Jump to content

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted
సీఎం చెంతకు సామాన్యుడి స్వరం
 
636284465794728432.jpg
  • సకల సమస్యలు ‘పరిష్కార వేదిక’కు 28 శాఖలు అనుసంధానం 
  • సంధానకర్తగా ప్రణాళికా బోర్డు 
  • త్వరలో టోల్‌ ఫ్రీ నంబర్‌ కేటాయింపు 
  • కార్వీ కాల్‌సెంటర్‌తో గుంటుపల్లికి కార్పొరేట్‌ కళ 
సహాయం చేసే చేతుల్లేక, ఆదుకునే అపన్నహస్తం కనిపించక సామాన్యుల గొంతు అరచి అరచి ఆగిపోతోంది. వాళ్ల స్వరాన్ని ప్రభుత్వ ‘పెద్ద’కు చేర్చుతుంది ‘పరిష్కార వేదిక’. కార్వే ఆధ్వర్యంలో నడిచే ఈ కాల్‌సెంటర్‌ను ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని శుక్రవారం ప్రారంభించారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
ఇబ్రహీంపట్నం మండలం గుంటు పల్లిలో కార్వే ఆధ్వర్యంలో నడిచే కాల్‌సెంటర్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. స్టాక్‌మార్కెట్లో వివిధ కంపెనీలకు సేవలందిస్తున్న కార్వే సంస్థ ఈ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తుంది. కార్వే రాకతో ఆ గ్రామానికి కార్పొరేట్‌, హైటెక్‌ హంగులు అద్దబోతున్నాయి. ఈ కాల్‌సెంటర్‌కు ప్రభుత్వానికి మధ్య రాష్ట్ర ప్రణాళికాబోర్డు సంధానకర్తగా వ్యవహరిస్తుంది.
ఆరా ఇక్కడి నుంచే

వృద్ధాప్య, వితంతు పింఛన్లు.. చంద్రన్న బీమా.. ఎన్టీఆర్‌ గృహనిర్మాణం.. వంటి ప్రభుత్వసంక్షేమ పథకాలు.. రాష్ట్రంలోని నిరుపేదల చెంతకు చేరుతున్నాయా? లేదా? ప్రభుత్వానికి అధికారులు పంపుతున్న సమాచారం వాస్తవమేనా? అన్నవి లెక్కలేనన్ని ప్రశ్నలు. ప్రతినెల ఒకటి నుంచి అయిదో తేదీ వరకు పింఛన్లు పంపిణీ జరుగుతుంది. ఇది ప్తూయిన తర్వాత కార్వే కాల్‌సెంటర్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంలో ఒక ఫోనకాల్‌ వెళ్తుంది. ‘పింఛనఅందిందా? ఎంత ఇచ్చారు?’ అని ప్రశ్నిస్తారు. వాటికి లబ్ధిదారులు చెప్పే సమాధానం కాల్‌సెంటర్లో రికార్డవుతుంది. అలాగే వివిధ సమస్యలపై బాధితులు చేసే ఫోనకాల్స్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణాళికా బోర్డుకు పంపుతారు. అక్కడి నుంచి అదంతా ముఖ్యమంత్రికి చేరుతుంది.
  • పరిష్కార వేదికలో మొత్తం 1200 మంది ఉద్యోగులు పనిచేస్తారు.
  • రోజుకు 12 గంటలపాటు కాల్‌సెంటర్‌ పనిచేస్తుంది.
  • ఈ కాల్‌సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
  • మొత్తం 28 ప్రభుత్వ శాఖలు దీనికి అనుసంధానమై ఉంటాయి.
  • ఏ సమస్యపైనైనా బాధితులు ఈ కాల్‌సెంటర్‌కు ఫోన చేయవచ్చు.
  • ఫోన్ చేసే వ్యక్తి ముందుగా ఆధార్‌ నంబర్‌ చెప్పాలి. ప్రజా సాధికార సర్వే ద్వారా ప్రభుత్వం, ప్రజల సమస్త వివరాలనూ సేకరించింది. ఆధార్‌ నంబర్‌ చెప్పిన వెంటనే సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు కంప్యూటర్‌ స్ర్కీనపై ప్రత్యక్షమవుతాయి.
  • 100, 101, 108 ఫోననంబర్లను కొంతమంది ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి చేష్టలకు ఆస్కారం లేకుండ చేయడానికి ఆధార్‌ను తప్పనిసని చేశారు.
  • రెండు, మూడు రోజుల్లో ఈ కాల్‌సెంటర్‌కు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయిస్తారు.
  • సరదాగా సెల్ఫీలు..
  • కాల్‌సెంటర్‌ ప్రారంభానికి వచ్చిన సీఎం చంద్రబాబు కొద్దిసేపు విద్యార్థినులతో మాట్లాడారు. భద్రతా సిబ్బందిని వారించి మరీ వారితో సెల్ఫీలకు చిరునవ్వుతో ఫోజులిచ్చారు. స్థానిక గ్రామస్థులతో సైతం ఆయన మాట కలిపారు. వేదిక మీద స్థానిక నాయకులు చెరుకూరి వెంకటకృష్ణ, నల్లూరు సూర్యనారాయణ, సర్పంచ్‌ డి.వెంకటరమణలు శాలువతో సత్కరించి సీఎంకు కొండపల్లి బొమ్మను బహూకరించారు. కాల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు అధికసంఖ్యలో హజరుకావటంతో వేదిక నిండుగా కనిపించింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, జవహార్‌, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, కార్వీ చైర్మన్‌ పార్థసారథి, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావటంతో గుంటుపల్లిలో సందడి నెలకొంది.
Posted
కైజాలా... ఏపీ సీఎం కనెక్ట్‌తో సమస్యల పరిష్కారం
 
