Jump to content

AP New Land Acquisition Bill


Recommended Posts

http://www.nandamurifans.com/forum/index.php?/topic/358791-aps-new-land-acquisition-act/

Andhra Pradesh is mulling to make amendments to the existing Land Acquisition Act to effectively handle legal hurdles and to speeded up the process by cutting short the lengthly/time taking procedures. Based on Section 107 of the Central Act, State Government wants to introduce its own Land Acquisition Act without affecting the framework of Centre's Land Acquisition Act 2013. Officials say, The new Act will be a win-win situation for Government & Land Owners.

Four Amendments under consideration:

1) While Central Act fixed 6 months as the time period for Social Impact Assessment, AP Govt wants to reduce it to as low as possible.

2) In Central Act, There is no provision for advance possession of the Land. Only Lands for Defence Projects & Natural Calamity relief measures needn't follow mandatory procedure. Whereas, AP Govt is keen to include a provision which permits acquisition even before the completion of legal process.

3) AP Govt plans to introduce an 'Urgency Clause' for acquiring land for infrastructure projects.

4) AP Govt wishes to introduce 'Consent Award' under which Land Owners can't challenge the land acquisition in the court once after issuing the consent letter.

Link to comment
Share on other sites

భూసేకరణ కోసం కొత్త చట్టం
ఏపీ అవసరాలకు అనుగుణంగా కసరత్తు
సామాజిక ప్రభావ మదింపు ప్రక్రియ కుదింపు
తమిళనాడు తరహాలో విభాగాలవారీగా చట్టాలు
కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

భూసేకరణ సందర్భంలో కీలకమైన సామాజిక ప్రభావాన్ని లెక్కించే ప్రక్రియను వీలైనంత కుదించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సేకరణ ప్రక్రియను వీలైనంత వేగంగా చేయాలంటే చట్టంలో సవరణలు చేయడం తప్పనిసరి. అయితే భూసేకరణ చట్టం 2013కి జాతీయస్థాయిలో సవరణలు సాధ్యం కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే విడిగా మరో చట్టాన్ని తీసుకురాబోతోంది. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వస్తే సామాజిక ప్రభావం ఎలా ఉంటుంది? పరోక్షంగా ఎంతమంది ఉపాధి కోల్పోతారు? వారికివ్వాల్సిన పరిహారం ఎలా గణించాలి? లాంటి అంశాలతో కూడిన ప్రక్రియపై భూసేకరణ చట్టం 2013లో ప్రధానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. చట్టంలోని రెండో భాగంలో ఉన్న సామాజిక ప్రభావ మదింపు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలంటే కనీసం ఏడాదిన్నరపడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన భూమిని సేకరించడం కష్టంగా మారుతోందన్నది ప్రభుత్వ భావన. ఈ క్రమంలో కేంద్ర చట్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మరో భూసేకరణ చట్టాన్ని చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు తమిళనాడులో ఉన్న భూసేకరణ చట్టాలను అనుసరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా భూసేకరణ చట్టం చేసుకొనే వెసులుబాటు ఉందని ఇప్పటికే న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. కొన్ని రంగాల అవసరాలకు అనుగుణంగా సేకరణ చట్టాలను కేంద్రంలో కూడా చేసుకొన్నారనీ, రైల్వే చట్టంలోనూ, జాతీయ రహదారుల చట్టంలోనూ కూడా భూసేకరణకు అనుసరించే నిబంధనలను విడిగా పేర్కొన్నారని కూడా న్యాయశాఖ స్పష్టం చేసింది. ఇదే తరహాలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు ప్రత్యేక భూసేకరణ చట్టాలను గతంలోనే చేసుకొంది. అక్కడ దళితులు, వారి సంక్షేమ అవసరాలకు భూమి అవసరమైన సందర్భంలో సేకరించేందుకు 1978లోనే ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. ‘తమిళనాడు హరిజన్‌ సంక్షేమ భూసేకరణ చట్టం - 1978’గా అమలులో ఉంది. అలాగే పారిశ్రామిక అవసరాల నిమిత్తం 1997లోనూ, రహదారుల నిర్మాణం కోసం 2001లో వేర్వేరుగా భూసేకరణ చట్టాలు చేశారు. కొత్త చట్టం వచ్చాక కూడా ఇవే అమలులో ఉండేలా తమిళనాడు ప్రభుత్వం చేసిన సవరణకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.

