Jump to content

AP Police headquarters


Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

Top Posters In This Topic

అమరావతి: ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని జూన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని డీజీపీ సాంబశివరావు తెలిపారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ ప్రాంగణంలో నిర్మితమవుతున్న డీజీపీ కార్యాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ వ్యవస్థను నూతన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామన్న డీజీపీ ఏబీఎన్‌తో చిట్ చాట్‌గా మాట్లాడారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
సీఆర్డీఏ పరిధిలో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ
 
అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా అనుమతులిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఎస్ఎల్ ఏర్పాటు చేసేందుకు రూ. 27 కోట్లు మంజూరు చేశారు. పలు కీలకమైన అంశాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ అందుబాటులోకి రానుంది
Link to comment
Share on other sites

రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఏర్పాటుకు ఆమోదం

ఈనాడు, అమరావతి: అమరావతిలో రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రయోగ పరికరాలకు రూ.27 కోట్లు, 10 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనం, శాస్త్రీయ పరిశోధన సిబ్బంది, రికరింగ్‌ బడ్జెట్‌ కింద ఏడాదికి రూ.72 లక్షలు కేటాయించాలని కోరుతూ ఏపీ డీజీపీ పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపింది. తొలి దశలో ఈ నిధులతో తాత్కాలిక ప్రయోగశాలను నెలకొల్పాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

దేశానికే రోల్ మోడల్‌‌గా ఏపీ సీఐడీని తీర్చిదిద్దుతాం’
 

636279253384029411.jpg
గుంటూరు: నేర పరిశోధనలో రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గుంటూరులోని మెడికల్‌ కళాశాల వెనుక పోలీసు క్వార్టర్స్‌లో నిర్మించిన సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని శనివారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే రోల్‌ మో డల్‌గా ఏపీ సీఐడీ విభాగాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. నేర పరిశోధన పకడ్బందీగా ఉండాలన్నారు. ఇందులో సీఐడీ అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎర్ర చందనం కేసులో అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు మారిషస్‌ కూడా వెళ్ళి వచ్చారన్నారు. ఆ కేసులో ముందుగా అనుకున్న ప్రధాన నిందితుడితో పాటు మరికొంత మందిని కూడా విచారణ అనంతరం అరెస్టు చేశారన్నారు.
 
 
అగ్రిగోల్డ్‌ విషయంలోనూ సీఐడీ అధికారులు సమర్ధంగా విచారణ సాగించి అనేక మందిని అరెస్టు చేశారన్నారు. ముఖ్యంగా నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నారన్నారు. దీనిలో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో రెండు ఆదర్శ పోలీస్‌స్టేషన్లను నిర్మించినట్లు తెలిపా రు. రాష్ట్రంలో మరో వంద మోడల్‌ పోలీస్‌స్టేషన్లను నిర్మిం చే ఆలోచన ఉందన్నారు. అనేక చోట్ల శిథిలావస్థకు చేరుకున్న పోలీసుల హౌసింగ్‌ క్వార్టర్స్‌ స్థానంలో పటిష్ఠమైన క్వా ర్టర్స్‌ నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ స్థలాలు ఉన్నాయని, వాటిని వాణిజ్య పరంగా వినియోగించి తద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బంది క్వార్టర్స్‌కు వినియోగిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నియామకంలోనూ ఏ ఒక్కరు వేలెత్తి చూపే అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించడం జరిగిందన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రాధాన్యత ప్రకారం తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అత్యాధునిక హంగులు..
గుంటూరులోని మెడికల్‌ కళాశాల వెనుక పోలీసు క్వార్టర్స్‌లో రూ.3.5 కోట్లతో 14 నెలల వ్యవధిలో పోలీసుశాఖ సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించింది. అత్యాధునిక హంగులతో చూడముచ్చటగా ఉన్న కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి భవన నిర్మాణం అద్భుతంగా ఉందంటూ పోలీసు అధికారులను అభినందించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏపీ సీఐడీకి సంబంధించిన సమాచారాన్ని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వారికి వివరించారు.
 
