Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
యుద్ధప్రాతిపదికన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు
07-07-2018 06:41:41
 
636665425030689307.jpg
నరసరావుపేట: నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు రైల్వే లైన్‌ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. పిడుగురాళ్ల, శావల్యాపురం మధ్య డిసెంబర్‌ నుంచి కొత్త రైల్వేలైన్‌పై 51 కిలోమీటర్ల పొడవున రైళ్ల రాకపోకలను ప్రారంభించేలా వడివడిగా పనులు జరుగుతున్నాయి. కొత్త రైల్వే లైన్‌కు విద్యుదీకరణ పనులు కూడా చేపట్టేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. నకరికల్లు ప్రాంతంలో కొండను తొలిచి రైల్వేట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయం రైల్వేలైన్‌ నిర్మాణ పురోగతిపై సమీక్షిస్తోంది.
Link to comment
Share on other sites

సరికొత్త రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే
18-07-2018 07:10:22
 
636674946235508903.jpg
  • సరకు రవాణాలో దుమ్ము దులిపిన విజయవాడ రైల్వే డివిజన్‌
  • దక్షిణ మధ్య రైల్వేలోనే టాప్‌గా నిలిచిన బెజవాడ
  • తొలి త్రైమాసికం లక్ష్యం 9 వేల మిలియన్‌ టన్నులు
  • సాధించింది.. 15 వేల మిలియన్‌ టన్నులు
సరకు (గూడ్స్‌ ) రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్‌ తొలి త్రైమాసికంలోనే దుమ్ము దులిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే టార్గెట్‌ను మించి అగ్రపథంలో నిలిచింది. గత రికార్డును చెరిపివేసి సరికొత్త రికార్డును లిఖించటానికి ఉవ్విళ్లూరుతోంది. 2017 -18 ఆర్థిక సంవత్సరంలో 30 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేపట్టాలని విజయవాడ డివిజన్‌కు లక్ష్యం విధించారు. తొలి త్రైమాసికం విజయవాడ రైల్వే డివిజన్‌కు రూ.9 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. త్రైమాసికంలో నిర్దేశించిన టార్గెట్‌ కంటే అదనంగా మొత్తం 15 మిలియన్‌ టన్నుల మేర గూడ్స్‌ రవాణా చేపట్టింది. టార్గెట్‌ను మించి రవాణా చేపట్టడంతో డివిజనల్‌ రైల్వే అధికారులు ఆనందంతో ఉన్నారు.
 
విజయవాడ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ 1 - జూన్‌ 30 వరకు)లో విజయవాడ డివిజన్‌ సాధించిన వృద్ధి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కిందటి ఆర్థిక సంవత్సరం 2016 -17 లో విజయవాడ డివిజన్‌ 28 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని సాధించింది. గత మూడేళ్లుగా విజయవాడ రైల్వే డివిజన్‌ కూడా సరకు రవాణాలో గణనీయంగా మెరుగు పడుతూ వస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరం రూ.28 మిలియన్‌ టన్నుల మేర సరకు రవాణా చేపట్టడంతో రైల్వే శాఖ 2017 -18 ఆర్థిక సంవత్సరానికి 30 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రైల్వే శాఖ కూడా ఊహించనంతగా విజయవాడ డివిజన్‌ తొలి మూడు నెలల్లోనే 15 మిలియన్‌ టన్నులను దాటి మరీ సరకు రవాణా చేపట్టడం విశేషం.
 
పోర్టుల నుంచే భారీగా..
విజయవాడ రైల్వే డివిజన్‌ అనూహ్యమైన ఫలితాలు సాధించటానికి ప్రధానంగా కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు ఎంతగానో దోహదపడ్డాయి. సింహభాగం వీటి ద్వారానే సరుగు ఎగుమతి, దిగుమతులు జరగటం విశేషం. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి చూస్తే.. గతంలో సగటున రోజూ 10 ర్యాక్‌ల మేర ఎగుమతి, దిగుమతులు జరిగేవి. కాకినాడ పోర్టును ప్రతి రోజూ సగటున 7 - 8 ర్యాక్‌ల మేర ఎగుమతి దిగుమతులు జరిగేవి. గూడ్స్‌కు ఉండే ఒక వ్యాగన్‌లో 60 టన్నుల సరుకు పడుతుంది. ఇలా సగటున 50 వ్యాగన్లు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఒక ర్యాక్‌ అంటారు. ఒక ర్యాక్‌లో 3 వేల టన్నుల మేర సరుకు పడుతుంది. కృష్ణపట్నం పోర్టులో 10 ర్యాక్‌లు అంటే 30 వేల టన్నులు, కాకినాడ పోర్టు ద్వారా 21 వేల టన్నుల మేర రవాణా జరిగేది.
 
