Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని ఎల్పీఎస్‌కు పలు దేశాల ప్రశంసలు
22-03-2018 08:24:31
 
636573038712114635.jpg
అమరావతి: ‘భూమి మరియు పేదరికం’ అనే అంశంపై ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌ డి.సి.లో ఈ నెల 19నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న వివిధ దేశాల ప్రతినిధులు అమరావతి కోసం అమలు పరచిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంను కొనియాడారు. భూనిర్వహణపై పలు దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోపాటు వివిధ అభివృద్ధి సంస్థల ఉన్నతాధికారులు పాలుపంచుకునే ఇలాంటి సదస్సులను ప్రపంచ బ్యాంక్‌ ఏటేటా నిర్వహిస్తుంటుంది.
 
   ఇదే కోవలో జరుగుతున్న ప్రస్తుత సదస్సులో మన దేశం నుంచి హాజరైన ప్రతినిధుల్లో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమీకరించేందుకు ఎల్పీ ఎస్‌తో సహా పాటిస్తున్న వేర్వేరు విధానాలపై విస్తృతంగా చర్చిస్తున్న ఈ సదస్సులో శ్రీధర్‌ మన రాజధాని కోసం దిగ్విజయంగా అమలు పరచిన భూసమీకరణ పథకం గురించి ఇచ్చిన ప్రజెంటేషన్‌ పలువురి ప్రశంసలను అందుకుంది. చాలా దేశాల్లో అమలు పరచిన భూసమీకరణ పథకం పరిమాణంతో పోల్చితే అమరావతి ఎల్పీఎస్‌ చాలా పెద్దది కావడం, దానిని దిగ్విజయం చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గణనీయ పాత్రను పోషించిందని తెలుసుకున్న ప్రతినిధులు అభినందనలు తెలిపారు. రాజధాని రైతులకు కేటాయించే రిటర్నబుల్‌ ప్లాట్లను ఎంచుకునేందుకు వారికి లెక్కకు మిక్కిలి ఆప్షన్లను అందుబాటులో ఉంచడం, ఆయా గ్రామాల్లోని అన్నివర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తుండడం కూడా వారిని విశేషంగా ఆకర్షించింది.
 
అమరావతిలో పెట్టుబడులపై పలువురి ఆసక్తి..
ఈ సందర్భంగా శ్రీధర్‌ వాషింగ్టన్‌లో వివిధ దేశాలకు చెందిన పలువురు కీలక పెట్టుబడిదారులను కలిసి, అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న విస్తృతావకాశాల గురించి వారికి తెలియజెప్పారు. దీనికి మంచి స్పందన లభించింది. రాజధానిలో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఉద్యోగాల కల్పనకు దోహదపడేంత మొత్తాలను పెట్టుబడి పెట్టేందుకు వారు ఆసక్తి చూపారు.
Link to comment
Share on other sites

రాజధానిలో లక్ష కోట్ల పనులు
22-03-2018 03:11:39
 
  • రూ.6,420 కోట్లతో స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
  • పట్టణాల్లో 6.84 లక్షల పేదల ఇళ్లు పూర్తి
  • జూన్‌ 8 నుంచి 200 అన్న క్యాంటీన్లు: నారాయణ
  • మౌలిక సదుపాయాల తీరు భేష్‌: విష్ణుకుమార్‌
 
అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రూ.1.02 కోట్ల మేర పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీలో పురపాలక పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల తీరుపై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. ‘‘రాజధానిలో రూ.57,159 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ నాలుగేళ్లలో రూ.4,172 కోట్ల విలువైన పనులు పూర్తిచేశాం. మరో రూ.37,323 కోట్ల పనులు ప్రతిపాదనదశలో ఉన్నాయి. మొత్తంగా రూ.1.02 లక్షల కోట్ల విలువైన పనులు చేయనున్నాం’’ అని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 110 మున్సిపల్‌ పట్టణాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని, దీనికోసం 13, 14వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎ్‌ఫసీ, ప్రపంచబ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీల నుంచి నిధులను సమీకరిస్తున్నామని మంత్రి తెలిపారు.
 
రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 135 ఎల్‌పీసీడీల తాగునీరు అందిస్తున్నామన్నారు. ‘‘రూ.3,762 కోట్లతో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో అమృత్‌ పథకం ద్వారా తాగునీటి, సీవరేజ్‌, స్టార్మ్‌ వాటర్‌ ప్రాజెక్టులను చేపడుతున్నాం. రూ.6,420 కోట్లతో కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంను స్మార్ట్‌ నగరాలుగా రూపొందించే పని కొనసాగుతోంది. వీటితోపాటుగా, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, అనంతపురం, ఒంగోలు నగరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో స్మార్ట్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం’’ అని చెప్పారు. పట్టణాల్లో 9 లక్షల ఇళ్లకు దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 6.84 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
 
రూ.10,740 కోట్లతో రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నామని, మరో రూ.17,962 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. విజయవాడ మెట్రో పనులకు త్వరలో బిడ్లు ఓపెన్‌ చేస్తామన్నారు. రూ.5తో పేదలకు టిఫిన్‌, భోజనం అందించే 200 అన్న క్యాంటీన్లను జూన్‌ 8 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో తూర్పు నుంచి పడమరకు 18 రోడ్లు, ఉత్తరంనుంచి దక్షిణానికి 16 రోడ్లు మొత్తం 34 రోడ్లు నిర్మిస్తున్నామని, ఇందులో 28 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, టీడీపీ ప్రభుత్వం పట్టణాల్లో మౌలికవసతులను బాగా మెరుగుపరిచిందని బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌రాజు ప్రశంసించారు. హుద్‌హుద్‌ తుఫాను తరువాత విశాఖపట్నంలో నీటి సమస్యలు తీవ్రతరం అయ్యాయని, తన నియోజకవర్గంలోని 34, 35వ వార్డుల్లో అర్ధగంట ఎక్కువ సమయం నీళ్లు ఇవ్వాలని మంత్రి నారాయణను రాజు కోరారు. ఈ చర్చలో టీడీపీ సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, బొండ ఉమా, వీ వెంకటేశ్వరరావు, అలపాటి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వరద నియంత్రణకు రూ.542 కోట్లతో టెండర్లు
22-03-2018 08:09:21
 
636573029603676603.jpg
అమరావతి: రాజధాని నగరానికి వరద ముప్పును తప్పించేందుకు చేపట్టనున్న పలు పథకాల్లో భాగంగా కొన్ని కీలక పనులకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. మొత్తం రూ.541.85 కోట్ల అంచనా వ్యయంతో అమలుపరచనున్న ఈ పథకాలు 19, 20 ప్యాకేజీల్లో భాగంగా ఉన్నాయి. 19వ ప్యాకేజీలో కొండవీటివాగు, పాలవాగుల విస్తరణ, అభివృద్ధి పనులు ఉండగా, 20వ ప్యాకేజీలో గ్రావిటీ కెనాల్‌తోపాటు కృష్ణాయపాలెం వద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌ను చేర్చారు. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 
రూ.288.47 కోట్లతో ప్యాకేజీ నెంబర్‌ 19...
రాజధాని ప్రాంతానికి దుఃఖదాయనిగా పేరొందిన కొండవీటి వాగుకు కట్టడి వేయడమే ప్రధాన లక్ష్యంగా దీనిని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో ప్రవహించే మరొక ప్రధానవాగైన పాలవాగు నియంత్రణ కూడా ఇందులో భాగంగా ఉంది. వెడల్పు, లోతు బాగా తక్కువగా ఉండడంతో భారీవర్షాలు కురిసినప్పుడల్లా ఈ రెండు వాగులూ ఉవ్వెత్తున పొంగిపొర్లి, పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నట్లు గుర్తించిన ఏడీసీ ఈ సమస్య నివారణకుగాను ఈ వాగులను వెడల్పు చేయడంతోపాటు లోతును కూడా పెంచేందుకు నిర్ణయించింది. ఈ ప్రకారం కొండవీటివాగును సుమారు 23.60కిలోమీటర్ల పొడవున, పాలవాగును 16.70 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం అవి ఉన్న పరిమాణంతో పోల్చితే భారీగా విస్తరించి, అభివృద్ధి పరచనుంది. ఇందుకు మొత్తం రూ.288.47 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది.
 
