Jump to content

Recommended Posts

  • Replies 95
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted

ఏపీలో ఎన్ ఎం సి పెట్టుబడులు 
4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అతిపెద్ద ఆరోగ్య సేవల సంస్థగా పేరు గాంచిన న్యూ మెడికల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంసీ) ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయమై ఎన్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ బీఆర్‌ శెట్టి మే 2వ తేదీన ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎన్‌ఎంసీ సంస్థ రెండు దశల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో అమరావతిలో 1400 పడకల ఆసుపత్రి, కర్నూలులో 300 పడకల ఆసుపత్రి నిర్మించనుంది. ఇదే దశలో అమరావతిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌ తో పాటు ఒక అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్మాణాలన్నింటినీ 2019లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,800 పడకల స్థాయి ఆసుపత్రులు, వైద్య పరికరాలు, ఔషధాల తయారీ సంస్థలను ఏర్పాటు చేయనుంది.

Posted
రాష్ట్రానికి 12వేల కోట్ల పెట్టుబడి
 
635978362760966307.jpg
  • అమరావతిలో వైద్య పరిశోధన కేంద్రం
  • మెడికల్‌ నాలెడ్జ్‌ ఔట్‌సోర్సింగ్‌ సెంటర్‌ కూడా
  • కృష్ణానదీ ద్వీపంలో గోల్ఫ్‌ కోర్సులు
  • స్మార్ట్‌ హౌసింగ్‌కు మౌలిక సదుపాయాలు
  • ఏపీతో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఒప్పందం
విజయవాడ, మే 2: రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. సుమారు రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీకి చెందిన బీఆర్‌ షెట్టీ వెంచర్స్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ.. పర్యాటకం, గృహనిర్మాణం, మౌలికసదుపాయాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒప్పందంలో పేర్కొంది. ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటినీ 2018 నాటికి పూర్తిచేస్తామని బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది.
 
బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ తరఫున ఆ సంస్థ ప్రచాకర్త, చైర్మన బీఆర్‌ షెట్టీ, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణ కిషోర్‌ పరస్పర అవగాహన ఒప్పందపత్రంపై సంతకాలు చేశారు. వీలైనంత వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన భూములు, అనుమతులు త్వరగా ఇస్తామని సీఎం చంద్రబాబు... బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌కు హామీ ఇచ్చారు.
 
ఒప్పందంలోని వివరాలు
  • 2018 నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మొత్తం 3500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు నిర్మిస్తుంది.
  • అమరావతిని హెల్త్‌ కేర్‌ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా అక్కడ సూపర్‌ స్పెషలైజేషన, మెడికల్‌ టూరిజంతో 1500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తారు.
  • కర్నూలు డెవలపింగ్‌ ఇండస్ర్టియల్‌ ఎకో సిస్టం సహకారంతో కర్నూలులో 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు.
  • హరిత స్మార్ట్‌ గృహనిర్మాణానికి బీఆర్‌ఎస్‌ మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత తీసుకుంటుంది. గృహనిర్మాణ ప్రాజెక్టుల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 1700 పడకలు ఉండే ఆస్పత్రులు నిర్మిస్తారు.
  • అమరావతిలో అంతర్జాతీయ వైద్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు. వైద్య పరిశోధనలను మెరుగుపరిచే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు. ఆసియాలోనే ఇది మొదటిది.
  • గ్లోబల్‌ ఎల్‌వీవై లీగ్‌ యూనివర్సిటీ నాలెడ్జ్‌ పార్టనర్‌గా ఏపీలో అంతర్జాతీయ స్థాయి మెడికల్‌ యూనివర్సిటీ, ఔషధాల తయారీ కేంద్రం ఏర్పాటు.
  • అమరావతిలో మెడికల్‌ నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ సెంటర్‌ నిర్మాణం. దీనివల్ల ప్రపంచంలోని అన్ని మెడికల్‌ ఇనస్టిట్యూషన్లు, కార్పొరేషన్లకు మెడికల్‌ నాలెడ్జ్‌ను అందించే సామర్థ్యం ఏపీకి లభిస్తుంది.
  • అమరావతి సమీపంలోని కృష్ణా నదీ ద్వీపంలో 18-గోల్ఫ్‌ కోర్సు ప్రాజెక్టుల నిర్మాణం. ఇందులో భాగంగా ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌, కన్వెన్షన సెంటర్‌ నిర్మిస్తారు.
Posted

BRS Ventures, AP ink MoU for investment of Rs. 12,000 cr in Amaravati

MoU_2838398f.jpg
 
Hyderabad, May 3:  

BRS Ventures of Abu Dhabi and Andhra Pradesh Government have inked a memorandum of understanding (MoU) which entails an investment of Rs. 12,000 crore in healthcare, setting up of a university, tourism, hospitality and infrastructure in the new capital city of Amaravati.