వెరసి ఈ రెండు పోర్టుల నుంచి రోజుకు 51 వేల టన్నుల మేర సరకు రవాణా జరుగుతోంది. నెలకు 15.30 లక్షల టన్నుల మేర ఈ పోర్టుల ద్వాదానే రవాణా జరుగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సగటున కృష్ణపట్నం పోర్టుకు సగటున 20 ర్యాక్‌లు నడిచాయి. కృష్ణపట్నం పోర్టుకు 12 - 15 ర్యాక్‌లు నడిచాయి. దీనిని బట్టి చూస్తే సగటున ప్రతిరోజూ కృష్ణపట్నం పోర్టు నుంచి 60వేల టన్నులు, కాకినాడ పోర్టు నుంచి 40 వేల టన్నులు వెరసి లక్ష టన్నుల మేర రవాణా జరిగింది. ఈ లెక్కన నెలకు 30 లక్షల టన్నుల మేర రవాణా చేసింది. ఒక మిలియన్‌ అంటే పది లక్షలు . ఈ లెక్కన నెలకు సగటున మూడు మిలియన్ల టన్నుల రవాణా ఈ రెండు పోర్టుల ద్వారా జరిగింది. దాదాపుగా మూడు నెలల్లో 10 మిలియన్‌ టన్నుల రవాణా పోర్టుల ద్వారా జరగ్గా... మిగిలిన 5 వేల మిలియన్‌ టన్నుల రవాణా సాధారణంగా జరిగింది.
 
 
ఆల్‌టైమ్‌ రికార్డు
ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ ఆల్‌టైమ్‌ రికార్డుగా 35 మిలియన్‌ టన్నుల మేర సరకు రవాణా చేపట్టడం గమనార్హం. దశాబ్దం కిందట ఈ రికార్డును సాధించటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో గణాంకాలు లేవు. తొలి త్రైమాసికం ఇచ్చిన ఫలితాలతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం ధనుంజయులు భారీ టార్గెట్‌పై కన్నేశారు. ఈ ఏడాది ముగిసే నాటికి 50 మిలియన్‌ టన్నుల మార్కును చేరుకోవాలని భావిస్తున్నారు. ఇదే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించినా.. 40 మిలియన్‌ టన్నుల టార్గెట్‌ తగ్గకూడదని ఆ దిశగా క్షేత్ర స్థాయిలో పనిచేయటానికి ఆదేశాలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
‘అమరావతి’తో రైల్వే అనుసంధానం
06-09-2018 03:33:29
 
636718016086344063.jpg
  •  ఈ బడ్జెట్‌లోనే నిధులొచ్చే అవకాశం
  •  తొలుత సింగిల్‌ లైన్‌..రద్దీని బట్టి రెండోది నిర్మాణం
  •  తెనాలి-గుంటూరు డబ్లింగ్‌ పనులు
  • త్వరలోనే పూర్తి: రైల్వే జీఎం
గుంటూరు (సంగడిగుంట), సెప్టెంబరు 5: ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్‌ను అనుసంధానించే ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నంబూ రు, ఎర్రబాలెం మధ్య సింగిల్‌ లైన్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆతర్వాత రద్దీని బట్టి రెండో ట్రాక్‌ నిర్మిస్తామని చెప్పారు. గుంటూరు, మంగళగిరి స్టేషన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నగరం పశ్చిమం వైపు అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా రైల్వే స్టేషన్‌ను అటువైపు ఆధు నీకరిస్తున్నామన్నారు.
 
తెనాలి-గుంటూరు డబ్లింగ్‌ ట్రాక్‌ పనులు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామన్నారు. గుంటూరు-గుంతకల్లు విద్యుదీకరణ పూర్తయిందని, త్వరలోనే డబ్లింగ్‌ ట్రాక్‌ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నల్లపాడు-పగిడిపల్లి డబ్లింగ్‌కు సర్వే పూర్తయిందన్నారు. నడికుడి-కాళహస్తి ట్రాక్‌ నిర్మాణ పనులు 70 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...