభివృద్ధి కోసం జర్మనీతో భారతీయ రైల్వే మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
 
దీని ప్రకారం ఈ కారిడార్‌ను 3 దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలుత రైల్వేలైన్‌ అప్‌గ్రెడేషన్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తారు. కారిడార్‌ అభివృద్ధితో సంభవించే మార్పులు, ఆర్థికంగా చూపే ప్రభావం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చివరగా వాటి అమలుపై దృష్టిసారిస్తారు. ఇరు దేశాల రైల్వేశాఖలు చెరిసగం వ్యయం భరిస్తాయి. సాధ్యాసాధ్యాల నివేదిక పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో మళ్లీ ఒప్పందం చేసుకుని.. ప్రాజెక్టు ప్రారంభిస్తారు.
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...