Jump to content

కృష్ణమ్మ దిశగా గోదారి పరవళ్లు


Ramesh39

Recommended Posts

కృష్ణమ్మ దిశగా గోదారి పరవళ్లు 

పట్టిసీమ నుంచి ఈ ఏడాది ముందే నీళ్లు 

జులైలో కృష్ణా డెల్టా నారుమళ్లకు నీళ్లిచ్చేందుకు అవకాశం 

9 పంపుల ద్వారా ప్రస్తుతం సరఫరా 

ఈనాడు - అమరావతి; పోలవరం - న్యూస్‌టుడే 

19ap-main11a.jpg

గోదారి నీరు ఈసారి కాస్త ముందుగానే కృష్ణమ్మ దిశగా బిరబిరా తరలిపోతోంది. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటం.. స్థానికంగాను, ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలో ప్రవాహాలు పెరగడం, సముద్రంలోకి నీటిని వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో ఆ జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. తొలుత సోమవారం పట్టిసీమ నుంచి ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేయాలనుకున్నారు. నదిలో తగినంత ప్రవాహం ఉండటంతో 9 పంపుల ద్వారా దాదాపు 3,150 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా మళ్లించడం ప్రారంభించారు. ఇది ట్రయల్‌ రన్‌ కాదని, ఇక నిరంతరం పంపులు పనిచేయిస్తూ నీటిని కృష్ణమ్మకు మళ్లించడమేనని పోలవరం కుడి కాలువ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ ఈనాడుకు చెప్పారు. ఈ సంవత్సరం 80 నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుడికాలువ వెంబడి ఎక్కడా నీటి ప్రవాహనికి అవరోధం లేదని, ఆరో కిలోమీటరు(గుడ్డిగూడెం) రెగ్యులేటర్‌ వద్ద సోమవారం రాత్రికి నీటిని నిలిపి మంగళవారం ఉదయం దిగువకు వదులుతామని చెప్పారు. గోదావరి వరద జలాలతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పట్టిసీమ నుంచి చాలా ముందుగానే నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టారు. గతేడాది జులై 7న పట్టిసీమ నుంచి నీళ్లు ఇవ్వడం ప్రారంభించినా పూర్తి స్థాయిలో జులై 14 నుంచి ఎత్తిపోశారు. ఈ ఏడాది జూన్‌ మూడో వారంలోనే గోదావరి నుంచి నీటిని తీసుకుంటున్నారు. డెల్టా అవసరాలు తీరాకే బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని పట్టిసీమ నుంచి మళ్లిస్తున్నారని గోదావరి డెల్టా ఎస్‌ఈ రాంబాబు ఈనాడుతో చెప్పారు.

19ap-main11b.jpg

గోదావరిలో 14,351 క్యూసెక్కుల ప్రవాహాలు 

గోదావరిలో సోమవారం ఉదయానికి పైనుంచి 14,351 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఇందులో సీలేరు నుంచి వస్తున్నది 251 క్యూసెక్కులే. మిగిలినదంతా ఇతరత్రా ప్రవాహాల నుంచి చేరుతున్నదే. ఎగువన గోదావరిలో నీరు ఎర్రబడిందని, ఇది తాజా వర్షాలకు గోదావరిలోకి చేరిన ప్రవాహాల వల్లేనని అధికారులు చెబుతున్నారు. గోదావరిలోని తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు 9,200 క్యూసెక్కులు పోను మిగిలిన 4919 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.165 మీటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. గోదావరి డెల్టాలో ఇంతవరకు జూన్‌ నెలలో నారుమళ్ల నిమిత్తం 12 టీఎంసీల నీరు వినియోగించారు. జులై నెలలో 20 టీఎంసీలకు మించి నీరు అవసరమవుతుందని లెక్కిస్తున్నారు. గత చరిత్ర ప్రకారం జులైలో వరద నీరే ఉంటుంది. ఈ మేరకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు

జులై నుంచి కృష్ణా నారుమళ్లకు నీళ్లు... 