ఇటీవల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రతి జిల్లాలోనూ భూ బ్యాంక్‌ ఏర్పాటు అంశంపై చర్చిస్తూ సేకరణలో ఉన్న ఇబ్బందులపై చర్చించారు. తమిళనాడు తరహా భూసేకరణ విధానాలను తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ అవసరాల వారీగా ప్రత్యేక భూసేకరణ చట్టాలు రూపొందించాలని భావిస్తున్నారు. ఇటీవలే దీనిపై రెవెన్యూ, న్యాయశాఖ అధికారులు ప్రాథమిక చర్చలు చేశారు. కొత్త చట్టంలో 2013నాటి భూసేకరణ చట్టంలో కంటే తక్కువగా పరిహారం, పునరావాసం ఉంటే రాష్ట్రపతి ఆమోదం పొందదు. అందులో చెప్పినట్లుగానీ, అంతకంటే మెరుగైన విధంగా ఇస్తూనే కొత్త చట్టాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొంటే రాష్ట్రపతి నుంచి అభ్యంతరాలు రావని నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక ప్రభావ మదింపు ప్రక్రియను కుదించే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

స్పీడుగా సేకరణ
 
636261715965611611.jpg
  • ‘కీలక’ క్లాజులకు మినహాయింపు
  • కేంద్ర చట్టంలో కీలక మార్పులు
  • పరిహారంలో కలెక్టర్‌ ఆమోదమే ఫైనల్‌
  • వందెకరాల లోపైతే నగదుతోనే క్లియర్‌
  • ముసాయిదా బిల్లు రెడీ.. నేడో రేపో సభకు

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజోతి): గ్రామసభ ఆమోదం... సామాజిక ప్రభావం అంచనా... ఆహారభద్రత! కేంద్ర భూసేకరణ చట్టం-2013లోని అత్యంత కీలకమైన క్లాజులివి. అయితే వీటితో భూసేకరణ చేయలేక, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ముందడుగు వేయలేకపోతున్నామని భావించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... ఈ చట్టాన్ని సవరించేందుకు ముసాయిదా బిల్లు రూపొందించింది. కేంద్ర చట్టాన్ని గుజరాత్‌ తన అవసరాల కోసం సవరణ చేసుకుంది. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. గుజరాత్‌ తరహాలోనే ఏపీ కూడా సవరణలు ప్రతిపాదించింది. కేంద్ర చట్టంలోని ఏ ఒక్క క్లాజునూ తొలగించకుండా... వాటి అమలులో మినహాయింపులను చేరుస్తూ సరికొత్త వ్యూహంతో బిల్లును రూపొందించింది. న్యాయశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక ఈ డ్రాఫ్ట్‌ బిల్లును మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీన్ని వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 
కేంద్ర భూసేకరణ చట్టం-2013లో నిర్వాసితులతోపాటు భూములపై ఆధారపడిన శ్రామికవర్గాన్ని కాపాడేందుకు అనేక క్లాజులు ఉన్న సంగతి తెలిసిందే. ఒక గ్రామం పరిధిలో పెద్దమొత్తంలో భూములను సేకరించడం వల్ల రైతులు, శ్రామికులు, గ్రామాభివృద్ధిపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉందని సామాజిక అంచనాలో తేలితే... భూసేకరణ చేయడానికి వీల్లేదని ప్రస్తుత చట్టం చెబుతోంది. ఇక రెండు పంటలు పండే సారవంతమైన భూములను కూడా సేకరణ నుంచి దూరంగా ఉంచాలని చట్టం స్పష్టం చేస్తోంది. రైతాంగ, శ్రామిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు భూసేకరణకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి అన్న క్లాజును చేర్చారు. ఒకవేళ భూసేకరణకు రైతులు అంగీకరించినా నిర్వాసితులయ్యేవారికి, ఉపాధి కోల్పోయే శ్రామికవర్గానికి పునరావాసం కల్పించాలని, రెట్టింపు పరిహారం ఇవ్వాలని చట్టం చెబుతోంది. అయితే, ఈ క్లాజుల వల్ల పలు అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని కేం ద్రం భావించింది. చట్టంలోని అనేక క్లాజులను తొలగించి ఆర్డినెన్స్‌ తెచ్చింది. అయితే అది పార్లమెంటులో చర్చకే రాలేదు. ఫలితంగా ఆర్డినెన్సులు నిలబడలేదు.
 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రా‌లే భూసేకరణ చట్టాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలంటూ కేంద్రం సూచించింది. లోగడ ఏపీ ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ముందుకుసాగలేదు. భూసేకరణ చట్టం-2013కు సవరణలు చేసే విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆహార భద్రత, సామాజిక ప్రభావం అంచనా, రెట్టింపు పరిహారం, గ్రామసభల ఆమోదం వంటి కీలకమైన అంశాలను చట్టం నుం చి తొలగించలేదు. అయితే పలు కీలక ప్రాజెక్టులకు అవి వర్తించవని(ఎక్స్‌క్లూజన్స్‌) సవరణలు ప్రతిపాదిస్తూ... సహేతుకమైన నష్టపరిహారం, పారదర్శకతతో కూడిన భూసేకరణ, పునరావాస, సహాయం(ఏపీ సవరణ) బిల్లు- 2017 (భూసేకరణ చట్టం-2017)గా దీనికి పేరుపెట్టారు.
 
