Jump to content

ITC Guntur


Recommended Posts

గుంటూరులో ఐటీసీ తొలి అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రం
 
636204906909479653.jpg
  • తుది దశకు చేరుకున్న భవన నిర్మాణాలు 
  • రెండు వేల మందికి ఉపాధి 
  • ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
గుంటూరుకు తొలి అంతర్జాతీయ వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రం రాబోతోంది. ఇండియన్‌ టుబాకో కంపెనీ (ఐటీసీ) గుంటూరు కేంద్రంగా దేశం మొత్తానికి వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులు ఎగుమతులు చేయబోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అగ్రి బిజినెస్‌ డివిజన్‌ (ఎబిడి) ప్రధాన కార్యాలయాన్ని గుంటూరు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు జీటీ రోడ్డులో ఉన్న ఐటీసీ కార్యాలయాన్ని విస్తరిస్తున్నారు. ఈ పనులు చివరి దశకుచేరాయి. ఏప్రిల్‌ లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి జూన్‌లోపు గుంటూరు కేంద్రంగా పని చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ సంస్థలో 2వేల మందికి ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న 800 మంది ఉద్యోగులు గుంటూరు రాబోతున్నారు. ఎగుమతి కేంద్రంతో పాటు ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణపనులు చురుగ్గా సాగుతున్నాయి. రింగురోడ్డులోని హోటల్‌ పనులు పూర్తైతే మరో 500 మందికి ఉపాధి లభిస్తుంది.
 
రూ.700 కోట్లతో నిర్మాణాలు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పొగాకు, సిగరెట్లు, ఇతర అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులకు గుంటూరు కేంద్రంగా ఉంది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులను హైదరాబాద్‌ కేంద్రంగా ఎగుమతి చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాన్ని గుంటూరు మార్చాలని ఐటీసీ నిర్ణయించింది. దీనితో రూ.700 కోట్లతో ఇక్కడ మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నారు. రింగురోడ్డులో ఉన్న ఐటీసీ అతిథి గృహాన్ని తొలగించి దాని స్థానంలో రూ.220 కోట్లతో 12 అంతస్తులతో అంతర్జాతీయ స్థాయిలో 300 రూములతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం ఐటీసీ చైర్మన్‌ దేవేశ్వర్‌, సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. ఐటీసీ కార్యాలయం, సిబ్బంది నివాస గృహాలను తొలగించి వాటి స్థానంలో సుమారు రూ.380 కోట్లతో 12 అంతస్తులతో పరిపాలన కార్యాలయం, సిబ్బంది నివాస గృహాలను నిర్మించారు.
 
20 రకాల ఉత్పత్తుల ఎగుమతులు
ఐటీసీ ఇప్పటివరకు గుంటూరు నుంచి పొగాకు, సిగరెట్లు, బర్లి పొగాకు ఎగుమతులు చేస్తోంది. ఇకనుంచి మిర్చి, పసుపు, జిలకర, గోధుమ, రొయ్య, సోయాబీన్‌, కాఫీ, వరి, ఇతర పంటలు, పండ్లు జామ, మామిడి, పైనాపిల్‌, ఆరెంజ్‌, ద్రాక్ష, నేరేడు, ఇతర పండ్ల రసాలు, పండ్లు, పూలు ఎగుమతులు చేస్తారు. దీనికి అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులు రూ.25వేల కోట్లకు పెంచాలని ఐటీసీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
గుంటూరు ఐటీసీ సంస్థల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. రూ.20 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడే దీన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే అగ్రి బిజినెస్‌ డివిజన్‌ (ఏబీడీ) సంస్థకు చెందిన ఎక్కువ మంది అధికారులు, ఉద్యోగులు గుంటూరు చేరుకున్నారు. సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగాల్లోని నిపుణులు అంతర్జాతీయ ఎగుమతులను పర్యవేక్షిస్తున్నారు.
 
మారనున్న గుంటూరు రూపురేఖలు
ఐటీసీ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల కేంద్రం పని ప్రారంభిస్తే గుంటూరు రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే ఐటీసీ, టుబాబో బోర్డు, ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌ (ఐటీఏ) కార్యాలయం, ఆంధ్రాబ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం ఈ రోడ్డులో ఉన్నాయి. ఇటీవల ఈ రోడ్డులో ఆక్రమణలను తొలగించి నాలుగు లైన్లుగా విస్తరించారు. 2017 ఖరీఫ్‌ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు గుంటూరు నుంచే చేస్తామని ఐటీసీ ప్రతినిధులు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...

@sonykongara,

 

ITC vadiki always main business capital guntur plus vadu gorwth lo major part ..kani inta kalam combined state lo vadu mottam Hyd lo pettadu...

State vidi pogane mana Guntur lo complex start chesadu along with 5 star hotel.

 

Adi fast ga chestunadu with Guntur as Major agri capital. Pai photo lodi Hindu college daggara.

Link to comment
Share on other sites

@sonykongara,

 

ITC vadiki always main business capital guntur plus vadu gorwth lo major part ..kani inta kalam combined state lo vadu mottam Hyd lo pettadu...

State vidi pogane mana Guntur lo complex start chesadu along with 5 star hotel.