పట్టిసీమ నుంచి ప్రస్తుతం నీటి విడుదల ప్రారంభమైనా ప్రకాశం బ్యారేజి చేరేందుకు 177 కిలోమీటర్ల మేర కుడి కాలువలో ప్రయాణించాల్సి వస్తుంది. మధ్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రవాహాలు సాగితే జూన్‌ 25కల్లా ప్రకాశం బ్యారేజికి గోదారి నీరు చేరుతుంది. ఈ మధ్యలోనే కొంత నీరు మోటార్లు పెట్టి తోడేసే అవకాశం ఉంది. ఈ లోపు గోదారిలో ప్రవాహాలు మరింత పెరిగి పట్టిసీమ పంపులు 24 పనిచేయించి నీరు వదిలితే ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. జులై ఒకటి నుంచి కృష్ణా కాలువల ద్వారా నారుమళ్లకు నీటిని అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యారేజిలో 1.8 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. పులిచింతలలో 1.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గోదారి నీటితో ప్రకాశం బ్యారేజి నిండాక కాలువలకు సాగునీరు అందిస్తారు. ఈ ఏడాది గోదావరి, కృష్ణా డెల్టాలు రెండుచోట్లా నారుమళ్లు చాలా ముందుగానే పూర్తయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

ఇంత ముందుగా నీళ్లివ్వడం ఓ చరిత్ర 

కృష్ణా జలాశయాలు నిండాలంటే 683 టీఎంసీలు కావాలి 

అంతకన్నా ముందే పట్టిసీమతో ప్రకాశం బ్యారేజికి నీరిస్తున్నాం 

విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడేమంటారు 

చంద్రబాబు సూటి ప్రశ్న 

ఈనాడు - అమరావతి 

19ap-main5a.jpg

ఇంత ముందుగానే కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం ఒక చరిత్ర. పట్టిసీమతో గోదావరి నీటిని 9 పంపులతో 3,150 క్యూసెక్కుల చొప్పున సోమవారం ఎత్తిపోతల ప్రారంభించాం. మరో మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజికి ఆ నీళ్లొస్తాయి. ఇప్పటికే గోదావరి డెల్టాకు నీళ్లిచ్చేశాం. ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఇవ్వబోతున్నాం..

విశాఖ భూరికార్డుల తారుమారు వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోం. భూరికార్డుల ట్యాంపరింగ్‌ గురించి నా దృష్టికి రాగానే ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) నియమించా. సిట్‌ రెండు గ్రామాలకే కాకుండా విశాఖ జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా విచారిస్తుంది. గత పదేళ్లలో జరిగిన భూ కుంభకోణాల్నీ వెలికి తీస్తుంది.

ఇంత ముందుగానే కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం ఒక చరిత్రని, పట్టిసీమ నుంచి మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజికి ఆ నీళ్లొస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిపై ఆలమట్టి నుంచి మొత్తం ఏడుచోట్ల జలాశయాలు నిండితేనే ప్రకాశం బ్యారేజికి నీళ్లు రావాలి. ఆ అన్ని జలాశయాల్లో 858టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. ఇపుడున్న నిల్వలు తీసేస్తే ఇంకా 683 టీఎంసీలు నిండితేనే ప్రకాశం బ్యారేజికి నీళ్లు వచ్చేవి. అలాంటిది మా ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించడం వల్ల ముందుగానే కృష్ణా కాలువలకు నీళ్లివ్వగలుగుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కృష్ణాడెల్టాలో ఇంతముందుగా నీళ్లివ్వడం ఇదే తొలిసారని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మిస్తోంటే ఎన్ని విమర్శలు చేశారు? ఇప్పుడు సమాధానం చెప్పండి అని వైకాపా నాయకులకు చంద్రబాబు సవాల్‌ చేశారు.2018 మార్చిలోపు 24 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఫలితంగా జలాశయాలన్నింటినీ నింపవచ్చన్నారు. మూడేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులపై 32,195కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మట్టి తవ్వకం పనులు 70శాతం పూర్తయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులు ఏడాదిలో పూర్తికానున్నాయని చంద్రబాబు వివరించారు.

