Jump to content

డేరింగ్ డెసిషన్.. అంధుడిగా ఎన్టీఆర్!


srohith

Recommended Posts

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్.. వంటి విభిన్న సినిమాలతో తనలోని నటుడిని మరోసారి ప్రేక్షకులకు చూపించిన ఎన్టీఆర్ తిరుగులేని విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరో పొజిషన్‌ రేసులో ముందు వరుసలో నిల్చున్నాడు జూనియర్. మరొక్క బ్లాక్ బస్టర్ సాధిస్తే టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం జూనియర్ చేతిలో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో తన తరువాతి ప్రాజెక్టుపై తీవ్ర కసరత్తు చేసిన ఎన్టీఆర్.. త్రివిక్రమ్, వినాయక్ వంటి అగ్ర దర్శకుల కోసం చాలాకాలం ఎదురు చూశాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చిన్న దర్శకులు తీసుకొచ్చిన విభిన్న కథలపై ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిలో భాగంగానే, పటాస్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథకు జూనియర్ కన్విన్స్ అయ్యాడని, దీనికి కారణం ఈ కథలో హీరో పాత్ర అంధుడు కావడం, బలమైన కథ, భావోద్వేగాలతో నిండిన స్ర్కీన్‌ప్లే ఉండడం అని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు విభిన్న పాత్రలతోనే విజయాలు సాధించిన ఎన్టీఆర్ కావాలనే మరోసారి అటువంటి అంధుడి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కథపై ఉన్న నమ్మకంతో అనిల్ ఈ కథను నేరుగా దిల్ రాజుకు వినిపించినట్లు, ఈ కథకు ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడని భావించిన రాజు.. అనిల్‌తో జూనియర్ కథ వినిపించడం, ఎన్టీఆర్ ఓకే చెప్పండం జరిగిపోయాయని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా, ఎన్టీఆర్ డేరింగ్ డెసిషన్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా!

Link to comment
Share on other sites

Andaru anil antunnaru but thanu kuda template director ey kada, am i missing anything?

My choices are sukku n hanu raghavapudi.

Yes he is template director same like ssr,koratala,boyapati..they did with big stars anil did with small heros anthe difference

 

Making a routine stuff enjoyable is an art..if the director makes the audience to sit in theaters without making them bored then he will get success even with routine stuff

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...