రూ.253.38 కోట్లతో ప్యాకేజీ నెంబర్‌ 20...
ఎంతటి భారీవర్షాలు కురిసినా అమరావతికి ముంపు బెడద లేకుండా ఉండేందుకు, అదే సమయంలో రాజధానికి పెద్దఎత్తున అవసరమయ్యే జలవనరులను సమకూర్చేందుకు ఏడీసీ వివిధ ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మించాలని నిర్ణయించిన విషయం విదితమే. వీటిల్లో ఒకదానిని రాజధాని గ్రామాల్లో ఒకటైన కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ నిల్వ సామర్ధ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు దానికి నీటిని చేర్చేందుకు సుమారు 7.83 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్‌ను తవ్వాలని ఏడీసీ ప్రతిపాదించింది. ఈ రెండు పనులకు కలిపి మొత్తం రూ.253.38 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. పైన పేర్కొన్న ప్యాకేజీలను చేపట్టాలన్న ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థలు తమ బిడ్లను సమర్పించుకునేందుకు ఏడీసీ వచ్చే నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువునిచ్చింది.
Link to comment
Share on other sites

అమరావతిలో ఆకట్టుకుంటున్న సోలార్‌ వృక్షం

అమరావతి: సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోలార్‌ వృక్షం ఎంతో ఆకట్టుకుంటోంది. సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించడంలో భాగంగా సచివాలయంలో ప్రయోగాత్మకంగా రెండు సోలార్‌ చెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాధారణంగా సౌరవిద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు చాలా స్థలం అవసరమవుతుంది. వృక్షాకారంలో ఉన్న ఈ విధానంలో ఒకేచోట ఎక్కువ మొత్తంలో సౌరవిద్యుత్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. విదేశాల్లో ప్రయోగ దశలో ఉన్న వీటిని దూరదృష్టితో ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో సోలార్‌ చెట్టు నుంచి ఏడాదికి 18వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఒక్కో సోలార్‌ చెట్టు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. కేవలం 12 మీటర్ల విస్తీర్ణంలోనే వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

 

Link to comment
Share on other sites

కసరత్తు పూర్తి.. ఐదు టవర్లుగా ఏపీ సచివాలయం నిర్మాణం
22-03-2018 22:37:40
 
 
అమరావతి: సచివాలయం ఆకృతులపై తుది కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొండవీటివాగుకు రెండువైపులా సచివాలయ భవనాలు ఏర్పాటు చేయాలని సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు టవర్లుగా సచివాలయ నిర్మాణం జరగనుంది. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఏపీ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుందని సమాచారం.
Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:
కసరత్తు పూర్తి.. ఐదు టవర్లుగా ఏపీ సచివాలయం నిర్మాణం
22-03-2018 22:37:40
 
 
అమరావతి: సచివాలయం ఆకృతులపై తుది కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొండవీటివాగుకు రెండువైపులా సచివాలయ భవనాలు ఏర్పాటు చేయాలని సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు టవర్లుగా సచివాలయ నిర్మాణం జరగనుంది. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఏపీ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుందని సమాచారం.

kondaveeti vaagu akkada endukundi. my understanding is government complex is way north of this vaagu. vere edaina chinna vaagu ayyintundi

Edited by swarnandhra
Link to comment
Share on other sites

12 minutes ago, swarnandhra said:

kondaveeti vaagu akkada endukundi. my understanding is government complex is way north of this vaagu. vere edaina chinna vaagu ayyintundi

pala vagu ani untundi ...adi vachi kondaveedu vagu lo kalustundi.....

