Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 3 weeks later...
డబ్లింగ్‌ పనులు.. చక చకా
20-10-2018 08:16:39
 
636756201979528337.jpg
  • గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైల్వేలైన్‌ నిర్మాణం
  • 401.47 కిలోమీటర్లు... రూ.3,631 కోట్ల వ్యయం
  • రెండో లైన్‌తోపాటు విద్యుత్‌ లైన్‌ నిర్మాణం
  • రాజధాని అమరావతితో రాయలసీమకు రవాణా సౌకర్యం మెరుగు
నరసరావుపేట, అక్టోబరు 19: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రాయలసీమతో కలిపే రైల్వేలైన్‌ డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. రూ.3,631కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. గుంటూరు- గుంతకల్లు మధ్య రెండో రైల్వేలైన్‌ నిర్మించి దీనికి విద్యుత్‌లైన్‌ ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్‌కు విద్యుద్దీకరణ పనులు పూర్తయి విద్యుత్‌ రైళ్ళు పరుగులు తీస్తున్నాయి.
 
నూతన రైల్వేలైన్‌ నిర్మాణంతో రాయలసీమ-రాజధాని అమరావతి మధ్య రవాణా సౌకర్యం సులువుకానుంది. రాజధానికి ఈ రైల్వేలైన్‌ ఎంతో ఉపయోగపడనుంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు రైల్వేలైన్‌ డబ్లింగ్‌, విద్యుద్దీకరణ చేయటం వల్ల ఆయా జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రెండోలైన్‌ నిర్మాణంలో భాగంగా బ్రిడ్జీలు, ఆర్‌యూబీ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా గుంటూరు- గుంతకల్లు మధ్య రెండో రైల్వేలైన్‌, విద్యుద్దీకరణ కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానికి ఈ కొత్తలైన్‌ నిర్మాణం ఎంతో ఉపయోగపడనుంది. 2017 మే 17న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. వెను వెంటనే ఈ రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు ఉన్న రైల్వేలైన్‌కు విద్యుద్దీకరణ పనులు పూర్తిచేశారు. రోజుకు 40 నుంచి 50 రైళ్ళు వరకు ఈ మార్గంలో ప్రయాణించనున్నాయి. నూతన రెండో రైల్వేలైన్‌ గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్‌ల పరిధిలో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా సరిహద్దులో చలమ వద్ద ఉన్న సొరంగాన్ని, 1.6కిలోమీటర్ల మేర బోగడ సొరంగాన్ని విస్తరించాల్సివుంది. నల్లమల అభయారణ్యంలో రెండోరైలు మార్గం నిర్మాణంకోసం కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు కూడా లభించాయి. దీంతో ఐదారు రీచ్‌లుగా ఈ పనులను ప్రారంభించారు. గుంటూరు-గుంతకల్లు మార్గాల మధ్య ఏటా 30 మిలియన్‌ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ఏర్పాటుతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రెండో రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా 74భారీ, 182మధ్య తరహా వంతెనలను, ఆర్‌యూబీలు, సబ్‌వేలు, అండర్‌ టన్నెల్‌లను నిర్మించనున్నారు. ఇలా మొత్తం 700కు పైగా నిర్మాణాలు చేపట్టాల్సివుంది. గుడ్స్‌ రైళ్ళ సంఖ్య కూడా ఈ మార్గంలో అధికంగా ఉంది. సిమెంట్‌, సున్నపురాయి, నాపరాయి, ఇనుము పరిశ్రమలు ఈ మార్గంలో ఉన్నాయి. ఆయా సరుకు రవాణా కూడా అధికంగా జరుగుతుంది. సింగిల్‌ రైల్వే లైన్‌ ఉండటంతో రైళ్ళ క్రాసింగ్‌ కోసం గంటల కొద్ది సమయం వృధా అవుతోంది. రెండో లైన్‌ నిర్మాణంతో ఈమార్గంలో ప్రయాణం వేగవంతమవుతుంది. కొత్త రైళ్ళు ఈ మార్గంలో ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. రెండో రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న రైల్వే స్టేషన్‌లను ఆధునికీకరించే పనులు కూడా చేపట్టారు. గుంటూరు-గుంతకల్లు రైల్వే డివిజన్‌ల ఇంజనీరింగ్‌ అధికారులు రైల్వేలైన్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏడాదిలో ఈ లైన్‌ నిర్మాణాన్ని పూర్తిచేయాలని రైల్వేశాఖ ప్రణాళికను రూపొందించింది. ఆ మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

