AnnaGaru Posted May 23, 2017 Posted May 23, 2017 Idi CBN 2002 lo vesina road idi...Puligadda bridge appudu kattinde....Taruvata malli ippudu expand chestunaru This connects major ports along coasts and mainly useful for Diviseema and EAST Guntur which have not seen any Agri based export except domestic based
Kedism Posted June 2, 2017 Posted June 2, 2017 repu eee route lo travel cheyyabothunnanu for a short distance..oka 80 kms
sonykongara Posted October 4, 2017 Author Posted October 4, 2017 ఎన్‌హెచ్-216 భూసేకరణ తుది దశకు వచ్చే నెల రెండో వారంలో రైతుల భూముల విచారణ తెనాలి సబ్‌కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలకు హాజరుకావాలని నోటీసులు భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, జేసీ-2 ఆంధ్రజ్యోతి, గుంటూరు : ఎన్‌హెచ్-216 (కత్తిపూడి-ఒంగోలు) సెక్షన్ జాతీయ రహదారిని రెండు వరసలుగా అభివృద్ధి చేసే నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో ఏడు మండలాల్లోని 20 గ్రామాల్లో భూసేకరణను అధికార యంత్రాంగం తలపెట్టింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విజ్ఞప్తి మేరకు ఇంచుమించు రెండేళ్ల క్రితమే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు పెగ్ మార్కింగ్, సర్వే, భూముల ధరల నివేదికల సేకరణ వంటి ప్రక్రియలను పూర్తి చేశారు. చివరిగా భూసేకరణలో భూములు కోల్పోయే యజమానులను గుర్తించారు. వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించేందుకు వచ్చే నెల రెండోవారంలో తెనాలి సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా జాయింట్ కలెక్టర్ -2 ముంగా వెంకటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌హెచ్ -16 చెన్నై - కోల్‌కత్తాకు ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఎన్‌హెచ్-216 ప్రత్యామ్నాయంగా ఉంది. ఏ కారణం చేతనైనా ఎన్‌హెచ్-16లో వాహనాలను దారి మళ్లించాల్సి వస్తే ప్రస్తుతం ఎన్‌హెచ్-216నే వినియోగిస్తున్నారు. అయితే ఈ రహదారి ఇరుకుగా ఉండటం, గ్రామాల్లో నుంచి ఏర్పాటై ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ రహదారిని రెండు వరసలుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచుగా ఈ రోడ్డు భూసేకరణను సమీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జేసీ-1కు అమరావతి రాజధాని భూసమీకరణ, నడికుడి-శ్రీకాళహస్తి భూసేకరణ బాధ్యతలు ఉండటంతో అప్పటి కలెక్టర్ కాంతీలాల్ దండే ఎన్‌హెచ్-216 భూసేకరణ బాధ్యతను జేసీ-2(నాన్ రెవెన్యూ)కి అప్పగించారు. చెరుకుపల్లి మండలంలోని కనగాలలో 10,948 చదరపు మీటర్లు, గూడవల్లిలో 2003, అరుంబాకలో 1,192, రాంభొట్లపాలెంలో 8,663 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నగరం మండలంలోని శివనాగులపాలెం(శివంగులపాలెం)లో 2,281 చదరపు మీటర్లు, పిట్టలవానిపాలెం మండలం చందోలులో 13,261, ఖాజీపాలెంలో 899, భట్టిప్రోలు మండలంలోని అద్దేపల్లిలో 15,766 చదరపు మీటర్లు, భట్టిప్రోలులో 5,073, పెదపులివర్రులో 7,216, సూరేపల్లిలో 8,628, గొరిగపూడిలో 9,122, రేపల్లె మండలంలో పేటేరులో 4,172, పరిసపాడులో 6,441, మురుకొండుపాడులో 2,583, బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలో 30,281, బాపట్లలో 71,514, కర్లపాలెం మండలంలోని యాజలిలో 1,636, బుద్ధాంలో 7,613, కర్లపాలెంలో 316 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు రైతులకు నోటీసులు పంపించారు. సేకరించాల్సిన భూముల్లో సాగు, నివాస, వాణిజ్య కేటగిరీవి ఉన్నాయి. ఎన్‌హెచ్-216 పక్కన ఉండటంతో వీటికి ఆయా గ్రామాల్లో మంచి ధర ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరకు మూడు రెట్ల వరకు లభించే అవకాశం ఉన్నది. అయితే అక్కడ ధర రిజిస్ట్రేషన్ విలువ కంటే ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఉండటంతో రైతులు ఎక్కువ నష్టపరిహారాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా అక్టోబర్ 11, 12, 13, తేదీల్లో జరిగే విచారణ వేదికలకు హాజరై తమ డిమాండ్లను అధికారుల ముందుంచేందుకు సన్నద్ధమౌతున్నారు. అయితే విచారణ వేదికలు తమ మండలాల్లో కాకుండా దూరంలో ఉన్న తెనాలిలో ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
sonykongara Posted November 29, 2017 Author Posted November 29, 2017 (edited) v Edited November 30, 2024 by sonykongara
