Jump to content

kondaveedu fort and golden temple


Recommended Posts

  • Replies 192
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4 weeks later...
స్వర్ణహంస.. నత్తనడక!
 ప్రతిష్ఠాత్మక ఇస్కాన్‌  ప్రాజెక్టుకు అవరోధాలు
 గ్రావెల్‌ అందకపోవడంతో  మందకొడిగా పనులు
gnt-top2a.jpg
స్వర్ణహంస మందిరం నిర్మాణంతో పర్యటకంగా జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది.. ఇస్కాన్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం.. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు చెప్పిన మాటలవీ
యడ్లపాడు, న్యూస్‌టుడే
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) కొండవీడులో నిర్మించతలపెట్టిన స్వర్ణహంస మందిరం నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. మొదట్లో స్థలం కేటాయింపు విషయమై ఎన్నో అవాంతరాలు  ఎదురయ్యాయి.. ఎట్టకేలకు నిర్మాణ పనులు మొదలైతే గ్రావెల్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అనుమతులు ఇచ్చే విషయంలో అధికారగణం పట్టించుకోకపోవడంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనుల్లో జాప్యం అనివార్యమైంది.  వెన్నముద్దల వేణుగోపాలస్వామి కొలువైన యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలో ఇస్కాన్‌ రూ.వందల కోట్ల వ్యయంతో స్వర్ణహంస మందిరం నిర్మాణానికి 2015 విజయదశమి నాడు శంకుస్థాపన చేశారు. తొలుత భూ కేటాయింపులు జరగకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఎట్టకేలకు గత ఏడాది పనులు ఊపందుకున్నాయి. అయితే నిర్మాణ పనుల్లో గ్రావెల్‌ కొరత వేధిస్తోంది. పునాది నిర్మాణ పనుల అనంతరం ఆలయ ప్రాంగణం ఎత్తు పెంచడానికి అవసరమైన గ్రావెల్‌ను అందించాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమకూర్చలేదు. ఆలయ నిర్మాణానికి కేటాయించిన భూమి పల్లంగా ఉండటంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆలయాన్ని 13 అడుగుల ఎత్తులో నిర్మించాలని ఇస్కాన్‌ ప్రణాళికలు రూపొందించింది. ఆమేరకు గతేడాది ఆలయ నిర్మాణానికి పునాదులు తవ్వి పనులను మొదలు పెట్టారు. తవ్విన పునాదులు పూడ్చడానికి గ్రావెల్‌ అవసరమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గతంలో ఆలయ నిర్మాణ పనులు సందర్శించిన సమయంలో విన్నవించుకున్నారు. మంత్రి సిఫార్సుతో అధికారులు చెంఫీˆుజ్‌ఖాన్‌పేట, కొత్తపాలెం గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకానికి అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఇస్కాన్‌ ప్రతినిధులు గ్రావెల్‌ తరలింపునకు సొంత నిధులు వెచ్చించి టిప్పర్లు, యంత్రాలు సమకూర్చారు. ప్రాంగణం మధ్యలో నిర్మిస్తున్న రెండు ప్రధాన మందిరాల పునాదులను గ్రావెల్‌తో పూడ్చారు. వర్షాల కారణంగా గ్రావెల్‌ తరలింపు అంతటితో ఆగింది. అనంతరం గ్రావెల్‌ తరలింపునకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలోనే భారీ గుంతను తవ్వి కొంతమేర మెరక చేయడానికి గ్రావెల్‌ సమకూర్చుకున్నారు.

వందల టిప్పర్ల గ్రావెల్‌ అవసరం
ఆలయ ప్రాంగణంలో నిర్మించే ఆడియో, వీడియో విజువల్‌ థియేటర్స్‌, చుట్టూ ఉన్న 108 మండపాలను ప్రధాన ఆలయాల ఎత్తుకు సమాంతరంగా ఉండాలంటే మరో ఆరు అడుగుల మెరక తోలాల్సి ఉంది. అందుకు వందల టిప్పర్ల గ్రావెల్‌ అవసరమవుతుందని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చెరువులు లేదా క్వారీల్లో గ్రావెల్‌ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ఏడాది కాలంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా, వారి నుంచి స్పందన లేదని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న 108 మండపాలు, ఆడియో, వీడియో విజువల్‌ థియేటర్స్‌ నిర్మాణ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రావెల్‌ పూర్తిస్థాయిలో అందితే ప్రధాన ఆలయం నిర్మాణం వెనువెంటనే పూర్తిచేస్తామని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