మూడో మార్గం.. సుగమం
30-10-2018 07:56:25
 
636764829867896984.jpg
  • నాలుగు దశాబ్దాల.. కల సాకారం!
  • విజయవాడ - సికింద్రాబాద్‌ మూడో రైల్వే లైన్‌ సిద్ధం
  • మేళ్ళచెరువు - జాన్‌పహాడ్‌ మధ్య లింకుమార్గం అభివృద్ధి
  • రూ.348 కోట్ల వ్యయం.. 29 కి.మీ దూరం
  • విష్ణుపురం - జగ్గయ్యపేటకు అనుసంధానం
  • అతి తక్కువ దూరంలో సికింద్రాబాద్‌కు..
  • నాలుగు దశాబ్దాల కల సాకారం
నాలుగు దశాబ్దాల కల ఎట్టకేలకు ఫలించింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ మూడవ ప్రత్యామ్నాయ రైల్వే లైన్‌ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ చరిత్రలో రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులను తీసుకు రావటానికి అడుగు ముందుకు పడింది. రాజధాని ప్రాంతంలో విష్ణుపురం - జగ్గయ్యపేట ప్రాంతాల అనుసంధానంతో కూడిన మూడవ సింగిల్‌లైన్‌ మార్గం అందుబాటులోకి రావటంతో అతి త్వరలో ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు ఈ మార్గం మీదుగా నడవటానికి దోహదపడబోతోంది.
 
 
విజయవాడ/కంచికచర్ల(ఆంధ్రజ్యోతి): విజయవాడ - సికింద్రాబాద్‌కు ప్రత్యామ్నాయ మూడవ రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. జగ్గయ్యపేట - జాన్‌పహాడ్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.348 కోట్ల వ్యయంతో ‘మేళ్ళ చెరువు - జాన్‌పహాడ్‌’ మధ్య 29 కిలోమీటర్ల రైల్వే లైన్‌పూర్తి చేయటంతో సరికొత్త మూడవ రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. రాజధాని ప్రాంతంలో విష్ణుపురం - జగ్గయ్యపేటలకు అనుసంధానం పూర్తి కావటంతో మూడవ రైలు మార్గానికి ప్రత్యేకత ఏర్పడింది. ఈ మార్గాన్ని సికింద్రాబాద్‌కు వెళ్ళే ప్రస్తుత రెండు రైల్వే మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. పైగా ఈ రెండింటికంటే అతి తక్కువదూరంలో సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల కోసం రైళ్ళను నడిపితే అత్యంత రద్దీగా నడిచే అవకాశం ఉంది. రైల్వేశాఖ భారీ ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
 