 
ఏపీ సవరణలు ఇవీ..
1. భూసేకరణ చట్టం-2013లో చాప్టర్‌ 2, 3, వాటి పరిధిలోని మూడు సెక్షన్లు, 4 సబ్‌సెక్షన్లు గ్రామసభలు, మెజారిటీ ప్రజల ఆమోదం, సామాజిక ప్రభావం అంచనా, ఆహారభద్రత వంటి అంశాలను సూచిస్తున్నాయి. అయితే, కొన్ని ప్రాజెక్టులకు ఈ రెండు చాప్టర్లు వర్తించవంటూ సెక్షన్‌-10(ఏ) కింద సవరణ ప్రతిపాదించారు. ఇందులో దేశ రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణ రంగం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నెలకొల్పే ఇండసి్ట్రయల్‌ కారిడార్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పబ్లిక్‌ ప్రైవే టు పార్టనర్‌షిప్(పీపీపీ) ప్రాజెక్టుల (భూమి పై ప్రభుత్వానికి యాజమాన్యపు హక్కు ఉంటే)లను చేర్చారు.
 
2. పూర్వపు భూసేకరణ చట్టంలో జిల్లా కలెక్టర్‌ కన్సెం ట్‌ అవార్డు ఉండేది. కానీ, 2013 భూసేకరణ చట్టంలో దీన్ని తొలగించి... రైతులు ఎంతమేరకైనా పరిహారం, పునరావాసం కోరేలా క్లాజులు చేర్చారు. ఇప్పుడు తాజాగా సవరణ బిల్లులో కలెక్టర్‌ కన్సెంట్‌ అవార్డు ఉండాలని ప్రతిపాదించారు. సెక్షన్‌ 23(ఏ) కింద కన్సెంట్‌ అవార్డును ప్రతిపాదించారు. భూసేకరణ ధరను ఖరారు చేసిన తర్వాత నిర్వాసితులు ఆ ధరకు అంగీకరిస్తే ఇక అదే ఫైనల్‌.
 
3. పాత భూసేకరణ చట్టం మేరకు అవార్డు పాస్‌ చేశా క సంబంధిత రైతులు డబ్బు తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్‌ చేసేవారు. ఆ కేసు తేలేవరకూ భూమిని ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోజాలదు. ఇక ఐదేళ్ల కాల వ్యవధి దాటిన తర్వాత ఆ అవార్డు పనిచేయదు. తాజాగా సెక్షన్‌ 23(ఏ) కింద కన్సెంట్‌ అవార్డు ప్రతిపాదించారు. దీనికి అనుబంధంగా సెక్షన్‌(24)లో సబ్‌సెక్షన్‌-2 కింద... కన్సెంట్‌ అవార్డు ప్రకటించిన తర్వాత... దానిపై వచ్చే కోర్టు చిక్కులతో సంబంధం లేకుండా భూసేకరణ అవార్డు చెల్లుబాటయ్యే కాలంలోనే భూములను స్వాధీనంచేసుకునేలా సవరణ ప్రతిపాదించారు. అంటే... కోర్టుల్లో కేసు నడిచినంతకాలం భూమిని తీసుకోవద్దన్న నిబంధన ఉండదు.
 
4. 100 ఎకరాలు లేదా అంతకన్నా తక్కువగా భూమిని సేకరిస్తే నిర్వాసితులకు పరిహారంతోపాటు పునరావాసం, సహాయం ప్రకటించాలి. ఆ తర్వాతే భూములు తీసుకోవాలని చట్టంలోని సెక్షన్‌-31 చెబుతోంది. దీనికి మినహాయింపును ప్రతిపాదిస్తూ కొత్తగా సెక్షన్‌ 31(ఏ)ను ప్రతిపాదించారు. దీని ప్రకారం 100 ఎకరాలు, అంతకన్నా తక్కువగా భూమిని సేకరిస్తే నిర్వాసితులకు పరిహారం కింద ఖరారు చేసిన ధరపై అదనంగా మరో 50 శాతం కలిపి... అంటే 150 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఇక పునరావాసం, ఇతర అంశాలను మినహాయించారు. దీనివల్ల చిన్న ప్రాజెక్టులు తర్వితగతిన పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
 