రైతులకో యాప్‌ 

అనంతపురంతో పాటు కరవు జిల్లాల్లో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ వూళ్లొ కురిసిన వర్షం ఆ వూళ్లొనే ఇంకిపోవాలనేది తమ ఉద్దేశమన్నారు. అదే సమయంలో సాంకేతికత, రెయిన్‌గన్లు వినియోగించుకుని పంటలను కాపాడతామన్నారు. ప్రతి వూళ్లొను మట్టిలో తేమను గుర్తించి, వాటికి తడులు అందించేందుకు దగ్గర్లో నీటి వసతి ఎక్కడుందో తెలియజేసే క్రాప్‌ స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌ను రూపొందించినట్లు సీఎం పేర్కొన్నారు. నీటి వనరుల నిర్వహణ విషయంలో మంత్రి దేవినేని బాగా పనిచేశారని సీఎం అభినందించారు.

నీటి విడుదలను వీక్షించిన సీఎం 

పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేసిన ఘట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి నుంచే వీక్షించారు. సోమవారం పోలవరంపై సమీక్ష సందర్భంగా సరిగ్గా అదే సమయంలో గోదావరి నీరు విడుదల చేయడంతో అధికారులు డ్రోన్ల సాయంతో అక్కడి నుంచి వర్చువల్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆ ఘట్టాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును సీఎం వర్చువల్‌ తనిఖీ చేశారు. ప్రగతిని సమీక్షించారు. గత వారం రోజులుగా 8,000 క్యూబిక్‌మీటర్ల కాంక్రీటు పనులు చేసినట్లు సీఈ వేమన రమేష్‌బాబు సీఎంకు వివరించారు. జులై నెలాఖరుకు అది రోజుకు 5,000 నుంచి 6,000 క్యూబిక్‌మీటర్లకు పెంచుతామని వివరించారు. కాంక్రీటు పనులను రీషెడ్యూల్‌ చేయాలని సీఎం సూచించారు. కాఫర్‌ డ్యాం పనులను చేపడుతున్న కెల్లర్‌ సంస్థ ప్రతినిధులు సీఎంకు ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా పనులు పూర్తిచేసేస్తామని సీఎంకు చెప్పారు. వంశధార సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షించారు. గాలేరు-నగరికి సంబంధించిన డ్రోన్ల సాయంతో తీసిన వీడియోను ముఖ్యమంత్రి తిలకించారు. సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

YSRCP & Congress tried their best to stop Pattiseema project as it will benefit farmers directly in Krishna-West Godavari-Guntur districts & it indirectly benefits Rayalaseema & Nellore districts.

Link to comment
Share on other sites

YSRCP & Congress jaffas now trying to stop Polavaram, Purushottamapatnam, Uttarandhra Srujala sravanthi & Chintalapudi projects ivi complete ayithe by 2019 both YSRCP & Congress parties will be closed forever.

Link to comment
Share on other sites

YSRCP & Congress jaffas now trying to stop Polavaram, Purushottamapatnam, Uttarandhra Srujala sravanthi & Chintalapudi projects ivi complete ayithe by 2019 both YSRCP & Congress parties will be closed forever.

 

 

Uttarandhra sujala sravanthi and polavaram water ni tesukele canals for uttarandhra start cheyali atleast 50%  avali 2019

Link to comment
Share on other sites

sir raithu lu app's tho yemi chesukuntaaru sir. Oka call centre petti raithu la ki phone lu chesi info ippinchandi...........it will connect a lot! yetu raithu la number lu anni unnayi, SMS lu vastunnayi.....rains start avutunnayi, seeds ready chesukondi etc ani

 

Adhe number ki call chesi information chepthe super untadhi! Never before it happened and it will definitely connect well with farmers!

Link to comment
Share on other sites

ప్రస్తుతం జిల్లాలో వర్ష సూచన ఉన్నందున రైతులు నేలను లోతు దుక్కులు చేసుకోవాలి. దీని వలన పురుగుల గ్రుడ్లు, ప్యుపాలు మరియు ఇతర శిలీంద్ర భీజలు నశించి వర్షపు నీరు భూమిలోనికి ఇంకి నిల్వ వుండే అవకాశం వుంది.

 

Kisan nundi vachindi above message

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...