రాజధానికీ అనుసంధానం
qwrtrthdrt.jpgవిజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలు ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరు, నడికుడి, విష్ణుపురం, నల్గొండ, బీబీ నగర్‌, సికింద్రాబాద్‌ మార్గం ప్రధానమైనది. ఆ తర్వాత విజయవాడ నుంచి మధిర, మోటుమర్రి, ఖమ్మం, డోర్నకల్‌, ఖాజీపేట, బీబీనగర్‌, సికింద్రాబాద్‌కు రెండవ రైలు మార్గంగా ఉంది. విజయవాడ నుంచి సికిరందాబాద్‌కు తాజాగా విజయవాడ నుంచి మధిర, మోటుమర్రి, జగ్గయ్యపేట, రామాపురం, మేళ్ళ చెరువు, జాన్‌పహాడ్‌, విష్ణుపురం, నల్గొండ, బీబీనగర్‌ల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకోవచ్చు. దీంతో పాటు గుంటూరు జిల్లాలో విష్ణుపురం, కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేటలకు లింక్‌ ఏర్పడింది. ప్రత్యామ్నాయ మూడవ లైన్‌కు రాజధాని ప్రాంతం అనుసంధానంగా మారింది. నాలుగుదశాబ్దాల కిందటే ఈ ప్రత్యామ్నాయ మార్గానికి బీజం పడినా సాకారం కావటానికి ఇన్నేళ్లు పట్టింది. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో అపార సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. సిమెంట్‌ కంపెనీల ఆవిర్భావంతో 1986వ సంవత్సరంలో జగ్గయ్యపేటకు ఖమ్మం జిల్లాలోని మోటుమర్రి నుంచి రైల్వేలైన్‌ఏర్పాటు జరిగింది. గూరకల్లు, మధిర స్టేషన్ల మధ్యన మోటుమర్రి ఉంది.
 
అప్పట్లో వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీకి అవసరమైన సున్నపురాయి కోసం మోటమర్రి - జగ్గయ్యపేట మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత దశల వారీగా జగ్గయ్యపేట - మేళ్ళచెరువుకు 20.6 కిలోమీటర్లు, విష్ణుపురం - జాన్‌పహాడ్‌కు 16 కిలోమీటర్లు, మేళ్ళ చెరువు - జాన్‌పహాడ్‌కు 29 కిలోమీటర్ల రైల్వే మార్గాలను అభివృద్ధి చేశారు. చివరి దశలో మేళ్ళ చెరువు - జాన్‌ పహాడ్‌కు రూ.348 కోట్ల వ్యయంతో రైలు మార్గాన్ని అభివృద్ధి పరచటంతో మూడవ రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చినట్టు అయింది.
 
ప్రయాణం దూరం తక్కువే..
ఖాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రస్తుత మార్గం కంటే అభివృద్ధి పరిచిన థర్డ్‌ రైల్‌ మార్గం ద్వారా తక్కువ సమయంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. డోర్నకల్‌, ఖాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు మొత్తం 351 కిలోమీటర్ల మేర దూరం ఉంది. మోటుమర్రి, విష్ణుపురంల మీదుగా అనుసంధానం కావటం వల్ల 291 కిలోమీటర్ల దూరంలోనే సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది. దాదాపుగా 60 కిలో మీటర్ల దూరం తక్కువుగా ఉంటుంది.
 
  • ప్రస్తుతం ఈ మార్గాన్ని సింగిల్‌ లైన్‌గా అభివృద్ధి చేశారు. ఈ మార్గం ప్రాముఖ్యత దృష్ట్యా రానున్న రోజుల్లో దీనిని డబ్లింగ్‌ చేయటం ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ప్రధానమైన రూట్‌గా మారే అవకాశం ఉంటుంది. మరిన్ని గూడ్స్‌, ప్రయాణికుల రైళ్లను నడపటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికి మార్గం సుగమం అవుతుంది.
  • ప్రస్తుతం ఈ మార్గంలో గూడ్స్‌ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. త్వరలో పాసెంజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నడపాల్సిన అవసరం ఉంది. అతి తక్కువ దూరంలో సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్గంలో పాసెంజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నడిపితే ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి.
  • విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు అభివృద్ధి చేసిన మేళ్ళచెరువు, జాన్‌పహాడ్‌ మార్గంలో పలు రైల్వేస్టేషన్స్‌ ఉన్నాయి. వీటిని రైల్వే అధికారులు అభివృద్ధి చేయాల్సి ఉంది. మోటుమర్రి, మక్కపేట, జగ్గయ్యపేట, రామాపురం, మేళ్ళ చెరువు, మటింపల్లి, వరదాపురం, జాన్‌ పహాడ్‌, విష్ణుపురం రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫుట్‌ బ్రిడ్జిలు, కుర్చీలు, మరుగుదొడ్లు, మంచినీటి వసతులతో పాటు సమాచార కేంద్రాలు, టిక్కెట్‌ కౌంటర్లు వంటివి ప్రధానంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
రైల్వే కేసులకు సత్వర పరిష్కారం
08-12-2018 05:30:30
 