Link to comment
Share on other sites

46 అంతస్తులుగా సీఎం కార్యాలయం
టవర్‌పైనే హెలిప్యాడ్‌ సచివాలయం, విభాగాధిపతులు
    కార్యాలయ భవనాల తుది ఆకృతులు సిద్ధం

ఈనాడు, అమరావతి: అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల తుది ఆకృతులు సిద్ధమయ్యాయి. వీటిని ఐదు టవర్లుగా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనం 46 అంతస్తులు ఉంటుంది. టవర్‌ పైభాగంలో హెలిప్యాడ్‌ ఉంటుంది. మిగతా నాలుగు టవర్లు... ఒక్కొక్కటి 40 అంతస్తులుగా నిర్మిస్తారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల తుది ఆకృతులపై లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆర్కిటెక్ట్‌లు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఆకృతుల నమూనాల్ని ప్రదర్శించారు. శుక్రవారం శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత తుది ఆకృతుల్ని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయ భవనాల్లోకి అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశాలు కల్పించినా, సచివాలయ ప్రాంగణంలోకి మాత్రం సాధారణ ప్రజలకూ ప్రవేశం ఉండేలా ఆకృతుల రూపకల్పన జరగాలని సూచించారు. అప్పుడే అది డైనమిక్‌గా, పర్యాటక ఆకర్షక ప్రదేశంగా ఉంటుందని, ప్రజలకు ప్రవేశం లేకపోతే అవి సాధారణ ప్రభుత్వ కార్యాలయాలుగానే మిగిలిపోతాయని పేర్కొన్నారు.

పాలవాగుకి రెండు పక్కలా..!
మొత్తం ఐదు టవర్లలో పాలవాగుకు ఒకపక్క రెండు, మరోపక్క మూడు టవర్లు ఉంటాయి. వీటిని కలుపుతూ 600 మీటర్ల పొడవైన అంతర్గత మార్గం ఉంటుంది. ఏ టవర్‌ నుంచి ఏ టవర్‌కైనా చేరుకునేందుకు వీలుగా ఒక వారధిలా ఈ మార్గాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన విభాగం ఒకే టవర్‌లో ఉంటాయి. సీఎం టవర్‌కు పక్కనే ప్రధాన కార్యదర్శి కార్యాలయ టవర్‌ ఉంటుంది. పాలవాగుకి రెండో పక్కన ఉన్న మూడు టవర్లలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలుంటాయి. ఐదు టవర్లకు చెంతనే ఫుడ్‌ ప్లాజాలు, స్పోర్ట్స్‌ ఏరియా, ఇతర సదుపాయాల కోసం విడిగా రెండంతస్తుల నిర్మాణాలుంటాయి.

వేటికవే మకుటాయమానంగా ఉండాలి
పరిపాలన నగరంలో ప్రతి నిర్మాణం దేనికైదే మకుటాయమాన(ఐకానిక్‌) కట్టడంగా, ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉండాలని, అప్పుడే అది సందర్శనీయ, పర్యాటక ప్రదేశంగా రూపొందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘కేవలం భవన నిర్మాణ శైలి, ఆకృతి వల్ల ఐకానిక్‌ అవదు. బాహ్య పరిసరాలూ అదే స్థాయిలో ఉండాలి. కార్యాలయ వేళలు దాటాక, పరిపాలన భవన ప్రాంతం నిర్మానుష్యంగా మారకూడదు. ప్రజలు సందర్శించేందుకు, కొనుగోళ్లు(షాపింగ్‌) చేసేందుకు అనువైన వాతావరణం ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఆకృతుల కోసం ఇక జాప్యం చేయడానికి వీల్లేదని, సత్వరం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విజయవాడ సంతోష నగరంగా మారాలి
ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో నిర్వహించే సంతోష నగరాల సదస్సుపై సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు ఏప్రిల్‌ 1 నాటికే విజయవాడ సిద్ధం కావాలని, సంతోష నగరంగా మారిపోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు, అధికారులు, ఉద్యోగులంతా కలసి విజయవాడను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సంతోష నగరాల సదస్సుకు సహకరించేలా అధికారులు వారిని సిద్ధం చేయాలన్నారు.