 
శాంతిభద్రతలతోనే అభివృద్ధి
ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండాలని హోం మంత్రి చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉంటే పరిశ్రమ లు వస్తాయని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే కొన్ని శక్తులు అడ్డుపడినప్పటికీ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న డీజీపీ నం డూరి సాంబశివరావు వాటిని ఛేదించారన్నా రు. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి అవకాశం లభించిందన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పోలీసుశాఖ మరింత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌, అభయగోల్డ్‌ లాంటి సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డిపాజిట్లు స్వీకరిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ప్రజలను దోపిడీ చేసే సంస్థల పట్ల ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు.
చరిత్ర సృష్టించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌: డీజీపీ నండూరి
గడిచిన 15 ఏళ్ళ తరువాత ఏపీలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కేసుల పెండెన్సీని జీరో శాతానికి తీసుకొచ్చి చరిత్ర సృష్టించిందని డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. మార్చి 31 నాటికి నమోదైన కేసులన్నింటిని పూర్తి చేసిందన్నారు. సీఐడీ ఏడాదికి ఆరేడు కేసుల్లో చార్జిషీట్లు మాత్రమే దాఖలు చేసేదని, కానీ గత ఏడాది 119 చార్జిషీట్లు దాఖలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. సిబ్బంది కొరత, వసతులు లేనప్పటికీ సీఐడీ అధికారులు విధులను సమర్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సీఐడీ విభాగం నేర పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ఆర్థిక సంస్థల మోసాలను ముందస్తుగా గుర్తించి అరికట్టేందుకు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను ఇటీవలే విజయవాడలో ప్రారంభించడం జరిగిందన్నారు.
 
 
రాష్ట్రంలో పోలీసుశాఖకు నాలుగు వేల ఎకరాల స్థలం ఉందని, దానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మహిళా పోలీస్‌స్టేషన్ల సంఖ్యను పెంచాలని, జిల్లాకు రెండు స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా స్టేషన్లలో సిబ్బంది కొరతను కూడా తీర్చాలన్నారు. పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా మాట్లాడుతూ పోలీసు హౌసింగ్‌ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు మాట్లాడతూ ఏపీ సీఐడీ చేదించిన కేసులు సాంకేతిక పరిజ్ఞానం పనితీరు, తదితర వివరాలను స్లైడ్స్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు.
 
 
ddsdsdasd.jpgఇటీవల ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఏ డిపాజిటర్స్‌ డాట్‌.కామ్‌ అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సీఐడీ వివిధ కేసుల్లో మూడు వేల కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్‌, ముస్తఫా, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, ఎమ్మెల్సీలు ఏఎస్‌ రామకృష్ణ, ఫిలిప్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, అదనపు డీజీలు ఏబీ వెంకటేశ్వరరావు, హరీష్‌కుమార్‌ గుప్తా, రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతమ్‌ సవాంగ్‌, ఐజీలు సునీల్‌కుమార్‌, అమిత్‌ గార్గ్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ, ఎస్పీలు త్రిపాఠీ, నారాయణ్‌ నాయక్‌, గోపినాథ్‌ జెట్టి, కోటేశ్వరరావు, మోహన్‌రావు, ప్రకాశం ఎస్పీ త్రివిక్రమ వర్మ, పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, విజయవాడ డీసీపీ అశోక్‌కుమార్‌, విజిలెన్స్‌ ఎస్పీ శోభా మంజరి, చీఫ్‌ లీగల్‌ అడ్వైజర్‌, సెషన్స్‌ జడ్జి ఎంఆర్‌ శరవణ్‌కుమార్‌, ట్రూత్‌ ల్యాబ్స్‌ ఎండీ కేపీసీ గాంధీ, సీఐడీ అదనపు ఎస్పీలు హుస్సేన్‌, అదనపు ఎస్పీలు భాస్కరరావు, సుబ్బరాయుడు, డీఎస్పీలు, టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టారు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ కో ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌, నాయకులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

‘నాలుగో సింహం’.. కేరాఫ్‌ మంగళగిరి
 
636279947434321300.jpg
  • పల్నాటి సింహదళం ప్రాంగణంలో కార్యాలయాలు
  • 40 ఎకరాల విస్తీర్ణం.. 50 కోట్ల వ్యయం
  • శరవేగంగా భవనాల నిర్మాణం
  • 18 పోలీసు విభాగాలకు శాశ్వత భవనాలు
  • జూన్‌ నుంచి కార్యకలాపాలు
అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిస్థాయిలో ‘సరికొత్త’గా కొలువు తీరనుంది. రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పల్నాటి సింహదళం (మంగళగిరి ఏపీఎ్‌సపీ బెటాలియన్‌) వేదిక కాబోతోంది. వెలగపూడి సచివాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరిలోని ఏపీఎ్‌సపీ 6వ బెటాలియన్‌ ప్రాంగణంలోని 40 ఎకరాల విస్తీర్ణంలో పోలీసు పరిపాలనా భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. డీజీపీ సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ.50 కోట్ల వ్యయంతో కీలకమైన నాలుగు భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సొంత రాష్ట్రంలో డీజీపీ కార్యాలయంతోపాటు ఆయుధాగారం కూడా లేని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖది. దీంతో విజయవాడలో ఆఫీసర్స్‌ క్లబ్‌ను అద్దెకు తీసుకొని మరమ్మతులు చేయించి అప్పటి డీజీపీ జేవీ రాముడు క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సొంత భవనాల నిర్మాణం కోసం కేంద్రానికి నిధుల కోసం విన్నవించినా ఆశించిన మేర నిధులు రాలేదు. అయినా డీజీపీ సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత ఆగస్టులో మంగళగిరిలో రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యాధునిక వసతులతో ఐదంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మే లోపు నిర్మాణాలు పూర్తి చేసి జూన్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. డీజీపీ కార్యాలయంతోపాటు ఐజీలు ఇతర సీనియర్‌ పోలీసు అధికారుల కార్యాలయాలతో కూడిన పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, ఇంటెలిజెన్స్‌ విభాగం, సీఐడీ, సైబర్‌ వింగ్‌, బెటాలియన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌, ఆయుధాగారం, హోంగార్డ్స్‌ డీజీ, రైల్వే ఏడీజీ, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, సీఎంకు రక్షణగా ఉండే ఎస్‌పీజీ కోసం ప్రత్యేక వసతి కేంద్రం, రిక్రియేషన్‌ తదితర 18 పోలీసు విభాగాలకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు.
 
