Jump to content

Srisailam

sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply
రంగుమారిన కృష్ణమ్మ
 
636420750599026722.jpg
  • ఎగువ నుంచి వచ్చే పరిశ్రమల వ్యర్థాలే కారణం
శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదిలో నీరు రంగు మారింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో కుడిగట్టు ఇన్‌టేక్‌ పరిసరాల వద్ద నీరు ఆకుపచ్చరంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోంంది. శ్రీశైలం, సున్నిపెంట, దోమలపెంట ప్రజలకు తాగునీరు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇప్పటికే కాలనీ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. దానికితోడు జలాశయంలోని నీరు కలుషితమవడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. శ్రీశైల జలాశయానికి ఏటా రంగు మారిన నీటి సమస్య తీరడం లేదు. ఇలా జరిగిన ప్రతిసారీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రావడం, నీటి నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం పరిపాటిగా మారింది. జలాశయానికి ఎగువన ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల వల్లే జలాశయంలోని నీరు రంగు మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. రంగు మారిన నీటిని తాగినా.. స్నానాలు చేసినా విషజ్వరాలు, చర్మవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద...
శ్రీశైలానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు డ్యాం నీటిమట్టం 870.70 అడుగులు ఉంది. జలాశయంలో నీటినిల్వ 144.4532 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలాశయం నుంచి 1,13,446 క్యూసెక్కు నీరు వస్తోంది. జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి రాయలసీమ రెతుల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,025 క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 60,122 క్యూసెక్కులు. కుడిగట్టులో విద్యుదుత్పత్తి చేయడం లేదు. తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
Link to comment
Share on other sites

పోతిరెడ్డిపాడు నుంచి మరో 5 టీఎంసీలు!

కేటాయింపు కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి మరో ఐదు టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కృష్ణా నదీ యాజమాన్యబోర్డును కోరింది. ఇటీవల జరిగిన సమావేశంలో పోతిరెడ్డిపాడు నుంచి 5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. వారం రోజులుగా ఈ నీటి విడుదల కొనసాగుతోంది. దీనికి కొనసాగింపుగా మరో ఐదు టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌.. కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై అభిప్రాయం తెలపాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను బోర్డు కోరింది.

Link to comment
Share on other sites

నీటి కేటాయింపులపై కమిటీ

ఈనాడు, అమరావతి: హంద్రీ నీవా సుజల స్రవంతి, తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌కు నీటి కేటాయింపులు, అవకాశాల పరిశీలనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ (పరిపాలన విభాగం) అధ్యక్షుడిగా, తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌ ఎస్‌ఈ కన్వీనర్‌గా ఉంటారు. అనంతపురం, కడప సీఈలతోపాటు విశ్రాంత ఈఎన్‌సీలు వై.అబ్దుల్‌ బషీర్‌, బీఎస్‌ఎన్‌రెడ్డిలను సభ్యులుగా నియమించారు.

Link to comment
Share on other sites

రంగుమారిన కృష్ణమ్మ

636420750599026722.jpg
  • ఎగువ నుంచి వచ్చే పరిశ్రమల వ్యర్థాలే కారణం
శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదిలో నీరు రంగు మారింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో కుడిగట్టు ఇన్‌టేక్‌ పరిసరాల వద్ద నీరు ఆకుపచ్చరంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోంంది. శ్రీశైలం, సున్నిపెంట, దోమలపెంట ప్రజలకు తాగునీరు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇప్పటికే కాలనీ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. దానికితోడు జలాశయంలోని నీరు కలుషితమవడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. శ్రీశైల జలాశయానికి ఏటా రంగు మారిన నీటి సమస్య తీరడం లేదు. ఇలా జరిగిన ప్రతిసారీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రావడం, నీటి నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం పరిపాటిగా మారింది. జలాశయానికి ఎగువన ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల వల్లే జలాశయంలోని నీరు రంగు మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. రంగు మారిన నీటిని తాగినా.. స్నానాలు చేసినా విషజ్వరాలు, చర్మవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద...
శ్రీశైలానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు డ్యాం నీటిమట్టం 870.70 అడుగులు ఉంది. జలాశయంలో నీటినిల్వ 144.4532 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలాశయం నుంచి 1,13,446 క్యూసెక్కు నీరు వస్తోంది. జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి రాయలసీమ రెతుల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,025 క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 60,122 క్యూసెక్కులు. కుడిగట్టులో విద్యుదుత్పత్తి చేయడం లేదు. తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

malli ee color change fitting enti?