636798438289683990.jpg
  • మూడు డివిజన్‌ల పరిధిలో 1,670 కేసులు పెండింగ్‌
  • కేసులన్నీ అమరావతి శాఖకు బదిలీ
  • జస్టిస్‌ సిటీలో రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ నిర్మిస్తాం
  • హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రహ్మణియన్‌
  • గుంటూరు రైల్వేస్టేషన్‌లో అమరావతి శాఖ ప్రారంభం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రైల్వే క్లెయిమ్స్‌, ట్రిబ్యునల్స్‌ని దేశంలో అన్ని చోట్ల హైకోర్టులున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి... అదేవిధంగా అమరావతి రాజధానిలో నిర్మాణం జరుగుతోన్న జస్టిస్‌ సిటీలో హైకోర్టు భవనాలకు సమీపంలో స్థలాన్ని కోరాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే రైల్వే క్లెయిమ్స్‌, ట్రిబ్యునల్‌ అమరావతి శాఖ శాశ్వత భవన సముదాయం అక్కడ ప్రారంభిస్తామని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌ అన్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో పశ్చిమ వైపున అరండల్‌పేట ఒకటో లైనులో రైల్వే క్లెయిమ్స్‌, ట్రిబ్యునల్‌ అమరావతి శాఖ తాత్కాలిక భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వీజీ భూమా అధ్యక్షత వహించారు.
 
ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ రామసుబ్రహ్మణియన్‌ ప్రసంగిస్తూ గత ఏడాది రైల్వే శాఖ మంత్రి అమరావతికి వచ్చినప్పుడు ట్రిబ్యునల్‌ ప్రకటన చేశారని, సంవత్సరం వ్యవధిలో తాత్కాలిక భవనాన్ని అన్నిరకాల సదుపాయాలతో రైల్వేశాఖ సిద్ధం చేసినందుకు అభినందించారు. అమరావతి రాజధానిలో శాశ్వత భవనాలు నిర్మించిన తర్వాత అక్కడికి మారుస్తామన్నారు. సికింద్రాబాద్‌లో ప్రస్తుతం నాలుగు వేలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిల్లో గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వేడివిజన్‌ల పరిధిలోకి వచ్చే కేసులు 1,670 వరకు ఉన్నాయన్నారు. వాటన్నింటికి ఇక్కడికి బదిలీ చేశామన్నారు. దీని వలన ఆయా క్లెయిమ్‌లు సత్వరమే పరిష్కారం కావడానికి అనువైన వాతావరణం ఏర్పడిందన్నారు.
 
frdg.jpg రైల్వే క్లెయిమ్స్‌, ట్రిబ్యునల్‌ ప్రిన్సిపల్‌ శాఖ ఛైర్మన్‌ జస్టిస్‌ కె.కన్నన్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమకు ఉన్న 22 శాఖల్లో 33 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిల్లో 90శాతం ప్రమాదాలకు సంబంధించివనేనని, మిగిలిన 10శాతం సరుకు రవాణాకు చెందినవన్నారు. సగటున ఒక్కో క్లెయిమ్‌ పరిష్కారానికి నాలు గేళ్ల వ్యవధి పడుతున్నందున బాధితులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ట్రిబ్యునల్‌ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేసిందన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌ అయినా పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2003 నిబంధనల ప్రకారం ఏ కేసులో అయినా 120 రోజుల్లో డీఆర్‌ఎం రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డీఆర్‌ఎం ఇచ్చే రిపోర్టు ప్రామాణికంగా తీసు కొంటామని, దీని దృష్ట్యా అందులో వాస్త వికత ఉండాలని స్పష్టం చేశారు.
 
