sonykongara Posted August 13, 2017 Author Posted August 13, 2017 నవ్యాంధ్ర ప్రజలకు చంద్రబాబు, ఇండిపెండెన్స్ డే గిఫ్ట్... పచ్చటి ప్రకృతి ఒడిలో... సర్వాంగ సుందరంగా.... నవ్యాంధ్ర రాజధాని మంగళగిరిలో... నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్స్ ప్రాంగణంలో రెండెకరాల స్థలంలో ఐదంతస్థుల్లో నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఈనెల 16వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రూ.40కోట్ల ఖర్చుతో 5 ఫ్లోర్లతో 1.10లక్షల చదరపు అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గత ఏడాది అక్టోబర్‌లో భూమిపూజ చేసి, కేవలం 10నెలల్లో మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసి ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం అయిదు ఫ్లోర్లు: ఈ భవనంలో సుమారు 40వేల చదరపు అడుగుల నిర్మాణంలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు సీఐడీ విభాగానికి కేటాయించారు. దీనితో సీఐడీకి డీజీపీ మొదటి ప్రాధాన్యం ఇచి నట్లయింది. ఇక రెండు, మూడో అంతస్థుల్లో పీ అండ్ ఎల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ట్రైనింగ్ అధిపతి, శాంతి భద్రతల ఏడీజీ, టెక్నికల్ సర్వీసెస్ తదితర విభాగాల అధిపతుల కార్యాలయాలకు అద్దాల గదులు నిర్మించారు. పలువురు ఐజీలు, ఇతర అధికారులు కూడా ఆయా ఫ్లోర్‌లలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఐదో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్స్ హాల్, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం: కార్యాలయం లో లిప్ట్ మొదలుకొని ఏ గదిలోపలికి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్ తప్పనిసరి. సిబ్బంది కార్యాలయంలోకి ప్రవేశించాలంటే వేలిముద్రతోనే తలుపు తెరుచుకుంటుంది. ఆఫీసర్ల పేషీల్లోకి ఆయనతోపాటు పేషీ సీసీకి మాత్రమే బయోమెట్రిక్ లాక్ తెరిచే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా పై అంతస్తులో బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలతో సువిశాలమైన గదిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేసారు. ఇక ఈ భవనానికి పశ్చిమాన పచ్చని చెట్లతో ఆహ్లాదంగా మంగళగిరి కొండ ఉంటుంది. మరోవైపు చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి సుమారు రెండు కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. డీజీపీ పేషీకి ఎదురుగా కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. కారిడార్ నుంచి డీజీపీ పేషీ వరకూ చక్కటి కొటేషన్లతో పలు డిస్‌ప్లే బోర్డులు అమర్చారు. భవనంలో పనిచేసేవారి మనసుకు ప్రశాంతత లభించేలా చక్కటి సంగీతం వినిపించేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదకర వాతావరణం: నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా పచ్చని చెట్లను నరికేయకుండా ప్రొక్లెయిన్‌తో తొలగించి, మరో ప్రాంతంలో నాటారు. ప్రధాన ద్వారం నుంచి భవనంలోకి ప్రవేశించగానే కుడివైపు మెట్లు, లిప్ట్ ఉంటాయి. ఎడమవైపు రిసెప్షన్, వెయిటింగ్ హాల్ ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లోనూ ఎదురుగా కారిడార్ ఉంటే కుడివైపు అధికారి, ఎడమ వైపు సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కారిడార్‌లో సీసీ కెమెరాలతోపాటు ఫైర్ సేప్టీ ఏర్పాట్లు చేశారు. ఈ భవనంలో కొత్తగా చెప్పుకోవాల్సింది గోడలు లేకుండా పిల్లర్స్ వేసి అద్దాలతో నిర్మించడం. అవసరాన్ని బట్టి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వాడినా సిబ్బంది, ఇతరత్రా గదులకు రెండు అద్దాలు అమర్చి మధ్యలో ఆర్గానిక్ గ్యాస్ నింపారు. భవనం లోపల పనిచేసుకునే వారికి బయటి ఎండ వేడి తెలియకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేయడానికి వీలుగా ఏర్పాట్లుచేసినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రతి ఫ్లోర్‌కు డైనింగ్ హాల్, సమావేశ మందిరం, రెండు కామన్ టాయ్‌లెట్లు నిర్మించారు.