Link to comment
Share on other sites

Guest Urban Legend

Power generation ani sollu cheppi rayalaseema ki water andhakudadhu..ani water antha release chesestundhi TS

From srisailam, last year motham kaali chesesaru with in few days

Same repeating

Asaley inflow reduced t0 40k

AP gattiga fight cheyyali ..control antha TG hand lo pettaru E Sonia munjals

Link to comment
Share on other sites

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ఆపేది లేదు
29-09-2017 02:14:22
 
  • తెలంగాణ 18 టీఎంసీలు తోడేసింది
  • అక్రమంగా విద్యుదుత్పాదన
  • శ్రీశైలాన్ని ఖాళీచేయాలని చూస్తోంది
  • సాగర్‌లో నీటి నిల్వకు తరలిస్తోంది
  • బోర్డు ‘స్టాప్‌ ఆర్డర్‌’పై ఆంధ్ర స్పందన
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంద్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కేటాయింపులకు మించి నీటిని విడుదల చేసినందున తక్షణమే దీని ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదలను నిలుపు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) జారీచేసిన ‘స్టాప్‌ ఆర్డర్‌’ను ఆంధ్రప్రదేశ్‌ తోసిపుచ్చింది. ఓపక్క శ్రీశైలం జలాశయాన్ని వేగంగా ఖాళీచేసి.. నాగార్జునసాగర్‌కు తరలిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు నీరు అందకుండా చేయాలని తెలంగాణ చూస్తుంటే తమకు స్టాప్‌ ఆర్డర్‌ ఎలా ఇస్తారని బోర్డును ప్రశ్నించింది.
 
ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ ఎం.వెంకట్వేరరావు బోర్డుకు గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఐదు టీఎంసీలు విడుదల చేశాక మరో 5 టీఎంసీల విడుదలకు ఇండెంట్‌ పెడతామని త్రిసభ్య కమిటీకి తెలియజేశామని, సమావేశం మినిట్స్‌లో కూడా దీనిని రికార్డు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనికి బోర్డు ఇంతవరకు అంగీకారం తెలుపకుండా బుధవారం అర్ధరాత్రి స్టాప్‌ ఆర్డర్‌ ఇచ్చిందని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే ఎత్తున నీటి నిల్వలు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల అనువుగా ఉంటుందన్నారు.
 
దానిని 854 అడుగులకు తక్కువగా తీసుకొచ్చి.. ఆంధ్రకు నీరందకుండా చేసేందుకు తెలంగాణ ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో అవసరాన్ని మించి విద్యుదుత్పాదన చేస్తూ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని తెలిపారు. ‘ఇప్పటి వరకు 18 టీఎంసీల నీటిని తోడేసింది. విద్యుదుత్పత్తికి కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవాలని త్రిసభ్య కమిటీ ఆదేశించింది. దానిని తెలంగాణ బేఖాతరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి నీరు అందకుండా చేసేందుకు దానిని ఖాళీచేసి.. నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవడానికి తరలిస్తోంది. జలవిద్యుత్‌ ఉత్పాదనకు ఆ రాష్ట్రం అసలు ఇండెంట్‌ పెట్టలేదు. ఇందుకు బోర్డు అంగీకారం తెలపకముందే విచ్చలవిడిగా నీటిని తోడేస్తోంది’ అని పేర్కొన్నారు. దీనివల్ల కృష్ణా జలాలపైనే గాక.. విద్యుత్‌లోనూ ఏపీ తన వాటాను కోల్పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
 
రాష్ట్రానికి హక్కుగా రావాల్సి వాటాను వాడుకుంటామని.. తమ హక్కులను సద్వినియోగం చేసుకుంటామని, ఇప్పటికైనా ఆ ఐదు టీఎంసీల విడుదలకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని.. ఆ తర్వాతే సాగుకు నీటిని విడుదల చేయాలని స్పష్టం చేయడాన్ని బోర్డుకు ఈఎన్‌సీ గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వాస్తవాలను గుర్తించి కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా తోడేయడాన్ని నిరోధించాలని అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీ మెట్రీలను ట్యాంపరింగ్‌ చేస్తూ కృష్ణా జలాల విడుదలను తక్కువగా చూపుతున్నామన్న తెలంగాణ ఆరోపణలను ఈఎన్‌సీ ఖండించారు. అంతకుముందు బుధవారం రాత్రి పొద్దుపోయాక కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు ‘స్టాప్‌ ఆర్డర్‌’ జారీచేసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ఆపాలని ఆంధ్రకు, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రం నుంచి నీటి వాడకాన్ని నిలిపివేయాలని తెలంగాణకు ఈ ఆదేశాలిచ్చింది.
Link to comment
Share on other sites

శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో
29-09-2017 02:25:08
 
636422487324536115.jpg
శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబరు 28: శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రం 6గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 872.00 అడుగులుగా జలాశయ నీటినిల్వలు 150.1330 టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల నుంచి 46,540, తుంగభద్ర నుంచి 2,265 క్యూసెక్కుల నీరు వస్తోంది. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి ఎలాంటి విద్యుదుత్పత్తి చేయడంలేదు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో 150మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. పోతిరెడ్డిపాడుకు 12,000, హంద్రీనీవాకు 2,025, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...