Link to comment
Share on other sites

ఇటు పరిపాలన.. అటు ప్రజాకర్షణ!
23-03-2018 03:05:46
 
636573711458051632.jpg
  • రెండూ నెరవేరేలా సచివాలయ సముదాయం
  • ఏపీసీఆర్డీఏ సమీక్షలో సీఎం
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని పరిపాలనా నగరంలో నిర్మించనున్న సచివాలయం తుది ఆకృతులపై దాదాపుగా స్పష్టత వచ్చింది. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ వీటికి సంబంధించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజెంటేషన్‌ ఇవ్వగా, అవి ఆయన ప్రశంసలు చూరగొన్నాయి. శుక్రవారం శాసనసభ్యులకు ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఏపీసీఆర్డీఏ సమీక్షా సమావేశంలో సచివాలయం తుది ఆకృతులపై విస్తృత చర్చ జరిగింది.
 
వివరాలిలా ఉన్నాయి. సచివాలయాన్ని 5 టవర్లుగా, పాలవాగుకు ఒకవైపున 3, మరోవైపు 2 చొప్పున నిర్మించాలని నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతిపాదించారు. వీటిల్లో నాలుగు టవర్లు 40 అంతస్థులతో నిర్మితమవుతుండగా.. ముఖ్యమంత్రి కొలువుదీరే టవర్‌ మాత్రం 46 అంతస్థులతో ఉండనుంది. దీనిపైనే హెలిప్యాడ్‌ కూడా నిర్మిస్తారు. సచివాలయమంటే కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా సాయంత్రం వేళల్లో, సెలవు దినాల్లో సాధారణ ప్రజలు, పర్యాటకులు వచ్చి సేద తీరేందుకు వీలుగా ఉండాలన్న ముఖ్యమంత్రి సూచనను అనుసరించి 5 టవర్లకు చెంతనే ఫుడ్‌ ప్లాజాలు, క్రీడాప్రదేశాలు, ఇతర వసతులు కల్పించేందుకు వీలుగా నిర్మాణాలు జరుపుతారు.
 
ప్రతి నిర్మాణం ఐకానిక్‌గా రూపుదిద్దుకోవాలని చంద్రబాబు అన్నారు. సత్వరమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో అమరావతిలో జరగనున్న సంతోష నగరాల సదస్సుకు జరుగుతున్న ఏర్పాట్లను చంద్రబాబు ఈ సమావేశంలో సమీక్షించారు. ఏప్రిల్‌ 1 నాటికే విజయవాడ నగరం ఈ సదస్సుకు సిద్ధం కావాలన్నారు. బెజవాడ సంతోష నగరంగా మారిపోవాలని చెప్పారు.
Link to comment
Share on other sites

భవన ఆకృతులపై ఎమ్మెల్యేల సంతృప్తి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధానిలో నిర్మించతలపెట్టిన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్ల భవన ఆకృతులపై శాసనసభ్యులు అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో భవన ఆకృతులతో ప్రదర్శన ఏర్పాటు చేయగా.. వాటిని తిలకించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎమ్మెల్యేల క్వార్టర్లు సిద్ధమవుతాయని.. క్లబ్‌ హౌజ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ వంటి అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. సందర్శకులను కలిసేందుకు ప్రతి క్వార్టర్‌లోనూ ప్రత్యేకహాల్‌ ఏర్పాటు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని.. వచ్చే ఎన్నికల్లో ప్రజామోదం పొందితేనే కొత్తగా నిర్మించే శాసనసభ భవనంలోకి అడుగుపెడతామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చెప్పారు. శుక్రవారం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే భవనాల ఆకృతులను తిలకించడంతో మిగిలిన వారికోసం శనివారం అసెంబ్లీ భవనంలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