RKumar Posted August 16, 2017 Posted August 16, 2017 Maree main road meeda vunnattu vundi, konchem lopalaki kattalsindi place vunte.
KaNTRhi Posted August 16, 2017 Posted August 16, 2017 Maree main road meeda vunnattu vundi, konchem lopalaki kattalsindi place vunte. temporary ye gaa.... so no issue, tharuvatha etu ee buidling ni either hotel or IT companies ki ichestharu le
sonykongara Posted August 16, 2017 Author Posted August 16, 2017 మంగళగిరిలో ఏపీ డీజీపీ కార్యాలయం ప్రారంభం అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని (డీజీపీ కార్యాలయం) ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపా సాంబశివరావు, పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ పటాలంలో దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి పది నెలల సమయం పట్టింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోని న్యాయస్థానాల సముదాయానికి సమీపంలో డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ డీజీపీతో పాటు అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు మాత్రమే ఛాంబర్లు ఉన్నాయి. దీంతో కొన్ని విభాగాల అధిపతులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీఐడీ కార్యాలయానికి తగిన వసతులు లేవు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో ఇకపై డీజీపీ కార్యాలయం పరిధిలోని అన్ని విభాగాల అధిపతులు ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణ విశేషాలు * నిర్మిత ప్రాంతం: మొత్తం 1.10 లక్షల చ.అడుగులు, ఒక్కో అంతస్తులో: 21,200 చ.అడుగులు * ఎన్ని అంతస్తులు: జీ ప్లస్ 4 * ఏ అంతస్తులో ఏ కార్యాలయం: * గ్రౌండ్‌తో పాటు మొదటి అంతస్తులో సీఐడీ కార్యాలయం * రెండు, మూడు అంతస్తుల్లో అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారుల కార్యాలయాలు * నాలుగో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీ, సమావేశమందిరం భవనం ప్రత్యేకతలు * ఒక్కో దాంట్లో 80 మందితో సమావేశం నిర్వహించుకునేందుకు వీలుగా మొత్తం మూడు సమావేశ మందిరాలు * ఒకేసారి వంద కార్లను పార్కు చేసుకునేందుకు వీలుగా స్థలం * భవనం అంతర్భాగంలో కేవలం ఐదు శాతమే గోడలు, మిగతా 95 శాతం అద్దాలతోనే నిర్మితం * విశాలమైన ఉద్యానవనం, భవనం చుట్టూ పచ్చదనం * మూడు వైపులా కొండలు, మరోవైపు జాతీయ రహదారి * ఏ గదిలోకి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్ తప్పనిసరి. వేలిముద్ర వేస్తేనే తలుపులు తెరుచుకుంటాయి. * భవనం మొత్తానికి వైఫై సౌకర్యం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, వీడియోవాల్స్ ఏర్పాటు చేశారు.
sonykongara Posted August 16, 2017 Author Posted August 16, 2017 మంగళగిరిలో మాన ఆక్టోపస్ చేసిన విన్యాసాల ముందు జేమ్స్ బాండ్, సినిమాలు కూడా పనికిరావు... రాష్ట్ర పోలీస్ దళం ఆక్టోపస్ బృందం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అద్భుత విన్యాసాలు, ఆంధా పోలీసుల ధైర్యసాహసాలకు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రశంసించారు. రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం అనంతరం ఆక్టోపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనను, పోలీస్ బృందం చేసిన విన్యాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డి.జి.పి ఎన్ సాంబశివరావు, తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయుధ ప్రదర్శనను తిలకించి ఆయూ ఆయుధ పరికరాలు పనిచేసే తీరును అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా యు.ఎస్.ఎ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ట్, ఆస్ట్రియాకి చెందిన గ్లోక్, ఇజ్రాయేల్ కు చెందిన సి.యస్.ఎం. డోగో, జర్మనీకి చెందిన ఎంపి-5 ఎస్.డి, నార్వేకు చెందిన బ్లాక్ హార్నెట్, బల్లేరియాకు చెందిన ఏకే-47, ఇటలీకి చెందిన స్సాస్, వంటి ఆయుధాలను ఆక్టోపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఆక్టోపస్ బృందం వివిధ విన్యాసాలను అత్యంత ధైర్యసాహసాలతో కూడి నిర్వహించారు. శత్రువులను, ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కునేందుకు పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరచడంతో పాటు ఎంతో కఠినతరమైనవిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇటువంటి సాహస క్రీడా విన్యాసాలను విద్యార్ధి దశలోనే విద్యారులకు అందించే చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్టోపస్ బృందం విన్యాసాలలో భాగంగా అబ్సెల్లింగ్ వాల్డ్రాప్, స్పైడర్ టెక్నిక్, పవర్ క్విక్ అసెండర్స్, స్పీడ్ర్యాప్లింగ్, బ్లాక్ హార్నెట్, బంగీజంప్, డోగో వంటి విన్యాసాలు ఆకటుకున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడి తేలికైన పరికరంతో 1.6 కిలోమీటర్ల పరిధిలో జరిగే సంఘటనలను చిత్రీకరించే డ్రోన్ పరికరం అందుబాటుల్లోకి తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఆభినందించారు.