5. కేంద్ర చట్టంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంది. సెక్షన్‌-40 ఇదే చెబుతోంది. అయితే కేంద్ర చట్టానికి రాషా్ట్రలు సవరణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవరించాలని ప్రతిపాదించారు. సెక్షన్‌-40 వద్ద సబ్‌ సెక్షన్‌-2ను చేరుస్తూ ‘‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాషా్ట్రలు నిర్ణయం తీసుకోవచ్చు’’ అనే అర్థం వచ్చే లా సవరణ ప్రతిపాదించారు. అంటే సమయం, సందర్భా న్ని బట్టి రాషా్ట్రలు అత్యవసరం అనే పేరిట చట్టసవరణ చేసుకునేలా ఇది ఉపయోగపడుతుంది.
 
6. భూసేకరణ చట్టం దుర్వినియోగానికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సెక్షన్‌-87కు సవరణ ప్రతిపాదించారు.
Link to comment
Share on other sites

Is this something similar to what Telangana tried to do to acquire land for the 50tmc storage. That didn't end well. Hope this works out.

 

I think that one was Mallanna Sagar. Issue there was mainly related to compensation being too low. AP bill does not alter the compensation any way. it mainly deals with speeding up the acquistion.

Link to comment
Share on other sites

భూసేకరణ... ఇక ఈజీ!
 
  • పలు క్లాజులకు ‘మినహాయింపు’
  • ధర ఖరారులో అమల్లోకి కలెక్టర్‌ కన్సెంట్‌
  • పునరావాసం లేకుండా 150 శాతం చెల్లింపుతో సరి
  • చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం
  • చుక్కల భూములకూ పరిష్కారం
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన అవరోధంగా ఉన్న ‘భూసేకరణ’ సమస్యను ప్రభుత్వం ఇక సులభంగా అధిగమించనుంది. వంద ఎకరాలు కాదూ... ఒకేసారి రెండువేల ఎకరాలనైనా సులువుగా సేకరించగలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ శాసనసభలో మంగళవారం బిల్లును ఆమోదించింది. ఇక దీన్ని గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదించాక ‘ఆంధ్రప్రదేశ్‌ సవరణ చట్టం-2017’ అమల్లోకి రానుంది.
 