636289666623805264.jpg
  • మొబైల్‌ ఫోనుతోనే ఫిర్యాదులు 
  • తక్షణం స్పందించే అవకాశం
మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికో వెళ్లారు. అక్కడ మిమ్మల్ని ఎవరైనా లం చం అడిగారు. అక్కడి నుంచే నేరుగా మీరు ఫిర్యాదు పంపించవచ్చు. మీరు ఎక్కడ నుంచి పంపారు? మీ ఫోన్‌ నంబర్‌ ఏంటి? నాకు తెలుస్తుం ది. ఆ వివరాలు కూడా మాకు తెలియకూడదని మీరనుకుంటే, యాప్‌లో దానికీ అవకాశం ఉంది. మీరు చేసే ఫిర్యాదులపై నేను తక్షణమే చర్యలకు ఆదేశించే అవకాశం ఉంటుంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గుంటూరు, చిలకలూరిపేట అర్బన్‌: మీ ప్రాంతంలో రోడ్డు సమస్య ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంత మొత్తుకున్నా ఫలితం శూన్యం. మీరు పట్టాదారు పాస్‌ పుస్తకానికో. మరో పని కోసమో ప్రభుత్వ కార్యాలయానికి వెళితే చేయి తడిపితేగానీ పనికావడం లేదు. మీ ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.. రేషన్‌సరుకులకు ఇబ్బందులు పడుతున్నారు... సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదు.. ఇలా అనేక సమస్యలున్నా ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటికి చక్కని పరిష్కారం చూపేందుకు సామాన్యుడి చేతికి మరో అస్త్రం అందుబాటులోకి వచ్చింది. అదే ఏపీ సీఎం కనెక్ట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిద్వారా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. జిల్లాలో 11 లక్షలమంది ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇలాంటి వారు వారి ప్రాంతాంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మంచి అవకాశం.
వీటిపైనా స్పందించవచ్చు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో దందా ఎక్కువైంది. వైద్యసేవలకు వెళ్లేవారిని సొమ్ములు డిమాండ్‌ చేస్తూన్నారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు బయటపడ్డాయి. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి ఎక్కువగానే ఉంది. కొందరు ఇలాంటి వారిని ఏసీబీకి పట్టించారు. మరికొందరు ఇబ్బందులు పడుతూనే ముడుపులు చెల్లించి పనులు చేయించుకుం టున్నారు. ఇలాంటివారు వారి సమస్యలను తెలియజేయడానికి ఈ యాప్‌ను వినియోగి ంచుకోవచ్చు. భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలు తీరడం లేదనే సమస్యను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. రేషన్‌ సరుకుల విషయ ంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదు, రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణం ముందుకు కదలని పరిస్థితిపై. కాలువలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అనేక సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఈ యాప్‌ ద్వారా ఉంది.
  • 4 weeks later...
Posted

పీపుల్స్ ఫస్ట్’ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు
 

విజయవాడ: విజయవాడలోని ఎ-కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఆయన అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతి, రానున్నకాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పీపుల్స్ ఫస్ట్ పేరుతో కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్ నెంబర్ 1100గా నిర్ణయించారు.
  • 2 weeks later...
Posted