sonykongara Posted August 17, 2017 Author Posted August 17, 2017 పోలీస్ హెడ్‌క్వార్టర్స్ c/o మంగళగిరి17-08-2017 08:38:50 మంగళగిరి: మంగళగిరి ప్రసిద్ధి పరంపరలో మరో ప్రత్యేకత వచ్చిచేరింది. ఇకనుంచి మంగళగిరి కేంద్రంగా పోలీస్ బాస్ కార్యాలయం పనిచేయనుంది. రాజధాని అమరావతి నగరానికి స్పష్టమైన రూపురేఖలు వచ్చేంతవరకు మంగళగిరే పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌గా రాజిల్లనుంది. ఇక్కడి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో రూ.40 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ భవన సముదాయాన్ని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాష్ట్ర విభజన ప్రకటనతోనే మంగళగిరి ఆరో బెటాలియన్ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌గా ఆవిర్భవించగలదని భావించారు. అందుకు తగినట్టుగనే మూడేళ్లు ఆలస్యంగా ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు స్థానం కల్పించింది. ఈనాటి ఈ పరిణామానికి 1971లోనే పునాది పడినట్టుగా భావించాలి. అప్పట్లో రిజర్వుడ్ అటవీ ప్రాంతంగా వున్న ఈ కొండ తీరప్రాంతంలో సుమారు 147 ఎకరాల విస్తీర్ణంలో డీ ఫారెస్టు చేసి అందులో ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో ముందుచూపును కనబరుస్తూ ఇంత పెద్ద విస్తీర్ణంలో పోలీసు బెటాలియన్‌ను ఏర్పాటు చేయబట్టే నేడు ఇక్కడ పోలీసుహెడ్ క్వార్టర్స్‌తో పాటు టెక్ టవర్, పోలీసు ఆయుధాగారం వంటి ప్రధాన విభాగాల ఏర్పాటుకు వీలు కుదిరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడే కొలువుదీరింది. దేశంలో ఏ రాష్ట్రంలో, ఎక్కడాలేని విధంగా ప్రధాన పోలీసు విభాగాలన్నీ ఒకేచోట కొలువుదీరి వుండడం బహుశా ఇక్కడే కావొచ్చునేమో! రాష్ట్ర విభజనానంతరం విజయవాడలోని ఓ భవనంలో డీజీపీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని సర్దుకుపోతున్న తరుణంలో, డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నండూరి సాంబశివరావు మాత్రం ఏపీకి ప్రత్యేకంగా పోలీసు హెడ్‌క్వార్టర్స్ వుండి తీరాలని పట్టుబట్టారు. డీజీపీ నండూరి పట్టుదలకు కాలం కలిసొచ్చిందనే చెప్పాలి. రాష్ట్రవిభజనతో ఏపీ పోలీసు విభాగానికి కొన్ని నిధులు రావడం... అందరికీ అనుకూలమైన ప్రాంతంగా మంగళగిరి పోలీసు బెటాలియన్‌లోని సువిశాలమైన ఖాళీస్థలం అందుబాటులో కనిపించడంతో ఆయన ఆలోచనలు వెంటనే కార్యరూపంలోకి వచ్చేశాయి. కేవలం పది మాసాల వ్యవధిలో ఇంచుమించు రూ.40 కోట్ల ఖర్చుతో ప్రకృతి సోయగాల నడుమ కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నే రీతిలో ఏపీ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఆవిర్భవించింది. జీ+4 భవన సముదాయంగా రూపుదిద్దుకున్న ఈ అధునాతన సాంకేతిక భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్, ఒకటవ అంతస్తును సీఐడీకి, రెండో అంతస్తును పీ అండ్ ఎల్‌కు, మూడో అంతస్తును పోలీసు నియామక విభాగానికి, నాలుగో అంతస్తును శాంతిభద్రతల ఏడీజీ కార్యాలయానికి, అయిదవ అంతస్తును డీజీపీ కార్యాలయం నిమిత్తం కేటాయించారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ భవన సముదాయాన్ని రికార్డు సమయంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం వెనుక డీజీపీ నండూరి సాంబశివరావు పట్టుదల ప్రధానంగా వుంది. ఇంచుమించు ప్రతిరోజూ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆయన ఒత్తిడి మేరకు ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు కూడా రోజులో ఎకు్కువ సమయాన్ని ఇక్కడే కేటాయించి నిర్మాణ పనులను అతివేగంగా జరిపించారు. నిర్మాణ పనుల్లో ఎంతయితే వేగాన్ని చూ పించారో దాని నాణ్యత, ఆకర్ష్ణణీయమైన డిజైన్ల విషయంలో రాజీపడకుండా అంతేస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి భవన ప్రా రంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భవనాన్ని తిల కించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రకృతి ఒడిలో పొదిగిన అద్దాల మహల్‌గా కనిపిస్తున్న ఈ భవనంలో అడుగడునా వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించి సీఎం ఫిదా అయిపోయారు. అమరావతిలో నిర్మించబోయే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఈ భవనం ఆదర్శంగా వుండాలని సీఎం ఈ సందర్భంగా చెప్పడం విశేషం!. మొత్తంగా మంగళగిరి ప్రసిద్ధి పరంపర వరుసలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కూడా వచ్చి చేరింది. మంగళగిరి ఓ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం...పెద్ద చేనేత కేంద్రం...అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతున్న క్రీడానగరం...ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రికి స్థానమిచ్చిన పట్టణం.... మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోనున్న ప్రసిద్ధ పట్టణంగా ప్రపంచ మ్యాపులో ప్రత్యేకతను చాటుకోనుంది.
Yaswanth526 Posted September 10, 2017 Posted September 10, 2017 IPS AssociationVerified account @IPS_Association Compliments to #AndhraPradesh Police on getting a world-class state-of-the-art Police Headquarters at #Amravati.
Yaswanth526 Posted September 10, 2017 Posted September 10, 2017 N Chandrababu NaiduVerified account @ncbn N Chandrababu Naidu Retweeted IPS Association Thank you for your acknowledgement. Maintaining law & order in the state is our prime focus & we will keep doing everything to ensure it.
sonykongara Posted February 24, 2018 Author Posted February 24, 2018 టెక్ టవర్ రెడీ 24-02-2018 07:59:50 మంగళగిరి: రాష్ట్ర పోలీసు శాఖ అధునాతన సొగసులతో కూడిన భవనాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. రాష్ట్ర పోలీసు శాఖకు ప్రధాన కేంద్రంగా మారిన ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మరో అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. బెటాలియన్ ఆవరణలో పూర్తి ఈశాన్యంగా టెక్ టవర్ పేరుతో బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. సుమారు రూ.16కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనికి సమీపంలోనే రూ.40కోట్ల వ్యయంతో పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయ భవనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం గతంలో మంజూరైన నిధులను వెచ్చించి 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఈ అధునాతన భవన సముదాయాలను నిర్మించారు.ప్రస్తుతం తుది మెరుగులను దిద్దుకుంటున్న ఈ భవనంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సరంజామాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో టెక్ టవర్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇందులోని ఏడంతస్తులలో తొలి నాలుగు అంతస్తులను కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్‌కు, ఆపై మూడంతస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ఒక్కో అంతస్తును 8500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.
sonykongara Posted April 12, 2018 Author Posted April 12, 2018 ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ప్రారంభించిన చంద్రబాబు12-04-2018 13:43:48 గుంటూరు జిల్లా: మంగళగిరిలో ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (ఇది తాత్కాలికం), పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రూ. 18 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పోలీసులు కొంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని, సర్వలెన్స్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టం.. ఇవన్నీ ఉపయోగించుకోవడంవల్ల దొంగతనాలు, క్రైమ్‌ను నియంత్రణ చేసే అవకాశం ఉందన్నారు. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు అరికట్టి, ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం మంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ మాలకొండయ్య, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now