Jump to content

25 వసంతాల ‘ఆదిత్య 369’

Ramesh39

Recommended Posts

25 వసంతాల ‘ఆదిత్య 369’ 

18aditya369-01.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలం.. డబ్బుకన్నా విలువైనది. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఒక్క క్షణం పోయినా తిరిగి పొందలేం. అందుకే కాలానికి అంత విలువ. ఎవరైనా తమ జీవితంలో గడిపిన మధుర క్షణాలు మళ్లీ మళ్లీ కావాలనుకుంటారు. అందుకోసం ఏమైనా యంత్రం లాంటిది ఉంటే బాగుండు అనుకుంటారు. నిజ జీవితంలో అది సాధ్యం కాకపోవచ్చు కానీ వెండితెరపై మాత్రం ఎప్పుడో సాధ్యమైంది. ఆ సంగతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటోంది ‘టైమ్‌ మెషీన్‌’. పదండి వెళ్లి తను చెప్పేది ఏదో చూసి వద్దాం!

నమస్కారం..! నాపేరు కాలయంత్రం. 1991 జులై 18న తొలిసారి నేను తెలుగు తెరపై కన్పించాను. దర్శకులు సింగీతం శ్రీనివాసరావు నన్ను తయారు చేశారు. నేను పుట్టకముందు నాకు ‘కాలయంత్రం’ అని నాకు పేరు పెట్టాలని అనుకున్నారు కానీ, మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉంది కదా! అందుకే ‘ఆదిత్య 369’ అని పెట్టారు. నేటికి నాకు 25ఏళ్లు వచ్చాయి. సిల్వర్‌ జూబ్లీ సంబరాల వేళ నన్ను తయారు చేయడం వెనుక ఉన్న విశేషాలు చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా ఫాలో అయిపోండి.

ఇలా తయారయ్యాను..! 

ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రముఖ గాయకులు బాల సుబ్రహ్మణ్యంకు సింగీతం శ్రీనివాసరావు విమానంలో కనిపించారు. ఆ మాట.. ఈ మాట.. మాట్లాడుకుంటుండగా నా గురించి చర్చ వచ్చింది. తాను ఒక స్టోరీలైన్‌ అనుకున్నానని, నా చుట్టూనే(టైమ్‌ మెషీన్‌) కథ తిరుగుతుందని సింగీతం శ్రీనివాసరావు చెప్పారు. నా సాయంతో కథానాయకుడు భూత, భవిష్యత్‌ కాలాల్లోకి వెళ్తాడని, భూత కాలంలో శ్రీకృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందాం అని కథ వివరించారు.బాలూకీ కథ నచ్చడంతో ఆయన దగ్గరి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్‌ వద్ద బాలకృష్ణ డేట్స్‌ ఉన్నాయి.. ఈ కథ బాలకృష్ణకు బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు బాలకృష్ణ బాగుంటారని అభిప్రాయపడ్డారు. నేను పుట్టకముందే నా గురించి రాసిన ‘టైమ్‌ మెషీన్‌’ అనే నవలను సింగీతం శ్రీనివాసరావు చదవి ఎప్పటికైనా నా నేపథ్యంలో సినిమా తీయాలనుకున్నారు. అయితే నేను భవిష్యత్‌కు వెళ్లే విషయాలపై మద్రాసులోని అమెరికన్‌ లైబ్రరీకి వెళ్లి మరికొన్ని పుస్తకాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా భవిష్యత్‌లో నగరాలన్నీ భూమి లోపల నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్‌లో వినపడటం, ఇలా అనేక సన్నివేశాలు అనుకొని సేకరించిన సమాచారంతో నన్ను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేశారు.

Link to comment
Share on other sites

18aditya369-02.jpg

నటీనటులు సాంకేతిక వర్గం ఇలా..! 

నేనంటే మెషీన్‌.. మిగిలిన వాళ్లు మాట్లాడాలి కదా! అందుకే మాటలు జంధ్యాలతో రాయించారు. సంగీత దర్శకుడిగా ఇళయరాజా, నన్ను అందంగా చూపించడానికి కెమెరామెన్‌గా పీసీ శ్రీరాం తదితర ఉద్ధండులను ఎంపిక చేశారు. అయితే పీసీ శ్రీరాం వేరే కారణాల వల్ల తప్పుకోవడంతో వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు. కథానాయికగా విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేపోవడంతో పీసీ శ్రీరాంకు పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. ఇక సినిమాలో నన్ను తయారు చేసినట్లు చూపించడానికి ఓ శాస్త్రవేత్త కావాలిగా.. అందుకే విభిన్నంగా ఉంటారని హిందీ నటుడు టీనూ ఆనంద్‌ను తీసుకున్నారు. మిగిలిన పాత్రలకు అమ్రిష్‌పురి, గొల్లపూడి మారుతీరావు, బాబూమోహన్‌, తనికెళ్ల భరణి, సుత్తివేలు, చంద్రమోహన్‌, చలపతిరావు, సిల్క్‌స్మిత, శుభలేఖ సుధాకర్‌, బ్రహ్మానందం తదితరులను ఎంపిక చేశారు. మరోపక్క బాల నటులుగా తరుణ్‌, రాశి నటించారు.