sonykongara Posted April 5, 2018 Author Posted April 5, 2018 ఎన్‌హెచ్ విస్తరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో కత్తిపూడి నుంచి గుడిమెల్లంక వరకు చేపట్టిన 216 జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కాకినాడ నుంచి కత్తిపూడి వరకు జరుగుతున్న రహదారి విస్తరణ, బైపాస్ రోడ్లు, వంతెన నిర్మాణాలను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ-1లో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు జరిగే పనులు త్వరగా పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తేవాలని సూచించారు. కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి బైపాస్ రోడ్లు త్వరగా నిర్మించాలన్నారు. నెలాఖరునాటికి పిఠాపురం రైల్వే వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో లోపలకు ప్రవేశించే రహదారుల వద్ద అప్రోచ్ రోడ్లు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ప్యాకేజీ-2, 3, 4 పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కాకినాడ బైపాస్ నిర్మాణంలో భాగంగా ఏడీబీ రోడ్డు కూడలి వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మళ్లీ ఈనెలాఖరున సమావేశం నిర్వహిస్తామని, అప్పటికి పూర్తి ప్రగతి చూపాలన్నారు. జూన్‌లోపే అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 రాధాకృష్ణమూర్తి, 216 జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted April 14, 2018 Author Posted April 14, 2018 216 హైవే బాధితుల సమస్యల పరిష్కారానికి ఫోర్‌మెన్ కమిటీ13-04-2018 08:40:44 జేసీ, ఎన్‌హెచ్ పీడీ, డీఆర్‌వో, ఆర్‌డీవోలతో ఏర్పాటు కలెక్టర్ అధ్యక్షతన ఆర్బిట్రేషన్ మీటింగ్ 150 మంది రైతుల హాజరు (ఆంద్రజ్యోతి, విజయవాడ) : జాతీయ రహదారి-216 విస్తరణలో చల్లపల్లి, మోపిదేవి మండలాలకు చెందిన భూ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ లక్ష్మీకాంతం ఫోర్‌మెన్ కమిటీని నియమించారు. జాతీ య రహదారి విస్తరణకు ప్రధాన అవరోధంగా మారిన రైతుల సమస్యలను పరిష్కరించడానికి జాయింట్ కలెక్టర్, నేషనల్ హైవేస్ పీడీ, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో), ఆర్‌డీవోలతో కూడిన ఫోర్‌మెన్ కమిటీని ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 216 జాతీయ రహదారి భూ బాధి తులకు సంబంధించిన విషయాలపై కలెక్టర్ అధ్యక్షతన ఆర్బిట్రేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి చల్లపల్లి బైపాస్, లక్ష్మీపురం, మోపిదేవి ప్రాంతాలకు చెందిన 150 మంది రైతులు పాల్గొన్నారు. ఒకే జాతీయ రహదారికి సంబంధించి వేర్వేరు పరిహారాలను నిర్ధేశించటం సమం జసంగా లేదని రైతులు కలెక్టర్ ముందు వాపోయారు. మచిలీపట్నం మండలానికి సంబంధించి 2013 భూసే కరణ చట్టాన్ని 2 మల్టిఫికేషన్ ఫ్యాక్టర్స్ ప్రకారం పరి హారం చెల్లించారని, అదే సమయంలో తమకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో ప్రక్రియ పూర్తి కాకపోవటం వల్ల నష్టపోయామని చెప్పారు. అధికారుల జాప్యం కారణంగా రాష్ట్రస్థాయిలో చేసిన కొన్ని చట్టాల వల్ల 1.25 మల్టిఫికేషన్ ప్రకారం పరిహారాన్ని నిర్ణయించటం జరిగిందన్నారు. తమకు 2 మల్టిఫికేషన్ ప్రకారం పరిహారం నిర్ణయించకపోవటం వల్ల ఎకరాకు (రిజిస్ర్టేషన్ ప్రకారం) రెండు రెట్ల ధరతో పాటు పునరావాసం కింద రెట్టింపు మొత్తాన్ని వెరసి.. నాలుగు రెట్ల పరిహారాన్ని అందుకోవడానికి అర్హత కోల్పో యామని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ విధానంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక తప్పులు చోటుచేసుకున్నాయని, వీటివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జనావాసాలను మాగాణి కింద, స్థలాల్లో ఇళ్లు ఉన్నట్టుగా చూపించటం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అసైన్డ్ భూములకు కూడా పరిహారం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసైన్డ్ భూములకు సంబంధించిన పరిహారాన్ని నిర్ణయించటంలో కలెక్టర్ అంగీకారం తెలపలేదని సమాచారం. మిగిలిన సమస్యలకు సంబంధించి కలెక్టర్ సానుకూలంగానే స్పందించారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ఫోర్‌మెన్ కమిటీని నియమించానని, కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌తో మాట్లాడి ప్రభుత్వ స్థాయిలో సమస్య పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.