మెక్కిందంతా కక్కిస్తున్నాం

లంచావతారాలపై విచారించి తీసుకున్న సొమ్ము తిరిగి బాధితులకు ఇప్పించేస్తున్నాం

1100 నెంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చు

నేతలే కాదు ఎవరిపైనైనా చెప్పొచ్చు

పంటల బీమా కనీసం రూ.15 వేలు ఇస్తాం

డాక్టర్‌ షిలా భిµడే కమిటీ సిఫార్సుల ఆమోదం

మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు వెల్లడించిన సీఎం

ఈనాడు - అమరావతి

1ap-main1a.jpg

అందివచ్చిన సాంకేతిక సాయంతో అవినీతిపై పోరు సల్పుతున్నామని, లంచావతారుల భరతం పడుతున్నామని చంద్రబాబు అన్నారు. 1100 నంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చని తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడిస్తూ ఈ విషయం చెప్పారు. ఫిర్యాదులన్నింటినీ మీ కోసం వెబ్‌సైట్‌లో పెడుతున్నట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను విచారించి లంచం తీసుకున్నట్టు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇప్పించేస్తున్నామని తెలిపారు.

Posted
లంచం డబ్బులు వెనక్కి!
 
 
  • పరిష్కార వేదికతో చర్యలు
  • ఇప్పటి వరకు 12 మంది తిరిగి ఇప్పించిన వైనం
అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఇంతకాలం భవిష్యత్‌లో లంచాలు లేకుండా ఎలా నిర్మూలించాలనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు... తీసుకున్న లంచాలను లబ్ధిదారులకు తిరిగి ఇప్పించే సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ‘పరిష్కార వేదిక’ కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి.. లంచాలు తిన్నది వాస్తవమని తేలితే తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 12 మంది నుంచి లంచాలు తిరిగి ఇప్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. లంచాలు తీసుకున్న వారి పేర్లు చెప్పకుండా, వాటి వివరాలను గురువారం ప్రెస్‌మీట్‌లో వివరించారు. పెన్షన్లపై 1,20,800 కాల్స్‌ వస్తే అందులో 4శాతం మంది లంచాలపై ఫిర్యాదులు చేశారన్నారు. రేషన్‌కు సంబంధించి 2లక్షల కాల్స్‌ వస్తే అందులో 1.25శాతం లంచాల ఫిర్యాదులు అందాయన్నారు. చంద్రన్న బీమాలో 3శాతం లంచాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. మొత్తం 25వేల కాల్స్‌లో ఫిర్యాదులు అందాయన్నారు. ‘కడప జిల్లాలో ఒక బ్రోకర్‌ చంద్రన్న బీమాలో ఒక లబ్ధిదారు నుంచి రూ.వెయ్యి లంచం తీసుకున్నాడు. విచారణ జరిపిస్తే తిరిగిచ్చాడు. కర్నూలు జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి పెన్షన్‌ విషయంలో రూ.500 లంచం తీసుకున్నట్లు తేలింది. దానిని తిరిగివ్వాలని ఆదేశించగా... దాంతోపాటు మొత్తం పది మంది వద్ద తీసుకున్న మొత్తాలను ఇచ్చేశాడు. ఫిర్యాదులపై విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటాం. రాజకీయ అవినీతి కూడా సహించేది లేదు. 1100 నంబరుకు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు సమాచారమివ్వాలి’ అని సీఎం కోరారు.
Posted

This is the best decision to reach out to people

Hope this helps solving the problems of those in need

annai antha emi leydhu ahh app lo ..CM weekly or 10 days okka survey adugutaadu...mnama reply iccehy option icchadu ....

Posted

అవినీతిపై అస్త్రం ఫిర్యాదుల కేంద్రం

సమాచారమిచ్చిన వాళ్లకు ప్రభుత్వం అండ: పరకాల ప్రభాకార్‌

ఈనాడు, అమరావతి: అవినీతిపరులపై, సర్కారు సేవలకు లంచాలు తీసుకునేవాళ్ల సమాచారాన్ని అందించిన వాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వివరాలు చెప్పిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. వీరికి తగిన రక్షణ కల్పించాలని, ప్రజావేగుల రక్షణకు సంబంధించిన చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ‘1100’ నెంబర్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రం (కాల్‌సెంటర్‌) అవినీతిపై ఓ అస్త్రమని అభివర్ణించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. పింఛన్లు, చంద్రన్న బీమా, రేషన్‌కి సంబంధించి లబ్ధిదారుల నుంచి స్పందన తీసుకున్నామని చెప్పారు. అవినీతికి సంబంధించి మూడు వేల మంది ప్రస్తావించగా... వారితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కొద్ది మందే వివరాలు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేశారని, ఆ వివరాల ఆధారంగా ఎవరికి లంచం ఇచ్చారో వాళ్లతో కూడా మాట్లాడామని వివరించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు, ఇంకెవరైనా... ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పాలన్నారు.