సెక్రటేరియట్‌, అసెంబ్లీ డిజైన్లపై శాసనసభ్యుల సంతృప్తి
24-03-2018 03:03:46
 
  • వచ్చే నెల 2వ వారంలో సచివాలయానికి టెండర్లు
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని పరిపాలనా నగరంలో నిర్మించనున్న సచివాలయం, అసెంబ్లీ, శాసనసభ్యుల నివాసాల డిజైన్లపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన ఈ డిజైన్లను శాసనసభ్యుల కోసం శుక్రవారంనాడు వెలగపూడిలోని సచివాలయంలో ప్రదర్శించారు. గురువారమే వీటిని పరిశీలించిన సీఎం కూడా బాగున్నాయన్నారు. పాలవాగుకు ఇరువైపులా 5టవర్లుగా నిర్మితమవనున్న సచివాలయ సముదాయం మొత్తం విస్తీర్ణం 50లక్షల చదరపు అడుగులు. తుది డిజైన్లపై ఏకాభిప్రాయం వ్యక్తమైనందున ఇతర ప్రక్రియలన్నింటినీ పూర్తిచేసి, వచ్చేనెల 2వ వారంలో సెక్రటేరియట్‌ నిర్మాణానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిజైన్ల విశిష్టతల గురించి ఆర్కిటెక్ట్‌లు, అధికారులు వివరించారు.
 
సాధారణ భవనాల మాదిరిగా ఈ సముదాయంలోని భవంతుల లోపల పిల్లర్లు ఉండవని, వాటికి బదులుగా అంతర్గతంగా ‘కోర్‌’, బయటి వైపున ‘గ్రిడ్‌ డిజైన్‌’ ఉండి, భవనాల బరువును మోస్తాయని పేర్కొన్నారు. ఈ విధంగా నిర్మితమవుతున్న భవంతుల్లో దేశంలోనే మన సచివాలయం మొదటిదన్నారు. గ్రిడ్‌ డిజైన్‌ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేలా ప్రఖ్యాత కలంకారీ డిజైన్లతోపాటు మరో రెండింటిని నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు చూపించారు. ఈ మూడింటినీ శనివారం అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు చూపిస్తారు. వాటిలో వారికేం నచ్చిందో తెలియజేయాలని కోరుతూ స్లిప్‌లు అందజేస్తారు.
 
ఏ డిజైన్‌కు ఎక్కువమంది మొగ్గుచూపితే అదే సచివాలయ టవర్ల బాహ్య రూపమవుతుంది. ఈ సందర్భంగా శాసనసభ్యులతో సీఎం మాట్లాడారు. వారికోసం రాజధానిలో నిర్మిస్తున్న నివాసాలు డిసెంబరుకల్లా సిద్ధమవుతాయన్నారు. నూతనంగా నిర్మించనున్న శాసనసభ భవంతిలోకి అడుగు పెట్టాలన్న సంకల్పంతో పని చేయాలని కోరారు. దానితో ప్రజలు సంతృప్తి చెందితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలుపొంది, అమరావతిలో నిర్మిస్తున్న కొత్త భవంతుల్లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనగలుగుతామని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

వచ్చే ఎన్నికల్లో ప్రజామోదం పొందితేనే కొత్తగా నిర్మించే శాసనసభ భవనంలోకి అడుగుపెడతామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చెప్పారు. 

 

 

అంటే ఈ term అసలే ఒక్క building కూడా lenattundi 

Link to comment
Share on other sites

విమర్శలకు గురవుతోన్న సీఆర్డీయే, ఏడీసీల తీరు
24-03-2018 08:48:35
 
636574781154453223.jpg
  • టెండర్లు పిలిచిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ!
  • సీఆర్డీయే, ఏడీసీల తీరుపై రాజధాని గ్రామాల రైతుల విస్మయం
  • దీనివల్ల ఒరిగేది ఏమిటని అధికారులకు ప్రశ్నలు
 
