sonykongara Posted February 19, 2019 Author Posted February 19, 2019 దశదిశలా.. కొండవీడు ఖ్యాతి19-02-2019 08:20:43 అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. పర్యాటక రంగానికి ప్రాధాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండవీడు ఘాట్ రోడ్డు ప్రారంభం నగర వనానికి శంకుస్థాపన చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర అధ్యయనం చేయడంతోపాటు కొండవీడు అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ, మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్, అటవీ, పర్యాటక శాఖాధికారులను ఆదేశించారు. కొండవీడు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఘాట్‌రోడ్డు, నగరవనాన్ని ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే కొండవీడు, కొండపల్లి, కోటప్పకొండ.. ఇలా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. నిన్న మొన్నటివరకు పుస్తకాలు, సినిమాలకే పరిమితమైన కొండవీడు చరిత్రను భావితరాలకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా సమయంలో కొండవీడు గురించి బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఒకప్పుడు నడవడానికి కూడా వీలులేని ప్రదేశమైన కొండవీడుపైకి నేడు చక్కగా సందర్శకులు, పర్యాటకులు వెళుతున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వబట్టేనన్నారు. కొండవీడు కొండపై మ్యూజియం, ఆడిటోరియం, జంతు ప్రదర్శనశాల, రోజూ లైట్ అండ్ సౌండ్, రోప్‌వే, చారిత్రక దేవాలయాల అభివృద్ధి, వృక్షసంపద పరిరక్షణకు బొటానికల్ గార్డెన్, స్టార్ హోటల్, పర్యాటకులకు అవసరమైన తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. కొండవీడుపై పురాతన సంపద పరిరక్షణకు సెక్యూరిటీ, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకునేవిధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కొండవీడు కొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్ట్ నిర్మించేందుకు గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి ముందుకు రావడం సంతోషంగా ఉన్నదని ఆయనను అభినందించారు సర్వీస్ సెక్టార్‌లోని అన్ని రంగాలను అభివృద్ధిచేసి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తున్నామన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక కొండ దిగువన సభా వేదికపై భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత యల్లా వెంకటేశ్వరరావు బృందంతో మృదంగ వాద్యం వీనులవిందు చేసింది. ప్రఖ్యాత మెజీషియన్ బీఎస్ రెడ్డి ప్రదర్శన ఆకట్టుకుంది. భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ విజయభాస్కర్, ఏపీ నాటక అకాడమీ వైస్‌చైర్మన్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావులు పర్యవేక్షించారు. ఆవిష్కరణలు.. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పురా వస్తుశాఖ రూపొందించిన కొండవీడు చరిత్ర డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. ఈమని శివనాగిరెడ్డి, శివారెడ్డిలు రూపొందించిన కొండవీటి వైభవం, కొండవీటి సామ్రాజ్యం, కొండవీటి కైఫియత్‌ల పుస్తకాలను ఆవిష్కరించారు. కొండవీడు ఉత్సవంతోపాటు అభివృద్ధి పనులకు కృషి చేసిన పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్, పర్యాటకశాఖ జేడీ మల్లిఖార్జునరావు, జిల్లా అటవీశాఖాధికారి మోహనరావు, ఘాట్ రోడ్డు కాంట్రాక్టర్‌ను అభినందించి జ్ఞాపికలు అందించారు. పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి జ్ఞాపిక బహుకరించారు. కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, టీడీపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఏపీ గ్రంథాలయ పరిషత్ చైౖర్మన్ దాసరి రాజామాస్టారు, జడ్పీ చైౖర్‌పర్సన్ జానీమూన్, క్రిష్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మ్యానీ, పర్యాటక శాఖ ఎండీ ధనుంజయరెడ్డి, శివనాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, రాయపాటి శ్రీనివాస్, రాయపాటి రంగారావు, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్‌కృష్ణ, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తదితర నాయకులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. కొండవీడుకోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం రూ.90కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికి రూ.60కోట్లతో పనులు పూర్తి చేశాం. ముఖ్యమంత్రి సహకా రంతో దశల వారీగా కొండవీడును మరింతగా అభివృద్ధి చేస్తాం. - ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మం
