sonykongara Posted June 16, 2016 Posted June 16, 2016 దూసుకుపోతున్న ఆర్టీసీ పార్శిల్ రెండు వారాల్లో 2.50 కోట్ల ఆదాయం పెరుగుతున్న లగేజీ బుకింగ్స్ ధర తక్కువ.. ఉపయోగించుకోండి: ఎండీ సాంబశివరావు హైదరాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రోడ్డు రవాణా సంస్థ ప్రవేశ పెట్టిన పార్శిల్ సర్వీస్ రాష్ట్రంలో దూసుకుపోతోంది. ప్రైవేటు పార్శిల్‌తో పోల్చుకుంటే ధర తక్కువ కావడంతో బుకింగ్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జూన 1న ప్రారంభించిన ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌కు తొలివారంలోనే రోజుకు రూ.10 లక్షల కలెక్షన రాగా రెండో వారం ముగిసే నాటికి రోజుకు రూ.25 లక్షలకు చేరింది. మొత్తం మీద రెండు వారాల్లోనే ఆర్టీసీకి పార్శిల్, కొరియర్ ద్వారా రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాల కన్నా మరింత ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు మాత్రమే ఉన్న పార్శిల్ సర్వీసును భవిష్యత్తులో ఇంటికి చేర్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో 12,600 బస్సులున్న ఆర్టీసీలో కొన్నేళ్లుగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించుకునేందుకు యాజమాన్యం బస్ చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం వేస్తూ వస్తోంది. ప్రస్తుత ఎండీ సాంబశివరావు సైతం మొదట్లో బస్సు చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం చంద్రబాబు అందుకు ససేమిరా అనడంతో రెండు, మూడు సార్లు ప్రయత్నించి చివరికి నామమాత్రపు చార్జీలు పెంచారు. అయితే, సిబ్బందికి 43ు ఫిట్‌మెంట్ పెంచడంతో ఆ మొత్తం ఎందుకూ సరిపోలేదు. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు.. సూచించారు. దీంతో ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ ప్రారంభమైంది. ఆదాయ మార్గాలపై దృష్టి ఆర్టీసీలో సంస్కరణలు ప్రారంభించిన యాజమాన్యం పలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. బస్సులతో పాటు బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగు పరిచి ప్రయాణికులను ఆకట్టుకోవడం వరకు ఎండీ పలు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ స్థలాలను లీజుకివ్వడం, బస్టాండు ప్రాంగణంలో మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణం ఇలా పలు మార్గాలను అన్వేషించిన యాజమాన్యం.. సొంతంగా పార్శిల్ సర్వీసును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీతో కాంట్రాక్టు తీసుకొని పన్నెండున్నర వేల బస్సులను వినియోగించుకొంటున్న ఏఎనఎల్ పార్శిల్ సర్వీస్ ఏటా ఎంతమేర వ్యాపారం చేస్తోంది. సంస్థకు ఎంత చెల్లిస్తోందన్న దానిపై ఎండీ ఆరా తీశారు. వ్యాపారం వందల కోట్లలో ఉండగా ఆర్టీసీకి దక్కుతున్నది కేవలం రూ.9 కోట్లు మాత్రమేనని తేలింది. దీంతో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల ద్వారా పార్శిల్, అన్ని బస్సుల ద్వారా కొరియర్ సర్వీసు ప్రారంభించాలని లాభ నష్టాలను యాజమాన్యం అంచనావేసింది. ఏఎనఎల్‌తోపాటు బయట ప్రైవేటు పార్శిల్ సర్వీసుల ధరలను పరిశీలించింది. మొదట్లో రూ.332 కోట్ల వరకు ఆదాయం వచ్చినా ఆ తర్వాత ఏటా రూ.వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. సిబ్బంది ఎంపికలోనే అప్రమత్తం ఎక్కడికక్కడ బస్ డిపో స్థాయిలో పార్శిల్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి రీజియన్ల వారీగా అధికారులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. రీజియన స్థాయి అధికారులకు కొత్త కార్లు కొనిచ్చి వ్యాపారం అభివృద్ధి చేయాలని టార్గెట్లు నిర్దేశించారు. సిబ్బందిని సైతం మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి జూన 1 నుంచి పూర్తిస్థాయిలో పార్శిల్, కొరియర్ సేవలు ప్రారంభించారు. మొదట్లో రోజూ రూ.3 లక్షల కలెక్షనతో ప్రారంభమైన వ్యాపారం వారం రోజుల్లోనే రూ.10 లక్షలకు, రెండు వారాల్లో రూ.25 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఏఎనఎల్ ఉండటం వల్ల పార్శిల్, కొరియర్ ఆదాయం రూ.500 కోట్లకు మించబోదని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ఏఎనఎల్ గడువు ముగుస్తున్నందున ఆర్టీసీకి పార్శిల్ సేవల ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. చౌక ధరలు! రాష్ట్రంలో పలు ప్రైవేటు కొరియర్, పార్శిల్ సంస్థలు చేస్తున్న చార్జీల కంటే ఆర్టీసీలో 20ుకి పైగా ధర తక్కువగా ఉంది. యాభై కిలోల బరువున్న బస్తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే ప్రైవేటు పార్శిల్లో వేస్తున్న ధరకన్నా ఆర్టీసీ బాగా తక్కువ వసూలు చేస్తోంది. ఆర్టీసీ సేకరించిన సమాచారం ప్రకారం ప్రైవేటు పార్శిల్లో యాభై కిలోల బస్తాకు కిలోమీటరుకు 44 పైసల నుంచి అర్థరూపాయి వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో 30 పైసలే. అంటే ప్రైవేటలో రూ.300కు పైగా అయ్యే ఖర్చు ఆర్టీసీలో రూ.200ల కన్నా తక్కువే అవుతుందని సంస్థ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్, పార్శిల్ సేవల్ని వినియోగించుకోవాలని ఎండీ సాంబశివరావు ప్రజలకు విన్నవించారు. RamaSiddhu J 1
sonykongara Posted June 16, 2016 Author Posted June 16, 2016 .RTC ni labala loki tisuku ravtaniki AP cabinet sub comitte chesina sipasu ni. super ga amalu chesthuna RTC MD.
swas Posted June 16, 2016 Posted June 16, 2016 I think so many don't know abt it Publicity cheyali in all bus stops and buses lo banners petti
sonykongara Posted June 27, 2016 Author Posted June 27, 2016 I think so many don't know abt it Publicity cheyali in all bus stops and buses lo banners petti
sonykongara Posted June 27, 2016 Author Posted June 27, 2016 http://www.andhrajyothy.com/pages/videodisplay?VideoId=46519
Nfan from 1982 Posted July 11, 2016 Posted July 11, 2016 .RTC ni labala loki tisuku ravtaniki AP cabinet sub comitte chesina sipasu ni. super ga amalu chesthuna RTC MD.
swas Posted July 11, 2016 Posted July 11, 2016 .RTC ni labala loki tisuku ravtaniki AP cabinet sub comitte chesina sipasu ni. super ga amalu chesthuna RTC MD. APTDC ni RTC ni combine chesi nadapali
sonykongara Posted July 11, 2016 Author Posted July 11, 2016 AP State Road Transport Corporation (APS RTC), new service of delivering Parcel Services to remote villages and interior tribal villages of the state is getting huge response from the public. Since the past 45 days, from the date of launch of this service, only Guntur and Vijayawada Regions have bought around Rs.One crore revenue. As the buses, would be there to near by towns, every 30 mins, the goods are being received very fast to the customers, than the private players. Below are the Sidelines of RTC Parcel Service: Parcels would be delivered within 24 hours to the places covered by the buses Not only AP, but other major cities like