Dr. BR Shetty, a businessman from Abu Dhabi has committed an investment of $ 1.8 Billion (about Rs. 12,000 crore) in Andhra Pradesh. Shetty has business interests in hospitals (NMC Group of Hospitals), hospitality, educational institutions, financial services (UAE Exchange and Travelex), pharmaceuticals (Neopharma), ports, infrastructure and other businesses.

The MoU was inked by BRS Ventures represented promoter Dr. B.R. Shetty, Chairman, BRS Ventures and the Andhra Pradesh Government represented by J. Krishna Kishore, IRS, CEO, Economic Development Board, Government of Andhra Pradesh.

State Chief Minister N Chandrababu Naidu wanted BRS Ventures to quickly complete the projects assuring the land allotment and clearances will be accorded at the earliest.

The investments include setting up of a 3500-bed hospital. Of this, by December 2018, a 1500-bed hospital will come up in Amaravati. The health care facilities will follow a hub and spoke strategy which ensures that everybody in the region gets comprehensive health care coverage.

Other initiatives include a 300 bed hospital in Kurnool, a medical analytics centre and the Asia’s first quantum computing centre in Amravati with a focus on medical research enhancement, to be completed by December 2018.

As a part of the investments, other initiatives include, setting up of a Medical University in collaboration with a global Ivy League university as a knowledge partner, a pharmaceutical manufacturing unit in AP, a Knowledge process outsourcing centre, to be set up by December 2018.

The Amaravati medical Knowledge Process Outsourcing Centre will become the backbone knowledge provider to a large number of medical institutions and corporations across the globe. The investment company has proposed a golf course and an integrated hospitality ecosystem in Amaravati, preferably in one of the river islands of the Krishna river, to be completed in Phase II.

A hospitality ecosystem in amalgamation with our golf course project in form of a 5 star hotel along with a convention centre will be set up in phase I and II, to cater to the growing needs of this upcoming iconic city of Amaravati.

(This article was published on May 3, 2016)
Posted

 

635981752403939009.jpg

 

  • తొలుత 12,000 కోట్ల పెట్టుబడులు...
  • మున్ముందు మరిన్ని పెట్టుబడులకు రెడీ
  • ఆంధ్రజ్యోతితో యుఎఇ పారిశ్రామిక దిగ్గజం బిఆర్‌ షెట్టి

డబ్బు కంటే సేవ ముఖ్యం.. 
నేను ఏ వ్యాపారమూ కూడా డబ్బు సంపాదన లక్ష్యంగా ప్రారంభించలేదు. దేశానికి సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి. నాణ్యమైన సేవలు అందించాలి. ఎండ్‌ రిజల్ట్‌ ఈజ్‌ మనీ. డబ్బే మనల్ని ఫాలో అవుతుంది. 
 

విజయవాడ (ఆంధ్రజ్యోతి): బిఆర్‌ షెట్టి.. పారిశ్రామిక ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన షెట్టి దశాబ్దాల క్రితం అబుదాబి వెళ్లారు. ఆ నగరాభివృద్ధితో సమాంతరంగా ఎదుగుతూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌, ఎన్‌ఎంసి గ్రూప్‌ ఆసుపత్రులు, హోటళ్లు, విద్యా సంస్థలను నెలకొల్పారు. నియో ఫార్మా పేరిట ఆ రంగంలోనూ కాలు మోపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈయన ప్రారంభించిన మరో సంస్థ ట్రావెలెక్స్‌.. విదేశాల్లో సంపాదించిన ధనాన్ని సొంత దేశాలకు పంపించేవారికి పెద్ద వేదికగా మారింది. అబుదాబి అత్యున్నత పురస్కారాన్ని పొందిన షెట్టికి.. భారత ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయ సమ్మాన్‌ పురస్కారం, ఆ తర్వాత పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.
 
ఈ నెల రెండో తేదీన షెట్టి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఓ భారీ ఒప్పందాన్ని చేసుకున్నారు.
 
అమరావతి కేంద్రంగా వివిధ రంగాల్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ సిఇఒ కృష్ణ కిశోర్‌తో బిఆర్‌ షెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ షెట్టి..‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 40 ఏళ్ల క్రితం అబుదాబిని ఇప్పటి అమరావతితో పోల్చిన షెట్టి... భవిష్యత అమరావతిలో ప్రస్తుత అబుదాబిని చూడగలుగుతున్నానని వ్యాఖ్యానించారు.
 