చట్ట సవరణలోని కీలకాంశాలు
1. భూసేకరణ చట్టం-2013లోని చాప్టర్‌ 2, 3, వాటి పరిధిలోని మూడు సెక్షన్లు, నాలుగు సబ్‌ సెక్షన్లలో చెప్తున్న గ్రామసభలు, మెజారిటీ ప్రజల ఆమోదం, సామాజిక ప్రభావం అంచనా, ఆహారభద్రత వంటి క్లాజులను కొన్ని ప్రాజెక్టులకు అమలు చేసే విషయంలో ఈ కొత్త చట్టంలో మినహాయింపు ఇచ్చారు. అంటే... రాష్ట్ర ప్రజల మేలు దృష్ట్యా దేశ రక్షణ , గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణ రంగం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నెలకొల్పే ఇండసి్ట్రయల్‌ కారిడార్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పబ్లిక్‌-ప్రైవేటు పార్టనర్‌షి్‌ప(పీపీపీ) ప్రాజెక్టుల(భూమిపై ప్రభుత్వానికి యాజమాన్యపు హక్కు ఉంటే )కు వర్తించవంటూ ప్రత్యేకంగా 10(ఏ) కింద మినహాయింపులు ఇచ్చారు. ఈ మార్పు ద్వారా గ్రామసభల నిర్వహణ, సామాజిక అంశాలపై సర్వేలు చేపట్టకుండానే భూమి సేకరించుకోవచ్చన్నమాట.
2. పూర్వపు భూసేకరణ చట్టంలో జిల్లా కలెక్టర్‌ కన్సెంట్‌ అవార్డు ఉండేది. 2013 భూసేకరణ చట్టంలో దీన్ని తొలగించారు. రైతులు ఎంతమేరకైనా పరిహారం, పునరావాసం కోరేలా క్లాజులు చేర్చారు. ఇప్పుడు తాజాగా సవరణ బిల్లులో కలెక్టర్‌ క న్సెంట్‌ అవార్డు ఉండాలని ప్రతిపాదించారు. సెక్షన్‌ 23(ఏ) కింద కన్సెంట్‌ అవార్డును చేర్చారు. భూసేకరణ ధరను ఖరారు చేసిన తర్వాత నిర్వాసితులు ఆ ధరకు అంగీకరిస్తే ఇక అదే ఫైనల్‌.
3. పాత భూసేకరణ చట్టం మేరకు అవార్డు పాస్‌ చేశాక సంబంధిత రైతులు డబ్బు తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్‌ చేస్తున్నారు. అ కేసు తేలే వరకూ ప్రభుత్వం భూమిని తన స్వాధీనంలోకి తీసుకోలేదు. ఇక ఐదేళ్ల కాల వ్యవధి దాటిన తర్వాత ఆ అవార్డు పనిచేయదు. 2013 కేంద్ర చట్టంలో ఈ ప్రొవిజన్‌ లేదు. తాజాగా సెక్షన్‌ 23(ఏ) కింద కన్సెంట్‌ అవార్డు ప్రతిపాదించారు. దీనికి అనుబంధంగా సెక్షన్‌24లో సబ్‌సెక్షన్‌-2 కింద... కన్సెంట్‌ అవార్డు ప్రకటించిన తర్వాత దానిపై వచ్చే కోర్టు చిక్కులతో సంబంధం లేకుండా భూసేకరణ అవార్డు చెల్లుబాటయ్యే కాలంలోనే భూములను స్వాధీనం చేసుకునేలా సవరించారు. అంటే... కోర్టుల్లో కేసు నడిచినంతకాలం భూమిని తీసుకోవద్దన్న నిబంధనను మినహాయించారు.
4. 100 ఎకరాలు లేదా అంతకన్నా తక్కువగా ప్రభుత్వం భూమిని సేకరిస్తే నిర్వాసితులకు పరిహారంతోపాటు పునరావాసం, సహాయం ప్రకటించాలి. ఆ తర్వాతే భూములు తీసుకోవాలని చట్టంలోని సెక్షన్‌ 31 చెబుతోంది. దీనికి మినహాయింపును ప్రతిపాదిస్తూ కొత్తగా సెక్షన్‌ 31(ఏ)ను ప్రతిపాదించారు. దీని ప్రకారం 100 ఎకరాలు, అంతకన్నా తక్కువగా భూమిని సేకరిస్తే నిర్వాసితులకు పరిహారం కింద ఖరారు చేసిన ధరపై అదనంగా మరో 50 శాతం కలిపి... అంటే 150 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఇక పునరావాసం, ఇతర అంశాలను మినహాయించారు. దీనివల్ల చిన్న ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
5. కేంద్ర చట్టంలో సవరణలు చేసే అధికారం పార్లమెంట్‌కే ఉంది. అయితే కేంద్ర చట్టానికి రాష్ట్రాలు సవరణలు చేస్తున్న నేపథ్యంలో సెక్షన్‌40 వద్ద సబ్‌ సెక్షన్‌-2ను చేరుస్తూ... ‘‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు’’ అని ప్రతిపాదించారు. అంటే ఈ చట్టాన్ని తమ అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు సవరించుకోవచ్చన్నట్లుగా సవరణ ప్రతిపాదించారు.
6. భూసేకరణ చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సెక్షన్‌ 87కు సవరణ ప్రతిపాదించారు.
చుక్కల చిక్కులకు సైతం..
‘చుక్కల భూముల’ వివాదానికి ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం ఓ పరిష్కారం చూపించింది. 1916 నాటికి ఆర్‌ఎస్ ఆర్‌ రిజిస్టర్‌ లేదా ‘రిజిస్టర్‌-ఏ’లో నమోదైన వివరాల ఆధారంగా పరిష్కారం చూపాలని, ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్‌ చేస్తోన్న భూములను పక్కా నిర్ధారణలు, ధ్రువపత్రాలను పరిశీలించిన మీదట వాటిపై హక్కులు కల్పించాలని ‘చుక్కల భూముల చట్టం-2017’ బిల్లులో పొందుపరిచారు. మంగళవారం ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. గవర్నర్‌ ఆమోదం అనంతరం చట్టం అమల్లోకి వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కనీసం 12 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ కాలంగా చుక్కల భూములపై హక్కులు కలిగి ఉన్నవారు, పొజిషన్‌లో ఉన్నవారు పక్కా డాక్యుమెంట్లు, పత్రాలను చూపిస్తే చట్టప్రకారం వారికి హక్కులు కల్పించనున్నారు. చట్టం అన్ని దశలు దాటుకొని అమల్లోకి వచ్చాక ప్రత్యేకంగా దాని అమలు కోసం రూల్స్‌ను రూపొందిస్తారు. రూల్స్‌లోనే కటా్‌ఫడేట్స్‌ వంటి అనేక కీలక అంశాలు ఉంటాయి. చుక్కల భూములపై హక్కులు కల్పించేందుకు జిల్లాలవారీగా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సీసీఎల్‌ఏకు అప్పీల్‌ చేసుకోవచ్చు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
గుజరాత్ బాటలో వెళతాం: చంద్రబాబు
 