రైళ్లలో ప్రయాణించే వారు టిక్కెట్‌ లేకుండా ప్రమా దానికి గురైతే క్లెయిమ్‌ చేయడం కష్టమౌ తుందన్నారు. కేసు ఫైలింగ్‌ అయిన తర్వాత మూడు నెలలు దాటిన తర్వాత ప్రతీ రోజూ దానిని సమీక్షిస్తామన్నారు. 2016 నుంచి కేసులు ఫైలింగ్‌ కాకముందే ట్రిబ్యునల్‌ స్పం దించి బాధితులకు స్వాంతన చేకూ రుస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ మాటా ్లడుతూ ఆర్‌సీటీ బెంచ్‌పై కేసులు ఒత్తిడి తగ్గించే ప్రధాన ఉద్దేశ్యంతో అమరావతి శాఖ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం రూ.75 లక్షలు వెచ్చించామని తెలిపారు. తక్కువ వ్యవధిలో భవన నిర్మాణం పూర్తి చేసినందుకు గుంటూరు రైల్వే డివిజన్‌ అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఆర్‌సీటీ మెంబర్‌ టెక్నికల్‌ గణేశ్వరరావు, ప్రిన్సిపల్‌ బెంచ్‌ రిజిస్ట్రార్‌ సర్జనరావు, కేపీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
దశాబ్దాల కల... సాకారమవుతున్న వేళ...
17-12-2018 07:37:50
 
636806290710462311.jpg
  • నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో పనులు చకచకా
  • పిడుగురాళ్ల - శావల్యాపురం సెక్షన్‌ పూర్తి
  • మార్చి తర్వాత రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే యోచన
  • రెండేళ్లలో ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తామంటున్న అధికారులు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల స్వప్నం... నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం... త్వరలో సాకారం కాబోతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణ పనులు లక్ష్యం దిశగా కొనసాగు తున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే పిడుగురాళ్ల - శావల్యాపురం సెక్షన్‌ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. కొన్ని చిన్న పనులు పెండింగ్‌లో ఉండగా వాటిని 2019 మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఆ తర్వాత ఈ మార్గంలో తొలి రైలు సర్వీసుని పట్టాలెక్కిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ గుంటూరు రైల్వే డివిజన్‌ ఇన్‌స్పెక్షన్‌ సందర్భంగా ప్రకటించారు.
 
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైలుమార్గం లేని వెనకబడిన ప్రాంతాల మీదగా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం ఎలైన్‌మెంట్‌ చేశారు. ఎంపీలు ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 309 కిలోమీటర్ల దూరం రైలుమార్గం నిర్మాణాన్ని రూ. 2,289 కోట్లతో పూర్తి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలుమార్గం పూర్తి అయితే వెనకబడిన ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తాయని రైల్వేవర్గాలు అంటున్నాయి.
 
కేంద్ర రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి సమానంగా నిధులు సమకూరుస్తున్నాయి. రైలుమార్గం నిర్మాణా నికి అవసరమైన భూమిని ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మార్గం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గుంటూరు - తిరుపతికి దూరం తగ్గిపోతుంది. అలానే తుపాన్ల సమయంలో చెన్నై - విజయవాడ మార్గానికి ఇదొక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని వలన రైళ్ల రాకపోకలకు ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఇబ్బంది ఉండదు. ప్రయాణికుల రవాణాకే కాకుండా సరుకు రవాణాకూ ఉపయోగపడుతుంది. గనుల నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి అనేక రకాల మెటల్స్‌ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయొచ్చు. ఈ మార్గం శ్రీకాళహస్తి వద్ద గూడూరు - రేణిగుంట ప్రధాన రైలు మార్గంతో, పిడుగురాళ్ల వద్ద గుంటూరు - సికింద్రాబాద్‌ బ్రాంచ్‌లైన్‌ మార్గంతో అనుసంధానం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని 20 లక్షల మందికి కొత్త రైలు మార్గం సేవలందిస్తుంది. ప్రాజెక్టు పూర్తి అయితే 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు రైలుసేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అమరావతి రాజధానికి కనెక్టివిటీ కూడా వస్తుంది.
కొత్తగా ఏర్పాటయ్యే రైల్వే స్టేషన్లు...
ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న పిడుగు రాళ్ల, శావల్యాపురం, వినుకొండ, గుండ్లకమ్మ, వెంకటగిరి వంటి రైల్వేస్టేషన్లతో పాటు కొత్త పిడుగురాళ్ల, నకరికల్లు, రొంపిచర్ల, వేకనకొండ, దర్శి, పొదిలి, గౌటువారిపల్లి, కనిగిరి, బలిపల్లె, పామూరు, గొల్లవారిపల్లె, వింజమూరు, ఆత్మకూరు, ఓబుళాయపల్లి, వెంకటాపురం, ఆదురిపల్లి, రావూరు, వల్లంపల్లె, ఆల్తూరుపాడు స్టేషన్ల నిర్మాణం జరుగుతాయి.
 