 

అప్పుడు అబుదాబి... ఇప్పుడు అమరావతి 

నేను మొదట అబుదాబి వెళ్లా. అప్పుడు అబుదాబి కూడా ఇంతే (ఇప్పుడు అమరావతిలా) ఉంది. అభివృద్ధి లేదు. ఆ నగరం అభివృద్ధిలో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈ రోజు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అబుదాబి ఒకటి. ఇక్కడ చంద్రబాబు ఒక రాష్ట్రాన్ని నిర్మించే సవాలును స్వీకరించారు. ఏ రాష్ట్ర అభివృద్ధిలోనైనా మొదట జాగ్రత్త తీసుకోవలసింది విద్య, వైద్య రంగాలపైనే. నేను ఆ రంగానికే చెందినవాడిని కాబట్టి వచ్చాను. నాకు ప్రపంచ వ్యాప్తంగా 38 ఆసుపత్రులున్నాయి. మాది లండన్‌ లిస్టెడ్‌ కంపెనీ. మా మార్కెట్‌ విలువ 340 కోట్ల డాలర్లకంటే ఎక్కువ. వీటికితోడు ఫార్మా, ఇన్వెన్షన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌. మిత్సుబిషి కార్పొరేషన్‌ నాతో భాగస్వామి కానుంది. అమెరికాలోని అత్యుత్తమ యూనివర్సిటీ, ఆసుపత్రులను కూడా భాగస్వాములను చేస్తా. నేను షార్ట్‌లిస్ట్‌ చేసిన సంస్థలలో శాన్‌డియాగో యూనివర్సిటీ ఒకటి. అలాంటి విశ్వవిద్యాలయం ఇక్కడకు రావడం అంటే... ప్రపంచ వ్యాప్త విద్యార్ధులు చదువుకోవడానికి ఇక్కడికే వస్తారు.
 
 

రూ.12 వేల కోట్లతో ఆగదు.. 

ఒప్పందంలో లేని రంగాలు కూడా మా ప్రణాళికలో ఉన్నాయి. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అందులో ఒకటి. వివిధ పనులు చేసేవారికి కూడా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నగర పారిశుధ్యం చాలా ముఖ్యమైనది. అవన్నీ ఎంఒయులో రాయాల్సిన అవసరం లేదు. ఎంఒయులో రూ.12 వేల కోట్లు మాత్రమే పేర్కొన్నాం. అంటే 180 కోట్ల డాలర్లు. అది 250 కోట్ల డాలర్లకు వెళ్లొచ్చు. డబ్బు ముఖ్యం కాదు.
 
 

ఐలాండ్‌లో గోల్ఫ్‌ కోర్స్‌.. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్‌ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్‌ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్‌’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్‌గానే పని చేస్తా. ఒకహోటల్‌, సిపిటి ఏరియా, షాపింగ్‌ మాల్‌, ఆసుపత్రి ఉంటాయి.
 
 

ఆరు గంటల్లోనే కల్చర్‌ ఫలితాలు.. 

వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో అధునాతన పద్ధతులను ప్రవేశపెడతాం. కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌కు ఇప్పుడు మూడు రోజుల సమయం పడుతోంది. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే తెలుసుకోవడానికి... దానికి విరుగుడుగా ఏ మందు వాడాలో నిర్ణయించడానికి మూడు రోజులు ఆగాలన్నమాట. నా దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆరు గంటల్లో ఈ పని చేయవచ్చు. ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.
 
 

అబుదాబి ప్రభుత్వం కూడా.. 

భవిష్యత అమరావతిలో అబుదాబి తరహా అభివృద్ధిని నేను ఇప్పుడే దర్శిస్తున్నా. అబుదాబి ప్రభుత్వంతో, రాజకుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తన తరఫున అబుదాబి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అవకాశాలను చూడాలని అబుధాబి ప్రభుత్వాన్ని కోరతా. ఇందులో భాగస్వాములయ్యేందుకు వారు సంతోషంగా ఒప్పుకుంటారు. వారు ఉదార స్వభావులు, సహనశీలురు. నీటి సరఫరా, తాగునీరు, రోడ్లు, ఎయిర్‌పోర్టుల వంటివి వారు చాలా చేయగలరు.
 
