Jump to content

బాలకృష్ణ ఎంతో సపోర్ట్‌ చేశారు! - ఫరా


Ramesh39

Recommended Posts

బాలకృష్ణ ఎంతో సపోర్ట్‌ చేశారు! 

  నెద‌ర్లాండ్స్ బ్యూటీ ఫరా 

23brk157-fora.jpg

హైదరాబాద్‌: ‘ధృవ’లో అరవింద్‌ స్వామి ప్రియురాలిగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో గ్రీకు రాకుమారిగా తెలుగు ప్రేక్షకులను అలరించింది  నెద‌ర్లాండ్స్‌‌ బ్యూటీ ఫరా. తెలుగు సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఇద్దరు స్టార్‌ నటులతో నటించడం అదృష్టంగా ఉందంటున్న ఫరా ఇంకా ఏం చెప్పిందంటే..

‘‘నేను పుట్టి పెరిగినదంతా  నెద‌ర్లాండ్స్‌లోనే. అక్కడ చదువు పూర్తయ్యాకఇంటర్న్‌షిప్‌ కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లాను. అనుకోకుండా సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దక్షిణ ఆఫ్రికాలోని ఓ సినిమా ఏజెన్సీ వారు నాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కొద్ది నెలల పాటు ఆఫ్రికాలోనే ఉండిపోయా. అప్పుడు ఎక్కువగా భారత్‌కు చెందిన ఏజెన్సీల నుంచే అవకాశాలు వచ్చేవి.’’ అంటు తన కెరీర్‌ తొలినాళ్ల గురించి చెప్పుకొచ్చింది.

‘‘ఈ నేపథ్యంలో ఏం జరిగినా మన మంచికే అనుకుని 2013లో భారత్‌కు వచ్చేశాను. డిజైనర్‌ ఫొటోషూట్లు, టీవీ వాణిజ్య కార్యక్రమాలు, ఎడిటోరిల్స్‌తో బాగా బిజీ అయిపోయా. మోడలింగ్‌ రంగంలో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నాక నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. వెంటనే నటనలో, డ్యాన్స్‌లో, హిందీ భాషలో శిక్షణ తీసుకున్నా. 2015లో హిందీ చిత్రం ‘తేరా సురూర్‌’లో హిమేష్‌ రేషమ్మియాకి జంటగా నటించే అవకాశం దక్కింది. హిందీలో తొలి అవకాశం అందిపుచ్చుకున్నాక ఇంకా ఏదో సాధించాలనే తపన. ఆ తపనే నాకు టాలీవుడ్‌లో అవకాశం తెచ్చిపెట్టేలా చేసింది. రామ్‌చరణ్‌, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధృవ’ సినిమాలో అవకాశం లభించింది. ఇందులో అరవింద్‌ స్వామి ప్రియురాలి పాత్రలో కనిపించా. సెట్స్‌లో అరవింద్‌ స్వామి చాలా అణకువగా ఉండేవారు. ఆయనలో ఉండే స్టార్‌ పవర్‌ తెరపై చూస్తే కానీ తెలియదు. ఆ తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో గ్రీకు రాకుమారిగా నటించే అవకాశం లభించింది. బాలకృష్ణ లాంటి అగ్రనటుడి పక్కన సమానంగా నటించడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో చాలా భయపడ్డా. అప్పుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ నన్ను ఎంతో ప్రోత్సహించి సపోర్ట్‌ చేశారు’’ అంటూ తన అభిప్రాయాలు పంచుకుంది.

23brk157-fora2.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...