Hyderabad, Chennai and Bengaluru where RTC is running the services A special place would be allocated for parcels. Right now, the delivery is being fone from busstand to busstand and in future, RTC is planning to send the parcel to the house. Global Positioning System-based vehicle tracking equipment to track the buses The cost of Private players per Kg for every one KM is 44 paise, whereas RTC is providing at 30 paise To send a parcel weighing 50 kg to Vijayawada it would cost just Rs. 50 In case of Chennai or Hyderabad, it would cost Rs. 100 and to Bengaluru just Rs. 100 Within the district, a parcel weighing 50 kg could be moved at a cost of just Rs. 30 Farmers could make use of the service to move fruits and vegetables to niche markets Parcel counter could be reached on mobile no. 7337347677 for Guntur and 8333095536 for Vijayawada, for more details
sonykongara Posted July 11, 2016 Author Posted July 11, 2016 దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ…. నష్టాలొచ్చి నీరసపడిన టైమ్ లో ధనాధన్ దరువేస్తున్నట్టుగా ఉత్సాహంతో ఉరకలేస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. అసలు సంగతేంటో తెలిస్తే…అద్దీ ఆంధ్రా ఎఫెక్ట్… దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ అంటారు మీరు కూడా ! ఆర్టీసీ సక్సెస్ అయిన దాఖలాలు చరిత్రలో చాలా తక్కువ. లక్షాతొంభై బాధ్యతలు, రిజర్వేషన్లు, దానికితోడు గవర్నమెంట్ సంస్థకాబట్టి బండెడు నిర్లక్ష్యం బస్సు సంస్థని కుంగదీసేస్తాయ్. దేశవ్వాప్తంగా చూసినా లాభాల్లో నడిచే రోడ్డు రవాణా సంస్థలు చాలా తక్కువ. అందుకే కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు జోన్లుగా విడగొట్టి నెట్టుకొస్తున్నాయ్. అలాంటిది ఏపీ మాత్రం ఇపుడు అదుర్స్ అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిలో మూడోసారి అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు సాదించి…అవునా అంటూ ఆశ్చర్యపరుస్తోంది. సంగతేంటి అంటే… ఏపీఎస్ ఆర్టీసీ లేటెస్ట్ గా సరుకు రవాణా మొదలుపెట్టింది. అంతా కలిపి నెలన్నర కాలేదు. ఇప్పటికే 20 కోట్లకిపైగా ఆదాయంతో రికార్డులు బద్దలుకొడుతోంది. కొత్తగా ఎలాంటి ఖర్చూ లేకుండా ప్ర్రత్యేకంగా కొద్దిమంది సిబ్బందిని మాత్రం కేటాయించి సరుకు రవాణాలో సంచలనం సృష్టిస్తోంది. ఉదయం ఆరు నుంచి అర్థరాత్రి 12 వరకూ ఏ వేళలో అయినా ఏ రూట్లో అయినా సరుకు పంపుకోవచ్చు అనే సరికి ఇక కొరియర్ మీద ఆధారపడటం తగ్గించి… వేగంగా వెళుతుంది. భద్రంగా ఉంటుంది అని ఆర్టీసీవైపు వచ్చేస్తున్నాయ్ పార్శిళ్లన్నీ ! అందుకే మాంఛి రిజల్ట్ కనిపిస్తోంది. ఇంకా కొన్ని మార్పులు చేస్తామని ముందు ముందు మరింత ఆదాయం రాబోతోందని ఆర్టీలీ లెక్కేస్తోంది. గత ఏడాదిలో ఆర్టీసీ రోడ్డెక్కించిన మూడో కొత్త ఐడియా ఇది. మొదట స్పెషల్ యాప్, సీజన్ల వారీగా సీట్ల వారీగా బుక్కింగ్ లో రాయితీలు. రెండోది బస్టాండుల్లో మినీ ప్లెక్స్ లు. ఖాళీగా ఉన్న జాగాల్ని కమర్షియల్ పాగాలు మార్చుకునేందుకు ఆర్టీసీ తిరుగులేని ఐడియా వేసే సరికి తెలంగాణ లాంటి రాష్ట్రాలు మనల్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమయ్యాయ్. ఇపుడు సరుకు రవాణాతో హ్యాట్రిక్ సక్సెస్. అందుకే అంటున్నది… ఆలోచన ఉంటే ఎలాంటి అవరోధాలు అయినా అధిగమించొచ్చు అని. ఆర్టీసీ మరోసారి ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ అనిపిస్తోంది.