  • భూసేకరణ చట్టాన్ని సవరిస్తాం: సీఎం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం 2013కు అవసరమైన సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఆదివారం రాత్రి న్యాయ శాఖ మంత్రితో ఆయన భేటీ అయ్యారు. వాస్తవానికి భూసేరణ చట్టానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిందని, వాటికి కేంద్ర న్యాయ శాఖ కొర్రీలు వేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేయగా కేంద్రం ఆమోదించిందన్నారు. కాబట్టి తాము కూడా గుజరాత్ తరహాలోనే భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తామని, ఆ చట్టాన్ని ఆమోదించాలని కోరారు. ఇందుకు రవిశంకర్‌ ప్రసాద్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

  • 1 month later...
ఆ భూసేకరణ చట్టాన్నిఆమోదించొద్దు
 
636312827196242816.jpg
  •  రాష్ట్రపతికి ఏపీసీసీ విజ్ఞప్తి 
     
న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రజలకు, రైతుల ప్రయోజనాలకు విఘాతంగా ఉన్న ఏపీ భూసేకరణ చట్టాన్ని ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఏపీ కాంగ్రెస్‌ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం బుధవారం రాష్ట్రపతిని కలిసింది. మార్చి 28న ఏపీ అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ చట్టంలోని సవరణలు భూములు కోల్పోయే రైతులకు ఎలాంటి రక్షణలనూ కల్పించడం లేదని 5 పేజీల మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదిస్తే భూములు కోల్పోయే రైతులకు ఇక దిక్కే ఉండదని తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏపీ భూసేకరణ చట్టానికి గ్రీన్ సిగ్నల్
 
 
636321218500930566.jpg
ఢిల్లీ: ఏపీ భూసేకరణ బిల్లుకు త్వరలో మోక్షం కలగనుంది. ఏపీ భూసేకరణ చట్టానికి కేంద్రం రాజముద్ర వేయనుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం దస్త్రాన్ని కేంద్ర హోం శాఖ సిద్ధం చేస్తోంది. ఏపీ భూసేకరణ చట్టం రాజ్యంగ నిబంధనల మేరకే ఉందని ఎలాంటి అవకతవకలు లేవని సంబంధింత శాఖలన్నీ హోం శాఖకు లిఖితపూర్వకంగా ఆమోదాన్ని తెలిపాయి. దీంతో రాష్ట్రపతి ఆమోదమే తరువాయి అని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు వారాల్లో రాష్ట్రపతి వద్దకు ఈ  ఫైల్ రానుంది. అంతా సక్రమంగానే ఉందని కేంద్ర న్యాయశాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ తేల్చిచెప్పాయి. హోంశాఖకు సంబంధిత శాఖలు లేఖలు పంపాయి. కాంగ్రెస్ అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోలేదు.
Link to comment
Share on other sites

  • 5 months later...
స్వచ్ఛంద భూసేకరణ
30-11-2017 02:20:15
 
636476052162924766.jpg
  • భారీ పరిహారానికి ఓకే.. పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ ఉండదు
  • కీలక ప్రాజెక్టులకు 3 క్లాజుల మినహాయింపు
  • ఏపీ భూసేకరణ-2017 బిల్లుకు ఆమోదం
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతులను మెప్పించి.. ఒప్పించి ఒప్పందాలతో స్వచ్ఛంద భూ సేకరణ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ భూ సేకరణ బిల్లు -2017ను శాసనసభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013కు సవరణ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా కొత్తగా కొన్ని క్లాజులు చేరుస్తూ.. ఇప్పటికే చట్టంలో ఉన్న మూడు ముఖ్యమైన క్లాజులకు ఇందులో మినహాయింపు ఇచ్చారు.
 
 
ఈ బిల్లును బుధవారం శాసనసభలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. అక్కడ ఆమోదం పొందితే రాష్ట్రంలో అమల్లోకి రానుంది. వివరాల్లోకి వెళ్తే.. నవ్యాంధ్ర భవిష్యత్‌ అవసరాలు, విశాల ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం స్వచ్ఛందంగా భూములు సేకరించేలా, నిర్వాసితులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా కేంద్ర చట్టానికి సవరణలు చేసింది. ఇక కేంద్ర చట్టంలో లేని విధంగా, తన అవసరాల కోసం ప్రభుత్వమే నేరుగా ఆసక్తి ఉన్న రైతుల నుంచి భూములు కొనుగోలు చేసుకునేలా, ఒప్పందాలు కుదుర్చుకునేలా వెసులుబాటు కల్పించుకుంది. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచే అమలవుతున్నట్లుగా పేర్కొన్నారు.
 