ఎన్నో కష్టాలను ఓర్చుకుంటున్నాం
భూమి లోతట్టుగా ఉండటంతో గ్రావెల్‌ అవసరం ఎంతో ఉంది.. గ్రావెల్‌ సకాలంలో అందితే పనులు వెనువెంటనే చేసేందుకు అవకాశం ఉంటుంది. వర్షం వస్తే ట్రాక్టర్లు తిరిగేందుకు అవకాశం లేక పనులు ముందుకు సాగడం లేదు. ఎంతో శ్రమకోర్చి పనులు చేపడుతున్నాం. మా కష్టాలను తక్షణం పాలకులు, అధికారులు గుర్తించి గ్రావెల్‌కు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం.

- వేణుధారిదాస్‌, పనులు పర్యవేక్షిస్తున్న ఇస్కాన్‌ ప్రతినిధి
పూర్తి సహకారం అందిస్తాం
నేను ఇటీవల బాధ్యతలు చేపట్టాను. ఇస్కాన్‌ ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులు నాదృష్టికి రాలేదు. దైవ కార్యక్రమానికి నా వంతు సహకారం అందిస్తాను. తక్షణం పరిశీలించి అనుమతులు జారీకి చర్యలు తీసుకుంటాను.
- కె. శ్రీనివాసరావు, ఆర్డీవో, నరసరావుపేట
అందరి సహకారం కోరుతున్నాం
కొండవీడు ప్రాంత చారిత్రక విశిష్టత, ఈ ప్రాంతంతో కృష్ణ భగవానుడికి ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్కాన్‌ ప్రాజెక్టును ఇక్కడ చేపట్టాం. ఇటీవల దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా కృష్ణభక్తుల నుంచి నిధులు మందకొడిగా వస్తున్నాయి. అయినప్పటికీ సంకల్పబలంతో ఆలయ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాం. కొండవీడు ప్రాంతంలో ఇంతటి భారీ ప్రాజెక్టు చేపడితే అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో సహకారం ఆశించాం. ప్రజలకు మేలు చేసే కీలకమైన ఈప్రాజెక్టుకు సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం.
-  సత్యగోపీనాథ్‌దాస్‌, దక్షిణ భారతదేశ ఇస్కాన్‌ అధ్యక్షుడు
 
 

 

Link to comment
Share on other sites

  • 1 month later...
రూ. 3కోట్లతో ఘాట్‌రోడ్డుకు విద్యుత్‌
10-11-2018 08:10:35
 
  • మంత్రి ప్రత్తిపాటి వెల్లడి
యడ్లపాడు : ఇటీవల పూర్తయిన 5.1 కి.మీల కొండవీడుకోట ఘాట్‌రోడ్డుకు రూ.3కోట్లతో కలర్‌ లైటింగ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. శుక్రవారం యడ్ల పాడు మండలం తిమ్మాపురంలో నూతనంగా నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడు తూ ఈ ఏడాది డిసెంబరులో సీఎం చంద్రబాబునాయుడు కొండవీడుకోట ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆర్‌అం డ్‌బీ శాఖ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి రూ.60కోట్లు కేటాయించడం జరిగిం దన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎ.శ్రీనివాసమూర్తి, ఆపరేషన్స్‌ డీఈఈ ఎన్‌.పిచ్చియ్య పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచ పర్యాటక ప్రాంతంగా కొండవీడు
14-11-2018 03:17:54
 
636777622754887707.jpg
  • మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కొండవీడుకోట(యడ్లపాడు), నవంబరు 13: చారిత్రక ప్రాముఖ్యమున్న కొండవీడుకోటను ప్రపంచ పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కొండవీటి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రులు నక్కా ఆనందబాబు, శిద్దా రాఘవరావు, కలెక్టర్‌ శశిధర్‌తో కలసి మంగళవారం కొండవీడుకోట ప్రాంతంలో ప్రత్తిపాటి పర్యటించారు. కొండలపైన చారిత్రక ప్రాంతాలను కలుపుతూ రూ.11.80 కోట్లతో ఘాట్‌రోడ్డు నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు
Link to comment
Share on other sites

