Jump to content

Recommended Posts

  • Replies 68
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4 weeks later...
  • 2 months later...
  • 1 month later...
  • 2 months later...
Posted
ఏపీ - ఆల్‌రౌండర్‌ పోలీస్‌ వచ్చేస్తున్నారు!
15-04-2018 02:35:02
 
636593565008624578.jpg
  • వరదలలో దూకేసి ఈదేస్తారు
  • మంటలకు ఎదురెళ్లిపోతారు
అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చిందంటే, పోలీసులకు గండమే! పోటెత్తే వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలంటే పోలీసులకు ఈత వచ్చి ఉండాలి కదా? దానికోసం మత్స్యకార గ్రామాల్లో ఈత వచ్చిన యువకులకు పోలీసులు డబ్బులిచ్చి మరీ తెచ్చుకోవడం చూస్తున్నాం. పోలీసు స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఆన్‌లైన్‌(సీసీటీఎన్‌ఎ్‌స)లో పొందు పరచాలి. మరి స్టేషన్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న పీసీలు ఒకరిద్దరు కూడా లేకపోతే పని జరిగేదెలా.?.. ఇలాంటి ప్రశ్నలతో కసరత్తు చేసిన పోలీసుశాఖ, ట్రైనీ పోలీసుల్ని తన ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్ది రంగంలోకి దించుతోంది.
 
6 వేల మంది యువ పోలీసులకు 9నెలలుగా శిక్షణ ఇస్తోంది. ఏపీ అంటే ఆల్‌రౌండర్‌ పోలీస్‌ అనేలా వారిని తీర్చిదిద్దుతోంది. 2016 జూలై నోటిఫికేషన్‌ ఆధారంగా 675 మంది ఎస్‌ఐలు (168 మంది మహిళలు), 5,302 మంది కానిస్టేబుళ్లను పోలీస్‌ శాఖ ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యర్థులు ఉన్నారు. అనంతపురం పీటీసీ మొత్తం ఫ్రీవైఫై ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ ల్యాప్‌ ట్యాప్‌ ఇచ్చి నేరాలపై విశ్లేషణ, నేరాల తీరుపై అవగాహన కల్పించారు.
 
 
అన్నింటా అధికులమంటూ..
రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లోని డీటీసీలు, బెటాలియన్లలో కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. పోలీసు వాచకంతో మొదలెట్టి ఆ తర్వాత ఐపీసీ, సీఆర్‌పీసీ, నేరాల తీరు, ఆంగ్ల భాషపై పరిజ్ఞానం, కంప్యూటర్‌ శిక్షణ, ఈత, వాహన డ్రైవింగ్‌లో ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నారు. నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన వారిని, మంటలు ఆర్పి రక్షించేలా మహిళా ట్రైనీలకు తర్ఫీదు ఇస్తున్నారు. అలాగే, నీటిలో మునిగి పోతున్న వారిని రక్షించడానికి సంబంధించిన తర్ఫీదును కూడా అందిస్తున్నారు.
 
 
ఆధునిక శిక్షణ!
ఏపీ పోలీసులంటేనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందిస్తున్నాం. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు పురుష ట్రైనీలతో పోటీగా కష్టపడి ప్రతిభ చూపుతున్నారు. భూమిపై పరుగు మొదలుకొని, నీటిలో ఈదడం, పోలీసు జీపును డ్రైవింగ్‌ చేయడం, లాఠీలు తిప్పడం, తుపాకులు పేల్చడం, అడవుల్లో దూసుకెళ్లడం దాకా అనేక విషయాల్లో సత్తా చాటుతున్నారు’’ - సంజయ్‌, ఏపీ పోలీసు ట్రైనింగ్‌ చీఫ్‌
Posted (edited)

@sonykongara mee posts lo photos/images/screenshots ravadam ledu Brother - okka saari Check cheyyandi 

On 1/17/2018 at 10:59 AM, sonykongara said:

police.jpg

 

Edited by DVSDev
Posted
2 minutes ago, DVSDev said:

@sonykongara mee posts lo photos/images/screenshots ravadam ledu Brother - okka saari Check cheyyandi 

 

adi na problem kadu bro ,https://postimg.cc valla problem konni rojula lo sari avuthundi anukutunna

  • 2 weeks later...
Posted
On 4/15/2018 at 8:14 AM, sonykongara said:

adi na problem kadu bro ,https://postimg.cc valla problem konni rojula lo sari avuthundi anukutunna

use imgbb.com site bro. very reliable it seems. 