 
కేంద్ర చట్టంలో ఇలా..
2013నాటి కేంద్ర భూ సేకరణ చట్టంలో నిర్వాసితులతోపాటు భూములపై ఆధారపడిన శ్రామికవర్గాన్ని కాపాడేందుకు అనేక క్లాజులు చేర్చిన సంగతి తెలిసిందే. ఆహారభద్రతను కాపాడాలని, తద్వారా సాగు భూములను సేకరణనుంచి తప్పించాలని, భూముల సేకరణ వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, గ్రామసభల ఆమోదం తప్పనిసరంటూ కీలక క్లాజులు చేర్చారు. ఇక నిర్వాసితులకు ఇచ్చే పరిహారం రెట్టింపుగా ఉండాలంటూ చట్టంలో రక్షణ కల్పించారు. మెజారిటీ ప్రజలు భూసేకరణను వ్యతిరేకిస్తే ఇక ఆ గ్రామంలో భూములు తీసుకోవడానికి వీల్లేకుండా మరో ప్రత్యేక క్లాజుపెట్టారు. ఈ క్లాజుల వల్ల పరిరిశ్రమలు, భారీ హౌసింగ్‌ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయల కల్పన, రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని కేంద్రం భావించింది. చట్టంలోని అనేక క్లాజును తొలగించి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. అయితే అది పార్లమెంట్‌లో చర్చకే రాలేదు. దీంతో ఆర్డినెన్స్‌ నిలబడలేదు. ఫలితంగా రాష్ట్రాలే భూ సేకరణ చట్టాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని కేంద్రం సూచించింది.
 
 
ఏపీ సవరణ బిల్లులోని ముఖ్యాంశాలు..
  • గ్రామసభలు, మెజారిటీ ప్రజల ఆమోదం, సామాజిక ప్రభావం అంచనా, ఆహారభద్రత వంటి క్లాజులు రాష్ట్ర ప్రజల మేలు దృష్ట్యా.. దేశ రక్షణ , గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణ రంగం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నెలకొల్పే ఇండస్ట్రియల్‌ కారిడార్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టుల (భూమిపై ప్రభుత్వానికి యాజమాన్యపు హక్కు ఉంటే )కు వర్తించవంటూ.. ఏపీ భూ సేకరణ చట్టం సవరణ బిల్లు-2017లో ప్రత్యేకంగా 10ఏ కింద మినహాయింపులిచ్చారు. దీని ద్వారా గ్రామసభల నిర్వహణ, సామాజిక అంశాలపై సర్వేలు చేపట్టకుండానే భూమి సేకరించుకోవచ్చన్న మాట. అయితే వ్యూహాత్మకంగా వాటిని చట్టంలో కొనసాగించారు. సెక్షన్‌ 10ఏకి మినహాయింపులు ఇస్తూ.. తీసుకునే భూములకు పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తారు. అలా భూములిచ్చే రైతులకు పునరావాసం, రీ సెటిల్‌మెంట్‌లు వర్తించవని సెక్షన్‌ 31ఏలో పేర్కొన్నారు. వీటి స్థానంలోనే పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తారని వివరణ పొందుపరిచారు.
  • ప్రజా ప్రయోజనాలను ఆశించి ప్రభుత్వం అవసరం ఉన్న చోటల్లా.. రైతులను ఒప్పించి నేరుగా భూములు కొనుక్కోవచ్చు. ఇందుకు ప్రభుత్వం నియమించిన అధికారి.. ఆసక్తి ఉన్న రైతులతో లిఖిత పూర్వక ఒప్పందం చేసుకుంటారు. దీనికి స్వచ్ఛంద భూసేకరణ అని పేరుపెట్టారు. దీనిని సెక్షన్‌ 30ఏ కింద చేర్చారు. ఇందులో రైతులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. అందులోనే పునరావాసం, రీ సెటిల్‌మెంట్‌ ఉంటాయి. ఇక అదే ఫైనల్‌. దీన్ని ఆధారం చేసుకుని గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేస్తారు. అయితే ప్రభుత్వం ఆ భూములను కొనుగోలు చేశాక ఎలాంటి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
  • పూర్వపు భూసేకరణ చట్టంలో జిల్లా కలెక్టర్‌ ‘కన్సెంట్‌ అవార్డు’ ఉండేది. 2013 భూసేకరణ చట్టంలో దీన్ని తొలగించారు. తాజా సవరణ బిల్లులో సెక్షన్‌ 23-ఏ కింద కలెక్టర్‌ క న్సెంట్‌ అవార్డు ఉండాలని ప్రతిపాదించారు. భూసేకరణ ధరను ఖరారు చేశాక నిర్వాసితులు ఆ ధరకు అంగీకరిస్తే ఇక అదే ఫైనల్‌.
  • పాత భూసేకరణ చట్టం మేరకు అవార్డు పాస్‌ చేశాక సంబంధిత రైతులు డబ్బు తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్‌ చేస్తున్నారు. ఇక ఆ కేసు తేలేవరకు ప్రభుత్వం భూమిని తన స్వాధీనంలోకి తీసుకోలేదు. ఐదేళ్ల కాల వ్యవధి దాటాక ఆ అవార్డు పనిచేయదు. 2013 చట్టంలో ఈ నిబంధన లేదు. తాజాగా సెక్షన్‌ 23-ఏ కింద కన్సెంట్‌ అవార్డు ప్రతిపాదించారు. దీంతో దీనికి అనుబంధంగా సెక్షన్‌ 24లో సబ్‌సెక్షన్‌-2 కింద.. కన్సెంట్‌ అవార్డు ప్రకటించిన తర్వాత.. దానిపై వచ్చే కోర్టు చిక్కులతో సంబంధం లేకుండా.. భూసేకరణ అవార్డు చెల్లుబాటయ్యే కాలంలోనే.. భూములను స్వాధీనంచేసుకునేలా సవరణ చేశారు. అంటే కోర్టుల్లో కేసు నడిచినంత కాలం భూమిని తీసుకోవద్దన్న నిబంధనను మినహాయించారు. కలెక్టర్‌ కన్సెంట్‌ అవార్డు పాస్‌చేశాక.. ఆ భూములపై జరిగిన ఒప్పందాలను ఎవరూ మార్చకుండా మార్పులు చేశారు.
  • భూసేకరణ చట్టం కింద పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా పరిహారం చెల్లిస్తే తిరిగి రెవెన్యూ రికవరీ చట్టం కింద సొమ్ము వసూలు చేయడానికి కొత్తగా 33ఏఅనే సెక్షన్‌ను జోడించారు.
  • భూ సేకరణ చట్టాన్ని దుర్వినియోగపరిచే అధికారులపై చర్యలు తీసుకోవాలని సెక్షన్‌ 87కు సవరణ.
Link to comment
Share on other sites