 

మొదటి దశలో 1800 పడకలు.. 
రాష్ట్రంలో 3,500 పడకలతో ఆసుపత్రులు నిర్మిస్తాం. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలలో కూడా ఆసుపత్రులు వస్తాయి. మొదటి దశలో భాగంగా అమరావతిలో 1500 పడకలు, కర్నూలులో 300 పడకలతో ఆసుపత్రులను నిర్మిస్తాం. మొదటి దశలో అమరావతిలో 300 పడకలు, కర్నూలులో 50 పడకలు ఏర్పాటు చేస్తాం. అనుమతులు వచ్చినప్పటినుంచి రెండేళ్లలో మొదటి దశ (మొత్తం 1800 పడకలు)పూర్తవుతుంది. కేరళ, రాయ్‌పూర్‌లలో నాకు ఆసుపత్రులున్నాయి. నేపాల్‌, ఈజిప్ట్‌, సౌదీ, ఒమన్‌ వంటి దేశాల్లోనూ ఆసుపత్రులున్నాయి. రీసెర్చ్‌ సెంటర్‌ మాత్రం కేవలం అబుదాబిలోనే ఉంది.

Posted

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్‌ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్‌ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్‌’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్‌గానే పని చేస్తా. ఒకహోటల్‌, సిపిటి ఏరియా, షాపింగ్‌ మాల్‌, ఆసుపత్రి ఉంటాయి.

 

 ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.

 

Padmashree BR Shetty ki Jai. Islands in Krishna are our main investment for Amaravati growth

Those are gods gift for Amaravati and even Gujarat River Front,Gift city location does not have them.

Posted
రేపే షెట్టి రాక!
 
636043139458395357.jpg
  • రూ.15వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం
  • ‘అమరావతి’లో తొలి పెట్టుబడిపై బీఆర్‌ఎస్‌ ఆసక్తి
  • పలు సంస్థల ఏర్పాటుపై సీఎంతో చర్చలు
  • హాస్పిటల్‌, హాస్పిటాలిటీ రంగాల్లో ప్రణాళికలు
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రవాస భారతీయ సంపన్నుడు బీఆర్‌ షెట్టి... భారీ పెట్టుబడులతో సోమవారం విజయవాడ వస్తున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో అందరికంటే ముందుగా తన సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. అబుదాబి కేంద్రంగా బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌, ఎన్‌ఎంసీ హెల్త్‌ కేర్‌ సంస్థలను ఏర్పాటు చేసి బహుముఖాలుగా విస్తరించిన షెట్టి... ఏపీలోనూ రూ.12 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో మే మొదటి వారంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం భూమి కూడా కేటాయించడంతో ప్రాజెక్టుల నిర్మాణ దిశగా షెట్టి అడుగులు వేస్తున్నారు. హాస్పిటల్‌-రీసెర్స్‌ సెంటర్‌, వినోద కేంద్రం, గోల్ఫ్‌కోర్స్‌ వంటి పలు ప్రాజెక్టులను షెట్టి ప్రతిపాదించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలోనే కృష్ణా నదిలో ఉన్న ఐలాండ్‌ను గోల్ఫ్‌కోర్స్‌ సహా వినోద సంబంధ నిర్మాణాల కోసం బీఆర్‌ షెట్టికి ఇవ్వడానికి ప్రభుత్వం గతంలోనే సమ్మతించింది. దరఖాస్తుల నుంచి ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ వరకూ సిద్ధం చేసుకొని తన బృందంతో సహా ప్రత్యేక విమానంలో విజయవాడలో దిగనున్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించి ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్టు తెలిసింది.
 
రెండున్నర నెలల్లోనే కీలక అడుగు
అమరావతికి సంబంధించినంత వరకూ మొదటిగా నిర్మాణాలు జరిపే ప్రైవేటు సంస్థల్లో అబుదాబికి చెందిన బీఆర్‌ షెట్టి గ్రూపు ముందుంది. రూ. 12 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్న బీఆర్‌ షెట్టి... ఆ మొత్తాన్ని 15 వేల కోట్ల వరకూ విస్తరించే అవకాశం ఉందని, ఒప్పందంలో లేని రంగాల్లో కూడా పెట్టుబడులు పెడతామని అప్పట్లో ’ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. అవగాహన ఒప్పందం తర్వాత రెండున్నర నెలలకు తదుపరి ప్రక్రియకు సంబంధించిన మరో కీలక అడుగు పడుతోంది. భారత ప్రమాణాల ప్రకారం చూస్తే త్వరగా జరుగుతున్నట్టే లెక్క. భూమి ఎక్కడ ఇస్తారో చెప్పిన మరుక్షణమే పనిలోకి దిగుతామని ఒప్పందం చేసుకున్న సమయంలోనే షెట్టి చెప్పారు. అమరావతిలో తొలి పెట్టుబడి తనదే కావాలని కూడా ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఆకాంక్షించారు. అయితే భూకేటాయింపుల విషయంలో జాప్యం జరిగింది. జూన్‌ 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే భూకేటాయింపులను ఖరారు చేయాలని సీఎం అనుకున్నారు. అప్పటికి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను సిద్ధం చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి ఈ నెలలో భూ కేటాయింపులు జరిగాయి.
 