  • 2 weeks later...
Posted

రాయచోటి Police Station జిల్లాకి రెండు కట్టాలని ఈ టైపులో ..ఇప్పటికి 6 అయిపొయ్యాయనుకుంటా ..మిగతావి In Progress

వ్యాపార & ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ CC కెమెరాలు అమర్చి ..ఇక్కడనుండే మోనిటరింగ్ అలాగే ట్రాఫిక్ కూడా మోనిటర్ చేస్తా..అక్కడున్న పోలీసులకి Info పంపుతారు

https://pbs.twimg.com/media/DcwH4t-V0AEFlm8.jpg

 

  • 2 weeks later...
Posted

ఈ రోజు చిత్తూరు పట్టణంలో నూతన వన్ టౌన్ మోడల్ పోలీసు స్టేషన్ ను మంత్రులు చినరాజప్ప, అమరనాథ రెడ్డి ప్రారంభించరు. మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేరాలు తగ్గించేందుకు పోలీసుశాఖ వినూత్న శైలిలో ముందుకు సాగుతోందిఅన్నారు.

https://pbs.twimg.com/media/Dd_OqGTVwAAZUUv.jpg

https://pbs.twimg.com/media/Dd_OqGSVAAA9MjW.jpg

https://pbs.twimg.com/media/Dd_OqGUU0AAtLnT.jpg

Posted
2 minutes ago, sonykongara said:

endi bro

Image hosting ki imgur use sesthe, aa image 6 months evaru click seyyakapothe delete sestharu ga antunna. 

  • 1 month later...
  • 4 weeks later...
  • 2 weeks later...
Posted
మహిళలకు రక్షణగా మేమున్నాం!
22-08-2018 01:45:12
 
636704991145465174.jpg
  • వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం: డీజీపీ
  • ఏపీ పోలీస్‌ ట్రైనింగ్‌ మాన్యువల్‌ విడుదల
  • ఏపీ పోలీసులు దేశానికే ఆదర్శం: ‘ప్రజ్వల’ సునీత
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. మానవ అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం అంటూ.. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మహిళా లోకానికి భరోసా ఇచ్చారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌పై ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ.. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంతో 234 పేజీల పుస్తకాన్ని (ఏపీ పోలీస్‌ ట్రైనింగ్‌ మాన్యువల్‌) ప్రచురించింది. దేశంలో మానవ అక్రమ రవాణా, ఆపై శ్రమ దోపిడీ, శరీరాలతో వ్యాపారం, ముఠాల చిత్రహింసలు, బాధితుల అనుభవాలు.. ఇలా అన్ని కోణాలనూ స్పృశించి కేస్‌ స్టడీస్ తో రూపొందించింది. ఈ మాన్యువల్‌ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మంగళవారం విడుదల చేశారు.
 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ పోలీసుల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో బాలికలు, యువతులు, మహిళల్ని నరక కూపాల నుంచి బయటకు తీసుకొచ్చారంటూ అభినందించారు. సునీతా కృష్ణన్‌ మాట్లాడుతూ... మహిళలు, బాలికలు, యువతులే గాక బాలురు సైతం శ్రమదోపిడీ, లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాంతి భద్రతల ఏడీజీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, సీఐడీ చీఫ్‌ అమిత్‌ గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యభిచార కూపాల నుంచి బయటపడిన పలువురు బాధితుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిలో కొన్ని...
 
 
చేయి కోసుకుంటే కారం పెట్టారు..
ఢిల్లీలోని వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ పలమనేరు(చిత్తూరుజిల్లా) బాధితురాలు మాట్లాడుతూ.. పేద కుటుంబం లో జన్మించిన తనను ఒకామె పని ఇప్పిస్తానని ఢిల్లీ తీసుకెళ్లి వ్యభిచార ముఠాకు అమ్మేసిందని చెప్పింది. అక్కడ విటులతో గడపాలని వ్యభిచార ముఠాలు ఒత్తిడి తెచ్చాయని, అందుకు వ్యతిరేకించి బ్లేడుతో చేయి కోసుకుంటే కారం చల్లి మరింత హింసించారని కన్నీరు పెట్టుకుంది. చివరికి ప్రజ్వల సహకారంతో ఆ నరకం నుంచి బయటపడ్డానని పేర్కొంది.
 
 
చెల్లీ.. అని చెరిచాడు..
రాజమండ్రికి చెందిన మరో యువతి మాట్లాడుతూ... ‘పాఠశాలలో ర్యాగింగ్‌ చేసిందుకు తనను చదువు మాన్పించి మైనర్‌కు పెళ్లి చేసేందుకు అమ్మ(తండ్రి లేడు) ప్రయత్నించగా ఇంటి నుంచి పారిపోయి బస్టాండుకు వచ్చా. అక్కడ తన అన్న స్నేహితుడు కనిపించి ఏంటి చెల్లి ఇక్కడున్నావని ఆప్యాయంగా పలకరించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి తనపై అత్యాచారం చేశాడని వివరించింది. రేప్‌ వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి వ్యభిచార ముఠాలకు అమ్మేశాడని వాపోయింది.
 