అమరావతికి వరద ముప్పును నివారించేందుకు తలపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు పరచేందుకంటూ సీఆర్డీయే, ఏడీసీలు వివిధ రాజధాని గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ విమర్శలకు గురవుతోంది. సాధారణంగా ఎక్కడైనా పథకాలను ప్రతిపాదించే సమయంలోనే ఆయా సమస్యలతో సంబంధం లేదా అవగాహన ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకుని, వాటిల్లో అనుసరణీయమైన అంశాలను టెండర్లలో పొందుపరచడం రివాజు. కానీ.. అమరావతి అంతటి బృహత్తర నగరాన్ని నిర్మిస్తున్న సీఆర్డీయే, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)లు మాత్రం ఎంతో కీలకమైన వరద నియంత్రణ పథకాలకు తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినవస్తున్నాయి.
 
 
అమరావతి: రాజధాని నగరానికి వరద ముప్పును తప్పించేందుకు రూ.541.85 కోట్ల అంచనా వ్యయంతో కొండ వీటి వాగు, పాలవాగుల విస్తరణ, అభివృద్ధి పనులతోపాటు గ్రావిటీ కెనాల్‌ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కొద్ది రోజుల క్రితం టెండర్లు పిలిచింది. కొండవీటి వాగును సుమారు 23.60 కిలోమీటర్ల పొడవున, పాలవాగును 16.70 కిలోమీటర్ల పొడవున వెడల్పు చేయడంతోపాటు లోతు పెంచడం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ నిల్వ సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం, సుమారు 7.83 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్‌ తవ్వకం వంటి అతి ముఖ్యమైన పను లు వీటిల్లో భాగంగా ఉన్నాయి.
 
    అయితే.. టెండర్లు పిలిచి, వాటి స్వీకరణకు ఇచ్చిన గడువు వచ్చే నెల 16వ తేదీతో ముగి యబోతున్న తరుణంలో సీఆర్డీయే, ఏడీసీ అధికారులు ఆయా పథకాలపై వివిధ రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు తీరిగ్గా ఉద్యుక్తులవడమే ఆక్షేపణీయమవుతోంది. ఈ విషయాన్నే పలు వురు గ్రామీణులు తమ వద్దకు వచ్చిన అధికారులతో స్పష్టంగా చెప్పడమే కాకుండా టెండర్లు కూడా ఆహ్వానించిన తర్వాత చేపట్టిన ఈ ప్రహసనం వల్ల ఒరగబోయేదేమిటని ప్రశ్నిస్తున్నారు.
 
చిత్తశుద్ధి లేదు..
రాజధానిలోని వరదపీడిత ప్రాంతాల్లో ఉండే వారి అభిప్రాయాల సేకరణకు వచ్చిన అధికారులు కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, నెక్కల్లు తదితర గ్రామా ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కలిసిన గ్రామీణుల్లో అత్యధికులు ఇప్పుడెందుకీ కార్య క్రమమని వారిని ప్రశ్నించగా, సంతృప్తి కరమైన సమాధానాలివ్వలేకపోయారని తెలుస్తోంది. అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విధంగా చేసేవారు కారని, ఏళ్ల తరబడి వరదలతో నానాపాట్లు పడిన తమ అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడం ద్వారా వరద నియంత్రణ పథకాలకు మరింత పక్కాగా రూపకల్పన చేసి ఉండేవారని రైతుల్లో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
 
   కానీ ఎందువల్లనో అలా చేయకుండా తమకు తోచిన విధంగా ముందుకు వెళ్లారని విమర్శించారు. ఒక వేళ ఇప్పుడు తామిచ్చే సూచనల్లో ఏవైనా ఆచరణీయమైనవని అనిపించినా చేయగలిగిందేమీ లేదని అధికారులకూ తెలిసి కూడా తూతూ మంత్రపు అభిప్రాయ సేకరణ జరపడం ద్వారా తమను మభ్య పుచ్చాలనుకోవడం తగదన్నారు. తరతరాలుగా అమరావతి ప్రాంతాన్ని ముంచెత్తుతున్న వివిధ వాగుల నుంచి రాజధానిని రక్షిం చేందుకు వందలాది కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టనున్న పథకాలకు ప్రతి పాదనలు రూపొందిస్తున్నప్పుడే వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పలు గ్రామాల ప్రజల అభిప్రాయాలు, సూచనలను తీసుకుని ఉంటే అవి మరింత ఉపయుక్తంగా అమలయ్యేవన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
 