Yaswanth526 Posted February 19, 2019 Posted February 19, 2019 గుంటూరు జిల్లాలో ఎంతో ఘనమైన చరిత్రగల కొండవీడు కోట ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 34కోట్ల వ్యయంతో నిర్మించిన కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించారు.పలుఅభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, నూతనంగా నిర్మించనున్న కొండవీడు నగర వనానికి శంకుస్థాపన చేశారు. కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేసి, కొండవీడు సామ్రాజ్యం, వైభవం, కైఫీయత్ పుస్తకాలను ఆవిష్కరించారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులు, కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు. కొండవీడు కోటను మరింత ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చాలనే ధృడసంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే రూ. 90కోట్లను కేటాయించడం జరిగింది, అందులో భాగంగా రూ. 60కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
AnnaGaru Posted March 2, 2019 Posted March 2, 2019 (edited) 56 minutes ago, sonykongara said: CBN govt e project ayina timeline lo chestundi.....adi cheppukoleni tanam mana leaders di... Edited March 2, 2019 by AnnaGaru
Bleed_Blue Posted August 4, 2024 Posted August 4, 2024 Kondaveedu actual history ni pettali musueum lo...adedo Reddylight kingdom anukuntaru...that was ruled by kamma kings later occupied by reddylights
sonykongara Posted January 27 Author Posted January 27 చారిత్రక ఆనవాళ్లు.. కొండంతా అందాలు పల్నాడు జిల్లా కొండవీడు కోట ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. కొండవీడును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ప్రగతి పట్టాలెక్కనుంది. రాజధాని అమరావతికి 50 కి.మీ., గుంటూరుకు 27 కి.మీ.దూరంలో ఉన్న కొండవీడు కొండలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. By Andhra Pradesh Dist. DeskPublished : 27 Jan 2025 05:01 IST Ee Font size సెలవు రోజుల్లో సందర్శకుల సందడి ఈనాడు, గుంటూరు ఘాట్‌రోడ్ ఇలా.. పల్నాడు జిల్లా కొండవీడు కోట ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. కొండవీడును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ప్రగతి పట్టాలెక్కనుంది. రాజధాని అమరావతికి 50 కి.మీ., గుంటూరుకు 27 కి.మీ.దూరంలో ఉన్న కొండవీడు కొండలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో ఆ ప్రాంతం పర్యాటకులతో సందడిగా ఉంటోంది. కొండవీడును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం నిధులు కేటాయించింది. కొండవీడు నగరవనం పేరుతో కోట పరిసరాలు అభివృద్ధి చేసింది. సమగ్ర ప్రణాళిక రూపొందించి కొండువీడుని సందర్శన కేంద్రంగా రూపొందించారు. కొండపైకి చేరుకునేందుకు రూ.48 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మించారు. పర్యాటకులు సేదతీరేలా అటవీశాఖ సౌకర్యాలు కల్పించింది. 80కి పైగా కట్టడాలు కొండ చుట్టూ రాజుల కాలంలో నిర్మించిన రాతిగోడ, కోట బురుజులు, ఆలయాలు, అద్భుతమైన శిల్పాలు అబ్బురపరుస్తున్నాయి. శత్రువుల నుంచి రక్షణ కోసం అప్పటి రాజులు చుట్టుపక్కల ప్రాంతాల్లో 80కిపైగా కట్టడాలు నిర్మించారు. వాటిలో కొండవీటి దుర్గం అతిపెద్దది. కొండమీద నరసింహస్వామి ఆలయంతో పాటు శివాలయం ఉంది. రెండు మసీదుల్లో ఒకటి శిథిలమైంది. కోటకు సంబంధించి ఇప్పటికీ 44 బురుజులు, 32 ప్రాకారాలు రెండు ధాన్యాగారాలు, దేవాలయాలు తదితరాలు చారిత్రక ఆనవాళ్లుగా మిగిలాయి. అప్పట్లో తాగునీటి అవసరాల కోసం కొండపైనే తవ్విన మూడు చెరువులు అలాగే ఉన్నాయి. కత్తుల బావి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. వెదుళ్లచెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రెక్కింగ్ నిర్వహించాలన్న యోచనలో పర్యాటకశాఖ ఉంది. కొండపైకి వెళ్లే దారిలో పర్యాటక శాఖ ఆకర్షణీయంగా ముఖద్వారం నిర్మించింది. పర్యాటకులకు మరిన్ని కుటీరాలు నిర్మించాలి. తాగునీటి సౌకర్యం మరిన్ని ప్రాంతాల్లో కల్పించాలి. అల్పాహారం లభించేలా చూడాలి. పర్యాటకుల బసకు ఏర్పాట్లు చేయాలి. కొండపైన ప్రాంతాలు చూసేలా బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలి.
sonykongara Posted May 13 Author Posted May 13 కేంద్రమంత్రి షెకావత్‌తో ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి భేటీ.. కొండవీడుకోటపై చర్చ కొండవీడుకోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. By Andhra Pradesh News TeamPublished : 13 May 2025 19:46 IST Ee Font size 1 min read దిల్లీ: కొండవీడుకోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం దిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ అయ్యారు. పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రికి ప్రత్తిపాటి వివరించారు. ‘‘2018లో రూ.40కోట్లతో కొండవీడు కోటకు ఘాట్ రోడ్డు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దీన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చవచ్చు. కోటకు ఇన్‌క్రెడిబుల్ ఇండియా, దేఖో అప్నా దేశ్ విభాగాల్లో ప్రచారం చేయాలి’’అని విజ్ఞప్తి చేశారు. అన్ని వివరాలు తెలుసుకొన్న కేంద్ర మంత్రి.. కొండవీడు కోటను ప్రపంచ వారసత్వ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now