వేరే కథతో రాయలవారి కాలం.. 

నేను రాయలవారి కాలానికి వెళ్లిన తర్వాత అక్కడ తొలుత అనుకున్న కథ వేరే ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా! వారి మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలను, విషయాలను ప్రధానంగా చర్చించాలని సింగీతం అనుకున్నారు. అయితే అది వివాదాస్పదమవుతుందని, చివరకు సరదా సన్నివేశాలతో చిత్రీకరణ జరిపారు. అలా వచ్చినవే.. రాయలవారి దర్బారులో వచ్చే మేకతోకకు మేక.. తోక మేకకు తోక.. మేక తోక.. మేక.. మేక తోక.. సన్నివేశం, ‘సురమోదం..’ పాటలో మధ్యలో రంపంప రంప రంప.. అంటూ సాగే ర్యాప్‌తో పాటు సుత్తివేలు, శ్రీలక్ష్మిల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.

18aditya369-03.jpg

బాలకృష్ణ చాలా కష్టపడ్డారు..! 

అవునండీ! ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు. కృష్ణ కుమారుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రలు పోషించారు. ముఖ్యంగా రాయలవారి పాత్రకోసం ఉదయం 8గంటలకు మేకప్‌తో వచ్చి కొన్నిసార్లు మరుసటి రోజు వరకు పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి మధ్యాహ్నం వరకు సమయం ఉండేది. దర్శకులు కూడా బాలకృష్ణకు మధ్యాహ్నం షూటింగ్‌కు రమ్మనేవారు అయితే బాలకృష్ణ మాత్రం ఉదయం 8గంటలకే షూటింగ్‌కు వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారు.

కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో, తొలుత ‘టైమ్‌ మెషీన్‌’గా నేను కనపడే సన్నివేశాల మద్రాసు వాహినీ స్టూడియోలు సెట్స్‌ వేసి తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల కోసం నన్ను భారీ లారీలో వేసుకుని తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక భవిష్యత్‌లోకి వెళ్లిన తర్వాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలను వీజీపీ గోల్డెన్‌ బీచ్‌లో సెట్‌వేశారు.

నన్ను తయారు చేయడానికి మొత్తం 110 రోజులు పనిచేశారు. నాకు మరిన్ని మెరుగులు.. అదేనండీ గ్రాఫిక్స్‌ కోసం లండన్‌ తీసుకెళ్లారు. ఇప్పుడు గ్రాఫిక్స్‌ అంటే సులభం కానీ, అప్పట్లో గ్రాఫిక్స్‌ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇక నాకు ఏ పేరు పెడదామని చాలా ఆలోచించారు. చాలామంది ‘కాలయంత్రం’ పెడతారనుకున్నారు. ‘యుగ పురుషుడు’ అనే టైటిల్‌ కూడా అనుకున్నారు. కానీ చివరకు కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు. మెషీన్‌కు నెంబర్‌ ఉండాలి కదా అని 369. ఇలా ‘ఆదిత్య 369’గా పేరు పెట్టారు. చివరకు నన్ను తయారు చేయడానికి రూ.1.60కోట్లు ఖర్చు అయింది.

అలా 1991 జులై 18న ‘ఆదిత్య 369’గా నేను విడుదలయ్యాను. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నాను. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయాను.

ఇదండీ ‘ఆదిత్య 369’గా నా పుట్టు పూర్వోత్తరాలు. అన్నట్లు ఇటీవల నాకో తమ్ముడిని కూడా తయారు చేశారు. వాడి పేరు ‘24’. తమ్ముడంటే సింగీతం తయారు చేశారేమో అనుకుంటున్నారా. కాదు కజిన్‌ వరుస. వాడిని విక్రమ్‌ కె.కుమార్‌ తయారు చేశారు. నా సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తే వాడి సినిమాలో సూర్య మూడు పాత్రల్లో కనిపిస్తారు. అయినా ‘24’ చిన్నపిల్లోడులేండి! కేవలం 24 గంటలు మాత్రమే వెనక్కి.. ముందుకు వెళ్లగలడు. అయితే సూర్య వాడిని కూడా ఎక్కువ సంవత్సరాలు వెనక్కి వెళ్ల గలిగేలా మార్చేస్తాడు. నన్ను తయారు చేసిన దర్శకులు సింగీతం మరో మెషీన్‌ తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. వాడిపేరు ‘ఆదిత్య 999’ అని అంటున్నారు. చూడాలి వాడెలా ఉంటాడో..! అదండీ..! ఇంతసేపు నా గురించి తెలుసుకున్నారు కదా! పనిలో పనిగా నాతో వచ్చేస్తారా..! ఆదిత్య 999 దగ్గరకు తీసుకెళ్తా. ఏంటి వస్తారా.. ఆహా! అదేం కుదరదు. సింగీతం శ్రీనివాసరావే వాడిని మీ ముందుకు తీసుకొస్తారు అప్పటి వరకు బై.. బై..!

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...