 

Adi fast ga chestunadu with Guntur as Major agri capital. Pai photo lodi Hindu college daggara.

ohh anthe ga bro,ITC vadu malli debba vesaduemo anukunna.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 3 months later...
రాజధానిలో ఐటీసీ పేపర్‌ మిల్లు

636415817070180219.jpg


గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఐటీసీ పేపర్‌ మిల్లు ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటి వరకు భద్రాచలం కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీసీ పేపర్‌ మిల్లు ఉంది. విభజన తరువాత నవ్యాంధ్రలోని 13 జిల్లాలకు గుంటూరు కేంద్రంగా ఐటీసీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నవ్యాంధ్రలోని 13 జిల్లాలో ఐటీసీ పేపర్‌ సరఫరా కోసం సీఆర్‌ఈఏ పరిసర ప్రాంతాల్లో మిల్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేసినట్లు అదికారులు తెలిపారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే వెంటనే పేపర్‌ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని దరఖాస్తు చేసినట్లు ఐటీసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వం స్థలం కేటాయించకపోతే గుంటూరు - విజయవాడ వయా మంగళగిరి రోడ్డుకు రెండు వైపులా ఏదో ఒక ప్రాంతంలో పేపర్‌ మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ పేపర్‌ మిల్లులో సుమారు 300 మందికి ఉద్యోగాలు వస్తాయని ఐటీసీ ప్రతినిధులు తెలిపారు.

Link to comment
Share on other sites

చిత్తూరులో ఐటిసి డెయిరీ
 
 
గుంటూరు (ఆంధ్రజ్యోతి): భిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటిసి లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో డెయిరీని నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. ఐటిసి ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో డెయిరీలను నిర్వహిస్తోంది. సంస్థ ఇప్పటికే గుంటూరు కేంద్రంగా అగ్రి ఎక్స్‌పోర్ట్‌ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా దీనికి అనుబంధంగా పాల డెయిరీని స్థాపించాలని నిర్ణయించినట్లు ఐటిసి అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా స్థల సేకరణను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని చూస్తున్నట్లు వారు తెలిపారు. డెయిరీ ప్లాంట్‌తో అనుబంధ ఉత్పత్తులను కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఐటిసి అధికారులు వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 months later...
గుంటూరులో అంతర్జాతీయ స్థాయి ఐటీసీ ల్యాబ్‌
14-01-2018 09:22:04
 
636515185221252396.jpg
  • ఆరుగురు పీహెచ్‌డీలతో పరీక్షలు
  • నాణ్యత, కల్తీలు, నకిలీల నిర్ధారణ
గుంటూరు,(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల నాణ్యత, నకిలీలు, కల్తీలను నిర్ధారించడానికి ఐటీసీ రూ. 100 కోట్లతో ల్యాబ్‌ ఏర్పాటు చేసింది. చుట్టుగుంట సెంటర్‌ - మస్తాన్‌ దర్గా జీటీ రోడ్డులో ఈ సంస్థ అధునాతన సౌకర్యాలతో జాతీయస్థాయిలో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రూ. 500 కోట్లతో పది అంతస్తులతో నిర్మించిన కార్యాలయం కార్యకలాపాలను ప్రారంభించింది. దీనిలో భాగంగానే రూ. 100 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్‌ను నిర్మించారు. ఆరుగురు పీహెచ్‌డీలు, పది మంది ఎమ్మెస్సీ కెమిస్ర్టీ, మరికొంత మంది ఉన్నత విద్యావంతులను దీనిలో నియమించారు. నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ లేబరేటరీ (ఎన్‌ఏబీసీ)ని కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశారు.
 
అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలు
ఈ ల్యాబ్‌లో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులలో అన్ని రకాల పరీక్షలు చేస్తారు. ప్రధానంగా నాణ్యత, కల్తీ, నకిలీలను గుర్తిస్తారు. పొగాకు, మిర్చి, పసుపు, పాలు, చేపలు, సోయాబీన్‌, గోధుమ, మామిడి, చిరుధాన్యాలు, అపరాలు, వేరుశనగల్లో రసాయనిక అవశేషాలను నిర్ధారిస్తారు. కూరగాయలు, పండ్లలో రసాయనిక అవశేషాలను కనుగొనేందుకు సూడాన్‌ పరీక్షలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు తమ పరిధిలోని వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులను ఇక్కడ పరీక్ష చేయించుకునే అవకాశం కల్పించారు. విభజన తరువాత హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న వ్యవపాయ ఎగుమతి కేంద్రాన్ని ఐటీసీ గుంటూరు మార్చింది.
 
పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ఎగుమతులను ఇప్పటి వరకు గుంటూరు కేంద్రంగా సంస్థ నిర్వహించింది. ప్రధానంగా పొగాకు బోర్డు గుంటూరులో ఉండడం వలన ఐటీసీ ఎగుమతులను కూడా ఇక్కడ నుంచే చేపట్టింది. జాతీయ స్థాయిలో సంస్థ ఎగుమతుల్లో 60-70 శాతం పొగాకు, అనుబంధ ఉత్పత్తుల ద్వారానే ఉంది. దీనితో పాటు గుంటూరులో మిర్చి యార్డు, స్పైసెస్‌ పార్క్‌, స్పైసెస్‌ బోర్డు కార్యాలయం, దుగ్గిరాల పసుపు యార్డు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
 
దీంతో పాటు గన్నవరం విమానాశ్రయానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాల సంఖ్య పెరిగింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని గుంటూరులోనే వ్యవసాయ ఎగుమతుల కేంద్రం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.ఈ ల్యాబ్‌లో ఎవరైనా తమ ఉత్పత్తులను పరీక్ష చేయించాలంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా గుంటూరు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. వివరాల కోసం 7702486788 నంబరులో సంప్రదించాలన్నారు.
Link to comment
Share on other sites

  • 3 months later...
  • 1 month later...
  • 5 months later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...