  • 1 month later...
ఉత్తమ పర్యాటక ప్రాంతంగా కొండవీడు
06-01-2019 08:04:48
 
636823586866845919.jpg
  • ఫిబ్రవరి 2, 3 తేదీలలో కొండవీడు ఉత్సవాలు
  • మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
  • జేసీ ఇంతియాజ్‌తో కలిసి పనుల పరిశీలన
చిలకలూరిపేట: ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దనున్నట్టు పౌరసరఫరాలశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కొండవీటు కోటపై రూ.65 కోట్లతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి శనివారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ ఇంతి యాజ్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 2, 3తేదీలలో కొండవీడు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా హెలికాఫ్టర్‌పై సందర్శకులు కొండవీడు కోటను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
 
వాటర్‌ బోట్‌ రైడింగ్‌ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు వివరించారు. సందర్శకులు ఆ రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పూర్తిగా ఉత్సవాలను తిలకించేవిధంగా ఏర్పాట్లుచేస్తామన్నారు. 700 సంవత్సరాల చరిత్ర గల కొండవీడుకు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పూర్వవైభవం సంతరించుకుంటోందన్నారు. ప్రపంచ పర్యాటకులు ఎవరు వచ్చినా వారు తప్పనిసరిగా కొండవీడు కోటను సందర్శించుకునేలా అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. వెదుళ్లచెరువు, పుట్టాలమ్మచెరువు, ముత్యాలమ్మ చెరువు... ఇలా మూడు చెరువులు కొండవీడు కొండపైన మాత్రమే ఉన్నాయన్నారు. కొండవీడు కోటని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేవిధంగా ఆర్కియాలజీ, ఆర్‌డబ్ల్యూ ఎస్‌, ఫారెస్ట్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్‌ అండ్‌ బీ తదిత ర అన్ని శాఖల అధికారులు సీరియస్‌గా పనిచేయాలని మంత్రి ప్రత్తిపాటి అన్నారు.
 
కొండవీడు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. యూనివర్సిటీ, జూ ఏర్పాటు చేయాలని చూస్తున్నామన్నారు. అందుకు అనువైన 200 ఎకరాల ప్లెయిన్‌ ల్యాండ్‌ కొండపై ఉన్నదన్నారు.
జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ కొండవీడులో దేవాలయాలు, మసీదు, బురుజులు, కోట ఇలా అన్ని నిర్మాణాలను చేపట్టి పూర్వపు వైభవం తీసుకురానున్నట్టు తెలిపారు. ఫారెస్ట్‌, ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌, ఎస్‌పీడీసీఎల్‌ శాఖలు ఉత్సవాలకు సంసిద్ధమవ్వాలన్నారు. కొండవీడు కోట చారిత్రక ప్రాంతంగానే కాకుండా టూరిస్ట్‌స్పాట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్సవాల తర్వాత కొండవీడు వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందన్నారు. వివిధశాఖల అధికారులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఫిబ్రవరి 2న కొండవీడు కోట ఉత్సవాలు

 

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని కొండవీడు కోట ఉత్సవాలను ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన ఉత్సవాల నిర్వహణపై గుంటూరులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండవీడు కోటను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ.65 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వం తాజాగా మరో రూ.22 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు.

Link to comment
Share on other sites

కొండవీడు కోటపై బౌద్ధ ఆనవాళ్లు

 

ఇక్ష్వాకుల కాలం నాటి స్తూపం, స్తంభం లభ్యం

20AP-state4a.jpg

కొండవీడుకోట(యడ్లపాడు), న్యూస్‌టుడే: కొండవీడు కోట.. రెడ్డిరాజుల పాలనకు వెయ్యి ఏళ్లకు ముందే బౌద్ధ స్థావరంగా విలసిల్లిందనడానికి ప్రత్యక్ష అనవాళ్లు లభించినట్లు అమరావతి కల్చరల్‌ సెంటర్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోటపై నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిదుర్గమైన కొండవీడు కోటలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలపు నాటి బౌద్ధ మతం ఆనవాళ్లు బయల్పడినట్లు చెప్పారు.
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శివాలయంలో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయాన్ని ఊడదీసే క్రమంలో ఆలయ గర్భగడి ప్రాంతంలో ఐదు వరుసల పల్నాటి సున్నపు రాతితో నిర్మించిన వృత్తాకారపు స్తూపం(12 అడుగుల వ్యాసం, 4 అడుగుల ఎత్తు) వెలుగు చూసింది. ఇది కొండ మీద నివసించే బౌద్ధ బిక్షువుల సంఘానికి చెందినదని శివనాగిరెడ్డి వివరించారు. అలాగే పునర్నిర్మాణానికి ఊడదీసిన లక్ష్మీనరసింహ ఆలయం వెనక భాగంగా కొండలో బౌద్ధశైలిలో నిర్మించిన గుహ బయటపడిందన్నారు. అదే సమయంలో శివాలయానికి సమీపంలో పార్కింగ్‌ కోసం స్థలాన్ని చదును చేస్తుండగా రాళ్లు తొలగిస్తున్న జేసీబీకి ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ శిలామండప స్తంభం తగిలి బయటపడింది. లభించిన ఆధారాల ప్రకారం కొండవీడు కోట శాతవాహనులు, ఇక్ష్వాకులు కాలంలో బౌద్ధారామంగా విరాజిల్లిందని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