  • 4 months later...
  • 4 weeks later...
ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం ఓకే
పదిరోజుల్లోపు రాష్ట్రపతి ఆమోదముద్ర

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదముద్ర వేయనుంది. ఈ బిల్లుపై ఇటీవలే ఏపీ అధికారులు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్పాల్‌సింగ్‌కు పూర్తి వివరణలు ఇచ్చారు. గుజరాత్‌, తెలంగాణ బిల్లుల తరహాలోనే ఏపీ బిల్లు కూడా ఉందని, ఆ రెండింటికీ అభ్యంతరాలు లేనప్పుడు ఏపీ బిల్లు పట్ల కేంద్రానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లును రూపొందించినట్లు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టడం వల్ల ఆహార భద్రతకు ముప్పేమీ రాదని, రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణలతో సంతృప్తి చెందిన హోంశాఖ అధికారులు  ప్రస్తుతం అంతిమ ఆమోదం కోసం న్యాయశాఖకు పంపినట్లు తెలిసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఆమోదముద్ర వేస్తే తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండువారాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:
ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం ఓకే
పదిరోజుల్లోపు రాష్ట్రపతి ఆమోదముద్ర

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదముద్ర వేయనుంది. ఈ బిల్లుపై ఇటీవలే ఏపీ అధికారులు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్పాల్‌సింగ్‌కు పూర్తి వివరణలు ఇచ్చారు. గుజరాత్‌, తెలంగాణ బిల్లుల తరహాలోనే ఏపీ బిల్లు కూడా ఉందని, ఆ రెండింటికీ అభ్యంతరాలు లేనప్పుడు ఏపీ బిల్లు పట్ల కేంద్రానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లును రూపొందించినట్లు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టడం వల్ల ఆహార భద్రతకు ముప్పేమీ రాదని, రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణలతో సంతృప్తి చెందిన హోంశాఖ అధికారులు  ప్రస్తుతం అంతిమ ఆమోదం కోసం న్యాయశాఖకు పంపినట్లు తెలిసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఆమోదముద్ర వేస్తే తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండువారాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని పేర్కొన్నారు.

Antha scene ledu... it will not happen 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...