రూ.22 కోట్లతో ఆయుధాగారం
రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన ఆయుధాగారాన్ని ఇక్కడ శరవేగంగా నిర్మిస్తున్నారు. రూ.22 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భవనానికి సోలార్‌ విద్యుతతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. వెలగపూడి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన సాగుతుండటంతో అక్కడికి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆయుధాగారానికి అడిషనల్‌ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో 200 మంది సాయుధ సిబ్బంది నిరంతరం కాపలాగా ఉంటారు.
 
అంతర్జాతీయ ప్రమాణాలతో..
పోలీసుశాఖ మంగళగిరిలో నిర్మిస్తున్న భవనాల్లో కమ్యూనికేషన్‌కు సంబంధించిన టెక్‌ టవర్‌ కీలకమైనది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.10.67 కోట్ల వ్యయంతో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని పూర్తి చేయనున్నారు. ఇందులో సమగ్ర నేర సమాచారంతోపాటు నేరగాళ్ల వివరాలు అన్నీ నిక్షిప్తమై ఉంటాయి. విశాఖపట్నం, విజయవాడ కమిషనరేట్లు, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి అర్బన్‌ జిల్లాలు, ఇతర జిల్లాల ఎస్పీల కార్యాలయాలతో టెక్‌ టవర్‌ అనుసంధానమై ఉంటుం ది. ఇక్కడ పనిచేసే నిపుణులు రాష్ట్రంలో జరిగే నేరాలపై నిరంతరం పరిశీలన, నేరాల తీరుపై విశ్లేషణ చేస్తుంటారు. అందులో గుర్తించిన అంశాలను జిల్లాల ఎస్పీలు, ఆయా కేసులకు సంబంధించిన ఎస్‌హెచ్‌వోలకు వివరిస్తారు. దీంతో నేరాలను అదుపు చేయడంతోపాటు వేగంగా కేసు దర్యాప్తు పూర్తయ్యే అవకాశముంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...

40 మోడల్‌ పోలీసు స్టేషన్లు నిర్మిస్తాం

పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ నాగుల్‌మీరా

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒక్కోటి రూ.1.44 కోట్ల వ్యయంతో 40 మోడల్‌ పోలీసుస్టేషన్లను నిర్మించనున్నట్లు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ నాగుల్‌మీరా తెలిపారు. వీటిలో 25 పోలీసుస్టేషన్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. విజయవాడలో శుక్రవారం ఆ సంస్థ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంగళగిరి పటాలంలో రూ.48 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీసు ప్రధాన కార్యాలయాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో పోలీసు గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని 500 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తామని, మంగళగిరి ఏపీఎస్పీ పటాలం సమీపంలో ఐపీఎస్‌ అధికారుల తాత్కాలిక బస కోసం రెండు పడక గదులతో కూడిన 20 ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. కానిస్టేబుళ్ల నివాసగృహాలను ఇకపై 1030 చ.అడుగుల విస్తీర్ణంలోనూ, ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల కోసం 1200 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని వివరించారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
Guest Urban Legend

Ee building ni tharuvatha edaina company ki ichukovachu le :close:

 

infra build chestunnaru..we need lots of buildings

ivvani tarvatha ready to move spaces lekka...asala ah area chusava vijayawada guntur highway

e police headquaters ki pakkaney jagura and land rover showroom vundhi dhani pakkana convention center 250 mts distance lo LEPL mid valley city opposite lo resort

hot cake bro ilanti properties

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...