ఇవీ షెట్టి ప్రాధాన్యతలు
అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలలో ఆసుపత్రులు, అమరావతిలో రీసెర్స్‌ సెంటర్‌, ముఖ్యమంత్రి నివాసం ప్రక్కన ఉన్న ఐలాండ్‌లో గోల్ఫ్‌కోర్స్‌, టూరిజం సెంటర్‌, ఒక హోటల్‌, సీపీటీ ఏరియా, షాపింగ్‌ మాల్‌ వంటివి షెట్టి గ్రూపు ప్రణాళికలో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలిపి 3,500 పడకలతో ఆసుపత్రులను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో అమరావతిలో 1,500 పడకలు, కర్నూలులో 300 పడకలతో ఆసుపత్రులు నిర్మించాలని నిర్దేశించుకున్న షెట్టి గ్రూపు, అనుమతులు వచ్చిన రెండేళ్లలోపు నిర్మాణాలను పూర్తి చేస్తామని చెబుతోంది. అంతకంటే ముందే... అమరావతిలో 300 పడకలు, కర్నూలులో 50 పడకలతో ఆసుపత్రులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రితో సోమవారం సమావేశమైన సందర్భంగా ప్రాజెక్టు ప్రణాళికలు, అనుమతులపై చర్చించనున్నారు. అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యూఏఈ ప్రభుత్వంతో కూడా షెట్టి చర్చలు జరిపి వస్తున్నట్టు సమాచారం. అమరావతి నగర అభివృద్ధిలో యుఏఈ ప్రభుత్వం కూడా భాగస్వామి అయ్యేలా చూస్తానని ముఖ్యమంత్రితో గత సమావేశం సందర్భంగా బీఆర్‌ షెట్టి చెప్పారు. ఈ అంశంపై కూడా సోమవారం చర్చించే అవకాశం ఉంది.
Posted

ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలోనే కృష్ణా నదిలో ఉన్న ఐలాండ్‌ను గోల్ఫ్‌కోర్స్‌ సహా వినోద సంబంధ నిర్మాణాల కోసం బీఆర్‌ షెట్టికి ఇవ్వడానికి ప్రభుత్వం గతంలోనే సమ్మతించింది island peru emiti thelisthe veyyandi

Posted

ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలోనే కృష్ణా నదిలో ఉన్న ఐలాండ్‌ను గోల్ఫ్‌కోర్స్‌ సహా వినోద సంబంధ నిర్మాణాల కోసం బీఆర్‌ షెట్టికి ఇవ్వడానికి ప్రభుత్వం గతంలోనే సమ్మతించింది island peru emiti thelisthe veyyandi

3-4 Islands vunnai.. Bhavana Island vatilo Famous :shakehands:

Posted

:shakehands: tfs bro, Bhavani island kakunda ,migatha vi enni acres lo unnayi konchem veyyandi brother.

Bits Bits ga vuntadhi bro 200 - 400 acres ga vuntaii.. Total Capital paridhiloki around 2400 acres varaku vuntadhi bro :shakehands:

Posted

Bits Bits ga vuntadhi bro 200 - 400 acres ga vuntaii.. Total Capital paridhiloki around 2400 acres varaku vuntadhi bro :shakehands:

vati ni motthamga, oke island laga kalapataniki chance undha bro.

Posted
అమరావతిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌
 
గుంటూరు: అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకారం తెలిపింది. ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణం చేపడతామని డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్ సెంటర్‌ నిర్మిస్తామని ఆయన అన్నారు. 2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు.
Posted

 

అమరావతిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌

 

గుంటూరు: అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకారం తెలిపింది. ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణం చేపడతామని డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్ సెంటర్‌ నిర్మిస్తామని ఆయన అన్నారు. 2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు.

 

before elections ante  :terrific:  :terrific:  :terrific:  :terrific:

Posted

A Rotana group chana pedda di ga ippude chustunna. Dubai shake di. Good that Shetty introduced Amaravati to Emirates shakes.

 

BR Shetty chala serious ga vunnattu vunnadu Amaravati meda.Infact all he picked are good options

 

1st golf course in island

1st international convetion on river front 

TOp prive hospital with less than 30 minutes lab test results(this is missing in India)

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...