 
కేరళవాసిగా దండం పెడుతున్నా: సునీతాకృష్ణన్‌
‘నాది కేరళ... నా కుటుంబసభ్యులు వరద నీటిలో ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్నారు... మొత్తం కేరళీయులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు... అటువంటి వారికి ఏపీ పోలీసులు రూ. 8 కోట్ల విరాళం అందించారు... కేరళ వాసిగా డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు దండం పెడుతున్నా’ అని సునీత కృష్ణన్‌ కన్నీటిపర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
Posted

Kurnool police twitter lo active gha reply istey best some 6 guys beating home guard video circulate chestu baffas congs vadinie panilo panie gha mananie include chesie news spreading police not taking action Anie 

already police arrested them but still they should have atleast made statement regarding it to put an end to this fake news baffas in social media 

  • 2 months later...
Posted
పోలీస్‌ పవర్‌!
30-10-2018 03:02:30
 
636764717778991268.jpg
విభజన తర్వాత ఏపీ పోలీస్‌కు అన్నీ కష్టాలే! ప్రధాన కార్యాలయం లేదు. సొంతంగా శిక్షణ సంస్థ లేదు. ఆధునిక ప్రయోగశాలలు లేవు. చివరికి ఆయుధ డిపో కూడా లేదు. అన్నీ కష్టాలే! వీటిని ఏపీ పోలీసులు ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నారు. పోలీసింగ్‌లో కొత్త పంథా పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. పోలీసు శాఖలోకి ఇంజనీరింగ్‌ పట్టభద్రులు పెద్దసంఖ్యలో వచ్చి చేరడం హైటెక్‌ పోలీసింగ్‌కు మరింత కలిసి వస్తోంది.
 
  • హైటెక్‌గా అవతరించనున్న ఏపీ పోలీసులు
  • సాంకేతికంగా పూర్తిస్థాయిలో బలోపేతం
  • సీఐ, ఎస్‌ఐలందరికీ యూనిఫామ్‌ కెమెరాలు
  • రూ.50 కోట్లతో 500 వాహనాలు
  • విదేశాల నుంచి 700 కెమెరాలు కొనుగోలు
  • కెనెడా నుంచి ఆధునిక డ్రోన్ల సమీకరణ
  • స్పీడ్‌ గన్లతో రాష్ట్రంలో ప్రమాదాల నియంత్రణ
  • ప్రతి జిల్లాలో సైబర్‌ ల్యాబ్‌, ఠాణాకు ఒక కిట్‌
  • వారంలోనే టెండర్లు... నెలలోపు కొనుగోళ్లు
  • మరో 3 వేల మంది సిబ్బంది నియామకం
  • రాష్ట్రవ్యాప్తంగా 120 మోడర్న్‌ పోలీసు స్టేషన్లు
  • ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్‌ కావడమే లక్ష్యం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అప్రమత్తంగా ఉండండి! రాష్ట్రంలో ‘ఫ్లాష్‌’ నేరాలు జరిగే అవకాశముంది! పోలీసింగ్‌ పద్ధతి మారాలి. ప్రమాదాలు తగ్గాలి. శాంతి భద్రతలకు ఎట్టిపరిస్థితుల్లో విఘాతం కలగొద్దు!
... అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల మేరకు ఏపీ పోలీస్‌ ‘హైటెక్‌’గా అవతరిస్తోంది. లాఠీలకు స్వస్తి చెప్పి టెక్నాలజీని సమకూర్చుకుంటోంది. పాత పోలీసింగ్‌ నుంచి అగ్రరాజ్య స్థాయి పోలీసు వ్యవస్థగా రూపుదిద్దుకొంటోంది. ఆందోళనకారులపై ‘డ్రోన్లు’ ప్రయోగించనుంది. వాదించే వారిని సైతం గౌరవిస్తూనే... యూనిఫామ్‌కు అమర్చే కెమెరాలతో బుక్‌ చేయబోతోంది. థర్డ్‌ డిగ్రీల స్థానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. కొత్త వాహనాలను సమకూర్చుకోనుంది. వీటన్నింటినీ సమీకరించుకునే ప్రక్రియ గురువారం (నవంబరు 1) నుంచే ప్రారంభం కానుంది. ఇప్పుడున్న పోలీసు వాహనాల్లో సగానికిపైగా డొక్కువే. ఈ సమస్యను ఇటీవల డీజీపీ ఠాకూర్‌ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసు వాహనాలకు ఒకేవిడతలో రూ.50 కోట్లు ఇస్తున్నట్లు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో 500 వాహనాలు కొనుగోలు చేసి, వాటిలో అధునాతన పోలీసింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కొత్త వాహనాలు ఉపయోగపడతాయని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
సైబర్‌ నేరాల కట్టడికి ల్యాబ్‌లు..
అంతకంతకు పెరుగుతున్న సైబర్‌ నేరాలు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు మంగళగిరి, అనంతపురంలలో అంతర్జాతీయ స్థాయి సైబర్‌ ల్యాబ్‌ల ఏర్పాటు దాదాపు కొలిక్కి తెచ్చింది. వీటికి అదనంగా మరో నాలుగు రీజనల్‌ ల్యాబ్‌లు, ప్రతి జిల్లాకు ఒక సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు... ప్రతి పోలీసు స్టేషన్లో ఎవిడెన్స్‌ టూల్‌ కిట్‌ అందుబాటులో ఉంచుతారు. క్షేత్రస్థాయిలో సైబర్‌ నేరాల బాధితులు ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే ఆధారాలు సేకరించేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని టెక్నికల్‌ ఐజీ సంజయ్‌ తెలిపారు.
 
