Jump to content

శాతకర్ణి కోసం మళ్లీ ఫారిన్ షెడ్యూల్


sonykongara

Recommended Posts

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మొరాకోలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం హైద్రాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 20న ప్రారంభం కాగా.. ప్రధాన నటీనటులందరూ ఈ షెడ్యూల్ లో భాగం అవుతున్నారు.

హైద్రాబాద్ పరిసరాల్లో ఇప్పుడు షూటింగ్ జరుగుతుండగా.. దీని తర్వాత జార్జియాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ క్రిష్. గతంలో కంచె చిత్రం కోసం ఉపయోగించుకున్న ప్రదేశానికి దగ్గరలోనే.. కొన్ని కీలక సీన్స్ ను పిక్చరైజ్ చేయాలని భావిస్తున్నాడట దర్శకుడు. ఇందుకోసం ఇప్పటికే తన నిర్మాతలకు సూచనలు ఇవ్వగా.. వారు వీసాకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంటున్నారని తెలుస్తోంది.

నిజానికి క్రిష్ కు జార్జియా విపరీతంగా నచ్చేసింది. అక్కడి ప్రదేశాలు పాత కాలపు సీన్స్ ను తీసేందుకు.. చారిత్రక యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు అత్యంత అనువుగా ఉండడమే ఇందుకు కారణం. వరుణ్ తేజ్ తో తీయాలని తలపెట్టిన రాయబారి పట్టాలెక్కితే.. ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగేది. ఇప్పుడు బాలకృష్ణను కూడా జార్జియా తీసుకెళుతూ.. అక్కడ మైదానపు ప్రాంతంపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు క్రిష్.

Link to comment
Share on other sites




జులై2 నుండి ‘శాతకర్ణి’ క్లైమాక్స్


print_icon.gif




 

636021948570819682.jpg

నందమూరి బాలకృష్ణ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ వచ్చే నెల 2 నుండి మొదలు కానున్నట్టు సమాచారం. 22 రోజుల పాటు జార్జియాలో జరుగనున్న ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇదంతా చూస్తుంటే అన్నిటికంటే ముందు యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసేందుకే దర్శకుడు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్‌లో 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు సహా 200 గుర్రాలతో కొన్ని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన క్రిష్ హైదరాబాద్‌లో జరిగిన తర్వాతి షెడ్యూల్లోనూ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మరి కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక తర్వాతి షెడ్యూల్‌ను వాటికే కేటాయించారు. ‘బాహుబలి’ తర్వాత యుద్ధ నేపథ్యంలో వస్తున్న సినిమా గనక ఆ స్థాయికి తక్కువ కాకుండా క్రిష్ జాగ్రత్త వహిస్తున్నారట. బాలయ్య వందో చిత్రంగా రానున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...