kanagalakiran Posted November 12, 2018 Posted November 12, 2018 monna mopidevi velethe work bagane nadustondi......as per me, work is not that fast and not that slow Mobile GOM 1
sonykongara Posted January 1 Author Posted January 1 National high way: కత్తిపూడి - ఒంగోలు ఎన్‌హెచ్‌కు 4, 6 వరుసల యోగం రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. By Andhra Pradesh News DeskPublished : 01 Jan 2025 06:21 IST తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కి.మీ. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లు త్వరలో మిగిలిన 161 కి.మీ.కు టెండర్లు పిలిచే అవకాశం ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని నాలుగు, ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించగా, ఆ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. దీంతో 390 కి.మీ. మేర ఉన్న ఈ రహదారిని త్వరలో విస్తరించనున్నారు. భీమవరం బైపాస్‌కు కొత్త ఎలైన్‌మెంట్ దాదాపు మూడేళ్లుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయిన ఆకివీడు-దిగమర్రు ఎన్‌హెచ్ విస్తరణ, అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. భీమవరం వద్ద కొత్త ఎలైన్‌మెంట్‌తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే పామర్రు-ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి-165 విస్తరణ మంజూరైంది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం నెలకొంది. భీమవరానికి ఎడమవైపు వెళ్లేలా 18 కి.మీ.మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను తొలుత ఖరారు చేయగా, కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. ఎన్‌హెచ్ వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.వెయ్యి కోట్లు మంజూరవుతున్నా.. ఎలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటివరకు పురోగతి లేకుండా పోయింది. తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మించేలా ఎలైన్‌మెంట్ ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో ఆకివీడు నుంచి ఉండి, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 కి.మీ.మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కి.మీ. నాలుగు వరుసలుగాను, మిగిలిన 3 కి.మీ. రెండు వరుసలుగా విస్తరిస్తారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్ సిద్ధమైతే.. మోర్త్ ఆమోదం తెలిపి, విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ రెండు రోడ్ల విస్తరణకు డీపీఆర్ రాజమహేంద్రవరం-రంపచోడవరం జాతీయ రహదారిపై 23 కి.మీ.మేర 7 మీటర్ల వెడల్పుతోనే రహదారి ఉంది. దీనిని 10 మీటర్ల వెడల్పు (రెండు వరుసలు)తో విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశాఖపట్నం-రాయ్‌పుర్ పాత జాతీయ రహదారిలో భాగంగా సాలూరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు 13 కి.మీ.లను 10 మీటర్ల వెడల్పుతో విస్తరణకు డీపీఆర్ రూపొందించనున్నారు. డీజీ పరిశీలనతో విస్తరణపై దృష్టి.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) డైరెక్టర్ జనరల్ (డీజీ) సారంగి.. కొద్ది రోజుల కిందట రాష్ట్రానికి వచ్చారు. భీమవరం వెళ్తూ.. కొంతదూరం కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి-216పై ప్రయాణించారు. ఈ సందర్భంగా దీని విస్తరణపై సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో మోర్త్ అధికారులు కార్యాచరణ చేపట్టారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 390 కి.మీ.ఉంది. ఇందులో కత్తిపూడి-కాకినాడ మధ్య 27.5 కి.మీ. మాత్రమే నాలుగు వరుసలుగా ఉండగా, మిగిలిన జాతీయ రహదారి మొత్తం రెండు వరుసలతోనే ఉంది. తాజాగా నాలుగు వరుసలు ఉన్నచోట్ల ఆరు వరుసలుగాను, రెండు ఉన్నచోట్ల నాలుగు వరుసలుగా విస్తరించాలని భావిస్తున్నారు. దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీపై దృష్టిపెట్టారు. తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కి.మీ. వరకు విస్తరణకు డీపీఆర్ తయారీకి సలహాసంస్థ ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 8 వరకు టెండర్ల దాఖలుకు గడువిచ్చారు. ఎంపికైన సలహాసంస్థ.. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు 161 కి.మీ. విస్తరణకు డీపీఆర్ తయారీ కోసం సలహాసంస్థ ఎంపికకు కొద్ది నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు. 2026 చివరి నాటికి వీటి డీపీఆర్‌లు పూర్తయితే.. విస్తరణకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని అధికారులు చెబుతున్నారు. Mobile GOM 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now