sonykongara Posted September 6, 2017 Author Posted September 6, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/topic/410740-panta-sanjeevanilatest-photos/
sonykongara Posted December 8, 2018 Author Posted December 8, 2018 పంటకుంటల్లోనూ ఏపీ ఫస్ట్!08-12-2018 03:24:12 దేశవ్యాప్తంగా తొలి 10 జిల్లాల్లో 8 మనవే టాప్‌లో చిత్తూరు, అనంతపురం ఐదేళ్లలో 5.84 లక్షల కుంటలు పూర్తి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడి అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో దేశంలో మేటిగా ఉన్న ఏపీ వివిధ రకాలైన నీటి సంరక్షణ పనుల్లోనూ అగ్రగామిగా ఉంది. దేశ వ్యాప్తంగా ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పంటకుంటల నిర్మాణంలో కేంద్రం ప్రకటించిన జిల్లాల జాబితాలో మొదటి 10 జిల్లాల్లో 8 ఏపీకే చెందినవి కావడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించిన జిల్లాల్లో చిత్తూరు 1,00,612 పంటకుంటలు తవ్వి రికార్డు సాధించింది. ఆ తర్వాత అనంతపురం 1,00,336తో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా కడప 75,527, ప్రకాశం 69,171, విజయనగరం 59,158, కర్నూలు 52,384 నిలిచాయి. 9వ స్థానంలో విశాఖపట్నం 28,471, 10వ స్థానంలో నెల్లూరు 25,816 పంటకుంటలు తవ్వాయని కేంద్రం ప్రకటించింది. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకే.. మన దేశంలో మొత్తం సాగు భూమిలో 68ు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. పంటల దిగుబడిలో 43ు వరకు ఉంది. ఏపీలో 67.19 లక్షల హెక్టార్ల సాగు భూమిలో సుమారుగా 39.11 లక్షల హెక్టార్లు వర్షాధారం కిందే ఉంది. క్రమంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తుఫానులు, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతాంగం నష్టాలపాలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెట్ట సాగు ముందుకు సాగాలంటే వర్షపు నీటి వినయోగ సామర్థ్యాన్ని పెంచడం చాలా అవసరం. దీనిలో భాగంగా ప్రతి రైతు తనకున్న పొలంలోనే నిర్ణీత పరిమాణంలో నీటి కుంట ఏర్పాటు చేసుకుంటే అధిక వర్షపాతం వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రదేశం నుంచి వచ్చి చేరే నీటిని తర్వాత రోజులలో పంట అవసరాలకు ఉపయోగించుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా పంట కాలంలో కురవాల్సిన వర్షపాతం కొన్ని రోజుల్లోనే కురిసి, మిగిలిన సమయంలో 10 నుంచి 40 రోజుల వరకు కూడా వర్షాభావ పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో పంటలకు సున్నిత దశలలో రక్షిత తడులు ఇవ్వడం వల్ల 20-30ు వరకు దిగుబడి పెరిగే వీలుంటుంది. పండ్ల తోటల్లో బెట్ట పరిస్థితుల్లో రక్షక తడిగా, పశువులకు, గొర్రెలకు అత్యవసర సమయంలో తాగునీరుగా ఉపయోగపడుతోంది. కందిని అంతర పంటగా వేరుశనగలో విత్తడం వల్ల మూడు తడులు ఈ నీటిని ఉపయోగించి నికరాదాయం పెంచుకున్నారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పంటకుంటల తవ్వకం రికార్డు స్థాయిలో చేపట్టడానికి సీఎం చంద్రబాబు నిరంతర సమీక్షలే కారణమని అధికారులు చెబుతున్నారు. వర్షాభావం ఉన్న జిల్లాల్లో ఈ పంటకుంటలు సాగుకు సంజీవనిగా మారతాయని, ఈ పథకానికి పంట సంజీవనిగా నామకరణం చేశారు. దేశ వ్యాప్తంగా 16.68 లక్షల పంటకుంటలను తవ్వితే మన రాష్ట్రంలోనే అక్టోబరు నాటికి 5.84 లక్షల పంటకుంటలు తవ్వారు. 2014-15లో 6,277 పంటకుంటలు తవ్విన తర్వాత వాటి అవసరాలను గుర్తించి సంఖ్యను పెంచారు.
Yaswanth526 Posted December 8, 2018 Posted December 8, 2018 Lokesh NaraVerified account @naralokesh Amazing work by Chittoor district to go past Anantapur district in terms of the highest number of farm ponds dug in the Country. Super proud of my team for being the force behind 8 districts featuring amongst the top 10 in the Country! Keep the good work coming!!
kraghuveera Posted December 9, 2018 Posted December 9, 2018 I got 2 ponds sanctioned last week for my farm.
Yaswanth526 Posted December 9, 2018 Posted December 9, 2018 Just now, kraghuveera said: I got 2 ponds sanctioned last week for my farm. After finish pics pettu bro
Nfan from 1982 Posted December 9, 2018 Posted December 9, 2018 1 hour ago, kraghuveera said: I got 2 ponds sanctioned last week for my farm. What’s the meaning of this brother
kraghuveera Posted December 9, 2018 Posted December 9, 2018 I applied for2 farm ponds to be dug in my farm. It was sanctioned last week.
Nfan from 1982 Posted December 9, 2018 Posted December 9, 2018 49 minutes ago, kraghuveera said: I applied for2 farm ponds to be dug in my farm. It was sanctioned last week. Will you get any benefit from the government brother?@kraghuveera
Nfan from 1982 Posted December 9, 2018 Posted December 9, 2018 15 hours ago, Yaswanth526 said: Lokesh NaraVerified account @naralokesh Amazing work by Chittoor district to go past Anantapur district in terms of the highest number of farm ponds dug in the Country. Super proud of my team for being the force behind 8 districts featuring amongst the top 10 in the Country! Keep the good work coming!! This is an incredible achievement by our state ???
kraghuveera Posted December 9, 2018 Posted December 9, 2018 53 minutes ago, Nfan from 1982 said: Will you get any benefit from the government brother?@kraghuveera The ponds will be dug by the govt. Zero cost to the beneficiary. Pond size will be 50×50×7 feet.
TDPforever Posted December 9, 2018 Posted December 9, 2018 4 hours ago, kraghuveera said: I got 2 ponds sanctioned last week for my farm. Hi How big or how many ponds can be applied for if I have 20 acres under two names.(two owners)
kraghuveera Posted December 9, 2018 Posted December 9, 2018 Under each name you can get only one pond irrespective of no. Of acres. Size is 50×50×7 feet. Work will be done by MNREGA groups.this u will have to apply through velugu office in u r mandal. E passbook and aadhar card only required. If u require bigger size u will have to apply thro HORTICULTURAL DEPT. U can have pond sizes from 1 acre and above. Approx cost for 1 acre size pond with sheets is 25L. This u have to do it u r self and GOVT will reimburse in stages. Normally the reimbursement will be about 85% only. Another method is community farm pond.u will have to form a group of 5 farmers with a total collective farm holding of 25 acres .
kraghuveera Posted December 9, 2018 Posted December 9, 2018 If one pond is not sufficient for u then u can find a farmer in u r panchayat limits and apply in his name. And then manage the field officer and get it dug in u r farm. This is possible since GEO TAGGING is not being done now.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now