రాష్ట్రం వీధినపడ్డ రోజనే... నవనిర్మాణ దీక్షను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర నిర్వహించడాన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీలు తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని పరకాల వ్యాఖ్యానించారు. రాష్ట్రం వీధినపడిన రోజు అనీ, జరిగిన అన్యాయంపై ఓ గంటసేపు మాట్లాడి అందరిలో స్ఫూర్తి నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమన్నారు.

Posted
లంచం సొమ్ము కక్కిస్తున్న 1100 కాల్ సెంటర్ Super User 02 June 2017 Hits: 1700  
call-center-ap-02062017.jpg
share.png

ఇంతకాలం భవిష్యత్‌లో లంచాలు లేకుండా ఎలా నిర్మూలించాలనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు... తీసుకున్న లంచాలను లబ్ధిదారులకు తిరిగి ఇప్పించే సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

టెక్నాలజీ... ఆధునిక పరిపాలనా వ్యవస్థలో పాలకులకు ఒక అస్త్రం. సమస్యలకు ఒక సులభ పరిష్కార వినియోగ వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ సెంటర్లు అవినీతి అధికారుల పై ప్రజలు నేరుగా ఘుళిపించే కొరడాగా మారుతున్నాయి.

'ప్రజలే ముందు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి. వివిధ అవసరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తున్న లబ్దిదారులకు అక్కడక్కడా అవినీతి జాడ్యం తప్పడం లేదన్నది ప్రభుత్వం ప్రారం భించిన పరిష్కార వేదిక దృష్టికి వస్తుంది. బుధవారం ఒక్క రోజే 12 మంది లబ్దిదారులు, అధికారులకు, దళారులకు లంచం రూపంలో చెల్లించిన నగదును ముక్కపిండి వసూలు చేసి వెనుకకు తిరిగి అప్పగించేలా రియల్ టైం గవర్నెన్స్ విభాగం ఒక కొత్త ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది.

1100 పేరుతో ముఖ్యమంత్రి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రారంభించిన కాల్ సెంటర్ నంబర్ చురుగ్గా పని ప్రారంభించింది. మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొత్తం 23,827 ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే రేషన్ పెన్షన్, చంద్రన్న భీమా పధకం లభ్దిదారుల స్పందన తెలుసుకోడానికి ఈ కాల్ సెంటర్ నుంచి భారీగా ఫోన్ కాల్స్ చేస్తే అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

 

చంద్రన్న బీమా గురించి తెలుసుకోవటానికి 50 వేల పైగా కాల్స్, రేషన్ సంబంధించి తొమ్మిది లక్షలకు పైగా, పెన్షన్ల గురించి 6 లక్షలు, మిర్చి సమస్య పై 20వేలకు పై గా ఫోన్ కాల్స్, కాల్ సెంటర్ నుంచి లబ్దిదారులకు వెళ్ళాయి. లంచం పై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకోడానికి కాల్ సెంటర్ ప్రతినిధులు మూడు వేలకు పైగా కాల్స్ చేశారు. ఇలా చేసిన ఫోన్ కాల్స్ వల్ల నిన్న ఒక్క రోజే 12మంది లబ్దిదారులు, అధికారులకు తామిచ్చిన లంచాలను వెనక్కి పొందేలా చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ బృందం అధికారులు సక్సెస్ అయ్యారు.

కర్నూలు జిల్లాలో ఓ మహిళ పింఛను కోసం పంచాయతీ కార్యదర్శికి 500 రూపాయలు లంచం ఇచ్చినట్టు తెలియడంతో ఆ లంచం డబ్బును ఆ అధికారి నుంచి 1100 రియల్ టైం గవర్నెన్స్ బృందం వాసులు చేయించి తిరిగి ఆ లభ్దిదారునికి చెల్లించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమెకే కాకుండా మరో 10 మంది లభ్దిదారులకు లంచం డబ్బు ఆ అధికారి వెనిక్కి ఇచ్చేశారు.

కడప జిల్లలో మరో పించనుదారురాలు ఒక దళారికి 1000 రూపాయలు లంచం ఇవ్వగా 1100 కాల్ సెంటర్ పసిగట్టి ఆ లంచం డబ్బు వెనక్కి ఇప్పించింది.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పౌరుడు, డెత్ క్లెయిమ్ పరిష్కారం కోసం 500 రూపాయలు లంచం రూపంలో ఇస్తే దాన్ని కూడా ఆ లంచం తీసుకున్న వ్యక్తి నుంచి తిరిగి ఆ పౌరుడికి ఇప్పించారు.

"1100 నంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చని, ఫిర్యాదులపై విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటాం. రాజకీయ అవినీతి కూడా సహించేది లేదు. 1100 నంబరుకు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు సమాచారమివ్వాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు

  • 1 month later...
  • 2 months later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...