విధ్వంసాలపై డ్రోన్లు..
హద్దులు దాటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసే ఆందోళనకారులను సాక్షాఽ్యధారాలతో సహాగుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నారు. మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలు, ఏజెన్సీలో గంజాయి సాగుపైనా డ్రోన్ల ద్వారా కన్నేస్తారు. చిత్రీకరణలో అద్భుతమైన ప్రమాణాలుండే ఈ డ్రోన్లను కెనడా నుంచి కొనుగోలు చేస్తున్నారు.
 
యూనిఫామ్‌లకే కెమెరా
పోలీసులతో వాదనకు దిగడం... ఆ తర్వాత పోలీసులే తమపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించడం! ఇలాంటివి ఇక చెల్లవు. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులంతా ‘యూనిఫామ్‌ కెమెరాలు’, (బాడావోర్న్‌ కెమెరాలు) ధరించనున్నారు. రాష్ట్రంలో 868 పోలీసు స్టేషన్లున్నాయి. ఇప్పటికే కొన్ని స్టేషన్లకు వీటిని అందించారు. కొత్తగా 700 కొనుగోలు చేస్తున్నారు.
 
ప్రమాదాలకు బ్రేకులు..
పోలీసుశాఖకు మరో ప్రధాన సమస్య రోడ్డు ప్రమాదాలు! వాటిని తగ్గించేందుకు రవాణా, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ తదితర శాఖలతో కలిసి పోలీసులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టారు. కొంతమేర ఫలితాలు వస్తునప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తిగాలేరు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి ముందుగా బ్రేకులు వేసేందుకు పెద్ద ఎత్తున బ్రీత్‌ ఎనలైజర్లను పోలీసుశాఖ కొనుగోలు చేస్తోంది.
 
విభజన కష్టాలు అధిగమిస్తూ..
రాష్ట్ర విభజనతో అన్నీ హైదరాబాద్‌లో వదిలేసుకుని అమరావతికి వచ్చేసిన ఏపీ పోలీసులకు కనీసం ఆయుధాలు దాచుకోవడానికి డిపోకూడా లేని దుస్థితి. ఇలా ఎన్నో కష్టాలు! ఒక్కోదాన్ని అధిగమిస్తూ వస్తున్నారు. మంగళగిరిలో లక్ష చదరపు గజాల్లో ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. పక్కనే ‘టెక్‌ టవర్‌’ను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలతో అనుసంధానం చేసి మూడో కన్ను తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశల దశలో 40, రెండో దశలో 80 ఠాణాలను మోడర్న్‌ పోలీసు స్టేషన్లుగా మార్చాలని నిర్ణయించారు.
 
రాష్ట్ర విభజన నాటికి సిబ్బంది కొరత, వాహనాల కొరత, టెక్నాలజీ పరంగా వెనుకబాటు ఇలా ఎన్నో రకాలుగా వెనుకబడ్డ ఏపీ పోలీసు శాఖ 2016 జూలైలో ఆరువేల మంది పోలీసులను నియమించుకుంది. మహిళా పోలీసులకు పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికీ ఈత, డ్రైవింగ్‌, టెక్నాలజీ అన్నింటా మెరుగైన అధునాతన ట్రైనింగ్‌ ఇచ్చింది. ఈ ఏడాది మే, జూన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అందరూ విధుల్లోకి వచ్చారు. దీంతో కొంతమేర పోలీసుశాఖ బలోపేతమైంది. ఇది సరిపోదని డీజీపీ ఠాకూర్‌ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడువేల మంది నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై నోటిఫికేషన్‌ వెలువడనుంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...