ప్రాజెక్టు విశేషాలివీ...
  • 2016 ఆగస్టు 30న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గానికి రూ. 2,289 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అదే రోజున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులు సమకూర్చేందుకు ఒప్పందం చేసుకొంది.
  • ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ. 404 కోట్లు ఖర్చు చేశారు.
  • 2018-19 సంవత్సరానికి కేటాయించిన నిధులు రూ. 420 కోట్లు (రైల్వే వాటా రూ. 220 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు).
  • 2014-15 నుంచి 2018-19 వరకు రైల్వేబడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ. 414 కోట్లు. పెట్టిన ఖర్చు రూ. 375 కోట్లు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవం బరు వరకు రూ. 137 కోట్లు ఖర్చు చేశారు.
  • మొదటి దశ పిడుగురాళ్ల - శావల్యాపురం (45.50 కిలోమీటర్లు).
  • రెండో దశ గుండ్లకమ్మ - దర్శి, వెంకటగిరి - ఆల్తూరిపాడు (41.95 కిలోమీటర్లు)
  • మూడో దశ దర్శి - కనిగిరి, ఆలూర్తిపాడు - వెంకటాపురం (95.55 కిలోమీటర్లు)
  • నాల్గో దశ కనిగిరి - ఓబుళాయపల్లె - వెంకటాపురం (126.16 కిలోమీటర్లు).
  • నూతన రైలుమార్గంలో 160 వంతెనలు (ఒకటి మేజర్‌, 84 పెద్ద వంతెనలు, 248 చిన్న వంతెనలు) నిర్మించాలి. 28 ఆర్‌వోబీలు, 144 ఆర్‌యూబీలు. 37 కొత్త రైల్వేస్టేషన్లు (26 క్రాసింగ్‌ స్టేషన్లు, 11 హాల్టింగ్‌ స్టేషన్లు) నిర్మించాలి.
  • ఫ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన భూమి 5,189 ఎకరాలు. ఇప్పటివరకు రైల్వేకు స్వాధీనం చేసిన భూమి 1,499 ఎకరాలు.
  • సెక్షన్‌ ప్రారంభంలో 0.20 కిలోమీటర్ల వద్ద భూమిపై రైతులు వేసిన వ్యాజ్యం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది.
  • రొంపిచర్ల - శావల్యాపురం మధ్య రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసిన 17 కిలోమీటర్ల భూమిలో మట్టిపని, చిన్న, పెద్ద వంతెనల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన భూసేకరణ నిమిత్తం సంబంధిత దస్తావేజులను రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే రైల్వే శాఖ పంపింది.
  • ఈ కొత్త రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించిన బహుళార్థక సాధన వేదిక - ప్రోయాక్టివ్‌ గవర్నెన్స్‌ అండ్‌ టైమ్లీ ఇంప్లిమెంటేషన్‌ సమావేశాల్లో తరచుగా పర్యవేక్షిస్తున్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

Misleading title

only between Nadikudi and Savalyapuram for 45 KM

and still 0.2 acres of area is pending due to court case

 

45 KM ki 4+ years padithe 

inka remaining 250+ KM yenni years chestharo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...