MVS Posted July 11, 2016 Posted July 11, 2016 Courier vallu easy ga upayoginchukovachu apsrtc parcel service
youtube Posted July 11, 2016 Posted July 11, 2016 Labhaallo APSRTC ani eppudu chaduvutaano? Hope soon..
sonykongara Posted July 11, 2016 Author Posted July 11, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/353990-apsrtc-cargo-service/
sonykongara Posted August 1, 2016 Author Posted August 1, 2016 పార్శిల్’తో రూ.6 కోట్ల ఆదాయం త్వరలో ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు..ఇంటి వద్దకే కొరియర్: శిద్దా అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన పార్శిల్ సేవల ద్వారా మూడునెలల్లో రూ.6కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ పార్శిల్ సేవలను రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్‌కు విస్తరిస్తామన్నారు. ఇప్పటివరకూ బస్టాండ్‌కే పరిమితమైన కొరియర్ సేవలను.. వినియోగదారుల ఇంటికే చేర్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు. మరో రెండు నెలల్లో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ సర్వీసు ద్వారా 6 నుంచి 24 గంటల్లోపు కొరియర్ చేరుతుందన్నారు.
MVS Posted August 1, 2016 Posted August 1, 2016 పార్శిల్’తో రూ.6 కోట్ల ఆదాయం త్వరలో ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు..ఇంటి వద్దకే కొరియర్: శిద్దా అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన పార్శిల్ సేవల ద్వారా మూడునెలల్లో రూ.6కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ పార్శిల్ సేవలను రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్‌కు విస్తరిస్తామన్నారు. ఇప్పటివరకూ బస్టాండ్‌కే పరిమితమైన కొరియర్ సేవలను.. వినియోగదారుల ఇంటికే చేర్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు. మరో రెండు నెలల్లో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ సర్వీసు ద్వారా 6 నుంచి 24 గంటల్లోపు కొరియర్ చేరుతుందన్నారు. </p> Ivi Anni Kiran Kumar reddy 3years mundu chepinavi anta
srinivasulu pokuri Posted August 1, 2016 Posted August 1, 2016 Ivi Anni Kiran Kumar reddy 3years mundu chepinavi anta Annai.... Anni pattinchukuntava... Konni comments chusi vadileyyali....
Guest Urban Legend Posted August 1, 2016 Posted August 1, 2016 పార్శిల్’తో రూ.6 కోట్ల ఆదాయం త్వరలో ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు..ఇంటి వద్దకే కొరియర్: శిద్దా అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన పార్శిల్ సేవల ద్వారా మూడునెలల్లో రూ.6కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ పార్శిల్ సేవలను రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్‌కు విస్తరిస్తామన్నారు. ఇప్పటివరకూ బస్టాండ్‌కే పరిమితమైన కొరియర్ సేవలను.. వినియోగదారుల ఇంటికే చేర్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు. మరో రెండు నెలల్లో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ సర్వీసు ద్వారా 6 నుంచి 24 గంటల్లోపు కొరియర్ చేరుతుందన్నారు. more profits soon very good going aps rtc ....
Vivaan Posted August 1, 2016 Posted August 1, 2016 It is a very good idea. APSRTC are setting an example for sure.
sonykongara Posted September 1, 2016 Author Posted September 1, 2016 పార్శిల్స్ ఇంటికే చేర్చాలి డిపో వరకే పరిమితమైతే కష్టం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర రవాణ సంస్థ (ఏపీఎస్పార్టీసీ)ను నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు ప్రారంభించిన పార్శిల్ సేవలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం డిపోల వరకే పరిమితమైన సేవలను వినియోగదారుడి ఇంటి వరకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. మూడు నెలల క్రితం ఆర్టీసీలో ప్రవేశ పెట్టిన కొరియర్, పార్శిల్ సేవలు సామాన్యుడి చెంతకు ఎలా చేరుతున్నాయన్న అంశంపై బుధవారం ఆయన విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో సమీక్షించారు. ‘‘మన పార్శిల్ సేవలు డిపో వరకే పరిమితం అవుతున్నాయి. ఇలా అయితే వినియోగదారులను ఆకర్షించడం కష్టం. సరుకులను నేరుగా వినియోగదారుడి ఇంటికే చేర్చగలిగినప్పుడే సామాన్యుడి నుంచి మంచి స్పందన వస్తుంది’’ అని అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, జీపీఎస్ వ్యవస్థ ద్వారాకార్గో వాహనాలను ట్రాక్ చేయాలని ఆదేశించారు. విశాఖప ట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ప్ర యోగాత్మకంగా త్వరలో ట్రాకింగ్ విధానాన్ని ప్రారంభించాలన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now