  ‘ముందుది వెనుక, వెనుకది ముందు’ అన్న చందంగా జరుపుతున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణ తంతు రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో తాము ఏకపక్షంగా వ్యవహరించడం లేదని, అమరావతివాసుల అభిప్రాయాలకూ విలు వనిస్తున్నామని అధికారులు చెప్పుకొనేం దుకేనని కొందరు అంటున్నారు. భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే అందరి అభి ప్రాయాలు, సూచనలను తీసుకున్న తర్వాతనే పనులు చేపట్టినట్లు చాటుకునేందుకే వారిలా చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
 
 
రైతుల సూచనలు
 
కొందరు గ్రామస్థులు మాత్రం రాజధాని ప్రాంతంలోని అన్ని వాగులనూ పెద్దఎత్తున వెడల్పు, లోతు చేయడంతోపాటు వాటి గట్లకు రివిట్‌మెంట్‌ చేయాలని సూచించారు. మరికొందరు వివిధ వాగులు కలిసే ప్రదేశాల్లో మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇకనైనా.. అధికారులు ఇలాంటి మొక్కుబడి వ్యవహారాలకు స్వస్తి పలికి, పనులకు ప్రతిపాదనలను రూపొందించేటప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రాజధాని ప్రాంత రైతులు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

ఏపీ సచివాలయ నమూనాలను పరిశీలించిన కోడెల
24-03-2018 13:37:18
 
636574954385249555.jpg
అమరావతి: ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణానికి నార్మన్ పోస్టర్ నమూనాలు సరిగ్గా సరిపోతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. భవనాల నిర్మాణంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. సచివాలయంలో పెట్టిన రాజధాని నమూనాలను మంత్రి నారాయణతో కలిసి కోడెల పరిశీలించారు. సచివాలయం కోసం ఐదు బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించనున్నారు. సీఎం చంద్రబాబు ఉండే భవనంలో 46 అంతస్థులు, పైన హెలీప్యాడ్ నిర్మించనున్నారు. డయాగ్రిడ్ టెక్నాలజీతో భవనాల నిర్మాణం చేపడుతున్నారని మంత్రి పరిటాల సునీత చెప్పారు. నేరుగా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించకుండా ప్రత్యేక అద్దాలు ఏర్పాటు చేస్తారని ఆమె పేర్కొన్నారు. సచివాలయం పైనుంచి చూస్తే... ఇతర కట్టడాలు స్పష్టంగా కనిపించేలా నిర్మాణాలు చేపడుతున్నారని, నిర్మాణాల నమూనాలు అద్భుతంగా ఉన్నాయని సునీత కితాబిచ్చారు.
Link to comment
Share on other sites

అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయ భవన ఆకృతుల ప్రదర్శన

011215BREAK75-SEC.JPG

అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయ భవన నూతన ఆకృతులను స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు, మంత్రులు, శాసనసభ్యులు పరిశీలించారు. లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌  నార్మన్‌ పోస్టర్‌ రూపొందించిన భవన ఆకృతులను పరిశీలించిన అనంతరం ఆకృతులు చూడ చక్కగా ఉన్నాయని.. అయితే కార్యాలయ విధులకు అనుకూలంగా విశాలమైన స్థలం ఉండాలని ఆయన సూచించారు. రాజధాని ప్రాంతంలో ఈ తరహా భవన నిర్మాణం కారణంగా ఆర్థిక, సామాజిక, పాలనావ్యవహారాలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని స్పీకర్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు శాసనసభ్యులు, మంత్రులు భవన నమూనాలను పరిశీలించి బాగున్నాయంటూ కితాబిచ్చారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...