కొండవీడు రాజ్యం.. సప్తవర్ణ శోభితం
 

కోటకు అర్జీబీ దీపాల వెలుగు
విరజిమ్మనున్న ఏడు రకాల కాంతులు

gnt-gen9a_29.jpg

చారిత్రక కొండవీడు కోటపై సప్తవర్ణకాంతులు విరజిమ్మనున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా రంగురంగుల విద్యుద్దీపాలను కొండవీడు కొండలపై అమరుస్తున్నారు. రాత్రి సమయంలో కింది నుంచి కొండలు చూస్తే ఆకట్టుకునే రంగుల్లో కనిపించనున్నాయి.   ఫిబ్రవరి 9, 10 తేదీల్లో నిర్వహించ నున్న కొండవీటి ఉత్సవాల్లో పర్యటకులను ఆకట్టుకునేలా దీపాల అమరిక పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కొండవీడు(యడ్లపాడు), న్యూస్‌టుడే

రోడ్లు భవనాల శాఖ మంజూరు చేసిన రూ.4.7 కోట్ల నిధులతో కొండవీడు ఘాట్‌రోడ్డులో 5.1 కి.మీ దూరం విద్యుద్దీకరణ పనులు నిర్వహిస్తున్నారు. రంగురంగుల 500 వాట్స్‌ విద్యుద్దీపాలు 250 ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు ఎడమ వైపున ఏర్పాటు చేయనున్న మల్టీ కలర్‌ విద్యుద్దీపాల నుంచి పలు రంగుల కాంతి కుడివైపున ఉన్న కొండవీడు కొండల మీద ప్రసరించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళ్లలో కొండవీడు కొండలు ఎరువు, పసుపు, నీలి, ఆకుపచ్చ తదితర రంగుల కాంతితో కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. 6 మీటర్లు ఎత్తున నిర్మించే విద్యుత్తు స్తంభానికి పైన ఒక విద్యుద్దీపం, రెండు వైపులా కలర్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు నిలపెట్టడానికి 2.5 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పున కుంటలు తీసి కంకరతో బేస్‌మెంట్‌ ఫిల్లర్స్‌ పనులు పూర్తి చేశారు. అన్ని ఫిల్లర్స్‌కు విద్యుత్తును అనుసంధానం చేస్తూ 25 స్కేర్‌, 16 స్కేర్‌ సామర్థ్యాలు గల రెండు విద్యుత్తు వైర్లను ఘాట్‌రోడ్డులో సైడ్‌వాల్‌కు సమాంతరంగా కొనసాగించారు. కొండవీడులో విద్యుత్తు అవసరాలకు ఘాట్‌రోడ్డు ప్రారంభం నుంచి చివరి వరకు నాలుగు 25 కేవీ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు విద్యుత్తు శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆరో తేదీలోగా పనులు పూర్తి చేస్తాం
వంద మంది కార్మికులతో ఘాట్‌రోడ్డులో విద్యుద్దీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఫిబ్రవరి 6లోపు పూర్తి చేస్తాం విద్యుత్తు స్తంభాలకు బేస్‌మెంట్‌ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. గుంతల్లో నిలబెట్టటానికి విద్యుత్తు స్తంభాల మొత్తాన్ని ఘాట్‌రోడ్డుకు తరలించారు. అలాగే కొండపైన చారిత్రక కట్టడాల ప్రదేశంలో ఐదు ఐమాక్స్‌ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయనున్నాం.

- రాజు, రోడ్లు, భవనాల శాఖ విద్యుత్తు విభాగం డీఈ
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...