Jump to content

మంత్రివర్గంలోకి లోకేష్‌ - CBN


Ramesh39

Recommended Posts

మంత్రివర్గంలోకి లోకేష్‌ 

తెతెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 

3brk30a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేష్‌ను త్వరలో తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన తెలంగాణ తెదేపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో ఈ విషయాన్ని తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిపై జరిగిన చర్చ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. తెలంగాణ తెదేపా నాయకులకు కేంద్రంలో నియమిత పదవులిచ్చే అంశంపై మరోసారి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. తెరాస ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి 2019 నాటికి తెదేపాను తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చాలని దిశా నిర్దేశం చేశారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...